Search This Blog

Saturday, 7 September 2024

విజయవాడ ను ముంచేసిన జగన్ మోహన్ రెడ్డి YCP ప్రభుత్వ నిర్లక్ష్యం.

విజయవాడ ను ముంచేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం. 

 బుడమేరు కు బెజవాడ దుఃఖదాయిని అనేపేరుఎప్పటి నుండో ఉన్నదే!

గత 5 ఏళ్లుగా కాలువ కట్టలు,చెరువు గట్టులు దున్నేసే మట్టిని అమ్ము కోవడమేకాదు,  వెలగలేరు లాంటి చిన్ని చిన్ని బ్యారేజ్ లను కనీసం గ్రీజుకూడా పెట్టకుండా,  నేటి బుడమేరు వరదలకు కారణమైన రోగ్ ఎవడు? అంటే ఎవ్వరైనా చెబుతారు. 

ప్రక్రుతి ని దోచేస్తే  అది మనలను దోచేస్తుంది.  బుడమేరు ప్రకృతిలో భాగం. అలాంటి  బుడమేరును ఇష్టం వచ్చినట్లు దోచేస్తే అది చెప్పే గుణపాఠం ఎలాఉంటుందో అందరం చూస్తున్నాం. 

ఎక్కడో ఖమ్మం కృష్ణా జిల్లాల సరిహద్దులలో కొండప్రాంతలలో పుట్టిన బుడమేరు..

A.కొండూరు, మైలవరం, జి.కొండూరు మండలాల గుండా విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలోకి ప్రవహిస్తుంది.

బుడమేరుకి రెడ్డిగూడెం నుండి కోతుల వాగు, జి.కొండూరు మండల గంగినేని నుండి పులివాగు  మునగపాడు  నుండి బీమ్ వాగు, CH మాధవరం నుండి లోయవాగు, గడ్డమణుగు లోయప్రాంతం నుండి దొర్లింతలవాగు ఉపవాగులుగా ఉన్నాయి.

సరిగ్గా 20ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురైంది. వాగులు, వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి రుజువైంది. 20ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో దానికి మూల్యం నేడు చెల్లించుకుంటున్నారు. 20ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం, బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. ముఖ్యంగా 2019 నుండి జగన్ పాలనలో వైకాపా నాయకుల కబ్జాకి బలైంది బుడమేరు.. అసలు బుడమేరుతో విజయవాడ మునకకు ముఖ్య కారణం YS రాజశేఖర్ రెడ్డి.

విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానదికంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా దానికి ముప్పు పొంచి ఉంది. 2005లో చివరి సారి బుడమేరు బెజవాడ పుట్టిముంచింది. 2005సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపుకు గురైంది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్‌ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపంతో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువున ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచెత్తింది.

ఖమ్మం జిల్లాలో పుట్టే బుడమేరు ఏటా సాధారణ సీజన్‌లో గరిష్టంగా 11వేల క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది 70వేల క్యూసెక్కులకు చేరింది. బుడమేరు ప్రవాహాన్నినియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్‌ను కూడా 70వ దశకంలో నిర్మించారు. వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, విజయవాడ రూరల్‌ మీదుగా నగరంలోకి ఇది ప్రవేశిస్తోంది.

2005లో వచ్చిన వరదలకు కారణాలను వివరిస్తూ దేవినేని ఉమామహేశ్వరరావు గారు, సీపీఐ అనుబంధ రైతు సంఘం నాయకుడు కొల్లి నాగేశ్వరరావు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారం చూపకపోతే కృష్ణా జిల్లాకు ఎప్పటికీ ముంపు పొంచి ఉంటుందని ఆందోళనకు దిగడంతో ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి స్వయంగా విజయవాడ వచ్చారు. విజయవాడలో ఉన్న వరద పరిస్థితి మొత్తాన్ని ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరించారు. బుడమేరు ప్రవాహాన్ని కట్టడి చేయాలంటే దానిని మళ్లించడం ఒక్కటే మార్గమని భావించారు.

పోలవరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను కుడి కాల్వ ద్వారా కృష్ణా నదిలో కలిపే డిజైన్ అప్పటికే ఖరారైంది. బుడమేరు ప్రవాహానికి దిగువన పోలవరం కుడికాల్వ కృష్ణానదిలో గుర్తించి అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని అధికారులకు నాటి సీఎం వైఎస్సార్‌ సూచించారు. విజయవాడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బుడమేరు మలుపులు సరి చేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూస్తామని, వరదల్లో నీటి ప్రవాహం వెనక్కి ఎగదన్నకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పోలవరం కుడి కాల్వ నిర్మాణంలో భాగంగా 2007-08 నాటికి బుడమేరు దిగువ ప్రవాహాన్ని కుడి కాల్వలోకి మళ్లించారు. కొత్తగా మరో కాల్వను తవ్వకుండా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్‌ నుంచి వచ్చే జలాలను కృష్ణా నదిలో కలిపే కాల్వలోకి మళ్ళించారు.ఇక్కడే సాంకేతికంగా ఓ సమస్య తలెత్తింది. పోలవరం కుడి కాల్వను గరిష్టంగా 37,500 క్యూసెక్కుల ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు.

విటిపిఎస్‌ మీదుగా ప్రవహించే కాల్వలకు అంత సామర్థ్యం లేదు. వాటిని వరద ప్రవాహానికి అనుగుణంగా పెంచాలని ప్రతిపాదనలు ఉన్నా, థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ లోపల కాల్వలను విస్తరించే పరిస్థితి లేకపోవడంతో బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాల్వల సామర్థ్యం పెరగలేదనే వాదన ఉంది. 

దీనికి తోడు కృష్ణానది ముఖ ద్వారంలో ఉన్న నిర్మాణాలు కూడా వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.

విటిపిఎస్‌ నుంచి కృష్ణా నదిలోకి బుడమేరు వరద నీరు చేరాలంటే కృష్ణానదిలో నీటి మట్టం తగిన స్థాయిలోఉండాలి. కృష్ణా నదిలో ఎగువ నుంచి వరద కొనసాగే సమయంలో బుడమేరు నుంచి వచ్చే వరద ప్రవాహం నదిలోకి చేరదు. అదే సమయంలో పోలవరం కుడి కాల్వ నుంచి నీటి విడుదల కొనసాగితే వరద ప్రవాహం దిగువన విజయవాడ వైపే వెళ్లాల్సి ఉంటుంది.

20ఏళ్ల నిర్లక్ష్యానికి మూల్యం..

20ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో విజయవాడ నగరంలో న్యూ రాజరాజేశ్వరి పేట, సింగ్‌నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. రోజుల తరబడి ప్రజలు వర్షపు నీటిలో చిక్కుకుపోయారు. బుడమేరుకు వెలగలేరు రెగ్యులేటర్ దిగువన మళ్లింపు చేపట్టగానే విజయవాడకు వరద ముంపు తప్పిపోయింది.

2008 నుంచి విజయవాడ రూరల్‌ మండలంలో వేగంగా నిర్మాణాలు విస్తరించాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా నగరంలో మరో కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం పరిధిలో న్యూ రాజరాజేశ్వరిపేట ఎక్స్‌టెన్షన్‌, నందమూరి నగర్ వంటి ప్రాంతాలు విస్తరించాయి. అంతకు ముందు అదంతా బుడమేరు పరివాహక ప్రాంతమనే సంగతిని పూర్తిగా విస్మరించారు.

2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కిన సంగతి కూడా ప్రజా ప్రతినిధులు విస్మరించారు. బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను 2008 నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. సుందరీకరణ పేరుతో నగరానికి రక్షణగా ఏర్పాటు చేసిన వ్యవస్థల్ని రాజకీయ నాయకులు యథేచ్ఛగా ధ్వంసం చేశారు. కాలనీలకు కాలనీలను విస్తరించి నివాస ప్రాంతాలను విస్తరించడంలో 2009 నుంచి విజయవాడలో ఎన్నికైన ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్, వైసీపీలకు ఇందులో ఎక్కువ భాగస్వామ్యం ఉంది.

బుడమేరు ఉగ్రరూపం దాల్చినపుడు నీటి ప్రవాహానికి అనుగుణంగా పలు చోట్ల మలుపులు ఏర్పడ్డాయి. రెండు, మూడు దశాబ్దాల క్రితం & నాలుగైదేళ్ల క్రితం బుడమేరుకు వరదలు వచ్చినా.. పంట పొలాలు మాత్రమే నీట మునిగేవి. బుడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహ వేగాన్ని తగ్గించి ఊళ్లను ముంచెత్తుతున్నాయని, విజయవాడ, నిడమానూరు ప్రాంతాల్లో ఉన్న “యూ ” టర్నింగ్‌లను సవరించాలని 20ఏళ్ల క్రితమే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించింది.

బుడమేరును ఆక్రమణల నుంచి విడిపించి దాని గరిష్ట సామర్థ్యానికి అనుగుణంగా విస్తరించాలని ప్రతిపాదించారు. విజయవాడ మార్కు రాజకీయం ఆ పనుల్ని అడ్డుకుంది. ఇళ్లను తొలగిస్తే ఊరుకోమని హెచ్చరించడంతో ప్రభుత్వం కూడా వదిలేసింది. ఇదే అదనుగా బుడమేరును యథేచ్ఛగా ఆక్రమించేశారు. ఇక విటిపిఎస్‌ నుంచి ప్రవహించే వరద ప్రవాహ మార్గంలో ఉన్న నిర్మాణాలు కూడా విజయవాడ ముంపుకు కారణమవుతున్నాయి. వాటిని సరిచేసే సంకల్పం ఏ పార్టీకి లేకపోవడమే ప్రస్తుత పరిస్థితి కారణమైంది.

ప్రపంచంలోనే అతిపెద్ద మంచి నీటి సరస్సుకు నీటిని అందించే నీటి వనరుల్లో బుడమేరు ఒకటి, పశ్చిమగోదావరిలో తమ్మిలేరు, ఎర్రకాల్వలతో పాటు కృష్ణాలో బుడమేరు కొల్లేరుకు ప్రధాన నీటి వనరుగా ఉంటుంది. కొల్లేరులో వరద ప్రవాహాన్ని స్వీకరించకుండా ఆక్రమణలతో నిండిపోవడంతో వరదలు దిగువకు చేరడంలో జాప్యం జరుగుతోంది. ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ప్రవహించే వర్షపు నీరంతా బుడమేరు ద్వారా 170కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి కొల్లేరును చేరుతుంది.

బుడమేరు (BDC) వాస్తవాలు :- 2019 ఏప్రిల్ నాటికి చంద్రబాబు ప్రభుత్వం  చేసిన పనులు: ★ఎర్త్ డీపెనింగ్ వర్క్ 12 కోట్లు ★VTPS స్ట్రక్చర్ బలోపేతానికి 36 కోట్లు ★పాత రైల్వే బ్రిడ్జిలు తీసి కొత్తవి కట్టడానికి 42 కోట్లు ★పాత స్ట్రక్చర్ తీసి కొత్తవి కట్టడానికి డీపెన్ స్ట్రక్చర్ కు 25 కోట్లు

మూడు డబుల్ లైన్ బ్రిడ్జిలు, ఒక సూపర్ పాసెజ్ కి 24కేట్లు కేటాయించి 17 కోట్ల పనులు పూర్తి ★VTPS వద్ద మిగిలిన ఎర్త్ వర్క్, కాంక్రీట్ లైనింగ్ కు 2018 లో 208 కోట్లు కేటాయించి 26 కోట్ల పనులు పూర్తి.

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జరుగుతున్న పనులు ఐదేళ్లు ఆపేశారు కాంట్రాక్టర్లకు చేసిన పనులకు బిల్లులు కూడా చెల్లించలేదు .ఈ దోపిడీఫలితమే నేటి భయానకమైన వరద.  

అందుకే అంటారు. ఓటు వేసే ముందు బాధ్యతగా ఒక్క నిమిషం ఆలోచించి వేయాలి గానీ, లక్షకోట్ల ఆర్ధిక ఉగ్రవాదికి ఓటేస్తే ఏమవుతుందో గత 5 ఏళ్లు చూసాం.

రాజకీయపార్టీ ముసుగులో  మాఫియా ని, మత మార్పిడి ని  నడిపే వాడు వెళ్ళిపోయినా, వాళ్ళు చేసిన దురాగతాల దుష్ఫలితాలలో ఈ వరద ఒక్కటి. ఆ మాఫియా పాలన దుష్ఫలితాలు  ఇంకా ముందు ముందు ఎన్నో చూస్తాం. 

Excellent Upcoming Projects of Andhra Pradesh | #andhrapradesh #develop...

Tuesday, 2 July 2024

పోలవరం ప్రాజెక్టు & డయాఫ్రమ్‌ వాల్‌ అంటే ఏంటి ? YCP ప్రభుత్వం వలన లక్షకోట్ల నష్టం ఎలా జరిగింది. ?

 డయాఫ్రమ్‌ వాల్‌.. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న టాపిక్ ఇది... YCP ప్రభుత్వం చేసిన అరాచక పాలన, వివాదాస్పద నిర్ణయాలు, రివర్స్ టెండరింగ్ , పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ వద్దని చెప్పినా వినకుండా  కాంట్రాక్టర్ ని కమిషన్లకోసం మార్చేయడం ,తదితర దుర్మార్గాలవలన పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోవడమేకాదు,సుమారు లక్షకోట్ల నష్టం జరిగింది. 

  అసలు డయాఫ్రమ్‌ వాల్‌ లో ఏమి జరిగింది, ఎవరు దీనికి బాధ్యలు అనేది తెలుసుకుందాం రండి..

డయాఫ్రమ్‌ వాల్‌ అంటే ఏంటి ?

పోలవరం ప్రాజెక్టు కోసం 41 మీటర్ల ఎత్తులో, దాదాపు 1750 మీటర్ల పొడవునా రాతి-మట్టికట్ట నిర్మించాల్సి ఉంది. అలా మట్టికట్ట వేసినప్పటికీ ఎన్నో రోజులు నిలవదు. ఎందుకంటే... కట్ట కింద ఉన్న ఇసుక కదిలిపోతుంది. దాంతోపాటు రాక్‌ఫిల్‌ డ్యామ్‌ కూడా కుంగిపోతుంది. అలా జరగకుండా మట్టికట్ట కింది నుంచి ఒక్క చుక్క కూడా నీరు అట్నుంచి ఇటు రాకుండా నదీగర్భంలోనే అతిపెద్ద గోడ కట్టాలి. అదే... ‘డయాఫ్రమ్‌ వాల్‌’. మొత్తం ప్రాజెక్టులో ఇది అత్యంత కీలకం. గోదావరినదిలో 300 అడుగుల లోతులో 1427 మీటర్ల పొడవునా, 1.5 మీటర్ల మందంతో నిర్మించారు.


చంద్రబాబు గారు ఎంతో అనుభవం ఉన్న బావర్‌ కంపెనీకి పనులు అప్ప చెప్పారు. ఇనుప చక్రాలున్న భారీ యంత్రం ఇసుకను తొలుచుకుంటూ రాతి పొర తగిలేదాకా వెళ్లి, రాతి పొరను కూడా మరో రెండు మీటర్లు లోపలికి తవ్వి... అక్కడి నుంచి పైదాకా ఐదు మీటర్ల వెడల్పుతో కాంక్రీట్‌ గోడ కొట్టారు. ఇది పూర్తిగా నదీ గర్భంలో ఉంటుంది. అందుకే జగన్ రెడ్డి మొదటి సారి పోలవరం వెళ్ళినప్పుడు, డయాఫ్రమ్‌ వాల్‌ ఎక్కడ కనిపించదే అని తన అజ్ఞానాన్ని బయట పెట్టి అభాసు పాలు అయ్యాడు.

2017 ఫిబ్రవరి లో మొదలయ్యి 2018 జూన్ నెలలో పూర్తయ్యింది. 412 రోజుల్లో నిర్మాణం పూర్తి చేసారు.

పోలవరం కాఫర్ డాం నిజాలు: 

కాఫర్ డ్యాం మూడు streches గా కట్టారు. ఒకటి 300 మీటర్లు, మరొకటి 1700 మీటర్లు, మూడోది 300 మీటర్లు. ఈ మూడిటి మధ్య, 300 మీటర్లు వరకు రెండు గ్యాపులు ఉంటాయి. 

గడువుకి వారమ్ ముందే, జూన్ 2018లో.. ఎగువ కాఫర్ డామ్ గ్రౌటింగ్ పనులు పూర్తి అయ్యింది, అక్టోబర్ 2018 నాటికి  దిగువ కాఫర్ డామ్ గ్రౌటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.

వివాదం ఏంటి ?

2018 జూన్ నెలలో డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తయ్యింది. 2018 సీజన్ లో వరద వచ్చింది, 2019 లో భారీ వరద వచ్చింది. 2019లో స్పిల్ వే మీద నుంచి కూడా నీళ్ళు వెళ్ళాయి. అప్పుడు కొట్టుకు పోని డయాఫ్రమ్ వాల్ 2020  ఆగస్టు లో ఎందుకు కొట్టుకుపోయింది ? 

ఎందుకు కొట్టుకుపోయింది అంటే, జగన్ రెడ్డి చేతకాని తనం వల్ల:

స్పిల్ వే కట్టకుండా, కాఫర్ డ్యాం కట్టారు, కాఫర్ డ్యామ్ అవ్వకుండా డయాఫ్రం వాల్ కట్టాడు. అనేది వైసీపీ చేసే పిచ్చి వాదన:

స్పిల్ వే క్రస్ట్ లెవెల్ 25.72 మీటర్లు పూర్తి చేస్తే కాఫర్ డ్యాం మొదలు పెడతారు. చంద్రబాబు కూడా అలాగే  స్పిల్ వే క్రస్ట్ లెవెల్ 25.72 మీటర్లు అయ్యాకే, కాఫర్ డ్యాం నిర్మాణం మొదలు పెట్టారు. ఈ సైకోలు చెప్తున్నట్టు, స్పిల్ వే మొత్తం పూర్తి అవ్వాల్సిన పని లేదు. నిజానికి  స్పిల్ వే క్రస్ట్ లెవెల్ 25.72 మీటర్లు చంద్రబాబు పుర్తి చేసారు, ఇక్కడ నుంచి జగన్ చేసిన పని కేవలం చంద్రబాబు కట్టిన దాని పైన ప్రీక్యాస్ట్ స్లాబ్స్ వేయటమే. స్పిల్ వే మొత్తం పూర్తయితేనే కాఫర్ డ్యాం కట్టాల్సిన పని లేదు, ఆ వాదన పూర్తిగా తప్పు.. అరేయ్ సైకోలు మళ్ళీ మళ్ళీ చదవండి ఈ పాయింట్..

స్పిల్ వే క్రస్ట్ లెవెల్ 25.72 మీటర్లు వరకు కాంక్రీట్ పూర్తయితే, అప్రోచ్ ఛానెల్, స్పిల్ ఛానెల్ పూర్తయ్యి నదీ ప్రవాహం మారుతుంది. 2019 జూన్ కి ముందే అవి పూర్తి అయ్యాయి. ఇక్కడ సమస్య కాఫర్ డ్యాంలో వచ్చిన గ్యాప్ లు పూడ్చకపోవటం వల్ల, డయాఫ్రం వాల్ దెబ్బతింది. ఈ పని చేయటానికి రెండు నెలలు చాలు. చంద్రబాబు దిగిపోయి, జగన్ రెడ్డి వచ్చాక 18 నెలలు పోలవరం పనులు పూర్తి కాలేదు. ఈ లోపు రెండు సార్లు వరద వచ్చి, ఈ నష్టం జరిగింది.

కాఫర్ డ్యాం, డయాఫ్రమ్‌ వాల్‌ సమాంతరంగా కట్టాలి. దానికి తగ్గట్టే చంద్రబాబు గారు కాఫర్ డ్యాం, డయాఫ్రమ్‌ వాల్‌ కట్టారు. ఇక్కడ సమస్య కేవలం కాఫర్ డ్యాంలో ఉన్న గ్యాపుల వల్ల. 2020 వరదలకు ఈ గ్యాప్ లో నుంచి నీరు డయాఫ్రం వాల్ కి కొట్టటంతో, దెబ్బతింది. మరి 18 నెలలు జగన్ రెడ్డి, ఆ గ్యాప్ లు పుడ్చాకుండా ఏమి చేసాడు ?

మే 2019 నాటికి చంద్రబాబు ప్రభుత్వం ఏడు నెలలలో రెండు వేల కాఫర్ డ్యాం పనులు పూర్తి చేసింది. అంటే నెలకు ఏవరేజ్ గా 300 మీటర్లు పూర్తిచేసారు. ఇంకో రెండు నెలలు లో 300+300 మీటర్ల గ్యాప్ పనులు పూర్తి అయ్యేవి. కానీ మన దరిద్రానికి, జగన్ రెడ్డి వచ్చాడు పనులు ఆపేసాడు. 18 నెలలు పని ఆపేసాడు. రెండు వరదలు వచ్చాయి. మూర్ఖంగా చేయకుండా పని పూర్తి చేసి, అధికారులు, కేంద్రం చెప్పిన మాట విని ఉంటే, రెండు నెలల్లో ఆ గ్యాప్ లు ఫిల్ అయ్యేవి, ఈ పాటికే పోలవరం ప్రారంభం కూడా అయ్యేది. మ

మూర్ఖంగా చేసిన ఆ చిన్న తప్పుతో, కాఫర్ డ్యాం పోయింది, డయాఫ్రం వాల్ పోయింది, గైడ్ బండ కుంగింది, ఇంకా చాలా అనర్ధాలు జరిగి, చివరకు మళ్ళీ పోలవరం మొదటికి వచ్చింది.. ఆ రోజు రెండు నెలలు జగన్ రెడ్డి పని చేసి ఉంటే, పోలవరం వేరే రకంగా ఉండేది..

ఇంకా ఉంది. లక్షకోట్ల నష్టం ఎలా జరిగిందో నెక్స్ట్ పోస్ట్ లో తెలుసుకొందాం . 


Saturday, 15 June 2024

పెళ్ళి ఎందుకు చేసుకోవాలి ?

 తోడుని ఇచ్చేది పెళ్ళి. నీడను ఇచ్చేది ఇల్లు . అందుకే, ఇల్లు - ఇల్లాలు " అనేవి మానవ సమూహాల కేకాదు పశు పక్ష్యాదులకు కూడా  కనీస అవసరం . పెళ్లి  అవసరాన్ని  మాత్రమే వివరిస్తాను.  అర్ధాన్ని, పరమార్ధాన్ని ఇక్కడ చెప్పబోవడం లేదు. 

మనకు రోజూ ఆనందం, దుఃఖం, ఈర్ష్య, కోపం వంటి రకరకాల భావోద్వేగాలకు గురవుతాము. మనిషిగా వాటిని పంచుకోవడానికి మనకొక ఆలంబన, భవిష్యత్తుకు భద్రత అవసరం. అల్లారు ముద్దుగా పెంచిన అమ్మనాన్నలు మనకన్నా ముందే మనని వీడి వెళ్ళిపోతారు. తోబుట్టువులు వారి జీవితాన్ని వెతుక్కుని వాళ్ల సంసార జంజాటాలలో ఈత కొడుతూ అందుబాటులో ఉండకపోవచ్చు. కనక మనతో పాటు సదా నడిచే ఒక తోడు మనకు అవసరం. మనం కన్నబిడ్డలు కూడా రెక్కలు రాగానే విద్యావృత్తుల వెతుకులాటలో దూరతీరాలకు ఎగిరిపోతారు. వయస్సులో ఉన్నప్పుడు ఎవ్వరి అవసరం లేదనుకున్నా, వయస్సు మీరాకా, మన పక్కన, మన కోసం నేల మీద పట్టు కోసం ప్రయత్నిస్తూ ఊతకర్ర పట్టుకుని నిలబడి ఉండే ఒక మనిషిని చూస్తే పుట్టే కొండంత ధైర్యాన్ని పెళ్ళి అనే వ్యవస్థ సాధ్యపరుస్తుంది.


మా అమ్మ నాకొక కథ చెప్పేది. తన చుట్టూ ఉన్న మనుషుల జీవితాల్లో ఈతిబాధలను చూసి విరక్తి చెందిన ఒక వ్యక్తి, మనశ్శాంతికి కేవలం భగవద్ధ్యానమే మార్గమని ఎంచి, ధ్యానం చేయడం మొదలుపెట్టి సాధువుగా మారాడు. భవబంధాలు అన్నింటిని వదిలి తనకంటూ కేవలం రెండు గోచీలు మాత్రమే (అవి కూడా ఒకటి ఒంటిపై, ఒకటి దండెంపై ఉతికి ఆరేసినది) ఉంచుకున్నాడు.

కొన్నాళ్ళకు ధ్యానంలో ఉన్న సాధువును ఒంటి మీది గోచీ కొరుకుతూ ఒక ఎలుక ఇబ్బంది పెట్టడం మొదలెట్టింది. సాధువు ఎలుక బాధ భరించలేక పిల్లిని పెంచడంతో మొదలుపెట్టి, పిల్లి ఆకలి తీర్చే పాలు కొరకు ఆవుని, ఆవును మేపడానికి ఆలిని, ఆలిని బాధ పెట్టకూడదని ఆమెకు ఒక బిడ్డని తన జీవితంలోకి రానిచ్చి తిరిగి సంసార మోహమాయకు బంధీ అయ్యాడు. తను జీవనం సాగాలంటే కాషాయం కట్టిన సాధువుకు కూడా ఒక తోడు కావలసి వచ్చింది. ఆ తోడుని ఇచ్చేది పెళ్ళి !

దీనినే ‘కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపః’ అని చెప్తారు