Search This Blog

Tuesday 2 August 2016

అందరూ ఆలోచించండి ....ముఖ్యంగా మోడీ గారు కొంచెం మనస్సు పెట్టాలి

గాడ్గిల్ -ముఖర్జీ ఫార్ములా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పొందే  అర్హత లేదని తెలిసీ , రాష్ట్రాన్ని చీల్చి పడేసే హడావిడిలో ,ఆంధ్ర ప్రాంత ప్రజలను బుజ్జగించ డానికి కాంగ్రెస్ ,భాజాపా రెండూ కూడా రాజ్యసభలో హామీలు గుప్పించాయి . అంతే కాదు ,ఎన్నికల వేళ మోదీ కూడా ఆంధ్రుల కు అరిటాకులో వడ్డనచేస్తా నని  ఆశలు రేపాడు .

14 వ ప్రణాళికా సంఘాన్ని వేసి ,నీతిఆయోగ్ అనే అభివృద్ధి సంఘాన్ని కూర్చి ,  పన్నుల్లో రాష్ట్రాలవాటా ను 32 % నుండి 42% పెంచామని ,కాబట్టి ఆంధ్రాకి వేరే సాయం అనవసరం అని నేడు బల్లగుద్ది ఉభయసభల్లో చెబుతున్నారు.  .
కేంద్రం,  రాష్ట్రాలకు సాయం చేయడం అనేది రాజ్యాంగ నియమం . అది 30% ఉచిత సాయం రూపం లో ,70% అప్పు రూపం లో ఉంటుంది . కానీ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రం ,90% ఉచిత సాయం ,10% అప్పు రూపం లోనూ ఉంటుంది . అంతే కాదు ,ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల లో  కార్పోరేట్ పన్ను , ఆదాయం పన్ను ,తయారీ
పన్ను ,అమ్మకం పన్ను మొదలగు ప్రత్యక్ష, పరోక్ష పనులలో రాయితీలు ఉండటం వలన పరిశ్రమలు ,కంపెనీలు ,సేవారంగపు సంస్థలు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలలో స్థాపించ డానికి  మొగ్గు చూ పుతారు . దీని  వలన నిరుద్యోగం పోయి, రాష్ట్ర GDP పెరిగి,  ప్రజల కొనుగోలు సామర్ధ్యం పెరగడం వలన వినియీగా దారుల మార్కెట్ కూడా ఇబ్బడి ముబ్బడి గా పెరిగి పోతుంది .

రాష్ట్రాలకు కేంద్రం అందించే సాయం ఒక పద్ధతిలో ,ఒక ఫార్ములా ప్రకారమే ఉంటుంది గానీ ,ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు దోచి పెటేయడం జరగదు .
ఉదాహరణకు ,  రాష్ట్రాలకు అందించడానికి కేంద్రం దగ్గర 100 రూపాయలు ఉన్నాయి . ఇందులో కేవలం 30 రూపాయలు (30%) మాత్రమే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలన్నింటికీ సర్దాలి . ఇప్పటికే 11 ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి . వీటి మధ్యన ఈ 30% ని సర్దాలి గదా . ఏది ఎలా పంచుతారంటే , ఆయా రాష్ట్ర ప్రణాళిక మరియు ఖర్చు ని ఆధారం చేసుకొని పంచుతారు . ఇప్పుడు ప్రత్యేక హోదా  ఇస్తే గిస్తే ఆంధ్ర 12 వ రాష్ట్రం  అవుతుంది .

మిగతా 70 రూపాయలను ( 70% ) ని మిగతా రాష్ట్రాలకు అందిస్తుంది .
ఆంధ్రా ఎందుకు డిమాండ్ చేస్తోంది ?
5 కోట్ల ఆంధ్రుల మనోభావాలకు వ్యతిరేకం గా విభజన చేశారు .
వారి జీవనాడి ,ఆర్ధిక నాడీ కేంద్రమైన రాజధాని నుండి బలవంతం గా గెంటేశారు .
 హైదరా బాద్ నుండి వచ్ఛే రెవెన్యూ లో భాగం ఇవ్వకుండా కేవలం 10ఏళ్లపాటు తెలంగాణకి వివిధ పన్నుల రూపం లో అద్దె చెల్లించు కొంటూ  ఉండటానికి ఒప్పుకోవడం పుండుమీద కారం చెల్లినట్లే !
గత 60ఏళ్లలో మూడు మౌలిక రంగాల లో ఒక్క వ్యవసాయం తప్ప రాష్ట్ర GDP  ని శాసించే సేవా ,తయారీ రంగాలకు చెందిన సంస్థలన్నీ పోగొట్టుకొని ఒక రకం గా నడివీధిన పడ్డారు .
కృష్ణా , గోదావరి నదులకు చిట్ట చివరి అట్టడుగు రాష్ట్రమైన ఆంధ్రాకి న్యాయం గా అందవలసిన హక్కులను కాపాడటానికి "నదీ పరిరక్షణ కమిటీ ని" కేంద్ర పరిధిలో వేస్తేనే ఆంధ్రాకి అన్యాయం జరగకుండా కాపాడు కోవచ్చుఁ .
కానీ అదీ జరగలేదు . అంతే కాదు, నదీ దిగువ ప్రాంతం గా గుర్తింపు హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని విభజించడం వలన ఆంధ్రా పూర్తిగా అన్యాయం అయిపోయింది .

అఖండ సాగరం చుట్టూ ఉన్నా తాగడానికి చుక్కనీరు లేదనే సామెత లెక్క 1000 కి . ఎం . సముద్ర తీరం ఉన్నా సరైన ఓడరేవులు లేవు .
పెరట్లో కాచిన కూరలన్నీ ఇరుగు పొరుగు పట్టుకు పోయిన చందం గా , మన తీరంలో ఉన్న గ్యాస్ ని మనకి ఇవ్వకుండా దోచు కెళుతున్నారు .
డబ్బు పోతే మళ్ళీ సంపాదించు కోవచ్చుఁ . విద్య లేకపోతే ఎట్లా ? ఒ క  విద్యా సంస్థని స్థాపించాలంటే కనీసం 5ఏళ్ళు పడుతుంది . ఎంతమంది ఆంధ్రా విద్యార్థులు ఇబ్బందులు పడతారో ఆలోచించండి .
చదువు ,తెలివి ఉన్నా  సరైన ఉద్యోగాలు  లేకపోతే ఎలా ? ఉద్యోగాలు ఇచ్ఛే సంస్థలన్నీ హైదరాబాద్ లో ఉంటే ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళు అంటూ తెలంగాణ వాళ్ళు తరుముతుంటే ,స్థానికత పేరుతొ అవకాశాలు లేక ఆంధ్రా విద్యార్థులు  మల మల మాడాలసిందేనా ?
ఇప్పుడు ఆంధ్రాకి కావలసింది నిధుల సాయం కాదు . ఉద్యోగాలిచ్ఛే పరిశ్రమలు ,సంస్థలు కావాలి . యువత పక్కదారిపట్టి సమాజం ఛిద్రం కాకూడదు అంటే ఇది వెంటనే జరగాలి .
ఒక పక్క కేంద్రం 3.9 % లోటుతో కుంగి పోతుందని అంటున్నారు . అలాంటప్పుడు ప్రత్యేక పాకేజీ మాత్రం  ఎలా ఇవ్వగలరు ?
 జీవాధారాలైన నీటిని , జీవనా ధారా లైన రాజధానిని ,ఆర్ధిక పరిపుష్టిని కోల్పోయి  ... ఇలా మూడు విధాలుగా చెడ గొట్ట బడ్డ ఆంధ్రులు ఇంకా ఇలా ఉన్నారంటే అప్పుడు ఎం టి రామారావు ,ఇపుడు చంద్రబాబు చలవ , ఆంధ్రుల కార్య శురత్వం తప్ప మరోటి కానే కాదు .
స్వాతంత్రం వఛ్చిన తర్వాత ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయాలు, ఇతరుల కెవ్వరికీ  జరగలేదు .
మరీ ఇంత  అన్యాయం ఏ రాష్ట్రానికి జరగలేదు . జరగకూడదు కూడా !
ఎందుకంటే ,అప్పుడు కాంగ్రెస్ ,ఇప్పుడు భాజపా పై ఆక్రోశం ,ఆవేశం ఉండటం పెద్ద విషయం ఏమీ కాదు . కానీ అసలైన అత్యంత  విషమ మైన  మార్పు ... భారతదేశ సార్వభౌమత్వం పైన ,రాజ్యాంగం పైన ఏహ్యత , ఆంధ్రా ప్రజలలో వస్తే అది దేశానికే , దేశ సమగ్రతకే  ప్రమాదం !

No comments:

Post a Comment