ఈ మధ్య నేను చిదంబరం వెళ్లి నటరాజ స్వామిని దర్శనం చేసుకొన్నా .
పై నున్న చిత్రం లో 'సత్య జ్ఞాన సుందర ఆనంద స్థితికి' నటరాజ ఆకార మిచ్చి ,శక్తి కి శివకామి అని పేరు పెట్టి , నిరాకానికి గుర్తుగా ఓ చిన్న స్ఫటిక లింగం, ప్రక్కనే ఉన్న బిల్వ దళ పరివేష్టిత యంత్రమే ఆకాశ తత్వానికి సంకేతం గా అన్వయించి- కొలిచే గర్భా లయ విమానం బంగారు పూతతో ప్రకాశిస్తూ పొన్నాంబలం గా వినుతి కెక్కింది .
ఇంకా వ్యాఘ్ర పాదుడు ,పతంజలి మహర్షి సన్నుతి చేస్తుం టే ,నటరాజు అవిద్య ని అదిమి, ఇచ్చ -జ్ఞాన - క్రియా శక్తి రూపమైన శివకామి తో కలిసి ఈ సకల చరాచర సృష్టి ని పుట్టిస్తూ ,పోషిస్తూ ,లయం చేస్తూ జనన మరణ మోక్ష చక్రాన్ని నడుపుతున్నాడు .
మీకు తెలుసు ,తమిళ నాడు అంటే శివ మయం . 63 నాయ నార్లు , 18 సిద్ధ పురుషులు ప్రకటిత మై అణువ ణువు శివోహం గా సన్నుతి చేసిన పుణ్య దేశం .
సంగమ కాలం లో ని సంగం సాహిత్యం లో ముఖ్యం గా సంబంధర్,సుందర్,అప్పర్ వ్రాసిన తేవారం , అలాగే మాణిక్య వాచికర్ వ్రాసిన తిరువాచికం లో చిదంబర నటరాజ స్వామి స్తోత్రం లు ఉంటాయి .
పంచ భూత లింగాల వరుసలో చిదంబరం ఆకాశ తత్వాన్ని ప్రభోదిస్తుం ది .
కాళ హస్తి ,కంచి , చిదంబరం గుళ్ళు మూడు ఒకే వరుసలో ( a straight line exactly at 79 degree 41 minutes East longitude ,other wise called as divine axis) ఉంటాయి .
ఈ భూ మండలం లో కొన్ని ప్రదేశాలు దైవ శక్తి కి ప్రేరణా మరియు ప్రకటిత మయ్యె స్థలాలుగా ఉంటాయి .
అలాంటి శక్తి స్థానముల నే 'తీర్ధములు ' అంటాము.
అమాయకత్వం వేరు . అవిద్య వేరు . సరళం గా చెప్పా లంటే మూర్ఖత్వమే అవిద్య .
ప్రతి విషయములో అహం తో మమేక మవ్వడం అవిద్య .
మన కళ్ళకు కనిపించేదే సత్యం అనుకోవడం అవిద్య .
మన మూల ప్రక్రుతి సత్య జ్ఞాన ఆనందం అనీ , మిగతావన్నీ మన మనస్సు (-మాయ) ఆడించే కల్పితాలనీ తెలుసుకోవడమే శ్రీవిద్య .
'దుఃఖాలన్నీ కల్పితాలే.., ఆనందమొక్కటే సత్యం'.
కల్పితాలంటే మనిషి కావాలని(మాయలో పడి ,మొహం లో పడి ,బంధం లో చిక్కి ) చేసినవి. తన స్వార్థంతో, విద్వేషంతో కుత్సిత బుద్ధితో, క్రూర మనస్తత్వంతో చేసినవి .
శివం :
ప్రతి పర మాణువు , అలాగే క్వార్క్ లు ఇవన్నీ నిత్యమూ స్పందన లోనే ఉంటాయి .
శక్తిని ధరించి శక్తిని పంచి ఈ సర్వ సృష్టి స్థితి లయములకు ఆది మూలం పరమ శివుడు .
ధ్వని శక్తి , కాంతి శక్తి , స్థితి శక్తి ,గతి - చలన శక్తి ,ఐస్కాంత శక్తి ,విద్యుత్ శక్తి , ఫోటాన్ శక్తి ,అణు శక్తి -ఇవన్నీ వేర్వేరు గా స్పందించే స్పందనలే .
శివారాధన ?
శరణా గతి లేని ప్రార్ధనలు ,ఆరాధనలు , క్రతువులు,మంత్ర సాధన ,జప తపాలు అన్నీ నిరర్ధకం .
వాటి వల్ల మోక్షం కలుగదు.
హిందూ దేవాలయాల్లో శుభ్రత ?
ఏ గుడి చూసినా ,ఆ గుళ్ళకు ఎన్ని మడులు మాన్యాలున్నా శుచీ శుభ్రత లేకుంటే సామాన్యుడికి నచ్చదు .
ఆధ్యాత్మిక మార్గం లో ఉన్న వారికి ఎలాగున్నా నచ్చుతుంది . ఎందు కంటే వారు చూసేది వేరు .
40 ఎకరాలలో కొలువై ఉన్న చిదంబర దేవాలయం స్వామికి 5000 ఎకరాల పొలం ఉంది.
నిజమైన భక్తుడు దైవం పట్ల తన కృతజ్ఞత ని ప్రకటించు కోవడానికి గుడికి వస్తాడు. ఆ కృతజ్ఞతా భావా న్నే భక్తి అంటాము .
ప్రార్ధన ,నాట్యం ,సంగీతం ,పంచోపచార పూజ ఇలా వివిధ పద్దతుల (ఆగమ శాస్త్ర విధానాలు లేదా వైదిక క్రతువులు) లో తనలోని భక్తీ ని శరణా గతి భావం తో సమర్పణ చేస్తాడు .
చిదంబరం లో దీక్షితార్ లు అనే వారు ఆలయ పర్య వేక్షకులుగా ,పూజార్లుగా వైదిక పద్దతి లో స్వామిని సేవిస్తారు.
No comments:
Post a Comment