గత 100 ఏళ్లుగా భారత దేశాన్ని విదేశాలకు అమ్మేసే ఎజెండాతో ఉన్న ఎర్ర రాజకీయ పార్టీలు , డజను కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి నడిపించే రౌడీ పార్టీలు చెప్పేది వినే వాళ్ళు ఇంకా ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్నారంటే ఆశ్చర్యం తో బాటు బాధ కలుగుతుంది .
ఒక ముఖ్యమంత్రి స్థానం లో ఉన్న వ్యక్తికీ ఉండే అవగాహన ఎవ్వరికీ ఉండదు . అలాంటిది , 11 ఏళ్ళు ముఖ్యమంత్రిగా , రాష్ట్రపతి మొదలుకొని అన్ని రకాల రాజకీయ పార్టీల సారధులతో ఖఛ్చితం గ మెచ్చుఁకో బడిన రాజకీయ చాణక్యుడు , రాష్ట్రంలో సంపదని అభివృద్ధి చేయడమే ధ్యేయం గా ఉన్న నాయకుడు , ఇప్పటికీ రోజుకి 18 గంటల పాటు కష్టపడే వాడి కుండే అవగాహన వేరే ఎవ్వరికైనా ఉంటుందా ?
ఇలాంటి నాయకుడు వేరే ఉత్తరాది రాష్ట్రాలలో ఉంటే , ఈ పాటికి దేశ ప్రధాన మంత్రి అయ్యేవాడు . ఒక్కసారి నిదానించి చూడండి ... మనకున్న 29 రాష్ట్రాలలో ఏ ముఖ్య మంత్రైనా , మన ముఖ్యమంత్రిలా కష్ట పడుతున్నారా ? కేవలం సంక్షేమ కార్యక్రమాలు చేయడమే తెలిసిన మన పార్టీలకు , అదే సమయం లో సంపదను , ఉద్యోగాలను సృష్టించే నిర్మాణాత్మక కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడరు . ఎందుకంటే వాటి వలన వచ్ఛే ఫలితాలు ఆలస్యం అవ్వడం వలన సామాన్య ప్రజలలో కి వెళ్లవు . కాబట్టి వాటివలన ఓట్లు రాలవని వారికి భయం .
ఓట్ బాంక్ రాజకీయాలకు అతీతం గా ఆలోచించే దార్శినికులే సంపద సృష్టించ గలరు .
1990 వరకు హైదరాబాద్ అంటే చార్మినార్ ,గోల్కొండ తప్ప ఒక్క వైట్ కాలర్ ఉద్యోగం ఇచ్ఛే సంస్థలున్నాయా ? అలాంటిది , కేవలం 15 ఏళ్లలో ఒక ప్రఖ్యాత సైబరాబాద్ అనే నగరాన్ని నిర్మించి , భారతదేశ సేవారంగానికి కొమ్ముకాచి దేశ తలసరి ఆదాయాన్ని పెంచడమే కాదు , దారితప్పుతున్న యువతకి సాఫ్ట్ వేర్ రంగాన్ని పరిచయం చేసి , తెలుగు పల్లెల్లో ప్రతి ఇంటికీ ఒక NRI ఉండేటట్లు చేసి మానవ వనరుల ను ఏకోన్ముఖం చేసి సంపద సృష్టించిన ఏకైక ముఖ్యమంత్రి ఇతడు .
అలాంటి నాయకుడికి , కేంద్రం ప్రకటించిన స్పెషల్ పాకేజీ లో లాభనష్టాలు ఏమిటో తెలియదా ?
ఆయన చెప్పినట్లు గా చేయడమే , తెలుగు ప్రజలు ఆయన కిచ్ఛే గౌరవం !
అందరూ ముందుగా హోమ్ వర్క్ చేయవలసిన అవసరం ఉంది .
ప్రతిపక్షాలు , ఆర్ధిక నిపుణులతో సంప్రదింపులు జరిపి ఇలాంటి ప్రశ్నలు సంధించాలి తప్ప, రౌడీ జులుం చేయడం, బంద్ లు చేయడం వలన ఫలితాలు రావు . నిరసన తెలియ చేయడానికి బంద్ చేస్తామనే వాదన మరీ పాత చింతకాయ పచ్చ్చడి లెక్క ఉంది .
ప్రజలు కూడా మరీ ఎమోషనల్ గా ఉండకూడదు . తెలంగాణా ఇవ్వడం అంటే ఒక దానిని కోసి రెండు ముక్కలు చేయడం . అది చాలా తేలిక . మేకను కోయడం ఎంత సేపు ? క్రూర మనస్తత్వం ఉన్నవారికి , ఒక మనిషి ని చంపడం ఎంత తేలిక? అదే మనిషికి , ప్రాణం పోయడం ఎంత కష్టం ? రాష్ట్రాన్ని చీల్చి వేసి తెలంగాణ ఇవ్వడం వేరు , ఒక రాష్ట్రాన్ని బతికించు కొని నిలబెట్టడం వేరు .
తెలివి తేటలలో తెలుగు వారిని కొట్టిన వారు లేరు . అదే సమయంలో ,భావోద్వేగాల వలన అవకాశాలు పోగొట్టు కోవడం లో కూడా తెలుగు వారి ని కొట్టిన వారు లేరు !

- ప్రత్యేక పాకేజీ కి రాజ్యాంగపరమైన చట్టబద్ధత ఇచ్చ్చిందా ? లేదా ? ఇవ్వాలంటే ఏమి చేయాలి ?
- పోలవరం ప్రాజెక్ట్ కి అవసరమైన పర్యావరణ అనుమతులు , పునరావాస ఏర్పాట్లు ఎప్పటి లోగా పూర్తి చేస్తారు ?
- కేంద్రం ఇఛ్చిన హామీ ల్లో ఎంత నిజాయితీ ఉంది ? ఎంత నిజముంది ? ఇంకెంత సాయం అవసరం ? ఇఛ్చిన హామీలు ఎంత కాలంలో అమలు చేస్తారు ?
- రాష్ట్రానికి జీవనాడి ఐన పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది ? సాగుబడి ప్రాజెక్ట్ కి సాయం అందిస్తామని చెప్పిన కేంద్రం, ప్రాజెక్ట్ లో అంతర్భాగమైన విద్యుత్ ఉత్పత్తి కి ఎందుకు సాయం చేయదు ?
- విద్యా సంస్థలు ,కేంద్ర శాఖలు , కేంద్రీయ సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు సరే , ఇవన్నీ ఒక కాలపరిమితి లో పూర్తి చేస్తామని నిర్దిష్టమైన హామీ కేంద్రం ఇచ్చ్చిందా ?
- విదేశీ రుణాల విషయం లో సాయం అందిస్తామన్న కేంద్రం , వాటికి ఏదైనా పరిమితులు విధిస్తుందా ?
- విశాఖ పట్టణం కేంద్రం గా రైల్వే జోన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు ?
- పారిశ్రామిక కారిడార్ , పెట్రో కెమికల్ పరిశ్రమలు , సాగరమాల ప్రాజెక్ట్ , రాజధానికి చేసే సాయం, నగరాలలో మౌలిక సదుపాయాలు , ఇవన్నీ ఒక కాలపరిమితిలో అమలుచేస్తామన్న హామీ ఏదైనా కేంద్రం ఇచ్చ్చిందా ?
- GST వస్తున్న కాలంలో పరిశ్రమలకు ఇచ్ఛే పన్నురాయితీ ఎలా లెక్క వేస్తారు ? పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఎలా అమలు చేస్తారు ? వందలాది పరిశ్రమలు వస్తే , వా టన్నింటికీ పన్ను మినహాయింపు వర్తింప చేస్తారా ? ఒక వేళా అలా చేస్తే, పన్నుల రాబడిలో రాష్ట్రానికి ఇచ్ఛే నిధుల కోటాలో కోత పెడతారా ?
ప్రతిపక్షాలు , ఆర్ధిక నిపుణులతో సంప్రదింపులు జరిపి ఇలాంటి ప్రశ్నలు సంధించాలి తప్ప, రౌడీ జులుం చేయడం, బంద్ లు చేయడం వలన ఫలితాలు రావు . నిరసన తెలియ చేయడానికి బంద్ చేస్తామనే వాదన మరీ పాత చింతకాయ పచ్చ్చడి లెక్క ఉంది .
ప్రజలు కూడా మరీ ఎమోషనల్ గా ఉండకూడదు . తెలంగాణా ఇవ్వడం అంటే ఒక దానిని కోసి రెండు ముక్కలు చేయడం . అది చాలా తేలిక . మేకను కోయడం ఎంత సేపు ? క్రూర మనస్తత్వం ఉన్నవారికి , ఒక మనిషి ని చంపడం ఎంత తేలిక? అదే మనిషికి , ప్రాణం పోయడం ఎంత కష్టం ? రాష్ట్రాన్ని చీల్చి వేసి తెలంగాణ ఇవ్వడం వేరు , ఒక రాష్ట్రాన్ని బతికించు కొని నిలబెట్టడం వేరు .
తెలివి తేటలలో తెలుగు వారిని కొట్టిన వారు లేరు . అదే సమయంలో ,భావోద్వేగాల వలన అవకాశాలు పోగొట్టు కోవడం లో కూడా తెలుగు వారి ని కొట్టిన వారు లేరు !
No comments:
Post a Comment