మోడీ హయాం లో , బ్యాంకులను కార్పొరేట్లు చేసిన మోసం విలువ అక్షరాలా
రూ.1.55 లక్షల కోట్లు అని తేలింది.. సమాచార హక్కు చట్టం కింద పీటీఐ జర్నలిస్టు అడిగిన
ప్రశ్నకు భారతీయ రిజర్వుబ్యాంకు (ఆర్‌బీఐ) ఇచ్చిన సమాచారమిది.
మరి కాంగ్రెస్ హయాంలో ఇలాంటి మోసాలు జరగలేదా?
కాంగ్రెస్-2
హయాంలో 29,078 కోట్ల విలువ చేసే మోసాలు జరిగితే, అంతకుమించి మోడీ-1 హయాంలోనూ మోసాలు
చోటు చేసుకోవడం గమనార్హం. ఎవరు ఏ సంస్థ ఏమైపోతే నాకేంటీ… నేను బాగుంటే చాలు అన్న పద్ధతిలో
ఐదేండ్ల మోడీ పాలన సాగింది తప్ప సామాన్యులకు ఒరిగింది శూన్యం.
ఎందుకు మోడీ ఇలా చేశాడు?
రైతులు,
చిరు వ్యాపారులు వెళ్లి బ్యాంకుల్లో అప్పు అడిగితే సవాలక్ష ప్రశ్నలు.. కొర్రీలెన్నో!
ఇంత జాగ్రత్తగా బ్యాంకులు నియమ నిబంధనలు పాటిస్తుంటే.. బడా బాబులు మాత్రం వేలాది కోట్ల
మేర బ్యాంక్ మోసాలకు పాల్పడడంలో ఆరితేరారంటే ఎక్కడున్నది లోపం. డబ్బున్నచోట మోసమూ
ఉంటుంది. బ్యాంకులను బురిడీ కొట్టించే వాళ్లూ ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. కానీ, రుణాల జారీ
విషయంలో బ్యాంకులు ఎంతో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నా ఈ మోసాలు ఎలా జరిగాయి? మోడీ సర్కార్
అధికారంలోకి వచ్చాక.. ఈ మోసాలు బయటపడ్డాయా..? లేక అంతకుముందు కూడా జరుగుతూ వస్తున్నాయా?
అంటే గతంలోనూ ఈ మోసాలు జరిగాయన్నది వాస్తవం. కానీ, మోడీ పాలనలో పెద్ద ఎత్తున పెరిగాయి.
కాపలాదారుడిగా ఉంటానన్న మోడీ తన పాలనలో ఎవరికి రక్షణగా ఉన్నారన్నది ఆర్‌బీఐ నివేదికతో
తేటతెల్లమైంది. ఆశ్రితపక్షపాతానికి అంతులేదు. నీరవ్‌మోడీ, విజరుమాల్యా వంటి వారు బ్యాంకులను
కొల్లగొట్టినా చర్యల్లేకుండా విదేశాలకు పారిపోయేలా సహకరించారంటే ఇంతకంటే ఘోరం ఏముంటుంది?
లెక్కలు చూస్తే తేలుతుంది గదా?!
గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మోసాలకు సంబంధించి మొత్తం 6800 కేసులు నమోదైతే వీటిలో
దాదాపు రూ.71,500కోట్లు పోగొట్టుకున్నట్టు బ్యాంకులు ఆర్‌బీఐకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నాయి.
2017-18లో మోసాలు కంటే 2018-19లోని మోసాల విలువ 73శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఎన్నికల
సమయంలో తన వారికి మేలు చేయడం కోసం ఆర్‌బీఐపై ఒత్తిడి తెచ్చి ఉదారంగా వ్యవహరించడమే ఇందుకు
ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ విషయంలో తన మాట విననందుకు ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్
పటేల్ నిలువలేక పోయిన విషయం తెలిసిందే. పారుబకాయిలు :
రుణాలు తీసుకున్న వారు వాటిని పారు బకాయిల
కింద చూపి ప్రస్తుత ప్రభుత్వంలో ఎత్తివేసేందుకు సిద్ధమవుతున్నారని ఆర్‌బీఐ నివేదిక
ద్వారా స్పష్టమవుతున్నది. రూ.లక్ష రుణం తీసుకుంటున్న రైతుల విషయంలో నోటీసులు పంపి,
వేధింపులకు గురిచేసి అవమానాలు పాల్జేసి ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్న బ్యాంకులు, మోసాలకు
పాల్పడుతున్న బడా కార్పొరేట్ల పట్ల చూసీచూడనట్టు ఉండటం ఎంతవరకు సమంజసం?
కుంభకోణాలు :
లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన 26స్కామ్‌లు
బీజేపీ పాలనలో చోటు చేసుకున్నాయి. రాఫెల్ కుంభకోణంలో ప్రధాని మోడీ పైనే ఆరోపణలున్నాయి.
కార్పొరేట్ రంగంలో వెల్లువలా వెలుగుచూస్తున్న ఈ కుంభకోణాలు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ
పతానవస్థకు చేరువలో చేరిందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అవినీతి ఆరోపణ లెదుర్కొంటున్న
అమిత్‌షా లాంటివారు ఎంతోమంది మోడీ-2 ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.
ఇలాంటివారితో రేపటి పాలన ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.
No comments:
Post a Comment