Search This Blog

Tuesday, 30 August 2016

ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్రియా శీల మయ్యే సమయం ఇదే !

కేవలం 2 ఏళ్లలో 50000 కోట్ల విలువైన పరిశ్రమల ను రాష్ట్రానికి రప్పించి , 1400 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాని స్థిరీకరించి , ఆనతి కాలం లోనే అమరావతికి బీజం వేసి , ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి గుర్తింపు ని తీసుకొస్తున్న నాయకుడిని ఓటుకి నోటు అనే తుగ్లక్ కేసుతో సతాయి స్తుంటే మనం చూస్తా ఊరుకుంటే , దిశా నిర్దేశం చేసే కార్యశీలుడైన ఒక మంచి నాయకుడిని కోల్పోవలసి వస్తుంది . దగుల్భాజీ కుంభకోణాలు ఎన్నో చేసి లక్షల కోట్ల దేశ సంపదను లూటీ చేసిన వారు బలాదూర్ గా తిరుగుతూ రైళ్లను తగలబెడుతుంటే ,కులాన్ని అడ్డుపెట్టుకొని ఉగ్రవాదులను వదిలేయమని చెప్పే కుల నాయకులు దొంగ దీక్షలు చేస్తుంటే ఏమీ పట్టనట్లు ఉండిపోవడం ఆంధ్రులు చేస్తున్న చారిత్రిక తప్పు . ఎవరికీ వారు ఒక్క సారి ఆలోచించు కోవాలి . మళ్ళీ ఇంతలా పనిచేసే నాయకుడు మనకు దొరకడు .

లక్షల దోపిడీ జరిగిందనే క్విడ్ ప్రొ  కేసులు నత్త నడక నడుస్తున్నాయని ఎందుకని   ఎవరూ ప్రశ్నించరు ?
కుల దీక్ష పేరు తో రైళ్లు తగలపెట్టిన కేసు లో, పురోగతి ఎందుకు లేదో ఎందుకు ప్రశ్నించరు ?
ఆంద్ర ప్రదేశ్ లో ముఖ్యం గా తెలుగుదేశం పార్టీలో కార్యశీలం గా ఉన్న నాయకులు ,  ఈ కేసులపై సమాచారాన్ని తెప్పించు కొని ,  త్వరిత గతమైన విచారణ చేయమని హైకోర్టు లో ఎందుకు పిటిషన్ లు వేయరు ?
మంత్రులు , MLA లు ఎవ్వరూ ప్రతిభావంతం గా మాట్లాడలేరు . తమ నాయకుడి కి  సరైన  తోడ్పాటును అందించ లేరు . కేవలం వారి వ్యాపారాలు ,కమిషన్ లు చూసుకోవడమే తప్ప , పార్టీపైన , రాష్ట్రం పైన శ్రద్ధ లేదు . ఇలాంటి వాళ్ళ తో ఈదాలను కోవడం నాయకుడి పెద్ద పొరపాటు .  అన్నీ తానే చేయడం తప్పుకాదు . ఎవరితో ఎలా పని
చేయించు కోవాలో ,  నిష్కర్షగా ఉంటూ ఎదుటివారి నుండి  పనిని ఎలా  రాబట్టు కోవాలో కూడా ఆచరణ లో చూపించాలి . 

రాజకీయం ఒక అట . ఈ ఆటలో ఒక పార్టీ ఇంకో పార్టీ ని తొక్కెయ్య వచ్చుఁ .  ఆటలో అంతా ధర్మమే . 
 స్టింగ్ ఆపరేషన్ లు చేసో ,కంఠాన్ని అనుకరించో ఏదో ఒకటి చేసి రాష్ట్ర నాయకుడిని తద్వారా రాష్ట్ర ప్రగతిని కుంటు పరచాలనే కుట్ర మాత్రం సాగ నివ్వ కూడదు . 
ఎందు  కంటే ఈ కేసు లో  కేవలం ఎన్నిక నియమావళి ఉల్లంఘన తప్ప , అవినీతి అనేది లేదు . ఆ విషయం న్యాయ మూర్తులందరికీ తెలుసు . ఏదో ఒక విధం గా ఒక ముఖ్యమంత్రిని బద్నాం చేసి ,రాష్ట్ర పరువు ప్రతిష్టలను బజారు కీడ్చి , వచ్ఛే ఒకటి ,రెండు ప్రాజెక్ట్ లకి మోకాలడ్డి ,  చెల్లించ వలసిన బకాయిలను ఎగ్గొట్టే కుట్ర ఇది . 
నేనేమీ పార్టీ పై అభిమానం తో చెప్పడం లేదు . ఇది చూడండి ... 
ఇదివరకే హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి , "ఓటుకు నోటు కేసు ఎన్నికల నియమ నిబంధనల అతిక్రమణ కిందకు వస్తుందే తప్ప అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని, దీని విచారణకు ఏసీబీకి పరిధి లేదని "హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శివ శంకర్‌ రావు తీర్పు ఇచ్చారు. 

 రాజకీయ నాయకులు ఆడే అట వలన ప్రజాధనం లూటీ కాకూడదు . దేశానికి దెబ్బ తగల కూడదు . 
 గత 50 ఏళ్లుగా  పార్టీ ఫిరాయింపులు కళ్ళ ముందు జరుగుతా ఉంటే , రాజ్యాంగం ప్రకారం తప్పని తెలిసీ  ,  
న్యాయ వ్యవస్థ గానీ, రాజ్యాంగ వ్యవస్థ గానీ ,ఎలక్షన్ కమిషన్ గానీ ఎవ్వరూ మాట్లాడరు . 
రాజద్రోహం ,దేశ  ద్రోహం వేరు . పార్టీ ద్రోహం వేరు .  దీనివలన , పార్టీ ఫిరాయింపులనేవి అనైతికమే గానీ నేరమని ఎవ్వరూ నమ్మడం లేదు .  ప్రజలు కూడా ఇదంతా రాజకీయ పార్టీలు ఆడుకొనే క్రీడ గా భావించి నిర్లిప్తం గా 
ఉంటున్నారు .  ఫిరాయింపులు చేయలేదని ఏ పార్టీ గుండె మీద చెయ్యేసి చెబుతుంది ? 
 ప్రజలే నేటి రాజులు . కాబట్టి ప్రజాద్రోహం జరిగితే కఠిన శిక్షలు ఉండాలి . ఓటుకి నోటు కేసు అనేది  కేవలం రాజకీయ పక్షాల మధ్య న  జరిగిన   ఒక  ఆట . దానివలన ప్రజలకు, దేశానికి  జరిగిన నష్టం ఏమీ లేదు .
కానీ , సూట్కేసు సంస్థల పేరిట  విదేశాల్లో దొంగ సంస్థలు స్థాపించి , విదేశీ ద్రవ్యాన్ని హవాలా ద్వారా దేశానికి రప్పించి  క్విడ్ ప్రో చేయడం రాజ్య ద్రోహం . ఇసుక మాఫియా  , భూగర్భ సంపద లూటీ  , భూ దందా ల ద్వారా  వేలకోట్ల ప్రజా ధనాన్ని లూటీ చేయడం ప్రజా ద్రోహం . రైళ్ల ను ,మనుషులను తగలబెట్టి కాలర్ ఎగరేయడం ప్రజాద్రోహం .   పట్టపగలు కళ్ళ ముందు జరుగుతున్న నేరాలపై  ముందుగా ఫోకస్ పెట్టండి . నల్ల ధనాన్ని ఎలా అరికట్టాలో ఆలోచించండి .    ఫోన్  ల ద్వారా చేసే స్టింగ్ ఆపరేషన్ లతో  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇరికిస్తే పక్క రాష్ట్రం చంక నాకి పోతుందనే రాక్షస బుద్ధి తో , రాష్ట్ర భవిషత్ కి విఘాతం కలిగించే వారి కుట్రలను తిప్పి కొట్టాలి . ఇది మీడియా ,ప్రజలు, విద్యార్థి సంఘాలు ముందుకు వఛ్చి క్రియా శీల మవ్వ వలసిన సమయం .  
తప్పు చిన్న దైనా తప్పే ! కానీ నేటి పరిస్థితులలో , ఎక్కువ పెద్ద  తప్పు ఎవరు  చేశారో ముందు వారికి శిక్ష పడాలి .

No comments:

Post a Comment