Search This Blog

Friday 31 January 2014

తెలుగు వాడంటే అలుసు . తెలుగు ప్రజల శాసన సభ అంటే బేఖాతర్ .

ఒక ఫెడరల్ ప్రభుత్వం,కొంత మంది ప్రజల ఆకాంక్షను గుర్తించి వారికి అనుగుణం గా  రాజ్యాంగ ము లోని 3 వ ఆర్టికల్ ఇచ్చిన అధికారం ద్వారా ,మెజారిటీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకం గా ,ఆ రాష్ట్ర  చట్ట సభ తీర్మానానికి వ్యతి  రేకం గా  రాష్ట్రాన్ని చీల్చడం అనేది చర్చించ వలసిన  చిక్కు ముడే .
జరిగింది ఏ మిటి ?
పా ర్లమెంటులో ప్రవేశపెట్టబోయే విభజన బిల్లులో, అసెంబ్లీకి పంపించిన బిల్లు కంటే, అదనంగా మూడు సప్లిమెంటరీ బిల్లులు, ఒక రహస్య బిల్లు ఉన్నాయి. వాటి గురించి గానీ లేక లక్ష్యాలు, ఆర్థిక విషయాలకు సంబంధించి శాసనసభ్యులు అడిగిన సమాచారాన్ని గానీ కేంద్రం ఇవ్వలేదు. 'ఆ సమాచారాన్ని మీకు ఇచ్చేది లేదు, మీకు పంపించిన బిల్లులో ఉన్న విషయాలను మాత్రం చర్చించి అభిప్రాయం చెప్పండి. అంతే' -ఇదీ స్థూలంగా కేంద్ర హోం శాఖ ద్వారా అసెంబ్లీకి అందిన హుకుం.
 అసలు ఒక అసెంబ్లీని ఆదేశించగల అధికారం కేంద్రానికి ఉందా? 
సమాచారాన్ని దాచిపెట్టి, అతి తక్కువ సమాచారం గల ముసాయిదా బిల్లుగా రాష్ట్ర అసెంబ్లీకి పంపించడం న్యాయసమ్మతమేనా?
పార్లమెంటుకు ఇవ్వబోయే విభజన బిల్లునే అసెంబ్లీకి ఎందుకివ్వరు ?
అంటే శాసన సభలో బిల్లు పై చర్చించడం కేంద్రానికి ఇష్టం లేదా ? 
కోర్టుతీర్పుల్లోనూ, రాజ్యాంగంలోనూ పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లు, ముందుగా అసెంబ్లీలో పెట్టే బిల్లు ఒకటికానవసరం లేదు అని చెప్పలేదు. రెండు బిల్లులకి సారూప్యం లేనప్పుడు రాష్ట్రపతి 'నేను ఈ బిల్లుని ఫలానా రాష్ట్ర అసెంబ్లీకి పంపించాను, వారి అభిప్రాయం ఇది' అని పార్లమెంటుకి ఎలా తెలుపగలరు? ఎందుకంటే పార్లమెంటులో వుండబోయే బిల్లులో ఇప్పుడు అసెంబ్లీకి పంపించిన బిల్లులో లేని భాగాలు చాలా వున్నాయి అని సాక్షాత్తు కేంద్రం హోంశాఖ కార్యదర్శి ద్వారా చెప్తుంటే ఇక ఈ బిల్లుకి సార్థకత ఏమిటి? ఏ రాష్ట్రమైతే విడిపోతోందో ఆ రాష్ట్రానికి ముందుగా అసెంబ్లీ అభిప్రాయం కోసం విభజన బిల్లు పంపించాలి అని రాజ్యాంగంలో స్పష్టంగా వుంది.
బిల్లుని పార్లమెంట్ లో పెట్టే ముందు ,ఆ బిల్లులో మార్పులు చేసినా కూడా తిరిగి అసెంబ్లీకి పంపనవసరం లేదు అని అధికరణ 3లో చెప్పినప్పుడు తమ అభిప్రాయం చెప్పే ముందు పూర్తి వివరాలతో కూడిన బిల్లు కావాలి అని అసెంబ్లీ అడగడం తప్పు ఎలా అవుతుంది? 
రెండంచెల వ్యవస్థ ఉన్నప్పుడు పార్లమెంటుకు ఎంత సార్వభౌమత్వం ఉన్నదో, రాష్ట్రాలకూ రాష్ట్ర స్థాయిలో అంత సార్వభౌమత్వం వుండాలి కదా? ప్రజలకు, రాష్ట్రానికి సంబంధించిన విభజన విషయాలు చర్చించేటప్పుడు పార్లమెంటు సభ్యులకు తెలుపగలిగే విషయాలు, అదే వియాన్ని చర్చించేటప్పుడు అసెంబ్లీ సభ్యులకు తెలియకూడదు/తెలియజేయనవసరం లేదు అని కేంద్రం నిర్ణయించడం, అసెంబ్లీని, దాన్ని ఎన్నుకొన్న ప్రజలని కించపరచడమే అవుతుంది. విభజన బిల్లు చర్చించే క్రమంలో అసెంబ్లీకి తగిన వివరాలు అందించే విషయంలో కేంద్ర హోం శాఖ అనుసరిస్తున్న వైఖరి ఖచ్చితంగా రాజ్యాంగపరంగా అసెంబ్లీకి ఆపాదించిన అధికారాలను ప్రశ్నించే విధంగా వుంది. ఇది అరాచకం . దేశ సమగ్రతకు ప్రమాదం . 

No comments:

Post a Comment