Search This Blog

Friday, 2 May 2014

ఇదే యదార్ధం - తత్ సత్ -ఓం తత్సత్

 ఆత్మ అనగా అర్ధం ఏమిటి ?
సవిస్తార చైతన్య  సముద్రం లో ఓ చిన్న కెరటం ఆత్మ . 
శక్తి  కి త్రిగుణాలుంటాయి . మూడు గుణాలు సమ స్థితిలో  ఉండే శుద్ద స్వరూపం ఆత్మ .
అలాంటి స్థితిలో ఉన్న శక్తి లో గుణ సమ స్థితి తప్పినప్పుడు కలిగేది మాయ .
దానినే మనిషి లో మనస్సు అని అంటాము .
పదార్ధానికి  ఒక్క  ఆకర్షణ మాత్రమే ఉంటుంది .( గ్రహాలకు ,అణువులకు మధ్యన ఆకర్షణ )
కాని శక్తికి ఆకర్షణ ,వికర్షణ రెండూ  ఉంటాయి . ఈ  తత్వ మే శక్తి స్వరూపమైన మనస్సుకీ ఉంటుంది .
ఇదే ద్వందం . రాగము ద్వేషము ;సంకల్పము ,వికల్పము .

పదార్ధమే  పూర్తి  యదార్థం  కాదు .(either material or energy are  not absolute truth)
పదార్ధం , మనస్సు , ఆత్మ ఇవన్నీ కలిసి చైతన్యం లో ఇమిడి ఉంటాయి .
 అంటే చైతన్యమే యదార్ధం . అదే శుద్ద సత్యం .

                                 ధ్యాన సాధన - ధ్యాన స్థితి 
Be a witness:
భౌతిక విషయాలను , ఇంద్రియాల లో కలిగే స్పందనలను  సాక్షీభూతం గా గమనించడ మే సాధన . ఆ  విధం గా సాధన చేస్తూ ఉంటే ఏదో ఒక క్షణం లో ధ్యానం సిదిస్తుం ది .
ఆ ధ్యాన స్థితి లో  యదార్ధ స్థితిని అనుభూతిస్తామ్ .
  ధ్యానం లో మనస్సు పని చేయదు . అలాంటప్పుడు అనుభూతి ఎలా కలుగుతుంది ?
పుట్టి బుద్దెరిగినాక మన దైనందిన వ్యవహారాలన్నీ మనస్సుతో చేస్తాము . మనస్సుతో అనుభూతిస్తాము. 
మనస్సు లేకపోవడం ,మనస్సుని అధిగమించడం అనేది మన అనుభవంలో లేనిది . 
ప్రతిదీ 'మనస్సు తో' అలవాటైన మనకు ఆత్మ గత అనుభూతి గురించి ఏమీ తెల్వదు . 
ఎంత చెప్పినా ,చదివినా ,ఉపన్యాసాలు విన్నా సాధన చేయకపోతే ఎప్పటికీ ఆత్మ ని గుర్తించ లేము . 

మన శరీరం , మనస్సు ,ప్రాణం  -ఇవన్నీ ఆత్మ ప్రకాశం వలనే పని చేస్తాయి .
ఆత్మ చైతన్యం తో నే మనస్సు పని చేస్తుంది . ఆత్మ ప్రకాశం తో నే ఆత్మను అనుభూతిం చడం ధ్యానం .
మనస్సు పని చేస్తే ద్వందం ఉంటుంది . మనస్సు పనిచెయ నప్పుడు మిగిలేది ఒక్కటే . అదే ఆత్మ . అదే చైతన్యం . అదే ఎరుక . అదే సత్ చిత్ ఆనందం . ఆ స్థితిలో చూడ బడేది ,చూసేది ,చూపు - ఇవన్నీ విడి విడి గా ఉండక అన్నీ కలిసి ఏకమవుతాయి .
మనస్సు పైన చిత్తం , దాని పైన బుద్ది ,దానికి పైన అహం - ఇలా పదార్ధం వివిధ స్థాయులలో స్పందనలు చేస్తుంది .
అరిషడ్వర్గాలు , సమస్త కోరికలు ,రాగ ద్వేషాలు అన్నీ మనస్సులోనే రూపు దిద్దుకొంటా యి . కానీ వీటికి మూలం చిత్తం లో ని వాసనలు ,తత్వాలు ,గుణాలు . కాబట్టి చిత్తాన్ని శుద్ది చేయకుండా మనస్సుని నియంత్రించు కొనే సాధనాలు ఎన్ని చేసినా సరైన ఫలితం ఉండదు .
చిత్తాన్ని ఎలా శుద్ది చేసుకోవాలి ? 
వివేకము తో కూడిన వైరాగ్య భావనలను, సాక్షీ త్వం ను  ప్రతిరోజూ ,ప్రతి క్షణమూ అభ్యాసం చేయాలి .
నవ విధ భక్తీ మార్గాలు కూడా చిత్తాన్ని శుద్ది చేస్తాయి .
ఎన్నో యుగాల నుండి పేరుకుపోయిన కర్మ వాసనలను సమూలం  గా భస్మం చేయాలి .
సాక్షీ భూత కర్మాచరణ ,కర్మ ఫల అనాసక్తి వలన మనస్సులో స్పందనలు తగ్గుతాయి . చిత్తం లో ఎలాంటి కర్మ పోగు పడదు .
ఎన్నో యోగ క్రియలు ,ఆసన ముద్రలు ,నాడీ శుద్ది క్రియలు ,ప్రాణ శుద్ది క్రియలు - ఇవన్నీ పంచ కోశ శు ద్దీకరణ లో భాగాలే .
చిత్త  శుద్ది  లేని శివ పూజ లేల ?భాండ శుద్ది లేని పాకమేల ?
కాబట్టి ముందు  చిత్త శుద్ది . తర్వాతే ఆత్మావిష్కరణ .
మోహం క్షయ మవ్వడమే మోక్షం .
అహం అణిగి సోహం గా మిగలటమే  శరణాగతి .
ఓం ప్రధమం మనకు శ్రద్ద ,ఓర్పు పుష్కలం గా ఉండాలి .


No comments:

Post a Comment