Search This Blog

Saturday, 15 December 2012

ధ్యానం

ధ్యానం  ఎప్పుడు చేయాలి  ? ఇప్పుడేనా ? నువ్వు సిద్దమేనా ?
ఎందు కంటే ఒక సారి ధ్యానం లో సుస్థిర మైతే నువ్వు మిగలవు . సంఘం ఉండదు .
ఈ మాయా ప్రపంచం ఉండదు . బంధా లుండవు ,మమకారం , వ్యామోహం ఉండదు .
ద్వంద భావాలు ,అరిషడ్ వర్గాలు ఉండవు .
నువ్వు సంతోష మనుకోనే విష యాలు ఉండవు .
మాయా ప్రపంచం లో ఏ దైతే మనకు సుఖ సంతోషాలను ఇస్తాయో అవేమీ ఉండవు .
అలాగే దుఃఖాలూ  , భాదలూ  ఉండవు .
కానీ ,ధ్యానం లో ప్రాపంచిక సంతోషానికి భిన్న మైన ఆనందం ఉంటుంది . 
చాలా మంది ప్రశాం తత లేనప్పుడు ,దుఖం ఎక్కువై నప్పుడు , ఈ  ప్రపంచము  భాధా కరముగా మారినప్పుడు  శాంతి  సంతోష ము  కోసం ధ్యానం చేయాలని అనుకొంటారు . తాత్కాలిక వైరాగ్య భావన తో సన్యాసి గా మారి ఈ  ప్రపంచం నుండి  పలాయనం చేద్దా మను కొంటారు . ధ్యానం పలాయ నానికి ఒక మార్గమని అనుకోని  తర్వాత నిరాశ పడ తారు .

ధ్యానానికి ఒక అర్హత మనకు ఉండాలి . సత్యాన్వేషణ కు ఓపిక ఉండాలి . ఎందు  కంటే ధ్యానం అంటే  నిన్ను  నువ్వు కోల్పోయి శూ న్యం లో ఒక భాగ మై పోవటమే .
 తాత్కాలిక వైరాగ్యం  కాక నిజ మైన మానసిక చింతన , చిత్త వైరాగ్యం ఉండాలి . బుద్దికి వివేకం విచక్షణ ఉండాలి .

ఏకాగ్రత ,ధారణ లో మన మనస్సు పూర్తిగా ఒక విషయం పై మమేక మైనా అహంకారం మాత్రం పోదు . అనగా బంధం ఇంకా మిగిలే ఉంటుంది .రాగ ద్వేషాలు అలాగే ఉంటాయి .
మనం ఎన్నో పరీక్షలకు ఏకాగ్ర చిత్తం తో చదువుతాము .
అలాగే అవధానం చేసే వారు , వారికి పట్టు ఉన్న విషయాన్ని ధారణ చేస్తారు .
ఒక ఆట గాడు తన ఆట పై   ఏకాగ్ర చిత్తం తో ఉంటాడు . అక్కడ ఏదో సాధించాలన్న, గుర్తింపు పొందాలన్న తపన ఉంటూనే ఉంటుంది .

కానీ, ధ్యానం లో అహంకారం  ఇగిరి పోయి ,దృశ్యం ,ద్రష్ట  , దృక్కు అన్నీ ఒక్కటి గా పరివర్తనం చెందుతాయి .  గుర్తింపు పొందాలన్న తపన గానీ, ఏదో సాధించాలన్న కోరిక గానీ ఉండవు .
అందుకే ధ్యానమనేది ఎలాంటి గుణాలు లేని ,ఎలాంటి లక్షణాలు లేని  అవ్యక్తమూ ,నిత్య సత్యమూ ఐన విషయం పై నే సాధ్య పడుతుంది . పరిమితంగా ఉన్న మన ఎరుక అంటే  మన  అవగాహన , మనకు తెలిసిన  ఎల్లలు దాటి  పరి వ్యాప్తి చెందటమే ధ్యానం . ఎరుక వ్యాప్తి చెందింది అని అనే స్పృహ కోల్పోవడమే సమాధి .

ఏకాగ్రత ,ధారణ ,ధ్యానం -- ఒక్కటేనా  ?
ఇంద్రియాలను ,మనస్సు ని కేంద్రీకరించడ మే ఏకాగ్రత . దానిని ఎక్కువ సేపు అవిచ్చిన్నంగా చేయడ మే ధారణ .

ఏకాగ్రత ,ధారణ లో మన ఎరుక ఒకే విషయానికి పరిమితం అవుతుంది .
ఒక అమ్మాయి ప్రేమ కోసం నీ ధ్యాస ని పెడితే అది ధ్యానం అవ్వదు .
నీ వ్రుత్తి లో నువ్వు నిష్ణాతు గా మార టానికి నువ్వు పడే కష్టం ధారణ అవ్వుతుంది గానీ   ధ్యానం అవ్వదు .
ఒక కిటుకు ఏమిటంటే ,  ఏకాగ్రత ,ధారణ అనే దశ లు బాగా అభ్యసించి  దాటితే నే ధ్యానం సాధ్య పడుతుంది .

 ధ్యానం అంటే ఏమిటి ?
ఒక వస్తువు- అది బయట ప్రపంచం లొ నిదే దైనా కావచ్చు , లేదా అంతర్ ముఖంగా -
ఒక అనుభూతి ,ఆలొచన, ఒక ద్రుశ్యం , ఒక మంత్రం ,ఒక భావన ,ఒక స్పందన - ఏదైనా కావచ్చు , దానిపై మన మనస్సుని ,ఇంద్రియాలతొ సహా లగ్నం చేయటం .అలా చేస్తూ నిన్ను నువ్వు కోల్పోవడం . అహంకార మమకారాలు అన్నీ మాయమై ,అంతా  ఒక్కటే అనే భావన కలిగి ,ఆ తర్వాత విశ్వ జన భావం కూడ  పోయి శూన్య సమాధి కి చేరు కోవడం ధ్యానం లో ని దశలు .


 మనిషి ఎందుకు ధ్యానం చేయాలి ?
ఒక విషయాన్ని ,అది ఏదైనా సరే ,పరిశీలన ,పరిశోధన , చేసి నిజం రాబట్ట కలగాలి .
అంటే సత్యాన్ వేషణ కోసం ధ్యానం చేయాలి .సత్యమైన సచ్చిదా నందం అనేదొక టుంద నే విషయాన్ని తెలుసుకొని అనుభూతి చెందటం కోసం ఋషులు ఎన్నో విధాలుగా అన్వేషించి ,చివరకు ధ్యానం ఒక్కటే మార్గమని చెప్పారు .
అసలైన సత్యం అనుభూతి చెంది దానిని సుస్తిరమూ , శాశ్వతమూ  చేసు కొనే టందుకు  మనిషి ధ్యానం చేయాలి .
అసలైన ప్రపంచం ఏమిటో తెలియాలన్నా,  ఈ  సృష్టి కి నిజమైన అర్ధం తెలియాలన్నా , మన శరీరం ,మనస్సూ బాగా పని చేయాలన్నా , ఆందోళన , ఆత్రుత తగ్గి సృష్టి కి    సత్య మైన  అర్ధం తెలియాలన్నా ధ్యానం చేయాలి . కానీ ఒక షరతు .
ధ్యానం లో నిన్ను నువ్వు కోల్పో తావని భయ పడితే నీకు ధ్యానం వద్దు .
ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావని నీవు తలిస్తే  ఇపుడు నీకు ధ్యానం వద్దు .

ఇప్పుడు నేను చాలా సంతోషము గా ఉన్నాను . నాకు ధ్యానం చేయ వలసిన అవసరం లేదు ?
బయటి నుండి  వచ్చేది సంతోషం .దానికొక కారణం ,దానితో పాటు నీ అహం తృప్తి చెందటం ఇవ్వన్నీ ఉంటాయి .
అది ఒక జల పాతం వలె ఉత్తుంగ జలధి తరంగమై ఉంటుంది .కారణం పోయినా , నీ అహం అలవాటు పడి తృప్తి పడక  పోయినా సంతోషం ఆగిపోతుంది .
కానీ,ఆనందం బయట ఉన్న వస్తువుల నుమ్డి రాదు . నీ అహం తృప్తి చెందటం కూడా  ఉండదు .అది నీ లోపలి నుండి పెల్లుబికి వచ్చే ప్రశాంత సరోవరం .

నీ కున్న భయా లన్నింటినీ నువ్వు ఎలా అధి గ  మించాలి ?
వివేక వైరాగ్య అభ్యాసం తో భయాలను , కోరికలను , శరీర సుఖ లాలసతను , నియమితం చేసు కోవాలి .
ఈ  ప్రపంచం కాక , మరేదో నిజమైన  శాశ్వత మైన సత్య స్థితి ఉందని సుస్థిర మైన నమ్మకం ఉండాలి .

కానీ ,ఈ  అర్హతలు ఏమీ లేక పోయినా నిజమైన కుతూహలం నీ కుంటే ధ్యానాన్ని గురు ముఖంగా ఆరంభించు !

No comments:

Post a Comment