సనాతన భారతావని లో వేద కాలం లో 'కులము' అనే పదం లేదు . ఉన్నదల్లా వర్ణ మే . వర్ణ మనేది ఆయా మనుషుల గుణాలు , చేసే వ్రుత్తి ,ప్రవ్రుత్తి పైన ఆధారపడి యుండేది . అది కర్కశమ్ గా ఉండేది కాదు . శూ ద్ర వృత్తిలో ఉన్నా వాడి సంతానం బ్రాహ్మణ్యం చేసుకోవచ్చు . వైశ్యుడు క్షత్రియుడి గా మార వచ్చు .
ద్వాపర యుగపు ఆఖరి రోజులు . కలియుగం ఆరంభం లో జరిగిన మహా భారత యుద్ధం లో సమస్త భూమండలమ్ లోని క్షత్రియులు నశించి పోగా ,బతికిఉన్న సైనికులు ,దళపతులు చిన్న చిన్న జన పదాలను ఆక్రమించుకొని రాజులుగా చెలామణీ అయ్యారు . కానీ వారికి రాజ నీ తి లో గానీ , రాజ ధర్మం పై గానీ ప్రవేశము లేదు . పట్టు లేదు .
బలవంతుడే రాజు . తెలివున్న వాడే అధికారి . కాస్త కండ ఉన్నోడే బంటు .
ఎప్పుడైతే రాజ ధర్మం నశించి , ఒక ధర్మం , పద్దతి లేని మనుషులు రాజులుగా - పాలకులుగా మారి రాజ ధర్మం తప్పి నప్పుడు , అలాగే సంఘం లోని ఇతర వర్ణాల వారు కూడ ఆయా సంఘ నియమాలు పాటించ నప్పుడు ,బ్రాహ్మణ వర్ణం వారు తిండికి మాడి పోయారు . అప్పుడు ,కొందరు బ్రాహ్మణులు పొట్టకోసం అనేక నియమ నిష్టలు , వేద ప్రామాణికం కాని క్రతువులు , మూడ నమ్మకాలు ప్రచారం చేసి ,వేదము లోని మర్మాలను ,జ్ఞానాన్ని కప్పిపుచ్చడానికి అవాకులు చెవాకులు ప్రవేశ పెట్టారు .
బ్రాహ్మణులు తప్ప మరే ఇతర వర్ణం వారు వేదాలు చదవకుండా అలాగే జ్ఞాన విజ్ఞాన ధార అందరికీ అందకుండా ఎన్నో తప్పుడు పనులు చేశారు .
ఎప్పుడైతే జ్హ్నాన ధార పది మందికీ అందకుండా పోయిందో అప్పుడే భారత జాతి జవజీవాలు ఉడిగిపోయాయి .
ఒక జాతిని నిర్వీర్యం చేయా లంటే వారిని చంప వలసిన పని లేదు . వారికున్న జ్ఞాన సంపదను వారి తర్వాతి తరాలకు అం ద కుండా చేస్తే చాలు .
విద్య లేని వాడు వింత పశువు అనే సామెత అలా వచ్చిందే .
బల వంతపు మత మార్పిడులు చేసి భుజాలు చరచు కొనక్కర లేదు .
మత గ్రంధాలను అంద కుండా చేస్తే చాలు -ఆ మతం క్రమేణా కనుమరు గవుతుం ది.
శాస్త్రాలు , వేదాలలోని నిజాలను మరుగు పరిచి కర్మ కాం డలు ప్రవేశ పెట్టి ఆనాటి జీవ సంపదను -గోవులు,మేకలు,బర్రెల ను -దానము రూపమ్ లో లేదా హోమ క్రతువుల బలి రూపం లో స్వీకరించే వారు .
సంఘ శాంతికి తోడ్పడ వలసిన వారి జ్ఞానం పక్క దారి పట్టి మొత్తం సంఘాన్ని బ్రష్టు పట్టించింది . విద్యని అమ్మకానికి పెట్టినది అప్పుడే .
మహా భారత యుద్ధం మొత్తం జాతిని, అప్పటికే బ్రష్టు పట్టిన వ్యవస్థను నాశనమ్ చేసింది .
పాలించే వారి ఆకృత్యాలు మితి మీరినప్పుడల్లా భగ వంతుడు ఏదో ఒక రూపమ్ లో వచ్చి లెక్క సరిచేస్తాడు .
వేద కాలం నుండి క్షత్రియ ,బ్రాహ్మణ వర్ణాల మధ్య జరుగుతున్న ఆధి పత్య పోరులో జరిగిన సంఘటనలు భారత దేశ చరిత్ర ని రకరకాలుగా మార్చి వేశాయి .
సమాజం లో రెండు వర్గాల మధ్య పోరు నాడు ఉంది . నేడు ఉంది .ఎప్పుడూ ఉంటానే ఉంటుంది .
వేద కాలంలో మొదటి స్థానం లో ఉన్న క్షత్రియులు క్రమం గా రెండో స్థానానికి జారారు . ఋగ్వేద కాలం లో పుట్టుకతో కాక , గుణాలను బట్టి వర్ణం ఉండేది .
త్రేతా యుగం లో పరశురాముడు క్షత్రియ వంశాలను సమూలము గా నిర్మూ లించిన తర్వాత ఏర్పడిన అరాచకాన్ని అరికట్టే టందుకు చేసిన హోమాగ్ని నుండి 4 రాజపుత్ర వంశాలు -పరమార్ ,చౌహాన్ , ఉద్భ వించాయి . వీరే రాజపుట్ క్షత్రియులు లేదా అగ్ని వంశ క్షత్రియులు .
ఆం ధ్ర క్షత్రియులు :
క్రీస్తుశకం 2వ శతాబ్దం లో శాతవాహనుల తర్వాత ఉత్తరా పధ మునకు చెంది కాలక్రమం లో దక్షిణా పదానికి వలస వచ్చిన ఇక్ష్వాకులనే వారు, వారి రాజ్యాలను కృష్ణా నదీతీరమైదానాలలో స్థాపించారు . నాగార్జున కొండ రాజధానిగా భట్టిప్రోలు ,జగ్గయ్య పేట ,అమరావతి ప్రాంతాలను పాలించారు .
వాయు పురాణమ్ ప్రకారం ఇక్ష్వాకు 100 మంది సంతానం లో 48 మంది దక్షిణా పదానికి వలస వచ్చి చిన్న చిన్న రాజ్యాలు స్థాపించు కొన్నారు .
బౌద్ద జైన సాహిత్యాన్ని తిరగేసినా ,అస్మక ,ములక,వేంగి రాజ్యాలు, వీరు స్థాపించిన వే .
ఇక్ష్వాకుల తర్వాత శాలంకాయనులు పల్లవ సామంతులుగా కృష్ణా గోదావరి ప్రాంతాన్ని పెదవేగి రాజధానిగా పాలించారు . వీరి తర్వాత విష్ణుకుండినులు, మిగతా క్షత్రియ వంశా లైన పరిచేది ,కోట , చాళుక్యలు గుంటూరు గోదావరి ,కృష్ణా సీమలను 300 ఏళ్ళ పాటు పాలించారు .(5 నుండి 7 శతాబ్దం వరకు ).
చంద్ర వంశ క్షత్రియులైన తూర్పు చాళుక్యులు నే వేంగి చాళుక్యులు గా పిలిచే వారు . వీరు పూర్వమ్ శాతవాహనులకు సామంతులు గా ఉండే వారు . వీరు ఎలమంచిలి , పిఠాపురం , ముదిగొండ ప్రాంతాలను పాలించారు .
మత్స్య రాజులు ముఖ్యం గా మత్స్య ప్రాంతం అనగా నేటి ఒరిస్సా కి చెందినా వారు .
చేది రాజులు కోణ ప్రాంతం అనగా నేటి కోన సీమ ని పాలించారు . తర్వాత కాలం లో చాళుక్య చోళ రాజులకు సామంతులుగా మారి చోడ రాజులుగా వ్యావహ రింప బడ్డారు . వీరి గోత్రం కాశ్యపస .
కాలచూరి,హైహేయ రాజులు మధ్య భారతానికి చెందినవారు .
ధనంజయ గోత్రీకులైన కోట వంశపు రాజులు ధరణికోట ని రాజధానిగా చేసుకొని 11,12 శతాబ్దం లో పాలించారు .
చాగి లేదా సాగి వంశ రాజులు చాలా కాలం చాళుక్యులకు సామంతులుగా ఉండి పోయారు .
ఆ తర్వాత కాకతీయులు , తర్వాత విజయనగర రాయలు పెద్ద రాజ్యాలు పాలించారు . కానీ వీరు క్షత్రియ వర్ణం నకు చెందినవారు కాదు .
- ప్రజలను కన్న బిడ్డల మాదిరి పాలించి కాపాడే వాడు క్షత్రియుడు .
- ఎలా బతికితే సుఖ సంతోషాలు ఉంటాయో బుద్ది చెప్పి,పరానికి పనికొచ్చే ధర్మాలను చెప్పే వాడు బ్రాహ్మణుడు .
- అవసరాలకు కావలసిన వస్తు సామగ్రిని పైకానికి అందించే వాడు వైశ్యుడు .
- పాడి - పంట పండించి , పనులు చేసే వాడు శూద్రుడు .
- పరం కోసం ,సత్య శోధనకి మౌనం గా తపం చేసుకొనే వారు మునులు .
- శాస్త్రాలను శోధించి , నిజాలను కనిపెట్టి సామాన్యులకు వాటి ఫలాలను అందించే వారు ఋషులు .
- విద్య అంగడి సరుకు కాదు .
- అన్నం అమ్మే వస్తువు కాదు . - ఇదీ వేద కాలం నాటి సంఘ స్థితి .
ద్వాపర యుగపు ఆఖరి రోజులు . కలియుగం ఆరంభం లో జరిగిన మహా భారత యుద్ధం లో సమస్త భూమండలమ్ లోని క్షత్రియులు నశించి పోగా ,బతికిఉన్న సైనికులు ,దళపతులు చిన్న చిన్న జన పదాలను ఆక్రమించుకొని రాజులుగా చెలామణీ అయ్యారు . కానీ వారికి రాజ నీ తి లో గానీ , రాజ ధర్మం పై గానీ ప్రవేశము లేదు . పట్టు లేదు .
బలవంతుడే రాజు . తెలివున్న వాడే అధికారి . కాస్త కండ ఉన్నోడే బంటు .
ఎప్పుడైతే రాజ ధర్మం నశించి , ఒక ధర్మం , పద్దతి లేని మనుషులు రాజులుగా - పాలకులుగా మారి రాజ ధర్మం తప్పి నప్పుడు , అలాగే సంఘం లోని ఇతర వర్ణాల వారు కూడ ఆయా సంఘ నియమాలు పాటించ నప్పుడు ,బ్రాహ్మణ వర్ణం వారు తిండికి మాడి పోయారు . అప్పుడు ,కొందరు బ్రాహ్మణులు పొట్టకోసం అనేక నియమ నిష్టలు , వేద ప్రామాణికం కాని క్రతువులు , మూడ నమ్మకాలు ప్రచారం చేసి ,వేదము లోని మర్మాలను ,జ్ఞానాన్ని కప్పిపుచ్చడానికి అవాకులు చెవాకులు ప్రవేశ పెట్టారు .
బ్రాహ్మణులు తప్ప మరే ఇతర వర్ణం వారు వేదాలు చదవకుండా అలాగే జ్ఞాన విజ్ఞాన ధార అందరికీ అందకుండా ఎన్నో తప్పుడు పనులు చేశారు .
ఎప్పుడైతే జ్హ్నాన ధార పది మందికీ అందకుండా పోయిందో అప్పుడే భారత జాతి జవజీవాలు ఉడిగిపోయాయి .
ఒక జాతిని నిర్వీర్యం చేయా లంటే వారిని చంప వలసిన పని లేదు . వారికున్న జ్ఞాన సంపదను వారి తర్వాతి తరాలకు అం ద కుండా చేస్తే చాలు .
విద్య లేని వాడు వింత పశువు అనే సామెత అలా వచ్చిందే .
బల వంతపు మత మార్పిడులు చేసి భుజాలు చరచు కొనక్కర లేదు .
మత గ్రంధాలను అంద కుండా చేస్తే చాలు -ఆ మతం క్రమేణా కనుమరు గవుతుం ది.
శాస్త్రాలు , వేదాలలోని నిజాలను మరుగు పరిచి కర్మ కాం డలు ప్రవేశ పెట్టి ఆనాటి జీవ సంపదను -గోవులు,మేకలు,బర్రెల ను -దానము రూపమ్ లో లేదా హోమ క్రతువుల బలి రూపం లో స్వీకరించే వారు .
సంఘ శాంతికి తోడ్పడ వలసిన వారి జ్ఞానం పక్క దారి పట్టి మొత్తం సంఘాన్ని బ్రష్టు పట్టించింది . విద్యని అమ్మకానికి పెట్టినది అప్పుడే .
మహా భారత యుద్ధం మొత్తం జాతిని, అప్పటికే బ్రష్టు పట్టిన వ్యవస్థను నాశనమ్ చేసింది .
పాలించే వారి ఆకృత్యాలు మితి మీరినప్పుడల్లా భగ వంతుడు ఏదో ఒక రూపమ్ లో వచ్చి లెక్క సరిచేస్తాడు .
వేద కాలం నుండి క్షత్రియ ,బ్రాహ్మణ వర్ణాల మధ్య జరుగుతున్న ఆధి పత్య పోరులో జరిగిన సంఘటనలు భారత దేశ చరిత్ర ని రకరకాలుగా మార్చి వేశాయి .
సమాజం లో రెండు వర్గాల మధ్య పోరు నాడు ఉంది . నేడు ఉంది .ఎప్పుడూ ఉంటానే ఉంటుంది .
వేద కాలంలో మొదటి స్థానం లో ఉన్న క్షత్రియులు క్రమం గా రెండో స్థానానికి జారారు . ఋగ్వేద కాలం లో పుట్టుకతో కాక , గుణాలను బట్టి వర్ణం ఉండేది .
త్రేతా యుగం లో పరశురాముడు క్షత్రియ వంశాలను సమూలము గా నిర్మూ లించిన తర్వాత ఏర్పడిన అరాచకాన్ని అరికట్టే టందుకు చేసిన హోమాగ్ని నుండి 4 రాజపుత్ర వంశాలు -పరమార్ ,చౌహాన్ , ఉద్భ వించాయి . వీరే రాజపుట్ క్షత్రియులు లేదా అగ్ని వంశ క్షత్రియులు .
ఆం ధ్ర క్షత్రియులు :
క్రీస్తుశకం 2వ శతాబ్దం లో శాతవాహనుల తర్వాత ఉత్తరా పధ మునకు చెంది కాలక్రమం లో దక్షిణా పదానికి వలస వచ్చిన ఇక్ష్వాకులనే వారు, వారి రాజ్యాలను కృష్ణా నదీతీరమైదానాలలో స్థాపించారు . నాగార్జున కొండ రాజధానిగా భట్టిప్రోలు ,జగ్గయ్య పేట ,అమరావతి ప్రాంతాలను పాలించారు .
వాయు పురాణమ్ ప్రకారం ఇక్ష్వాకు 100 మంది సంతానం లో 48 మంది దక్షిణా పదానికి వలస వచ్చి చిన్న చిన్న రాజ్యాలు స్థాపించు కొన్నారు .
బౌద్ద జైన సాహిత్యాన్ని తిరగేసినా ,అస్మక ,ములక,వేంగి రాజ్యాలు, వీరు స్థాపించిన వే .
ఇక్ష్వాకుల తర్వాత శాలంకాయనులు పల్లవ సామంతులుగా కృష్ణా గోదావరి ప్రాంతాన్ని పెదవేగి రాజధానిగా పాలించారు . వీరి తర్వాత విష్ణుకుండినులు, మిగతా క్షత్రియ వంశా లైన పరిచేది ,కోట , చాళుక్యలు గుంటూరు గోదావరి ,కృష్ణా సీమలను 300 ఏళ్ళ పాటు పాలించారు .(5 నుండి 7 శతాబ్దం వరకు ).
చంద్ర వంశ క్షత్రియులైన తూర్పు చాళుక్యులు నే వేంగి చాళుక్యులు గా పిలిచే వారు . వీరు పూర్వమ్ శాతవాహనులకు సామంతులు గా ఉండే వారు . వీరు ఎలమంచిలి , పిఠాపురం , ముదిగొండ ప్రాంతాలను పాలించారు .
మత్స్య రాజులు ముఖ్యం గా మత్స్య ప్రాంతం అనగా నేటి ఒరిస్సా కి చెందినా వారు .
చేది రాజులు కోణ ప్రాంతం అనగా నేటి కోన సీమ ని పాలించారు . తర్వాత కాలం లో చాళుక్య చోళ రాజులకు సామంతులుగా మారి చోడ రాజులుగా వ్యావహ రింప బడ్డారు . వీరి గోత్రం కాశ్యపస .
కాలచూరి,హైహేయ రాజులు మధ్య భారతానికి చెందినవారు .
ధనంజయ గోత్రీకులైన కోట వంశపు రాజులు ధరణికోట ని రాజధానిగా చేసుకొని 11,12 శతాబ్దం లో పాలించారు .
చాగి లేదా సాగి వంశ రాజులు చాలా కాలం చాళుక్యులకు సామంతులుగా ఉండి పోయారు .
ఆ తర్వాత కాకతీయులు , తర్వాత విజయనగర రాయలు పెద్ద రాజ్యాలు పాలించారు . కానీ వీరు క్షత్రియ వర్ణం నకు చెందినవారు కాదు .
No comments:
Post a Comment