Search This Blog

Monday, 23 December 2019

గాలి కబుర్లా...!

13 జిల్లాలను 25 జిల్లాలు చేస్తాం . ఒక్కో జిల్లాకి ఒక్కో రాజధాని కడతాం. ముందుగా 3 రాజధానులు కడతా!
ఇదీ ఒక ముఖ్యనాయకుడు చెప్పే మాటలు! కనీస కామన్ సెన్స్ లోపించిందా? లేక అతితెలివితేటలు పెరిగాయా?
ఒక బెల్లం ముక్కను పెడితే లక్షల చీమలు వచ్చి పుట్టలుపెట్టి కాలనీలు ఏర్పాటు చేసుకొంటాయి. అలాగే ఒక రాష్ట్రానికి ఒక అభివృద్ధి ఇంజన్ అనేదానిని అంకురింప చేస్తే దానిని చూసి ఆకర్షితులై ఎందరో పారిశ్రామికవేత్తలు,పెట్టుబడిదారులు తమ కంపెనీలను,పరిశ్రమలను స్థాపిస్తాయి. తద్వారా ఉద్యోగాలు, వాటిద్వారా రాష్ట్ర ఉత్పత్తి పెరుగుదల,దానిద్వారా ప్రభుత్వానికి ఆదాయం, దాని నుండి మరిన్ని మౌలిక సదుపాయాల కల్పన , తద్వారా మరింత అభివృద్ధి ఇలా ఒక చైన్ రియాక్షన్ లెక్క రాష్ట్రం అభివృద్ధి పధం  లో దూసుకు పోతుంది. పాతప్రభుత్వాధినేత కలలు గన్న అభివృద్ధి నగరం అది. దానికి మీరు రాజధాని అని పేరుపెట్టుకొన్నా, పెట్టుకోకపోయినా ఫర్వాలేదు. అంతేతప్ప, కేవలం హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ కట్టేస్తే అది రాజధాని అవ్వదు . అభివృద్ధి  కి ఊతమివ్వదు. 
నేను చెప్పేది గాలి కబుర్లు అనుకొంటే ఒకసారి కింద చదవండి...  

రాంచీలో హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ ఉన్నాయి..! ఈ రాజధాని ఎంత అభివృద్ధి చెందింది… ? రాయ్‌పూర్‌ లోనూ హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ ఉన్నాయి..! అ సిటీ ఎంత మందికి తెలుసు..? భోపాల్‌ అతి పెద్ద రాష్ట్రానికి రాజధాని..! అభివృద్ధిలో విశాఖ స్థాయిలో అయినా ఉందా..? ఇలా చెప్పుకుంటే… దేశంలో చాలా రాష్ట్రాల రాజధానులు… కేవలం పరిపాలనాపరమైన కేంద్రాలే. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు కార్యకలాపాలకే పరిమితం. ఇప్పటికి పలు రాజధానుల్లో వ్యాపార, పారిశ్రామిక ప్రగతి లేదు.
పాలన వికేంద్రీకరణ వేరు.. అభివృద్ధి వికేంద్రీకరణ వేరు. రాష్ట్రంలో ఉన్న ప్లస్ పాయింట్లను మార్కెట్ చేసి.. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపేవారిని ఆకర్షించి.. వారి పెట్టుబడులతో రాష్ట్రాన్ని నలువైపులా అభివృద్ధి చేయడం అభివృద్ధి వికేంద్రీకరణ. అదే సమయంలో.. ప్రభుత్వం తరపున నిధులు వెచ్చించి, అన్ని ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాలు పెంచడం, అభివృద్ధి వికేంద్రీకరణ. 
ఈ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, అభివృద్దిని అంతా అమరావతిలోనే కేంద్రీకరించిందని, ఇతర రాజకీయ పార్టీలు ఓ రేంజ్‌లో ప్రచారం చేశాయి. కానీ.. నిజానికి అమరావతిలో కన్నా.. పరిశ్రమలు.. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోనే ఎక్కువగా వచ్చాయి. ఈ విషయం ప్రభుత్వం గణాంకాల ద్వారా అసెంబ్లీలోనే వెల్లడించింది. 
సీమలో తయారీ రంగం, ఉత్తరాంధ్రలో సేవల రంగం కేంద్రీకృతం అయ్యాయి. 
 గత ఐదేళ్ల కాలంలో.. రాయలసీమలో గతంలో ఎన్నడూ లేనన్ని పెట్టుబడులు.. అభివృద్ధి అవకాశాలు వచ్చాయనేది కళ్ల ముందు కనిపించిన నిజం. 
చిత్తూరు జిల్లా శ్రీసిటీకి గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. ఐదేళ్ల తర్వాత చిత్తూరు పారిశ్రామిక ప్రగతి లెక్కలు తీస్తే,గత 50 ఏళ్లలో రానన్ని పరిశ్రమలు వచ్చాయి. 
ఇక అనంతపురంలో.. దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వచ్చింది. పదమూడు వేల కోట్ల పెట్టుబడితో కియా కార్ల పరిశ్రమ వచ్చింది.
 కర్నూలులో విమానాశ్రయం ప్రారంభమవడమే కాదు, తంగడంచలో మెగాసీడ్ పార్క్ కూడా నిర్మాణం ప్రారంభించారు. సీమలో సుమారు 40 వేల కోట్ల పెట్టుబడితో అనేక చోట్ల సోలార్ ప్రాజెక్టులువచ్చాయి. ఇలా చెప్పుకుటూ పోతే.. తయారీ రంగాన్ని గత ప్రభుత్వం రాయలసీమలో కేంద్రీకరించిందని సాక్షాత్ అసెంబ్లీ లోనే నివేదిక సమర్పించారు.  
ఉత్తరాంధ్రకు ఉన్న సానుకూలతలు,అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా సేవల రంగాన్ని గత ఏపీ సర్కార్ ప్రోత్సహించింది. హైదరాబాద్‌కు మొదటి సారిగా మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత.. ఇతర ఐటీ కంపెనీలన్నీ.. ఎలా క్యూకట్టాయో.. అలాగే, ఐటీ, ఫిన్ టెక్, బ్లాక్ చెయిన్ వంటి రంగాల్లో దిగ్గజ కంపెనీలను గత ఏపీ సర్కార్ ఆకర్షించింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ‘గూగుల్‌ ఎక్స్‌, కండ్యుయంట్‌ వంటి పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. కాపులుప్పాడలో 70వేల కోట్ల మెగా ఇన్వెస్ట్‌మెంట్‌తో ఆదాని గ్రూప్ ఒప్పందం చేసుకుంది. లూలూ గ్రూప్ సహా.. పలు సంస్థలు పెట్టుబడులతో వచ్చాయి. ఒప్పందాలు చేసుకున్నాయి. ఐటీ సేవల రంగాన్ని గత ప్రభుత్వం ఉత్తరాంధ్రలో కేంద్రీకరించింది. 
విజయనగరంలో ట్రైబల్‌, విశాఖలో ఐఐఎం, ఈస్ట్‌గోదావరిలో విద్యాసంస్థలు, ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు, ట్రిపుల్‌ ఐటీ, హార్టీ కల్చర్‌, నెల్లూరులో కృష్ణపట్నం పోర్టు, తిరుపతి కేంద్రంగా హర్డవేర్‌ రంగం, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఇండస్ట్రీయల్‌ టౌన్‌షీప్‌, నంద్యాలను సీడ్‌ కేపిటల్‌ గా  పాత TDP ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 
 పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నదుల అనుసంధానం చేసి గోదారి నీళ్లు రాయలసీమకు  తీసుకెళ్లి నా ప్రజలు పాతప్రభుత్వానికి ఓటేయలేదు.ఇది చాలా ఆశర్యం ,అంతకంటే ఎక్కువగా ఇది అన్యాయం. 
 బొల్లాపల్లి రిజర్వాయర్‌ కట్ట దానికి ని కూడా DPR తయారు చేసింది పాత ప్రభుత్వం. 


సెక్రటేరియట్ ఉంటే చాలా.. పరిశ్రమలు అక్కర్లేదా..? 
చంద్రబాబు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారనేది వాస్తవం.  రాష్ట్ర విభజన తర్వాత అమరావతి విషయంలో ఆయన వేసుకున్న ప్రణాళికలు, తన తెలివితేటలు, కష్టంతో చేసిన ప్రయత్నాలతో.. నిజంగానే ఓ అద్భుత నగరం ఆవిష్కరించబోతోందని దేశ విదేశాలలోని పెట్టుబడిదారులు గట్టిగా నమ్మారు. 
కానీ 2019 మే లో కొత్త ప్రభుత్వం వచ్చింది. 
 హైదరాబాద్‌లో అభివృద్ధి జరిగిన తర్వాత ఒక్కచోటే .. డెవలప్ చేశారని విమర్శలు ప్రారంభించిన రాజకీయం, అమరావతి విషయంలో మాత్రం.. ఇంకా పునాదులు పడక ముందే పురివిప్పుకుంది. ఫలితంగా..అది.. ఒక ప్రాంతానిది.. ఒక్క సామాజికవర్గానిది అంటూ… ప్రచారం చేసి.. ఇతరుల్లో వ్యతిరేకత పెంచేశారు. మాకేంటి.. అన్న చర్చను ఇతర చోట్ల లేవనెత్తేలా చేశారు. అభివృద్ధి అనేదానికి, రాజకీయ పార్టీలు చూసే కోణం, అవి చేసే ప్రచాాన్ని బట్టి అర్థాలు మారిపోతున్నాయి. ప్రస్తుతం అభివృద్ధి అంటే.. రాజధాని మాత్రమే. 


రాజధానిలో ఉండే వ్యవస్థలు అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టులను మూడు ప్రాంతాలకు పంచి గొప్ప అభివృద్ధిని చూపిస్తున్నామని చెప్పబోతున్నారు. కేవలం వాటి వల్ల నే  ఆయా ప్రాంతాల్లో  అభివృద్ధి జరిగిపోతుందని నమ్మేయడం వెర్రితనం. 
ఓ 10 ఆఫీసులు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నమ్మబలుకుతున్న నాయకులకు, వారి మాటలు నమ్ముతున్న ప్రజానీకానికి నమస్కారం. 

అభివృద్ధి అంటే ఇదా? అని ఆశర్యపోతున్న పక్క రాష్ట్రాల వారికి కూడా నమస్కారం .
 
రాష్ట్రం మొత్తం అతలా కుతలం అవుతున్నా, చోద్యం చూస్తున్న ప్రధానికి నమస్కారం.
పాలనా పరమైన వికేంద్రీకరణ కు, అభివృద్ధి వికేంద్రీకరణ కు తేడాతెలిసినా తెలియనట్లు నటిస్తున్న నాయకులకు నమస్కారం. 

కేవలం ప్రాంతాలవారీగా ఓట్లను గుంజుకోవడానికి కొన్ని పార్టీలు 3రాజధానులంటూ మూడుప్రాంతాలవారిమధ్యనచిచ్చు పెడుతున్నారు. కానీ రాష్ట్రం మాత్రం ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది చివరికి మరోసారి రాష్ట్ర విభజనకు దారి తీసినా ఆశర్యం లేదు. అమాయకత్వమో, ప్రాంతీయ వేర్పాటు వాదమో, శాడిజమో , రాజధాని అంటే మూడు టవర్లు,300ఆఫీసులు అనుకొంటున్న నాయకుల కు ,ప్ర జా సంఘాలకు నమస్కారం. 



Saturday, 26 October 2019

Brain Massage Meditation Video



ఈ వీడియోని ఇయర్ ఫోన్ లు పెట్టుకొని ,కళ్ళుమూసుకొని, ఓ పావుగంట వింటే మీ మనస్సు తేలికై ప్రశాంత త కలుగుతుంది.
సృష్టి సమస్తం స్పందనామయం. మనయొక్క స్పందన ప్రకృతికి అనగా ఈ విశ్వానికి ముఖ్యంగా మన భూమికి ఎంతదగ్గరగా ఉంటే అంతగా  మన ఆరోగ్యం బాగుంటుంది. భూమి స్పందించే పౌనపుణ్యం(frequency) 7. 83. మన కాస్మిక్ అంతరిక్ష శబ్దము యొక్క పౌనపుణ్యం 7. 83.  Ohm- 7.83 Hz . అలాగే కొన్ని బీజాక్షరాలు పౌనపుణ్యం
Gam - 14 Hz
Hleem - 20 Hz
Hreem - 26 Hz
Kleem - 33 Hz
Krowm - 39 Hz
Sreem - 45 Hz

Wednesday, 23 October 2019

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లను హాకింగ్ చేయవచ్చా ?

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లను హాకింగ్ చేయ వచ్చా ? అనగా ఒక సాఫ్ట్ వేర్ ద్వారా, ఓటరు తనకిష్టం వచినపార్టీ గుర్తువున్న బటన్ నొక్కినా, ఏదో ఒక్క పార్టీ గుర్తుకు మాత్రమే ఓటు పడేటట్లుగా చేయవచ్చా ?ఇదే ప్రశ్నను ఒక సాఫ్ట్ వేర్ నిపుణుడి ని అడిగితే ఇలా సమాధానం ఇచ్చాడు.

"చేయవచ్చని థియరిటికల్ గా చెప్పవచ్చు.  ఎందుకంటే వి ఫై  గానీ,బ్లూ టూత్ టెక్నాలజీ ఆధారంగాపనిచేసే చిప్ ను ఓటింగ్ మిషన్ లో అమర్చి హాకింగ్ చేసే అవకాశం ఉంది. అంతేగాక, ఓటింగ్ మిషన్ లోని ఆపరేటింగ్ సిస్టం లోనే మాల్ వేర్ ప్రోగ్రామింగ్ ద్వారా కూడా హాకింగ్ చేయవచ్చు .

ఎన్నికల కమిషన్ కి ఈ విషయం తెల్వదా?
తెలుసు. అందరికీ తెలుసు.
అందుకే చంద్రబాబుగారు ఎప్పటి నుండో మొత్తుకొంటుంటే VV PAT మిషన్  లను తగిలించారు. ఓటింగ్ మిషన్ లో వేసిన ఓటు గుర్తు  ఈ VV PAT లో ఒక చిన్న పేపర్ పైన  ముదిరింపబడుతుంది .
ఎన్నిక ముగిసిన తర్వాత, కౌంటింగ్ సమయం లో  ఓటింగ్ మిషన్ చూపించే ఓట్ల సంఖ్యకు,  VV PAT లలో ముదిరింప బడిన  ఓటింగ్ పేపర్లకు టాలీ అవ్వాలి.తద్వారా   ఓటింగ్ మిషన్  లు హాకింగ్ కి గురయ్యాయా?లేదా? అనే క్లారిటీ వస్తుంది. అందుకే చంద్రబాబు గారు ప్రతి పోలింగ్ స్టేషన్ లోని  ఓటింగ్ మిషన్ చూపించే ఓట్ల సంఖ్యకు,  VV PAT లలో ముదిరింప బడిన  ఓటింగ్ పేపర్లకు టాలీ అయ్యాయో లేదో చెక్ చేయాలని తీవ్రంగా పోరాడారు. సుప్రీం కోర్ట్ కు వెళ్లినా ఫలితం  లేకపోయింది.
 ఆయన ఘోరపరాజయం పాలవ్వడానికి ఓటింగ్ మిషన్ ల  హాకింగ్ ఒక కారణమా? ఏమో?!.

పోలింగ్ రోజున పోలింగ్ ఏజంట్ల సమక్షం లో 50 ఓట్లను పోలింగ్ ఆఫీసర్ మిషన్ పై వేసి చూపిస్తాడు గదా? మిషన్ లో మాల్ వేర్ ఉంటె అపుడే బయటపడుతుందిగదా ?
ఈ విషయం హాకర్ కీ తెలుసు. అందుకే హాకర్ ఏం చేస్తాడంటే మొదటి 100ఓట్లు కరెక్ట్ గానే పడేవిధంగా ప్రోగ్రామింగ్ చేస్తాడు. 100ఓట్ల తర్వాతే అసలుకధ మొదలయ్యే విధం గా ఓటింగ్ మిషన్ లో ప్రోగ్రామింగ్ జరిగిఉంటుంది.

ఇంకో విషయం , ఓటింగ్ మిషన్ లు మొరాయిస్తే ఎవరెవరో ప్రవేట్ వ్యక్తులు వచ్చి వాటిని అటూ ఇటూ కెలికి బాగుచేస్తున్నట్లు యాక్షన్ చేసినట్లుగా కొన్ని రిపోర్ట్ లు వచ్చాయి. అదే విధంగా కొన్ని పోలింగ్ స్టేషన్ లలో ఒక గుర్తు ను నొక్కితే వేరే గుర్తుకి ఓటు పడుతున్నట్లు రిపోర్ట్ లు వచ్చాయి. 
ఒక డిజిటల్ మెషిన్ ను హాక్ చేయాలంటే -
1. ఆ  ఓటింగ్ మిషన్  హాకర్  కి అందుబాటులో ఉండి  ఉండాలి.  లేదా 
2. ఆ ఓటింగ్ మెషిన్ లు నెట్ వర్క్  కి అనుసంధాన మైఉండాలి.  లేదా 
3. సింబల్ లోడింగ్ సాఫ్ట్ వేర్ అనగా   బాలట్ యూనిట్  లో నొక్కిన పార్టీ సింబల్ ,   VV PAT లోకి  డౌన్ లోడ్ చేసే సాఫ్ట్ వేర్  ని హాక్ చేసి కూడా ఆయా ఓటింగ్ మెషిన్ లకు సంబంధించి  మొత్తం ఎన్నికల ప్రక్రియను తారుమారు చేయవచ్చు.
  EVM-VVPAT మిషన్ లు ఎవరు తయారు చేస్తారు?
  BEL and ECIL. ఇవి కేంద్ర  ప్రభుత్వరంగ కంపెనీలు. 
  •  పార్టీ సింబల్స్ VVPAT లలోకి ఎప్పుడు అప్ లోడ్ చేస్తారు?

 పార్టీ అభ్యర్థుల సీక్వెన్స్ బాలట్ యూనిట్ పై ఖరారైన తర్వాత మాత్రమే ,   పార్టీ సింబల్స్ ను ,అభ్రర్థుల పేర్లను VVPAT లలోకి అప్ లోడ్ చేస్తారు. ఇది పోలింగ్ కు 2 వారాలముందు జరుగుతుంది.  ఒక లాప్ టాప్  ద్వారా ఈ అప్ లోడ్  ప్రక్రియ జరుగుతుంది. VVPAT లకు USB పోర్ట్ ఉంటే పెన్ డ్రైవ్ ద్వారాకూడ  అప్ లోడ్ చేయవచ్చు. 
ఇలా పార్టీ సింబల్స్ ను అప్ లోడ్ చేసే సమయం లోనే VVPAT లోకి  మాల్ వేర్ ను కూడా అప్ లోడ్ చేయవచ్చు. జిల్లా అధికారులు గానీ,మరెవ్వరూ ఈ విషయాన్ని కనిపెట్టలేరు. 
  •  అస్సలేందుకీ VVPAT లు ?కేవలం ఓటింగ్ మెషిన్ లు ఉంటె సరిపోదా? 

 VVPAT వలన పారదర్శకత పెరుగుతుంది. ఎలాగంటే, మనం బాలట్ యూనిట్ పైన నొక్కిన పార్టీ గుర్తు కే మన ఓటు పడిందో?లేదో అనే సందేహాన్ని , VVPAT లో  ముద్రించిన పేపర్ ద్వారా తీరుస్తుంది. మనం ఏ గుర్తుకు నొక్కామో (ఓటేశామో) అదే గుర్తు VVPAT  లో  ప్రింట్ చేయబడి  ఓటరుకు  కనబడుతుంది. 
మరింకేం? మోసానికి తావెక్కడుంది ? 
ఆగండాగండి! ఇక్కడే ఉంది మతలబు. 
ఓటింగ్ మెషిన్ లో  3  భాగాలుంటాయి. ఒకటి బాలట్ యూనిట్ ,రెండోది కంట్రోల్ యూనిట్. 3వది VVPAT . 
VVPAT సద్వినియోగపడాలంటే  బాలట్ యూనిట్ ని కంట్రోల్ యూనిట్కి, కంట్రోల్ యూనిట్ ని  VVPAT కి లింక్ చేయాలి. కానీ ఎన్నికల కమిషన్ సాంకేతిక  నిపుణులు ఇలా చేయకుండా  ఈ రెండిటికీ మధ్యన VVPAT ను పెట్టడం చేత, VVPAT లో కనబడిన పార్టీ గుర్తు ,కంట్రోల్ యూనిట్  లో నమోదయ్యే గుర్తు వేర్వేరు అయ్యే అవకాశాన్ని హ్యాకర్ కి ఇచ్చినట్లు గా భావించవచ్చు. 
  అనగా మన ఓటు ముందుగా  VVPAT లో రికార్డ్ అయిన తర్వాత కంట్రోల్ యూనిట్ లో రికార్డ్ అవుతుంది.  
VVPAT లో ప్రింట్ అయినదే ఓటరు చూడగలడు గానీ, కంట్రోల్ యూనిట్ లో తన ఓటు  ఎవరికీ పడిందో చూడలేడు . ఓటరేకాదు, కంప్యూటర్ నిపుణుడు కూడా తెలుసుకోలేడు .  ఈ 3 యూనిట్లను కనెక్షన్ చేయడంలో ఉన్న ఈ బలహీనతనే హ్యాకర్ లు వాడుకొనే అవకాశం ఉంది. 

VVPAT లు ప్రవేశపెట్టకముందు , పార్టీ అభ్యర్థుల సీక్వెన్స్  గురించిన ప్రోగ్రాం మెషిన్ లో ఉండేదికాదు. 
VVPAT లు ప్రవేశపెట్టినతర్వాతే , పార్టీ అభ్యర్థుల సీక్వెన్స్  గురించిన ప్రోగ్రాం మెషిన్ లో ఇన్సర్ట్ చేయడం మొదలెట్టారు.   దీనివలన "ఏ బటన్ నొక్కితే  ఓటు ఏ పార్టీకి  పడాలో" అనే జ్ఞానం  ఓటింగ్ మెషిన్ లో  ఉంటుంది. 
అనగా మెషిన్ కి ఉన్న  ఈ జ్ఞానాన్ని హాకింగ్ చేయవచ్చు.  మెషిన్ కి ఎంత జ్ఞానం ఉంటే దానిని అంతగా హాకింగ్ చేయవచ్చు. కాబట్టి,  VVPAT   లు తయారయ్యే సమయం లోనే హాకింగ్ జరిపే అవకాశం ఉంది. 
కొస మెరుపు : The Election Commission of India (EC) has set up an inquiry on how EVM-VVPAT (Voter Verifiable Paper Trail) machines are vulnerable to manipulations.
After hearing such type of vulnerability of machines, is it not correct to Re-introduce ballot paper polls? LEARNED election commission should think& take appropriate measures to protect the sanctity of the democracy.


Friday, 18 October 2019

భారతదేశం బాగుపడుతుందా?

నాయకులలో ఎంత స్వార్ధము,అవినీతి ఉందో అంతకు రెట్టింపు సామాన్యప్రజలలో కూడా ఉండటం గమనిస్తే భారత దేశ సంస్కృతి ఎంతగా దిగజారిపోయిందో అర్ధం అవుతుంది. ఒకర్నొకరు  పోల్చి చూసుకొంటూ,అసూయతో అట్టుడికిపోతూ ,తానేమైపోయినా ఫర్వాలేదు,పొరుగువారు పచ్చగా ఉండకూడదనే తామస ప్రవ్రుత్తి భారతీయ సమాజంలో రోజు రోజుకూ మహమ్మారిలా పెరిగిపోతుంది.

మొక్కులు, ముడుపులు,బలులు, జపతపాలు ,యజ్ఞయాగాలు సమస్తం తీవ్రమైన కాంక్షలతో,స్వార్ధభూయిష్టమైన మనస్సుతో  చేస్తున్నారు. అక్రమ సంపాదనలో  కొద్ది వాటాను టన్నులకొద్దీ బంగారం రూపంలో గుళ్ల కు  సమర్పించుకొంటున్నారు. ఇలా  సాక్షాత్ దేవుడితోనే వ్యాపారం చేస్తూ పైపెచ్చు అది భక్తి అని నిస్సిగ్గుగా చాటుకొంటున్నారు . గుళ్లకు ఇచ్చే దాంట్లొకనీసం పాతికో వంతైనా సమాజసేవకు వినియోగిస్తే సంఘం ఎంత ప్రశాంతంగా ఉంటుంది?

గత 1500 ఏళ్ళనుండి భారతీయ చరిత్రను,సమాజ పోకడలను పరిశీలిస్తే, భారతీయులలో పెరిగిపోయిన స్వార్ధం,అవినీతి,అధర్మం, దేశద్రోహపు బుద్ధులు ఎంతగా పేట్రేగి పోయాయో,తద్వారా దేశం పరాయిమూకలచేతిలో ఎలా ముక్కచెక్కలయిందో తెలుస్తుంది .
నాలుగు రూకలిస్తే చాలు మన దేశపు ఆనుపానులు చేరవేసే దేశద్రోహులు ఎంతమందో?
నాలుగు దెబ్బలువేస్తే చాలు రాజ్యపు రహస్యాలు వెళ్లగ్రక్కిన వారెందరో?
నాలుగురకాల ఆకర్షణలు ఎరవేస్తే చాలు,సొంతింటి కే కన్నమువేసిన వారెందరో?
తనకు లేనిది,తనకు దక్కనిది పక్కవాడికి ఎందుకుండాలనే రక్కసులు ఎందరో?
తమ  బలహీనతలకు దేశభవిష్యత్ ను తాకట్టు పెట్టిన వారెందరో?
కర్మ సిద్ధాంతాన్ని అపార్ధం చేసుకొని  పలాయన వాదాన్ని నెత్తినపెట్టుకొని సోమరిపోతులుగా మారి శుంఠ ల్లా దిగజారినవారెందరో?
పచ్చి స్వార్ధం తో మూఢనమ్మకాలతో బలులు ఇస్తూ బతుకులు బండపాలు చేసిన వారెందరో ?
తేరగా సంపదరావాలి , అప్పనంగా సుఖాలు పొందాలనుకునే పరాన్న జీవులెందరో?
కంచాలు కంచాలుగా లంచాలను మెక్కుతూ బితుకు బితుకుమంటూ  అవినీతి సామ్రాజ్యాన్ని ఏలే వారెందరో?

కన్నవారిపై ప్రేమలేదు, దేశమంటే భక్తిలేదు ,సంస్కృతి పై పూజ్యతలేదు, సంప్రదాయాలపై గౌరవం లేదు , సాటిమనిషిపై అభిమానం లేదు, ఉన్నదల్లా కేవలం కరడుగట్టిన స్వార్ధం,ధన పిపాస, కీర్తి కండూతి,భోగలాలస ! భారతీయులు భారతీయులేనా? లేక వీరికి పరాయి పిశాచ మూకల క్రౌర్యం అంటువ్యాధిలా అంటుకొందా ?
భారతీయులు ముఖ్యం గా ఆంధ్రులు ఇలా ఎందుకు దిగజారిపోయారు? భారతీయులు ఎందుకు ఇంత  దారుణంగా అవినీతిలోమునిగిపోయారు ? వారి ప్రవర్తనలో ఇంత ఘోరమైన  లోపం ఎలా వచ్చింది ? భారతీయులు  ఇంత క్రూరమైన స్వార్థపరులుగా ఎలా మారిపోయారు?.  భారత దేశ సంస్కృతిలో అవినీతి ఎందుకు ఇంతలా పెరిగిపోయింది. పైపెచ్చు,  భారతీయులు అవినీతినిఎందుకని  నీతి బాహ్యంగా చూడటం లేదు? 

ఏ మనిషీ పుట్టుకతో అవినీతితో పుట్టడు . ఏ జాతి కూడా  పుట్టుకతో అవినీతిమయంగా ఉండదు.కానీ పుట్టుకతోనే  గుణ వాసనల తో పుడతాడు మనిషి. పరిస్థితులప్రభావంతో ఆయా గుణాలు వృద్ధిచెందడమో,మరుగునపడిపోవడమో జరుగుతుంది.  

 ఈ అవినీతి జాడ్యం,స్వార్థపరత్వం  ఆంధ్రాకో, కేరళకో మాత్రమే కాదు,దేశం అంతటా వ్యాపించి ఉంది.
భారతీయులు అవినీతి పరులను భరించడమే కాదు,వారిని హీరోలుగా ఆరాధిస్తూ అందలం ఎక్కిస్తున్నారు. 

భారతీయులు చివరికి ఎంతగా దిగజారిపోయారంటే, దేవునితోనే లాలూచీ బేరాలాడటం చేస్తూ సనాతన  ఆచార వ్యవహారాలను  భ్రష్ట్టు పట్టించేస్తున్నారు. 

 నేడు, మన భారతదేశంలో  భక్తికూడా  ఒక వ్యాపార ప్రక్రియగా దిగజార్చేశారు. కనీస అవసరాలేకాదు,విలాసాలు,అంతేకాదు పక్కవాడికేమి సుఖాలున్నాయో అవన్నీ కావాలనుకొంటు కోర్కెలు క్షణ క్షణానికి పెంచేసుకొంటూ దైవారాధనను కూడా వ్యాపార విలాస క్రీడగా మార్చేశారు. 
మన  భారతీయులు దేవుడికి డబ్బులు అర్పిస్తారు. దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్ని ఆశిస్తారు దీని అర్థం ఏమిటంటే అర్హత, అవసరం లేకున్నా లబ్ది పొందాలనుకోవడమే.
గుడి వెలుపల ఇటువంటి వ్యాపార ప్రక్రియను *లంచం* అంటాము.
బాగా ధనవంతుడైన భారతీయుడు గుళ్లకు డబ్బు ఇవ్వడు. బంగారు కిరీటాలు ఇతర ఆభరణాలు కానుకగా ఇస్తాడు.
అతని కానుకలు పేదవాడి ఆకలి తీర్చవు. అతడు ఇచ్చేది దేవుడికి.
 ఆకలిగొన్న వాడికి సహాయం చేయడం వృధా అనుకుంటాడు. అందుకే దేవునికి కానుకలు ఇస్తాడు.  ఈ విధంగా విపరీతమైన సంపద  భారతదేశంలోని గుళ్ళల్లో  పోగుపడుతుంది . ఈ సంపద ఏం చేయాలో వారికి అర్థం కాదు. కోశాగారాలలో బిలియన్ల కొద్దీ ఆస్తులు, డబ్బు దుమ్ము కొట్టుకుపోతున్నాయి.

యూరోపియన్స్ భారతదేశానికి వచ్చి పాఠశాలలు నెలకొల్పారు. భారతీయులు మాత్రం యూరప్, అమెరికా వెళ్లి అక్కడ గుళ్ళు నిర్మిస్తున్నారు.
తన కోర్కెలను తీర్చడానికి దేవుడు కానుకలు తీసుకోవడం ఎట్లా తప్పుకాదో, బయట లంచం తీసుకోవడం, ఇవ్వడం కూడా తప్పు కాదు అనే భావన నెలకొంది. అందుకే భారతీయులు తేలికగా అవినీతికి లొంగిపోతారు.

ఈ దేశ సంస్కృతి, అవినీతిని తనలో ఇముడ్చుకుంటుంది.
1.అవినీతిని భారతీయులు ఒక మచ్చగా భావించరు. ఎందుకంటే బాగా అవినీతిపరులైన  రాజకీయ నాయకులను అధికారంలోకి తెస్తారు. ఇది పశ్చిమ దేశాలలో మనం ఊహించలేము.

2.చరిత్ర చూసినా కూడా అవినీతికి ఊతమిచ్చే  నైతిక దిగజారుడుతనమే కనిపిస్తుంది. భారతదేశ చరిత్రలో లంచాలుకు లొంగి ద్వారాలు తెరవడం ద్వారా అనేక పట్టణాలు, రాజ్యాలను  వశపరచుకున్న సంఘటనలు అనేకం. డబ్బు తీసుకొని లొంగి పోయిన సైన్యాధిపతులు అనేకం.
ఇది భారతదేశం అంతటా ఉన్న సారూప్యత.


పూర్వపు గ్రీకు, మోడ్రన్ యూరప్ తో పోలిస్తే, భారతీయుల పోరాట పటిమ ఎంతటిదో ఇట్టే అర్థమవుతుంది.
నాదేర్షాను అంతమొందించేందుకు టర్క్ లు పోరాడారు.
కానీ భారత దేశంలో పోరాటం అవసరం లేదు లంచాలు ఇవ్వడం ద్వారా సైన్యం లేకుండా చేయవచ్చు.
దండెత్తే వాడు డబ్బులు ఖర్చు పెట్టగలిగే వాడైతే భారతీయ రాజులను తేలికగా లొంగ తీసుకోవచ్చు.
ఆ రాజుల దగ్గర పదుల వేల సంఖ్యలో సైన్యం ఉన్నప్పటికీ ఇది సాధ్యం. ప్లాసి యుద్ధం లో భారతీయులు గట్టిగ యుద్ధం చేశారు. తర్వాత ఏమైంది మీర్ జాఫర్ కు  Clive లంచం ఇచ్చాడు. అంతే, బెంగాల్ లొంగి పోయింది.

భారతీయ కోటలను వశపరచుకున్న చాలా సంఘటనలలో డబ్బు మారక పాత్ర ఉంది. డబ్బు ముట్టి నందున గోల్కొండ  వెనుక దర్వాజ తెరచి ఉంచడం వలన 1867లో ఈ కోటను ఆక్రమించు కోగలిగారు.

మరాఠాలను, రాజపుత్రుల ను లంచాల ద్వారానే మొగలులు గెలుచుకోగలిగారు.శ్రీనగర్ రాజు ఔరంగజేబు దగ్గర  డబ్బులు తీసుకుని సులేమాన్ ను అప్పగించాడు. భారతీయులు అవినీతికి తలొగ్గి చేసిన దేశద్రోహ కార్యక్రమాలు అనేకం ఉన్నాయి.నేడు డబ్బుతీసుకొని తమతలరాతలను మార్చే నాయకులను ఎన్నుకొంటున్నారు. తన చేతిలో పైసా పడితే చాలు,ఎక్కడ నొక్కమంటే అక్కడ నొక్కేయడానికి జనాలు సిద్ధం.  
నేడు మన తెలుగురాష్ట్రాలలో కూడా అవినీతి మచ్చలున్న నాయకులనే అధికారం లో  కూర్చో పెట్టారంటే ఆంధ్రులు ఎంత అవినీతి ప్రియులో అర్ధం అవుతుంది.అవినీతికి భాషాబేధమేమీలేదు. ద్రావిడులు మొదలుకొని ఆర్యపుత్ర సంతానం సమస్తం అవినీతితో పుచ్చిపోయింది.

అర్థం కాని విషయమేమిటంటే, భారతీయులకు ఇచ్చిపుచ్చుకునే ( క్విడ్ -ప్రో కో / లంచాలు)సంస్కృతి ఎందుకు వచ్చింది ఇతర నాగరిక దేశాలలో ఇది ఎందుకు లేదు?

నైతికంగా అవినీతి రహితంగా మసలుకుంటే 'అందరము బాగుపడతాము' అనే స్వభావం భారతీయులలో కొరవడడానికి మూల కారణం, వారు గత 1500 ఏళ్లలో ఎదుర్కొన్న విదేశీ దాడులే నని అర్ధం అవుతుంది. 
కనీస అవసరాలేకాదు,తమ మానప్రాణాలకు ముప్పు ఉప్పెనలా విరుచుకు పడుతుంటే ఏది నీతి ? ఏది అవినీతి? అనే విచక్షణ ప్రాణికి ఎక్కడ ఉంటుంది ? భారతీయులు కేవలం ప్రాణులుగానే బతుకుతున్నారుతప్ప మనుషుల్లా బతకడం మర్చిపోయారు. భద్రతలేమి కి తోడు జ్ఞానసంపద  లుప్తమై అజ్ఞానాంధ కారం లో చిక్కి సదాచారాలను మూడాచారాలుగా, సక్రమమైన వర్ణవ్యవస్థను అక్రమమైన కులవ్యవస్థగా దిగజార్చేసుకొన్నారు. 
సమాజముపైన, తోటిమనిషిపైన అనుమానం,అసూయలేతప్ప అభిమానానికి చోటులేని పరిస్థితులలో దేశభక్తి,సమాజసేవ లాంటి వాటికి చోటెక్కడ ఉంటుంది? తమ వాకిట్లో వ్యర్ధాలను రోడ్ పై పడవేసే మనస్తత్వాన్ని చూస్తేనే అర్ధం చేసుకోవచ్చు,మిగతావాళ్ళు ఏమైపోతే నాకేమిటి,నేను బాగుంటే చాలు"అనే దుష్ట  దృక్పధం ఎంతగా వేళ్ళూనుకొందో అర్ధం అవుతుంది. శుచీ శుభ్రత మరచిపోయారు. కనీసం గుళ్లను కూడా శుభ్రంగా ఉంచుకోలేని స్థితిలో మిగిలిపోయారు.   

చాలామంది హిందువులు తమ భద్రతకోసం  సిక్కులు, జైనులు, బౌద్ధులు అయ్యారు.
మరికొంతమంది  క్రిస్టియన్లు, ముస్లింలు గా మారారు. తద్వారా భారతీయ సమాజం మతాల పేరిట, కులాల పేరిట చీలికలైపోయింది. దానివలన  భారతీయులు ఒకరిపై, మరొకరికి విశ్వాసం లేకుండాపోయింది. 

నేటి భారతదేశం లో భారతీయులు లేరు.  భిన్న విశ్వాసాలతో, కరడుగట్టిన స్వార్ధం,అపనమ్మకం,అవినీతి,అధర్మం తోకుళ్లిపోయిన  హిందువులు, క్రిస్టియన్లు ముస్లింలు మొదలగువారు బతుకులీడుస్తున్నారు. 
1400 సంవత్సరాల క్రితం భారతీయులంతా ఒకే విశ్వాసం కలిగి ఉండేవారు.

కులాలుగా మతాలుగా విడిపోవడం తో అనారోగ్య సంస్కృతి దాపురించింది. అసమానతలు అనేవి అవినీతి సమాజానికి దారితీస్తాయి. భారతీయులు ఒకరినొకరు ఈసడించుకుంటారు,ఒక్క దేవుడిని తప్ప. దేవునికే  లంచం ఇచ్ఛే వాళ్ళు తమకు కాస్తలాభం కలుగచేసే మనుషులకు ఎందుకివ్వరు? 
భారతీయులు మారాలి. నిజమైన భారతీయులై ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి. ఇది సాధ్యమేనా?





Thursday, 6 June 2019

మోడీ హయాం లో మోసాలు,కుంభకోణాలు జరిగాయా?

మోడీ హయాం లో , బ్యాంకులను కార్పొరేట్లు చేసిన మోసం విలువ అక్షరాలా రూ.1.55 లక్షల కోట్లు అని తేలింది.. సమాచార హక్కు చట్టం కింద పీటీఐ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు భారతీయ రిజర్వుబ్యాంకు (ఆర్‌బీఐ) ఇచ్చిన సమాచారమిది. 
మరి కాంగ్రెస్ హయాంలో ఇలాంటి మోసాలు జరగలేదా?
కాంగ్రెస్‌-2 హయాంలో 29,078 కోట్ల విలువ చేసే మోసాలు జరిగితే, అంతకుమించి మోడీ-1 హయాంలోనూ మోసాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఎవరు ఏ సంస్థ ఏమైపోతే నాకేంటీ… నేను బాగుంటే చాలు అన్న పద్ధతిలో ఐదేండ్ల మోడీ పాలన సాగింది తప్ప సామాన్యులకు ఒరిగింది శూన్యం. 

ఎందుకు మోడీ ఇలా చేశాడు?
రైతులు, చిరు వ్యాపారులు వెళ్లి బ్యాంకుల్లో అప్పు అడిగితే సవాలక్ష ప్రశ్నలు.. కొర్రీలెన్నో! ఇంత జాగ్రత్తగా బ్యాంకులు నియమ నిబంధనలు పాటిస్తుంటే.. బడా బాబులు మాత్రం వేలాది కోట్ల మేర బ్యాంక్‌ మోసాలకు పాల్పడడంలో ఆరితేరారంటే ఎక్కడున్నది లోపం. డబ్బున్నచోట మోసమూ ఉంటుంది. బ్యాంకులను బురిడీ కొట్టించే వాళ్లూ ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. కానీ, రుణాల జారీ విషయంలో బ్యాంకులు ఎంతో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నా ఈ మోసాలు ఎలా జరిగాయి? మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక.. ఈ మోసాలు బయటపడ్డాయా..? లేక అంతకుముందు కూడా జరుగుతూ వస్తున్నాయా? అంటే గతంలోనూ ఈ మోసాలు జరిగాయన్నది వాస్తవం. కానీ, మోడీ పాలనలో పెద్ద ఎత్తున పెరిగాయి. కాపలాదారుడిగా ఉంటానన్న మోడీ తన పాలనలో ఎవరికి రక్షణగా ఉన్నారన్నది ఆర్‌బీఐ నివేదికతో తేటతెల్లమైంది. ఆశ్రితపక్షపాతానికి అంతులేదు. నీరవ్‌మోడీ, విజరుమాల్యా వంటి వారు బ్యాంకులను కొల్లగొట్టినా చర్యల్లేకుండా విదేశాలకు పారిపోయేలా సహకరించారంటే ఇంతకంటే ఘోరం ఏముంటుంది?
లెక్కలు చూస్తే తేలుతుంది గదా?!
గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మోసాలకు సంబంధించి మొత్తం 6800 కేసులు నమోదైతే వీటిలో దాదాపు రూ.71,500కోట్లు పోగొట్టుకున్నట్టు బ్యాంకులు ఆర్‌బీఐకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నాయి. 2017-18లో మోసాలు కంటే 2018-19లోని మోసాల విలువ 73శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఎన్నికల సమయంలో తన వారికి మేలు చేయడం కోసం ఆర్‌బీఐపై ఒత్తిడి తెచ్చి ఉదారంగా వ్యవహరించడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ విషయంలో తన మాట విననందుకు ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నిలువలేక పోయిన విషయం తెలిసిందే. పారుబకాయిలు :
రుణాలు తీసుకున్న వారు వాటిని పారు బకాయిల కింద చూపి ప్రస్తుత ప్రభుత్వంలో ఎత్తివేసేందుకు సిద్ధమవుతున్నారని ఆర్‌బీఐ నివేదిక ద్వారా స్పష్టమవుతున్నది. రూ.లక్ష రుణం తీసుకుంటున్న రైతుల విషయంలో నోటీసులు పంపి, వేధింపులకు గురిచేసి అవమానాలు పాల్జేసి ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్న బ్యాంకులు, మోసాలకు పాల్పడుతున్న బడా కార్పొరేట్ల పట్ల చూసీచూడనట్టు ఉండటం ఎంతవరకు సమంజసం?

కుంభకోణాలు : 
లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన 26స్కామ్‌లు బీజేపీ పాలనలో చోటు చేసుకున్నాయి. రాఫెల్‌ కుంభకోణంలో ప్రధాని మోడీ పైనే ఆరోపణలున్నాయి. కార్పొరేట్‌ రంగంలో వెల్లువలా వెలుగుచూస్తున్న ఈ కుంభకోణాలు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ పతానవస్థకు చేరువలో చేరిందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అవినీతి ఆరోపణ లెదుర్కొంటున్న అమిత్‌షా లాంటివారు ఎంతోమంది మోడీ-2 ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఇలాంటివారితో రేపటి పాలన ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.