Search This Blog

Monday 4 April 2016

చంద్ర బాబు చేతులను ఎందుకు బల పరచాలి


  • పరిపాలన చేపట్టిన మూడు నెలల్లోనే కరెంటు సరఫరాను గాడిలో పెట్టినందుకు,
  • మన రాష్ట్రం కరెంట్ ఉత్పత్తి లో ,లైన్ నష్టాల నివారణలో , పునరుత్పత్తి  ఇంధన వనరుల వినియోగం లో దేశం లోనే ముందుకి  .. అదీ 2 ఏళ్లలో సాధ్యం చేసి నందుకు ,… 
  • హుదుద్ కు అల్లకల్లోలమైన విశాఖను ఒక్క నెల రోజుల్లోనే మళ్ళీ సాధారణ స్థితికి తీసుకు రావడమే కాదు , పారిశ్రామిక -వినోద -సాంకేతిక -ఆర్ధిక కేంద్రం గా వైజాగ్ ని వేగం గా మలుస్తున్నందుకు ... …
  •  నూతన రాజధాని కోసం చేపట్టిన ప్రణాళికలు… పెట్టుబడుల కోసం గతం లో ఏ ముఖ్య మంత్రీ గానీ .. ప్రధాన మంత్రి గానీ చేయని భగీరధ ప్రయత్నాలు చేయడమే కాక ,ఆచరణలో అత్యంత వేగ వంత  మైన రీతిలో ఫలితాలను కూడా రాబడు  తున్నందుకు ,  
  • నదీ జలాల అనుసంధానంలో భాగంగా పోలవరం పూర్తయ్యే లోపు  ఒక్క ఏడాదిలో, పట్టిసీమ  ప్రాజెక్ట్ ద్వారా ఎత్తిపోతల ప్రాజెక్ట్ ను పూర్తి చేసినందుకు .... 

  • వేల కోట్ల ఇసుక మాఫియాని ఒక్క కలం పోటుతో  దిమ్మ తిరిగే దెబ్బ కొట్టి నందుకు ... 
  • వేల  కోట్ల ఎర్ర చందనం  మాఫియాని ఇనప బూట్లతో అణచి వేస్తున్నందుకు .... 

  • దేశం లోనే మొట్ట మొదటి సారిగా ఓ చిన్న రాష్ట్రం అదీ లక్ష కోట్లు విలువ చేసే రాజధాని ఆస్థులను ,మరో  పది లక్షల కోట్లు విలువ చేసే రాజధాని మౌలిక సదుపాయాలను కోల్పోయి... అంతే కాదు 20 వేల కోట్ల  వార్షిక రెవెన్యూ లోటు  తో విల విల్లాడుతూ కూడా ....   5 లక్షల కోట్ల పెట్టు బళ్ళను  ఆకర్షింప చేసినందుకు ...  

  • చరిత్రలో కనీ వినీ ఎరగని రీతిలో ఆరుగాలం సాగుచేసుకొనే రైతన్నలకు ఋణ ఉపశమన పధకాన్ని .. ఎంత నెమ్మది గా నైనా  చిత్త శుద్ధి తో అమలు  చేస్తున్నందుకు ... 
  • అనవసర మైన ఖర్చులతో ,ఎడా  పెడా ఎరువులు -పురుగు మందులు చిమ్ముతూ వళ్ళు  ఇళ్ళే కాదు ... భూమిని కూడా గుల్ల చేసు కొంటున్న అమాయక రైతన్నలకు కనీస పెట్టుబడితో చేసే  పాలేకర్  ప్రక్రుతి వ్యవసాయ విధానంలో శిక్షణ ఇస్తున్నందుకు ... 
  • ప్రభుత్వ ఖజానా నుండి ఒక్క చిల్లి గవ్వ ఖర్చు పెట్టకుండా , దేశం లోనే తొలిసారి వేలాది ఎకరాల భూమిని స్వచ్చందం గా సమీకరింప చేసి ఒక బృహత్తర రాజధాని నిర్మాణం లో  ప్రజలకు భాగ స్వామ్యం కల్పించి కేవలం 2 ఏళ్లలో సెక్రటేరియట్ ,శాసన సభలను నిర్మించడమే కాదు ... అద్భుత రాజధాని  నిర్మాణ  పధకాలను( core capital master plan and integrated capital master plan and CRDA zonal master plan) కూడా కేవలం 2 ఏళ్లలో కాగితాలనుం డి కల సాకార మయ్యే దిశగా పరుగులు పెట్టిస్తున్నందుకు ... 
  • డిజిటల్ విప్లవం  లో  ఆంధ్ర రాష్ట్రం  ను ముందజ  వేయిస్తున్నందుకు ... ఫైబర్ నెట్ గ్రిడ్ , ఈ - ప్రగతి లాంటి సాంకేతిక సౌకర్యాలతో పల్లెల్లో కూడా సమాచార  విప్లవం తో సంపదని ఎలా పెంచు కోవచ్చో చేసి చూపిస్తున్నందుకు ... 

No comments:

Post a Comment