Search This Blog

Tuesday 4 December 2012

భారతీయం కడు కమనీయం

సంస్కృతి - సంప్రదాయం  అంటే ఏమిటి ? వాటి వలన జాతికి ఉపయోగం ఉందా?
ఒక జాతికి తిండి ,గుడ్డ ,నీడ లేక పోవచ్చు .కానీ , విజ్ఞానం లేక పోతే జాతి క్రమంగా అంతరించి పోతుంది . ఉదాహరణకు ,పశువులకు విజ్ఞాన మును వారసత్వంగా నేర్చుకొనే శక్తి , సామర్ధ్యం లేనందు వల్ల అవి ఎప్పుడూ ఇంకొకరి దయా దాక్షిణ్యాల పై ఆధారపడి బతక వలసిందే .శారీరక బలం కొంత మేరకే పనికొస్తుంది . బుద్ది  పదునెక్కి , జీవన పోరాటాన్ని సులభతరం ,సుఖ వంతం చేయక పోతే  ఆ జాతి మనలేదు .

మన విజ్ఞానమే మన సంస్కృతి . ఆ విజ్ఞానాన్ని మన దైనందిన జీవనం లో భాగం చేసు కోవడమే సంప్రదాయం .
విజ్ఞానాన్ని తరంతరం నిరంతరం ఒక ధారా లాగా అందివ్వ ట మే మనిషి భాద్యత .
ఓ చిన్న ఉదాహరణ -
శుభ , సంతోష  కార్యాలలో మనిషి బొట్టు పెట్టు కోవడం సంప్రదాయం . నుదుట ఆజ్ఞా చక్రాన్ని ఉద్దేపనం చేయడం దాగిఉన్న విజ్ఞానం .

 భౌతిక ,ఆధ్యాత్మిక అంతరార్ధం లేకుండా భారతీయ సంప్రదాయాలుండవు .
పూజ ,ఆలయం ,హోమాలు , వాకిట ముగ్గులు ,గొబ్బిళ్ళు , కొప్పులో పూ లు ,మంగళ సూత్రం ,ఉపనయనం ,షోడశ కర్మలు , పంచ యజ్ఞాలు  మొదలగు ఆచారాలు అన్నీ సత్  సంప్రదాయాలే. వీటన్నింటి వెనకాల ఉన్నవి  విజ్ఞాన వీచికలే  .

తరతరాల ఋషులు ఎన్నో పరిశోధనలు తపస్సు లాగా చేసి నిగ్గు తేల్చిన సత్యం  భారతీయ సంస్కృతి .
భారత సనాతన ధర్మం ఇహానికి ,పరానికి సమ తుల్యత నిచ్చిన జీవన వేదం .

మన భారతీయ సంస్కృతి - సంప్రదాయాన్ని కాపాడండి .
ప్రకృతిని ,గోవులను , స్త్రీలను , ద్వి జులను రక్షించండి .
వేదాలను వినండి . ఉపనిషత్ లను అధ్యయనం చేయండి . భగవంతుడే స్వయంగా భోధించిన గీతా సారాన్ని దైనందిన జీవితంలో అన్వ యించు కొండి .
రామాయణ ,భారత ,భాగవతాలను మన పిల్లలకు నేర్పటం మరవకండి .

వ్యక్తిత్వ వికాసాన్ని (personality development ) అభివ్రుది చేసు కోండి . దాని తోనే ఆగకండి .
 శీలాన్ని( character building) నిర్మించు కోండి .
సత్యము ,శౌచము ,అహింస ,కరుణ ,శ్రద్ద ,సహనము ,క్షమ  ,సేవ ,ప్రేమ - ఈ లక్షణాలను చిన్నప్పటి నుండి పిల్లలకు నేర్పిద్దాం ,మన జాతిని పరి పుష్టం చేసుకొందాం .


No comments:

Post a Comment