కృష్ణమ్మ ని గోదారి తల్లిని ముడి వేసే ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ , అదేనండి 'పోలవరం వలన లాభం ఉందా ?
నౌకా యానం తో పాటు అన్ని ప్రయోజనాలు ఒన కూడే టట్లు దీని డిజైన్ మార్చి ఇంకా చౌకలో ,తక్కువ సమయం లో పూర్తీ చేసే అవకాశం ఉందా ?
అసలు ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవ్ తుంది ?
ఈ ప్రాజెక్ట్ వలన ఎవరు ఎలా ప్రభావితం అవుతారు ?
నష్ట పోయే వారు :
లబ్ది పొందే వారు :
కొన్ని ప్రశ్నలు ?
నౌకా యానం తో పాటు అన్ని ప్రయోజనాలు ఒన కూడే టట్లు దీని డిజైన్ మార్చి ఇంకా చౌకలో ,తక్కువ సమయం లో పూర్తీ చేసే అవకాశం ఉందా ?
అసలు ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవ్ తుంది ?
ఈ ప్రాజెక్ట్ వలన ఎవరు ఎలా ప్రభావితం అవుతారు ?
నష్ట పోయే వారు :
- ఎగువ పాటు లో ఉన్న 3 రాష్ట్రాల వారు - ఒడిశా ,చత్తీస్ ఘడ్ మరియు ఖమ్మం జిల్లాలో (తెలంగాణా ) ఉన్న భూభాగం ముంపు వలన కొండ రెడ్లు నిర్వాసితు లవ్వడమే కాదు వారి తరతరాల జీవనోపాధిని కూడా కోల్పోతారు.
- గత కొంత కాలం గా ఏటికి ఏడు ,వరద నీరు అపరిమితం గా పోటెత్త డం వలన మట్టి తో కట్ట బోయే పోలవరం డాం వలన ,దిగువన ఉన్న గోదావరి డెల్టా వారికి ముంపు ప్రమాదం .
లబ్ది పొందే వారు :
- గోదావరి ,కృష్ణా డెల్టా పొలాలకు రబీ కాలం లో నికరమైన సాగు నీరు లభ్యత .
- రాయలసీమకి కొద్దిగా సాగునీరు ,వైజాగ్ కి త్రాగు నీరు ,పరిశ్రమలకు నీరు లభ్యత .
- ఆంద్ర రాష్ట్రానికి 1000 MW విద్యుత్ లభ్యత .
- గోదావరి లో నౌకా యాన వృద్ది .
కొన్ని ప్రశ్నలు ?
- 18000 కోట్లకి బదులు కేవలం 8000 కోట్లతో నే ,ఎలాంటి ముంపు సమస్యలు , అంతర రాష్ట్ర వివాదాలు లేకుండా , పోలవరం ప్రయోజనాలు అన్నీ ఒన కూడితే ఎవరి కైనా అభ్యంతరమా ?
- 75 TMC ల నీరు నిలవ చేసే మట్టి డాం కన్నా 30 TMC ల నీరు నిల్వ ఉంచే 3 చిన్న బారేజీలు కట్టుకొని కూడా అన్ని ప్రయోజనాలు చక్కగా చౌకలో ,తక్కువ సమయం లో పొందే అవకాశం ఉంటే ఎవరైనా వదులు కొంటారా ?
- 750 km పొడవు ఉన్న గోదావరి నది పై ఒక క్రమ పద్దతిలో చిన్న చిన్న బారేజీలు కడితే ఎంతో ప్రయోజనం ఉంటుందని నిపుణులు పోరుపెడుతున్నా కేవలం కాంట్రాక్ట్ పనులను పందేరం చేయడానికి భారీ డాం లు ప్లాన్ చేశారా ?
- ఉదాహరణకు ,అమెరికాలోని మిసిసిపి నది పై 27 బారేజీలు కట్టి భారీ నౌకా యానం కూడా అమలు చేస్తున్నారు .అలాగే గోదావరి పై కూడా 3 బారేజీలు ఎందుకు కట్ట కూడదు ?
మరి కొంత సమాచారం :
- ప్రాజెక్ట్ స్థలానికి అనుమతి ? - 2005 లో వచ్చింది .
- పర్యావరణ అనుమతి ? - 2005 లో వచ్చింది .
- పాపికొండల అభయారణ్యం అనుమతి ? - 2005 లో వచ్చింది .
- గిరిజనులకు నష్ట పరిహారం ,భూమి,ఇళ్ళు ,ఉపాధి చూపే అనుమతి(R&R CLEARANCE ) ? - 2007 లో వచ్చింది .
- కేంద్ర నీటి యాజమాయిషీ (central water commission )అనుమతి ? -2009 లో వచ్చింది .
- ప్రాజెక్ట్ పై పెట్టుబడికి ప్లానింగ్ కమిషన్ అనుమతి - 2009 లో వచ్చింది(25.02.2009 for Rs. 10151.04 Crore ).
- చత్తీస్ గడ్ , ఒడిశా లో ముంపు ప్రాంతాల ప్రజల సాధక బాధలను విని(public hearings) ,ఆయా ప్రాంతాలలో వరద గట్లు (flood banks) పటిష్టం చేసే దెప్పుడు ? - చత్తీస్ గడ్ , ఒడిశా ఒప్పు కొన్నప్పుడు .
- ప్రాజెక్ట్ కి ఎంత ఖర్చు అవుతుంది ? - 16000 కోట్లు .
- గత 10ఏళ్లలో జరిగిన కాల్వల పనులకు ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు ?- 4000 కోట్లు
- ప్రాజెక్ట్ లో చేయ వలసిన పనులే మిటి ?- 75 TMC ల నీళ్ళు నిల్వ చేయడానికి గోదావరి నది కి అడ్డుగా 45 మీటర్ల ఎత్తు ,సుమారు 2 km పొడవు డాం , దీనికి అనుబంధం గా 1000 MW విద్యుత్ ఉత్పాదన , కుడి ఎడమ కాల్వ ల ద్వారా గోదావరి ,విశాఖ జిల్లా లలోని 7 లక్షల ఎకరాలకు గారం టీ నీరు ,అలాగే ప్రకాశం బారేజి కి 80 TMC ల నీరు .
- ఎంత మంది నిర్వాసితు లవుతున్నారు ? - సుమారు 250 గ్రామాలు, 2 లక్షల జనం డాం వలన ; 15000 ఇళ్ళు 50000 జనం కాల్వల వలన నిర్వాసితులు అవుతారు .
- మీరు చెపుతున్న 7లక్షల ఎకరాలలో మూడొంతుల భూమికి అంటే 5లక్షల ఎకరాలకు ఆల్రెడీ 1999 నుండిసాగు నీరు అందుతుంది గదా ? మరి ఇంత ఖర్చు పెట్టి కడుతున్న ఈ ప్రాజెక్ట్ వలన కొత్తగా ఏమైనా లాభం ఉందంటారా ? -కుడి కాల్వ ద్వారాసుమారు 1 లక్ష ఎకరాలకు కొత్తగా సాగునీరు, మరో 2లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరణ; ఎడమ కాల్వ ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు స్థిరీకరణ;
- ఇప్పటికే , పుష్కరం ,తాడిపూడి ,చాగల్నాడు ,ఏలేరు ,తొర్రిగెడ్డ పంపింగ్ స్కీమ్ ల ద్వారా సాగు చేయ బడుతున్న గోదావరి ,విశాఖ పొలాలకు గారంటీ సాగునీరు అందే అవకాశం .
- ఏది ఏమైనా డాం మాత్రం ఉదృతం గా వచ్చే వరద నీటి( మాక్సిమం 250,000 cumecs ) ని తట్టు కొనే విధం గా ఉండాలి . కానీ ప్రస్తుత డిజైన్ మాత్రం కేవలం 10000 cumecs కి సరిపోతుంది . ప్రభుత్వం ఈ విషయం సరి చూసుకోవాలి . అలాగే డిజైన్ మార్చి తక్కువ వ్యయం ,తక్కువ టైం లో అన్ని ప్రయోజనాలతో ప్రాజెక్ట్ పూర్తి అయ్యే అవకాశం ఉందేమో మరొక్కసారి సాంకేతిక నిపుణులతో ఆలోచించాలి.
No comments:
Post a Comment