- సెక్రటేరియట్ లో రాష్ట్ర కేడర్ పోస్ట్ లు ఎన్ని ఉన్నాయి ? కేవలం 4417 పోస్ట్ లు .
- మొత్తం సంయుక్త రాష్ట్రం లో రాష్ట్ర కేడర్ పోస్ట్ లు ఎన్ని ఉన్నాయి ? 90000 పోస్ట్ లు .
- అన్ని పోస్ట్ ల లో ఉద్యోగులు ఉన్నారా ? లేరు . 27000 పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయి .నికరం గా 47186 రాష్ట్ర కేడర్ ఉద్యోగులున్నారు .
- రాష్ట్ర కేడర్ ఉద్యోగులను ఎలా విభజించారు ? 24838 ఉద్యోగులను ఇప్పుడు ఎక్కడ ఎలా పనిచేస్తూ న్నారో అలాగే ఉంచారు . 12,361 మందిని కొత్త ఆంధ్రా కి , మిగతా 9,987 మందిని తెలంగాణా కి పంచారు . అంటే జనాభా ప్రాతి పధికన 58:42 నిష్పత్తిలో పంచారు . అనగా సుమారు 25000 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులకు కొత్త ఆంధ్ర రాజధానిలో నివాస సౌకర్యాలు ఏర్పరచాలి .
- మొత్తం సంయుక్త రాష్ట్రం లో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు ? 11 లక్షలు .
- లోకల్ -నాన్ లోకల్ అని ఎలా నిర్ణ యిస్తారు ? వరుసగా 4 ఏళ్ళు ప్రాధమిక విద్య ( 4 నుండి 10 క్లాస్ వరకు) ఎక్కడ చదివితే ఆ ప్రాంతానికి చెందినా వారిగా గుర్తిస్తారు .
- నేటివిటి -స్వస్థలం ఎలా నిర్ణ యిస్తారు ? పుట్టిన ప్రదేశాన్ని బట్టి . తెలంగాణా ఉద్యోగులు నేటివిటి ని బేస్ చేసుకొని విభ జించ మంటుంటే ,సీమాంధ్ర ఉద్యోగులు లోకల్ స్టేటస్ ని బట్టి విభ జించ మంటున్నారు .
- రాజధానిలో ఎన్ని రకాల రాష్ట్ర కేడర్ పోస్ట్ లు / ఉద్యోగులు ఉంటారు ?
- సీమాంధ్ర ఉద్యోగులు ఎందుకు బాధ పడుతున్నారు ?
జనాభాని బట్టి ఆస్తులు అప్పులు పంచారు . కానీ విద్యుత్ ని మాత్రం వాడకాన్ని బట్టి పంచుతున్నారు ! ఇదెక్కడి న్యాయం ?
ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 16000 MW విద్యుత్ మరియు కొత్తగా రాబోయే విద్యుత్ ప్రాజెక్ట్ ల ద్వారా ఉత్పత్తి అయ్యే 4000 MW ల విద్యుత్ లో 54 % తెలంగాణ కి ,46% ఆంద్ర కి ఇస్తున్నారు .
అలాగే అంతర్ రాష్ట్ర కరెంటు సరఫరా ని ఏ విధం గా ఆజమాయిషీ చేయాలో కేంద్రం చెప్పడం లేదు . ఇది ఇరు రాష్ట్రాల మధ్య గొడవలకు దారి తీస్తుంది .
అటు విద్యా సంస్థ ల పంపకాలలో కూడా ఆంద్ర కి అన్యాయం జరుగుతుంది .
ఇప్పటికే తెలంగాణా లో ఉన్న అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు - ISB,NALSAR,NIFT ,ICFAI -లాంటివి కొత్త సీమాన్ధ్రలో ఏర్పరచా లంటే ఎంతో సమయం,డబ్బు కావాలి .
కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గపు తప్పుకి చెల్లించిన మూల్యం అధికారం కోల్పోవడమే . కానీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య రాచేసిన రావణ కాష్టం కారణం గా , త రతరాల తెలుగు సోదరుల బతుకు బండ లవుతుం ది.
ఇది రాజకీయ నాయకుల వికృత క్రీడ .
No comments:
Post a Comment