Search This Blog

Saturday, 10 September 2016

వాస్తవాలు పరిశీలించండి ..... ప్రాక్టికల్ గా ఆలోచించండి !

1. కేంద్ర నిధుల నుండి రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఇవ్వాలన్న 14 వ ప్రణాళికా సంఘం చేసిన  సిఫారసు వలన  2015 తర్వాత ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి ఒరిగే లాభాలు ఏమీ ఉండవని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు . కారణం ఏమిటి ?
ప్రతి రాష్ట్రం లో  కూడా పరిశ్రమలు ,సంస్థల నుండి సెంట్రల్  టాక్స్  (కార్పొరేట్ పన్ను , ఆదాయపు పన్ను , ఉత్పత్తి పన్ను , ఎగుమతి - దిగుమతి పన్ను , మొదలైనవి )వసూల్ చేస్తారు . ఉదాహరణకు ఒక రాష్ట్రం నుండి , Rs.100/- కేంద్ర పన్నుల రూపం లో వసూల్ చేశారని కొందాం .  2014-15 వరకు , దీనిలో 32% వాటా ని తిరిగి రాష్ట్రాలకు ఇచ్ఛే వారు . కేంద్ర పన్నులలో  మునుపు  32 శాతం గా ఉన్న రాష్ట్రాలకు ఇచ్ఛే  వాటాను  , 2015-16 నుండి 42 శాతా నికి పెంచారు . దీనివలన  రాష్ట్రాలకు ప్రత్యేక హోదా  ఇఛ్చినా  నిధులు పెరిగే అవకాశం ఉండదు . 
Economically, the tag of Special Category State (SCS) no longer means a windfall of special funds to any state. Till 2014-15, the SCS status indeed meant a bonanza of funds from the Centre. But the Centre virtually did away with the economic privileges attached to the SCSs from 2015-16, after the Fourteenth Finance Commission raised the share of states in central taxes from 32 percent to 42.
2. అంటే , ఒకవేళ వత్తిడి పెట్టి ప్రత్యేక హోదా సాధించు కొన్నా పెద్దగా ప్రయోజనం ఉండదు
 అని అంటారా ? 
అవును ! ప్రత్యేక హోదా అనేది 2014-15 ఆర్ధిక సంవత్సరం వరకు ఉపయోగకరం గా ఉండేది . ఆ తర్వాత ప్రత్యేక హోదా ఉన్నా కూడా ప్రయోజనం పెద్దగా లేదు . 
3. మరి , ఎన్నికల ప్రచారం లో ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ ఎందుకు చెప్పారు ?
అప్పటికి నీతి ఆయోగ్ , 14 వ ప్రణాళిక విషయాలు లేవు . ఆ సమయానికి ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి   లాభదాయకం అనే ఉద్దేశ్యం తోనే ఆ హామీ ఇచ్చ్చారు . 
4. ఆర్ధిక ప్రయోజనాల దృష్ట్యా , "ప్రత్యేక హోదా ' అనే పదం బదులు  "ప్రత్యేక సాయం" అనే పదం వచ్చ్చింది తప్ప , లాభాలు ఒకే రకం గా ఉంటాయని కేంద్రం చెబుతుంది . ఇది ఎంత వరకు నిజం ? 
వాస్తవం ఉంది . రాష్ట్ర నాయకత్వం నిరంతరం కేంద్రం తో సత్సంబంధాలు మెరుగు పరచుకొంటూ కేంద్రప్రాయోజిత పధకాలను కేటాయింప చేసుకొంటే ప్రత్యేక పాకేజీ రాష్ట్రానికి మేలు చేస్తోంది . 
5. సరిహద్దు రాష్ట్రాలకు , కొండప్రాంతాలలో అత్యధిక శాతం జనాభా ఉన్న రాష్ట్రాలకు ఇచ్ఛే ప్రత్యేక 
హోదా ని  , ఆంధ్రా  ఎందుకు కోరుతుంది ? 
ఏడాదికి 70000 కోట్ల ఆదాయం ఇచ్ఛే పాడికుండ లాంటి ఆర్ధిక రాజధానిని (హైదరాబాద్ ) ని  పోగొట్టు కోవడం ఒకటి ఐతే , మళ్ళీ ఒక ఆర్ధిక పుష్టితో కూడిన సమగ్ర హార్దిక రాజధానిని నిర్మించు కోవడం రెండోది . 
6. 2014-15 వరకు,  ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు నిధులు బాగా అందేవని చెబుతారు . నిజమేనా ?
అవును . క్రితం ఏడాది వరకు , కేంద్రం యొక్క ప్రణాళిక బడ్జెట్ ఎలా ఖర్చు అవుతుందో ఒక చిన్న ఉదాహరణ ... 
మొత్తం కేంద్ర బడ్జెట్  ప్రణాళిక Rs.100/- అను కొండి . 
  •  దీనిలో Rs.41/- లు కేంద్రమే  రక్షణ ,విద్య ,వైద్యం ,వివిధ మౌలిక సదుపాయాలు ,సంక్షేమ పధకాల కోసం ఖర్చు చేస్తుంది .  
  •  Rs.44/- లు కేంద్రపధకాల (Centrally Sponsored Schemes)అమలు కోసం  రాష్ట్రాలకు పంచుతారు . 
  • Rs. 15 /- లు  రాష్ట్రాలకు  సాయం గా (Bloc grants) ఇస్తారు . దీనిలో Rs.10/-లు సాధారణ కేంద్ర సాయం , Rs.5/- లు ప్రత్యేక కేంద్ర సాయం గా  జనాభా తామాషా లో రాష్ట్రాలకు  పంచుతారు.  
సాధారణ కేంద్ర సాయం  కింద Rs.6/- లు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ,మిగతా Rs.4/- లు మిగతా రాష్ట్రాలకు 
ఇస్తారు . 
ప్రత్యేక కేంద్ర సాయం గా ఇచ్ఛే Rs.5/-లను కేవలం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే పంచుతారు . 
అనగా , ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు  (11 రాష్ట్రాలు + ఆంధ్రా) 11/- లను పంచుకోవాలి . ఇంకా అర్ధమయ్యే విధం గ చెప్పాలంటే , అన్ని రాష్ట్రాలకు ఇచ్ఛే మొత్తం "కేంద్ర సాయం" అనే పద్దు క్రింద 4లక్షల కోట్లు ఉంటే , అందులో ప్రత్యేక హోదా యున్న రాష్ట్రానికి కేవలం ఏడాదికి 4000 కోట్లు  ఉచిత గ్రాంట్ రూపం లో దక్కేది . 
7. మరి జైరాం రమేష్ మొదలైన మేధావులు ,రాజకీయ నాయకులు ప్రత్యేక హోదా వస్తే , 60000 కోట్లు వస్తాయని చెబుతున్నారు ? 
15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఉంటే ఏడాదికి 4000 కోట్ల చొప్పున 60000 కోట్లు వస్తాయి . అంతే గానీ , ఏడాదికే 60000 కోట్లు రావు . మీకు తెలుసుగా ,రాజకీయ నాయకులు వారు మేధావులైనా , పూర్తి నిజాన్ని చెప్పరు . 
8. 14 వ ఆర్ధిక సలహా సంఘం, నీతి ఆయోగ్ ని ఎవరి కోసం , ఎందు  కోసం ఏర్పాటు చేశారు ? 
దేశ ఆర్ధిక ముఖ చిత్రాన్ని సమూలం గా మార్చడానికి మోడీ  ప్రభుత్వం సంస్కరణలు చే ప్పట్టింది . దానిలో భాగం గా  ఫెడరల్ వ్యవస్థని బలోపేతం చేయడానికి వీటిని ఏర్పాటు చేశారు . 
9. నీతి ఆయోగ్ ,  14 వ ఆర్ధిక సలహా సంఘం, నిబంధనల ప్రకారం 2015-16 నుండి రాష్ట్రాలకు ఇచ్ఛే నిధుల ప్రవాహం  ఏ విధం గా ఉంటుంది ?
 Union Budget 2016-17 uses a different nomenclature to classify the components of Central Assistance to States/UT plan this year. 
The components of Central Assistance includes:
  1. Grants/Loans – Rs. 60,614. crore. ( గ్రాంట్ అంటే సాయం . అది అప్పు రూపం లో మరియు ఉచిత సాయం రూపం లో ఉండ వచ్చుఁ . ) . 
  2. Finance Commission grants – Rs.1,00,646 crore.
  3. Centrally Sponsored Schemes – Rs. 2,26,820 crore.

అనగా , రాష్ట్రాలకు  ఇచ్ఛే కేంద్ర సాయం , పై విధం గా 3 రూపాలలో ఉంటుంది . 

10. కేంద్రప్రాయోజిత పధకాల కోసం (Centrally Sponsored Schemes ) , అన్ని రాష్ట్రాలకి కలిపి , కేంద్ర బడ్జెట్ లో  ఏ  విధం గా కేటాయింపులు చేస్తుంది? 

Centrally Sponsored Schemes (CSSs) are special purpose grants (or loans) extended by the Central Government to States to encourage and motivate State governments to plan and implement programmes that help attain national goals and objectives. 

(A) Core of the Core Schemes – Rs. 56186.65 crores (56వేల కోట్లు ) . 

  • 1. Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme 38500.00
  • 2 National Social Assistance Programme 9500.00
  • 3 Umbrella Programme for Development of Scheduled Castes 3917.89
  • 4 Umbrella Scheme for Development of Scheduled Tribes (Vanbandhu Kalyan Yojna and Umbrella
    Scheme for education of ST children) 1759.22
  • 5 Umbrella Scheme for Development of Backward Classes and other vulnerable groups 1264.54
  • 6 Umbrella Scheme for Development of Minorities. 1245.00
    a Multi-Sectoral Development Programme for Minorities 1125.00
    b Education Scheme for Madrasas and Minorities 120.00

(B) Core Schemes – Rs. 168992.05 crores

  • 7. Green Revolution 12979.79
    a. Krishonnati Yojna 7579.79
    b. Rashtriya Krishi Vikas Yojna 5400.00
  • 8. White Revolution 1273.46
  • 9. Blue Revolution 575.34
  • 10. Pradhan Mantri Krishi Sinchai Yojna (PMKSY) 5717.13
    a. Har Khet ko Pani 500.00
    b. Accelerated Irrigation Benefit Programme and other schemes under PMKSY in Water Resources Ministry 1377.13
    c. Per Drop More Crop 2340.00
    d. Integrated Watershed Management Programme 1500.00
  • 11. Pradhan Mantri Gram Sadak Yojna 19000.00
  • 12. National Rural Drinking Water Programme 5000.00
  • 13. Swachh Bharat Abhiyan (SBA) 11300.00
    a. SBA – Rural 9000.00
    b. SBA – Urban 2300.00
  • 14. National Health Mission (NHM) 20037.00
    a. NHM : Rural and Urban Mission 19037.00
    b. NHM : Human Resources in Health and Medical Education 600.00
    c. NHM : AYUSH 400.00
  • 15. Rashtriya Swastha Suraksha Yojna (RSSY) 1500.00
  • 16. National Education Mission (NEM) 28010.00
    a. NEM : Sarva Shiksha Abhiyan 22500.00
    b. NEM : Rashtriya Madhyamik Shiksha Abhiyan 3700.00
    c. NEM : Teachers’ Training and Adult Education 510.00
    d. NEM : Rashtriya Uchch Shiksha Abhiyan 1300.00
  • 17. National Programme of Mid-day Meals in Schools 9700.00
  • 18. Integrated Child Development Scheme (Umbrella ICDS) 16119.90
    a. Core ICDS 14000.00
    b. National Nutrition Mission 862.90
    c. Maternity Benefits Programme (IGMSY) 400.00
    d. Scheme for Adolescent Girls, SABLA, KSY 460.00
    e. Integrated Child Protection Scheme 397.00
  • 19. Pradhan Mantri Awas Yojna (PMAY) 20075.00
    a. PMAY- Rural 15000.00
    b. PMAY- Urban 5075.00
  • 20. National Livelihood Mission (NLM) 3325.00
    a. NLM- Rural – Aajeevika 3000.00
    b. NLM- Urban 325.00
  • 21. Forestry and Wildlife (F&WL) 755.02
    a. (F&WL)- National Mission for a Green India 155.01
    b. (F&WL)- Integrated Development of Wildlife Habitats (including Project Tiger and Project Elephant) 500.00
    c. (F&WL)-Conservation of Natural Resources and Ecosystems 100.01
  • 22. Urban Rejuvenation Mission (AMRUT and Mission for Development of 100 Smart Cities) 7295.50
  • 23. Modernisation of Police Forces 1753.90
  • 24. Infrastructure Facilities for Judiciary 625.01
  • 25. Member of Parliament Local Area Development Scheme 3950.00
(C) Optional Schemes – Rs. 1642 crores
  • 26. Border Area Development Programme 990.00
  • 27. National River Conservation Programme 352.00
  • 28. Shyama Prasad Mukherjee Rurban Mission 300.00
Total Allocation of CSS – 226820.70
Grand Total: 388081.12
11. మరి , ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏం చేయాలి ? ఏం కోరాలి ?
A. ప్రత్యేక ప్యాకేజి ని ఆమోదించాలి . పోలవరం ప్రాజెక్ట్ నకి  ,రాజధాని నిర్మాణానికి  ,పారిశ్రామిక కారిడార్ కి , కేంద్ర సంస్థలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను  5 ఏళ్లలో పూర్తి అయ్యే విధం గా  నిధులు కేటాయించ మని కేంద్రాన్ని కోరాలి . విభజన చట్టంలో 10 ఏళ్లలో సాయం అందించ మని సూచించినా , ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిధులను  పొందాలి . 
B. కేంద్ర ప్రాయోజిత పధకాలను ఎక్కువగా తెచ్చుకోవాలి . దీంట్లో  బ్లాక్ గ్రాంట్స్ కి ఉన్నట్లు ,  రాష్ట్రాలకు ఎక్కువ ఆజమాయిషీ ఉండక పోయినా , కేంద్ర ప్రణాళిక లో వీటి శాతం  ఎక్కువ కాబట్టి , రాష్ట్రానికి మరిన్ని  కేంద్ర ప్రాయోజిత పధకాల ను తెచ్చుకోవాలి .   కేంద్ర ప్రాయోజిత పధకాల కోసం సుమారు  మొత్తం 2లక్షల కోట్లు కేంద్రం ఖర్చు పెడుతుంది . కాబట్టి మరిన్ని కేంద్ర ప్రాయోజిత పధకాల కోసం ముఖ్యమంత్రి పట్టు బట్టాలి . 
Demand  the Centre shell out more cash by way of more Centrally Sponsored Schemes in Andhra Pradesh.
C. వచ్ఛే 5 ఏళ్లకు (2015 -2020) , ఆంధ్రా కి 22000 కోట్లు రెవెన్యూ లోటు ఉంటుందని  14 వ ప్రణాళికా సంఘం చెప్పిమ్ది . దీనిని ఏడాదికి కొంత చొప్పున  ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చ్చింది . కానీ రాష్ట్ర ఆర్ధిక శాఖ లెక్కల ప్రకారం ఈ లోటు ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి, మరింత సాయం అందించాలని డిమాండ్ చేయాలి  . 
D. రాజధాని నిర్మాణానికి కేంద్రం కేవలం 10000 కోట్లు ఇస్తామని చెబుతుంది . కానీ 55000 కోట్లు కావాలని రాష్ట్రం డిమాండ్ చేయాలి . 
E. పోలవరం ప్రాజెక్ట్ లోని విద్యుత్ ఉత్పా దన కి సంబంధించి కూడా నిధులను కేటాయించ మని 
డిమాండ్ చేయాలి . 

ఈ సమాచారం ఒక ఆర్ధిక నిపుణుడి సహకారం తో వ్రాసినదే తప్ప , సొంతం గా ఆలోచించి  వ్రాయలేదు .
వాస్తవాలు పరిశీలించండి ..... ప్రాక్టికల్ గా ఆలోచించండి !

No comments:

Post a Comment