Difference between branded and generic medicines?
This BLOG is dedicated exclusively to Andhra kshatriyas to strengthen the solidarity,tradition& morality of kshatriya community. it also promotes better human values and traditions. Please remember it’s not caste biased or caste based matter. Please contribute your positive suggestions & comments…
Search This Blog
Saturday, 29 January 2022
Sunday, 10 January 2021
3 minute Introduction to Kaya Kalpa Yoga
or reload the browser
ఓజస్సు, తేజస్సుగా,తేజస్సుప్రాణశక్తిని ఉద్దీపన చేసే శక్తిగా
చేసే విధానమే కాయకల్ప.
సృష్టిలో ఏదైనా దేశ కాలాలకు లొంగి ఉండవలసిందే!
కాలమానాలలో తేడా ఉండవచ్చు తప్ప , చివరికి బ్రహ్మ అనే శక్తికి కూడా జననం,లయమూ
ఉంటాయి. మానవ పూర్ణ ఆయుర్ధాయం 120 ఏళ్ళు. . కానీ ఈతి బాధలు, అంటువ్యాధులు,
ధాతు నష్ట ము, జనటిక్ తదితర వ్యాధులు , దురిత(కర్మ) కారకములు ఇలా అనేక కారణాల
చేత ఆయుర్ధాయం తగ్గిపోతుంది.
ముఖ్యంగా అపరిమితమైన లేదా పూర్తిగా లోపించిన ఆహరం,నిద్ర,ఆలోచనలు
,పని , లైంగిక క్రియ అనేవి మనిషిలో వైటల్ ఎనర్జీని బాగా తగ్గించివేస్తాయి.
ఎప్పుడైతే వైటల్ ఎనర్జీ తగ్గిందో, కణాలను పట్టిఉంచే బయో అయస్కాంత శక్తి
తగ్గి వ్యాధులు కలుగుతాయి .
కాబట్టి , ఆహరం,నిద్ర,ఆలోచనలు ,పని , లైంగిక క్రియ అనే
ఐదు మితంగా అదుపులో సంతులిత స్థాయిలోనే ఉండేటట్లు మన ప్రవర్తనను తీర్చి దిద్దుకోవాలి.
కేవలం వ్యాధి కి, వ్యాధి కారణానికి చికిత్స
అందిస్తే సరిపోదు. వ్యాధులను తట్టుకొనే రోగ నిరోధ సామర్ధ్యాన్ని పెంచితే తప్ప, క్వాలిటీ
ఆయువును అనగా ఎలాంటి రోగాలు లేని ఆయుస్సును మనిషికి ఇవ్వలేము.
బిలియన్ల సంఖ్యలోఉన్న సప్త ధాతువులకు చెందిన కణాలను ఒక
మానవాకారం లో కలిపి, నిలిపి ఉంచే శక్తినే బయో అయస్కాంత ఎనర్జీ
లేదా పోలార్ ఎనర్జీ అంటారు. ఈ అయస్కాంత శక్తి ఉందంటే విద్యుత్ శక్తి లాంటిది కూడా ఉండాలి
గదా?
అవును! కణాల మధ్యన భ్రమణం చేసే సూక్ష్మ మైన కణాలుంటాయి. వీటి
కేంద్రీయ భ్రమణ శక్తి ( centrifugal force ) వలన శక్తి తరంగాలు దేహమంతటా వ్యాపిస్తూ
ఉంటాయి. ఇదే విద్యుత్ శక్తి,కైనటిక్ శక్తి లేదా జీవశక్తి. (vital force).
జీవశక్తిని, బయో అయస్కాంత శక్తిని, ఎనర్జీని సరి
సమాన పాళ్ళలో ఉంచేటట్లుగా మన ఆహార విహార వ్యవహారాలను తీర్చి దిడుకొవాలి.
యోగ రసామృతం (sexual vital fluidic energy storehouse) అనేది ఒక బ్యాటరీ లాంటి అనగా శక్తిని నిల్వ ఉంచే ఒక రసాయనశక్తి . ఇది మెదడులో ముఖ్యంగా పీనియల్,పిట్యూటరీ,హైపో థలామస్ , మూడవ కుహరం అనే ఒక వలయకారపు సర్క్యూట్ ఉత్తేజము చెందినప్పుడు ఈ యోగ రసామృతం దేహములోని వైటల్ ఫోర్స్ ప్రవహించే నాడుల లోకి ప్రసరిస్తుంది.
Friday, 4 December 2020
కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లుల్ని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?*
* కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లుల్ని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?*
- కొత్త చట్టాలప్రకారం, రాష్ట్ర సహకార మార్కెట్ అనే చిన్న స్థాయి నుండి ప్రపంచం మొత్తం ఒక మహా మండీ గా మారుతుంది.
- కనీస మద్దతు ధర అనే బిచ్చమ్ పై ఆధారపడకుండా రైతులు సంఘటితమై తమ సరకులను ప్రపంచంలో ఎక్కడికైనా ఎగుమతి చేసుకోవచ్చు.
- వ్యవసాయరంగం లోకి ప్రవేట్ పెట్టుబళ్ళు ఎక్కువగా వస్తాయి కాబట్టి రైతులకిష్టం ఉంటే ప్రవేట్ పెట్టుబడిదారులతో కౌలు అగ్రిమెంట్ చేసుకొని ఎక్కువ కౌలు పొందే అవకాశం ఉంటుంది.
- అలాగే వాణిజ్యపరంగా ఏ వంగడానికి ఎక్కువ డిమాండ్ ఉంటే ఆ వంగడాన్ని పండించే అవకాశం ఉంటుంది.
- విత్తనాలు, భూమిని తయారు చేయడం, ఎరువులు,పురుగుమందులు ,కోత మిషన్లతో మాసూలు తదితర ఖర్చులు కమ్యూనిటీ వ్యవసాయం ద్వారా తగ్గించుకోవచ్చు. రైతులే సంఘాలుగా ఏర్పడి సబ్సిడీలు, సాఫ్ట్ లోన్ లు తీసుకొని గిడ్డంగులు, సోలార్ డ్రయ్యర్ లు ,శీతల స్టోరేజీ లు నిర్మించుకొని డిమాండ్ పెరిగేవరకు సరకును నిల్వ చేసుకోవచ్చు.
- ఇదే చట్టాన్ని కార్పోరేట్ వాళ్లకు అనుకూలంగా ఉందని కూడా చెప్పవచ్చు. ఒక విషయాన్ని చూసే దృక్పధం ను అనుసరించి మన అవగాహన ఉంటుంది. అలాగైతే ఇప్పటివరకు మన రైతులు కౌలు కిచ్చేది ప్రవేట్ వ్యక్తులకే గదా? ఇప్పుడు ఎక్కువ డబ్బు,మందీ మార్బలం ఉన్న పెద్ద ప్రవేట్ వాళ్లకి కౌలుకిస్తే ఎక్కువ కౌలు గిట్టుబాటవుతుంది గదా?
Tuesday, 9 June 2020
మోడీ పాలనలో మెరుపు లేవైనా ఉన్నాయా?
Sunday, 10 May 2020
Saturday, 2 May 2020
5 లక్షల వైరస్ మరణాలా ? 10కోట్ల ఆకలి చావులా?
ఆక్సిజన్ యంత్రాలు గానీ, కనీసం ఆక్సిజన్ గొట్టాలు కూడా తయారు చేయలేని దుస్థితి లో మన దేశం ఉంది. దీనికి కారణం మన నాయకుల హ్రస్వ దృష్టి అని గానీ, ఆరోగ్యమే మహాభాగ్యమనే ఇంగితం లేకపోవడమనీ నేను విమర్శించబోవడం లేదు.
5 లక్షల వైరస్ మరణాలా ?
40 కోట్ల ఆకలి ఆక్రంద న లా?
10కోట్ల ఆకలి చావులా?