ఆంద్ర రాష్ట్రంలో మొత్తం ఓటర్లు : సుమారు 4కోట్లు. కానీ అధికారుల లెక్క అనగా మార్చి 2019లో ప్రకటించిన కొత్త లిస్టు ప్రకారం మొత్తం ఆంధ్రా ఓటర్లు . 3. 91 కోట్లు. వీరిలో పురుషులు: 1. 93 కోట్లు; మహిళలు : 1.97కోట్లు. పురుషులకంటే సుమారు 4లక్షలు ఎక్కువగా మహిళా ఓటర్లు ఉన్నారు.
వీరిలో 2019 లో కొత్తగా ఓటు హక్కు పొందిన యువత అనగా 18 ఏళ్ళూనింది 19 లోకి అడుగుపెట్టినవారు: 5లక్షలు.
ఏ కారణం చేతనైనా గానీ, సుమారు 22లక్షలమంది కొత్తగా ఓటు నమోదు చేసుకొన్నారు.
ఏ కారణం చేతనైనా గానీ,1. 5 లక్ష ఓట్లు తీసివేయబడ్డాయి.
ఏప్రిల్ 11 పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలలో , నిష్పక్షపాతం గా పనిచేయవలసియున్న ఎన్నికల కమిషన్ ఆశ్రిత పక్షపాతము , నిరంకుశ వైఖరి,అప్రజాస్వామిక వ్యవహారశైలితో అభాసుపాలవ్వడమేకాక, తెలుగుదేశం పార్టీని ,ఆంధ్రప్రభుత్వాన్ని హీనంగా చూసి ,ఇష్టం వచ్చినట్లు, కేంద్రప్రభుత్వాధిపతులు చెప్పినట్లు చేసింది.
సుమారు 50000 బూత్ లలో 80% ఓట్లు పోల్ అయ్యాయి. కొన్ని చోట్ల రీ పోలింగ్ జరిగింది. సుమారు 10000 కోట్లు ఇరు పార్టీలు, ఆయా అభ్యర్థులు ఖర్చుపెట్టినట్లు అనధికార సమాచారం.
కుల మతాల వారీగా కాకుండా , వయస్సు,వృత్తి, సాంఘిక హోదా ,లింగ ము ప్రకారం ఓటర్లను వర్గీకరించి , పోస్ట్ పోలింగ్ సర్వే చేసి రాబట్టిన సమాచారం ఈ విధంగా ఉంది.
యువత,అనగా 18 నుండి 30 ఏళ్ల వయస్సు గల ఓటర్లు (సుమారు కోటి ) మెజారిటీ 50% జగన్ కి ఓటేశారు. ఆ తర్వాత 15% పవన్ కి వేస్తె,మిగతా 35% బాబు కి వేశారు. యువత లో బాబు పై తీవ్ర వ్యతిరేకత ను గమనించాం. తద్వారా జగన్ బాగా బలపడ్డాడు. వీరే గట్టి గొంతు తో జగన్ వస్తాడని తీవ్ర ప్రచారం కూడా చేశారు.
"యువత తీరు తెన్నులను సూక్ష్మంగా పరిశీలిద్దాం.
25 నుండి 35 వయస్సు ఉన్నవాళ్లు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడి కొద్దిగా మంచీ-చెడూ ఆలోచనచేయగల సత్తావున్నవాళ్ళు సుమారు 70 లక్షలు ఉన్నారు. వీరిలో 40%బాబుకి, 40% జగన్ కి ,20% పవన్ కి ఓటేసే అవకాశం ఉంది. వీరు ఆలోచనాపరులే గానీ,కులాలరీత్యా పార్టీలకు మొగ్గు చూపే అవకాశముంది. అనగా, 28లక్షల ఓట్లు బాబు కి , 28లక్షల ఓట్లు జగన్ కి , 14 లక్షలు పవన్ కి పడతాయి. వెరసి ,ఈ 18 -35 వయస్సు వర్గం నుండి, బాబుకి 40లక్షల ఓట్లు , జగన్ కి 58 లక్షలు, పవన్ కి 32 లక్షల ఓట్లు పడతాయి.
(18 నుండి 35 కాకుండా , 18 నుండి 30 ఏళ్ల వయస్సు అనగా కేవలం విద్యార్థులు సుమారు కోటిమంది ఉంటారు. సెఫాలజీ ఇంట్రస్ట్ తో వీరిని ఒక వర్గం గా గమనిస్తే, వీరిలో 50%జగన్ కి వేశారు. అనగా అరకోటి ఓట్లు. బాబుకి కేవలం 35% అనగా 35లక్షల ఓట్లు,పవన్ కి 15 లక్షల ఓట్లు పడ్డాయి. ).
రైతులు - రైతు కూలీలు (గ్రామీణులు ) :
మొత్తం రైతు ఓటర్లు 45 లక్షలు. వీరిలో 55% అనగా 25లక్షల ఓట్లు బాబుకి పడ్డాయి . 15 లక్షలు జగన్ కి , 5లక్షలమంది పవన్ కి వేశారు.
రైతు కూలీలు సుమారు 50 లక్షల మంది ఉంటారు.వీరిలో 21 లక్షలు జగన్ కి, 20 లక్షలు బాబుకి వేశారు .
మహిళా ఓటర్లు :
మహిళలు మొత్తం సుమారు 1. 9 కోట్లు . వీరిలో ఉద్యోగులు,ఉద్యోగుల కుటుంబాలు,వ్యాపారులు,వారి కుటుంబాల మహిళలను,కాలేజీ యువతను తీసేస్తే సుమారు 1.3 కోట్లు సాధారణ గృహిణులు . వీరిలో 60% అనగా 75 లక్షల మంది బాబుకే ఓటేశారు.
జగన్ కి 55 లక్షలమంది వేశారు.
మహిళా ఓటర్లను ద్వాక్రా మరియు నాన్ ద్వాక్రా గా విడదీసి చూద్దాం.
డ్వాక్రా మహిళల్లో (95 లక్షలు) 60% బాబుకి , 33% జగన్ కివేస్తారు. మొత్తం కోటి ద్వాక్రా మహళల్లో 58 లక్షలు బాబుకి , 32 లక్షలు జగన్ కి వేశారు.
నాన్ ద్వాక్రా గృహిణులు మొత్తం 40 లక్షలు ఉంటారు. వీరిలో 40% బాబుకి ,అనగా 16 లక్షలు , జగన్ కి 50% అనగా 20 లక్షలు వేశారు .
బాబు,ఉద్యోగులకు ఎంత చేసినా , పీఆర్సీ పెంచినా ,జీతాలు పెంచినా, వారికేది కావాలో అది చేసినా, విచిత్రంగా మెజారిటీ ఉద్యోగులు,టీచర్స్ బాబుకి వ్యతిరేకంగా ఓటేశారు.
ఉద్యోగులు మొత్తం 6లక్షలు. వారి కుటుంబాలతో కలుపుకొంటే 18 లక్షల ఓటర్లు ఉంటారు. వీరిలో 60% అనగా 11 లక్షలమంది జగన్ కి , 7లక్షలమంది బాబు కి వేస్తారు.
వ్యాపారులు మొత్తం 10 లక్షలమంది ఉంటారు. వీరి కుటుంబాల ఓట్లు మొత్తం కలుపుకొంటే 30 లక్షల మంది అవుతారు. వీరిలో 60% అనగా 18 లక్షలు బాబుకి , 10 లక్షలు జగన్ కి వేస్తారు.
వెరసి 1. 85 కోట్ల ఓట్లు బాబుకి.1. 65కోట్లు జగన్ కి ,అనగా 20 లక్షల ఓట్లు తేడా ఉంటుంది. 80%పోలింగ్ కాబట్టి, తేడా 16 లక్షల ఓట్లుగా ఉండే అవకాశముంది.
కాబట్టి తెలుగుదేశం మంచి మెజారిటీ సీట్లతో విజయం సాధిస్తుంది.
No comments:
Post a Comment