Search This Blog

Thursday, 26 November 2015

అతి సహన భారతం


మేధావులు ,కళాకారులు ,సూపర్ స్టార్ లు , ముఖ్యం గా కాంగ్రెస్ గడ్డి తినే కుహనా సెక్యులర్ లు ,  అసహనం .... అసహనం అంటూ ప్రపంచ మీడియాకి కావలసి నంత మేత ఇస్తున్నారు . make in india' అని ఎప్పుడైతే మన ప్రభుత్వం ప్రకటన చేసి ,మన ప్రధాని విదేశా లలో పర్యటనలు మొదలు పెట్టారో ... అప్పటి నుండి ,భారత దేశాన్ని ముఖ్యం గా ప్రభుత్వాన్ని పలుచన చేసి ఎలా గైనా సరే , విదేశీ పెట్టుబళ్ళు  రాకుండా అడ్డుకో వాలనే దురుద్దేశ్యం తో  పధకం ప్రకారం సాగిస్తున్న బురద జల్లుడు కార్యక్రమం చూస్తున్న వారికి అసలు విషయం అర్ధం అయ్యే ఉంటుంది .
 అసహనం అంటే  అర్ధం  ఈ కుహనా సెక్యులర్ లకు  తెలియదని అనిపిస్తుంది . 
1) ముంబైలో బాంబు దాడులు జరిగి అమాయకులు చనిపోతే మీకు భయం వేయలేదా?
2) తాజ్ హోటల్ పై దాడి జరిగినప్పుడు భయం వేయలేదా?
3) కాశీలో సంకటమోచన హనుమాన్ దేవాలయంపై దాడిచేసి అమాయక భక్తులను చంపినప్పుడు భయం వేయలేదా?
4) కాశీలో ఘాట్లపై బాంబులు పేలినప్పుడు భయం వేయలేదా?
5)పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు భయం వేయలేదా?
6) అక్షరధాంపై దాడి జరిగినప్పుడు భయం వేయలేదా?
7) గయలో బుద్దుడి ఆలయంపై దాడి జరిగినప్పయడు భయం వేయలేదా?
8) లుంబినిపార్కుపై దాడి జరిగినప్పుడు భయం వేయలేదా?
9)కాశ్మీర పండితులపై దాడులు, వారి స్త్రీలపై అత్యాచారాలు జరిగినప్పుడు భయం వేయలేదా?
10) సిక్కుల ఊచకోత జరిగినప్పుడు భయం వేయలేదా?
11) గోధ్రాలో రైలుబోగీని భక్తులతోపాటు తగలబెడితే భయం వేయలేదా?
11) గోకులచాట్ పై దాడి జరిగినప్పుడు భయం వేయలేదా?
12) పది నిమిషాలు టైమిస్తే ఈ దేశంలో హిందువుల అంతుచూస్తామని ఒకడు అన్నప్పుడు భయం వేయలేదా?
13) గోవధకు వ్యతిరేకంగా పోరాడుతున్న 'ప్రశాంత్ పూజారి'ని చంపినప్పుడు భయం వేయలేదా?
14) అమ్మాయిలను అల్లరి పెడుతున్న ముస్లిం కుర్రాడిని అడ్డుకున్నందుకు పూజారి మిశ్రాను పీకకోసి చంపినప్పుడు భయం వేయలేదా?
15) మసీదు ఎదురుగా హారన్ కొట్టినందుకు 'సంజయ్' అనే డ్రైవర్ను చంపినందుకు భయం వేయలేదా?
దయ చేసి విదేశీ కను సన్నలలో బతికే మన  మీడియా   కుట్రలో భాగ స్వాములుగా మారకండి . 
ఈ దేశప్రజలకు అసహనం ఉంటే మీ లాంటి వారికి అవార్డ్ లు ,మెడల్స్ ఇచ్చే వారా ?
ఈ దేశప్రజలకు అసహనం ఉంటే మీరు సూపర్ స్టార్లు అయ్యే వారా ? 
ఇన్ని మాటలేల .... ఈ దేశప్రజలకు నిజమైన నిఖార్సైన అసహనం ఉంటే  దేశం ఎప్పుడో బాగు పడేది గదా !

Monday, 21 September 2015

ఆంధ్రా నదుల అనుసంధానం

ఆంధ్రా లో ఎన్ని నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయి ?
40.
ఈ నదీ పరివాహక ప్రాంతాల వలన ఆంధ్రాకి  నీటి లభ్యత ఎంత ఉంటుంది ? పూర్వం సమైఖ్య రాష్ట్రం లో 2800 టి.ఎం.సి.లు . కానీ ఇప్పుడు ఆంధ్రాకి కేవలం 1700 టి.ఎం.సి.ల నీరు అందుబాటులో ఉంది.
కృష్ణా నది నీటిలో ఆంధ్రా వాటా ఎంత ? కృష్ణా నదిలో 800 టి. ఎం.సి.ల నీరు లభ్యమవుతుంటే, ఆంధ్రప్రదేశ్‌కు 520 టి.ఎం.సి.లు, మిగతానీరు తెలంగాణాకు కేటాయించారు. 
గోదావరి  నది నీటిలో ఆంధ్రా వాటా ఎంత ? 650  టి.ఎం.సి.లు . మొత్తం 1480 టి.ఎం.సి.ల గోదావరి  నీరు లభ్యమవుతుంటే, బచావత్‌ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు అందులో 650 టి.ఎం.సి.లు కేటాయించారు, మిగతాది తెలంగాణా రాష్ట్రం పొందింది. 
ఈ మూడు నదుల నుండి వచ్చే మన  వాటా నీటిని నిల్వ చేసు కోవడానికి ఎంత సామర్ధ్యం గల జలాశయాలు ఉన్నాయి ? 
  • పెన్నా నదిలో 100 టి.ఎం.సి.ల నీరు ఉంటే ,  200 టి.ఎం.సి.ల నీటిని నిల్వ చేసే  రిజర్వాయర్లు నిర్మాణం జరిగింది.
  • కృష్ణానది కేటాయింపు 800 టి.ఎం.సి.లు ఉంటే, 800 టి.ఎం.సి.ల నీటిని నిల్వచేసే సామర్ధ్యం కలిగిన రిజర్వాయర్లు ఉన్నాయి.
  • కానీ గోదావరి నీటిని నిల్వచేసేందుకు ఉన్న ఒకే ఒక రిజర్వాయర్‌ శ్రీరామ్‌సాగర్‌ సామర్ధ్యం 100టి.ఎం.సి.లు మాత్రమే. ఇప్పుడు ఆ జలాశయం కూడా తెలంగాణా రాష్ట్ర పరిధిలో ఉండడంతో, ఆంధ్ర ప్రదేశ్‌లో గోదావరి నీటిని నిల్వచేసే ఒక్క జలాశయం కూడాలేదు. 
నదుల అనుసంధానం మన రాష్ట్రం లో తొలిగా ఎక్కడ జరిగింది ? 1868లో   కె.సి.కెనాల్‌ ద్వారా కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం జరిగింది. 

పోలవరం డాం ఎలా ఉపయోగ పడుతుంది ? 
పోలవరం ఎడమ కాల్వద్వారా విశాఖపట్నానికి 1.5 లక్షల ఎకరాల నీరు,
ఏలేరుకాల్వ ద్వా రా మరో లక్ష ఎకరాలకు నీరు , 
1000MW  విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది . 

ఉత్తరాంధ్ర ప్రాంతంలో మొత్తం 23 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, ప్రస్తుతం 10 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది, ఇంకా 13 లక్షల ఎకరాలకు నీరందాల్సివుంది. దీనికి ప్రభుత్వం ఏం చేయాలి ? 
ఇందు కోసం నదుల అనుసంధానం, గోదావరి నీటి సమగ్ర వినియోగం అత్యంత అవసరం . 

ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఉన్న నదులు -వంశధార ,నాగావళి ,బాహుదా ,మహేంద్ర తనయ ,చంపావతి ,గోస్తనీ నదులను ఎలా అనుసంధానం చేయాలి ? 
  • పోలవరం ఎడమ కాల్వ నుండి , "ఉత్తరాంధ్ర సుజల స్రవంతి" అనే ఎత్తి పోతల ప్రాజెక్ట్ నిర్మాణం మరియు గడిగెడ్డ రిజర్వాయర్‌, తాటిపూడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ ద్వారా 20 టి.ఎం.సి.ల నీటిని నిల్వచేసి 8 లక్షల ఎకరాలకు నీరు  అందించ వచ్చు . 
  • జంఝావతి ప్రాజెక్ట్‌ వలన ఉపయోగం ఏమిటి ? ఒరిస్సాతో  ఒప్పందం కుదిరితే ,జంఝావతి ప్రాజెక్ట్‌  నిర్మించి తాటిపూడి ని అనుసంధానం చేయడం ద్వారా 4 టి.ఎం.సి.ల నీరు ,ఇంకా అదనం గా పారే 20 టి.ఎం.సి.ల నీటిని  చంపావతి, గోస్తనీ నదీ పరివాహక ప్రాంతానికి కానీ మళ్లిస్తే, తాటిపూడి ద్వారా విశాఖకు కూడా నీళ్లు అందించవచ్చు. 
  • వంశధారనాగావళి నదులను అనుసంధానం చేయా లంటే ఏం చేయాలి ? గొట్టా బ్యారేజ్‌  ఇప్పటికే రెడీ గా ఉంది . కాబట్టి హిరమండలం జలాశయం నిర్మించి , దీనిని , నాగావళి పై ఉన్న  నారాయణపురం ఆనకట్టకు అనుసంధానం చేస్తే, అదనపు నీరు లభ్యం అవుతుంది.
  • మహేంద్ర తనయ, బాహుదా నదుల  అనుసంధానం ఎలా జరపాలి ?   పారాపురం జలాశయాన్ని కుడి, ఎడమల దిశగా అనుసంధానం చేస్తే, రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇచ్ఛాపురం వరకూ నీరంది, అక్కడ నుంచి మహేంద్ర తనయ, బాహుదా నదుల మరో అనుసంధానం కూడా చేపట్టే అవకాశం ఉంది. 
  •  వంశధార ప్రాజెక్ట్‌ ఎలా పని చేస్తుంది ? దీని  కింద 52.5 టి.ఎం.సి.ల నీటిని వినియోగించేందుకు ఒప్పందం ఉంది. వంశధార స్టేజ్‌ వన్‌, టూ ద్వారా ఇప్పటివరకూ 35 టి.ఎం.సిలు మాత్రమే వినియోగిస్తున్నారు. మిగిలిన 17.5 టి.ఎం.సి.ల నీటిని వాడుకోవాలంటే, వంశధార స్టేజ్‌ త్రీ ద్వారా పారాపురం ద్వారా ఇచ్ఛాపురం, పాలకొండలకు నీటిని అందించవచ్చు.  

ఇవన్నీ సాకార మైన నాడు  ఉత్తరాంధ్ర జిల్లాల్లో 12 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి వినియోగంలోనికి తీసుకొనిరావచ్చు . 



ఈ బ్లాగ్ ని ఫాలో అయ్యే మిత్రులు ఈ విషయాలను మీకు అందుబాటులో ఉన్న మంత్రులకు సవివరమైన మెమొరాండం ద్వారా అందించి ,ప్రభుత్వాన్ని కదిలించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ -
డా . శ్రీని వాస రాజు . 

Monday, 14 September 2015

ప్రక్రుతి సేద్యం

తులసిలోని ఎపిజెనిన్‌, టాక్సోల్‌, యూరోసోలిక్‌ యాసిడ్‌లకు కేన్సర్‌ నిరోధక గుణాలు ఉన్నాయని, సిట్రాల్‌కు యాంటీ సెప్టిక్‌ గుణం ఉంటే, యూగనాల్‌కు ఇన్ఫెక్షన్లను నిరోధించే గుణం ఉందని శాస్త్రజ్ఞులు నిరూపించారు . 

రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలకు ఏటా ఎకరాకు రూ.15 నుంచి 20 వేలు ఖర్చు చేసినా దిగుబడి రాక నష్టాలు వస్తున్నాయి.  కాని ,సుభాష్ పాలేకర్ ప్రక్రుతి సేద్య పద్దతులతో  ఎకరాకు పెట్టుబడి రూ.4వేలు మాత్రమే అవుతోంది. 
విత్తనాలు, ఆవుపేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి కొనుగోలు చేసేందుకు, కూలీలు, సేద్యపు ఖర్చులకు ఈ మొత్తం ఖర్చవుతుంది. 
ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల పెట్టుబడిలోనే ఎకరాకు రూ. 10వేలకు పైగా ఆదా అవుతోంది . 

Monday, 24 August 2015

ఆంధ్రా ఆలోచన


  • ఋణాల పై  90%గ్రాంట్ .... 
  • లోటు బడ్జెట్ ని పూడ్చడానికి ,  ప్రతి ఏ టా సాయం పొందడం .... 
  • పరిశ్రమలకు పన్ను రాయితీలు ... 
  • వీటన్నింటితో పాటు ప్రత్యేక హోదా !
1. ప్రపంచ బాంక్ తదితర విదేశీ బాంకులు , సంస్థలు మంజూరు చేసిన రుణాలకు రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వ వలసి ఉంటుంది . ఇలా మన రాష్ట్ర ము తెచ్చు కొనే రుణాల పై కేంద్ర ము  90% గ్రాంట్ అంటే ,ఉచితం గా ఇవ్వాలని ఆంద్ర ప్రభుత్వం కోరబోతుం ది . ఇలా విదేశీ రుణ ప్రాజెక్టుల్లో అధిక భాగం గ్రాంటుగా వచ్చేలా చూసుకోగలిగితే అది రాషా్ట్రనికి మేలు చేకూరుస్తుంది . 

2.  తక్షణ సాయంగా (అప్పుగా కాదు ) రూ.25 వేల కోట్లు కేంద్రం నుంచి తెచ్చుకోవాలని ,దానితో  రాష్ట్రంలో పెద్దఎత్తున మౌలిక వసతులు చేపట్టవచ్చని, తద్వారా పరిశ్రమలను ఆకర్షించడం వీలవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన . ఇదే విధం గా  మరికొన్ని నిధులు ఏడాదికి కొంత చొప్పున మిగిలిన సంవత్సరాల్లో  రాబట్టు కో వచ్చని , వాటితో అభివృద్ధిపరంగా ముందడుగు వేయవచ్చని  ఓ ఆలోచన . 
ఒక నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్యాకేజీని ప్రకటించాలని కేంద్రాన్ని కోరనుంది. 

3. పారిశ్రామిక రాయితీల ద్వారా  ఏపీలో కొత్తగా పరిశ్రమలు పెట్టే వారికి 15 శాతం అదనపు మూలధన రాయితీ, 15 శాతం అదనపు తరుగుదల రాయితీ  వస్తాయి . 

అంతే కాదు , ఇలా ప్రత్యేక ప్యాకేజీతోపాటు ప్రత్యేక హోదా కూడా సాధించాలనే పట్టుదలతో నవ్యాంధ్ర ఉన్నట్లు తెలుస్తోంది. 

Thursday, 20 August 2015

ఊరంతా ఒక దారి -ఉలిపికట్టదొక దారి

2013-భూసేకరణ చట్టం ప్రకారం ,ఏదైనా ప్రజోప యోగ కరమైన ప్రాజెక్ట్ ల కోసం భూమిని తీసుకోవాలీ అనుకుంటే , ఆయా భూ యజమానులలో 80శాతం మందిని ఒప్పించి  మాత్రమె తీసుకోవాలి .
అమరావతి  ఆంధ్రుల రాజధాని గా చట్ట సభలో తీర్మానం చేయడ మైనది . 
దీని నిర్మాణానికి  ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిఫలం  నచ్చి , భూమిని "సేకరణ"రూపం లో కాకుండా భూ సమీకరణ ప్రాతిపదికన  ఇప్పటికే 98శాతం మంది భూ యజమానులు తమ భూములను  స్వచ్చందం గా ప్రభుత్వానికి స్వాధీనం చేశారు . ఆ విధం గా వారు కూడా చారిత్రాత్మక బృహత్తర రాజ ధాని నిర్మాణం లో భాగ స్వామ్యులు అయ్యారు .
కానీ , కేవలం 2శాతం మంది మాత్రమే ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరే కించి రాజధాని నిర్మాణం అనుకొన్న రీతిలో జరగా కుండా అడ్డు పడుతూ , 5కోట్ల మంది ఆంధ్రుల ఆశలే కాకుండా , భూములిచ్చి రాజధానిలో భాగ స్వామ్యులైన 98శాతం మంది రైతుల ఆశలను కూడా  వమ్ము చేయడానికి రక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు .
కొంతమంది మేధావులు ,దయార్ద్ర హృదయులు ఆ 2శాతం వారికి ఎలాంటి కష్టం కలగ కుండా చూడ మంటున్నారు . అదెలా సాధ్యమో కూడా వారు వివరిస్తే రాజధాని నిర్మాణానికి వారి వంతు పాత్ర  పోషించి నట్లు అవుతుంది .
ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆర్డి నెన్స్ ప్రకారం చూసినా ,  2013-భూసేకరణ చట్టం ప్రకారం పరి శీలిమ్చినా భూసేకరణ చట్ట ప్రయోగం న్యాయమే !

Tuesday, 18 August 2015

పట్టిసీమ, రాయల సీమ ను భాగ్య సీమ గా మారుస్తుం దా ?

10 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టిన చంద్ర బాబు మనస్సులో  సమస్య  ల సుడి గాలి . 

  • కోస్తా వారికి ,రాయల సీమకి సమ న్యాయం ఎలా ఏ విధం గా చేయాలి ?
  •  అలాగే సీమ భూముల్లో బంగారం పండించి సీమ బతుకుల్లో ఎలా నవ్వులు పూయించాలి ?
  •  వృధాగా పోతున్న గోదావరి జలాలను రాష్ట్ర సర్వతో ముఖాభి వృద్ధికి ఎలా వినియోగించాలి ?
  •  ప్రభుత్వ ధనం  ఖర్చు పెట్ట కుండా కొత్త రాజధాని ని ఎలా నిర్మించాలి ? 
  • వ్యవసాయం దండుగ గా మారి కునారిల్లుతున్న రైతు బతుకులో పండుగ ఎలా తీసుకు రావాలి ? 

వెంటనే నిపుణుల సమావేశం ఏర్పాటు ఐయింది .
రాష్ట్రం లోని మేధావులు ,ఇతర దేశాల నిపుణులు  అభి ప్రాయాలు , రాజకీయ కార్య కర్తల సలహాలు వీటన్నింటినీ క్రోడీకరించు కొని తీసుకొన్న నిర్ణయాలే అమరావతి నగరం ,పట్టిసీమ ప్రాజెక్ట్ , రైతు ఋణ మాఫీ ...

కారు చీకటిలో కాంతి రేఖ - ఇరిగేషన్ కార్య దర్శి సమయానికి గుర్తు చేసిన విషయం -
బచావత్  ట్రిబ్యునల్  సూచన తో మూ డు రాష్ట్రాలు- మహారాష్ట్ర ,మధ్య ప్రదేశ్ ,ఆంద్ర ప్రదేశ్  ల మధ్య  జరిగిన  ఒప్పందం ప్రకారం, గోదావరి నది లోని మిగులు జలాలలో 80 TMC ల నీటిని   కృష్ణా నదికి మళ్లిం చు కోవచ్చు .

ఇంతలోనే నిర్వేదం - దానికి కారణం పోలవరం కాలవలో నీరు పారదు .
పోలవరం ఆంధ్రాకి వరం . దురదృష్ట వశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వారి ట్రేడ్ మార్క్ అవినీతికి ఆలవాలం గా ముందు 'డాం ' కట్ట కుండా కాలవలు తవ్వడానికి ఉత్సాహం చూపించారు . ఎందుకంటే మట్టిపనుల్లో  లాభాలు ఎక్కువ .
అలా పోలవరం కుడికాలువ 80% పూర్తయ్యింది . కాని డాం లేదు . కాలవలో నీరు పారదు .

కొంతమంది నిరుత్సాహం -
 18000 కోట్లు ఖర్చు పెడితే గానీ , 150 అడుగుల పోలవరం డాం పూర్తవ్వదు . అంత  డబ్బు కేంద్రం నుండి వచ్చి పోలవరం ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి ఎంత కాలం పడుతుందో తెలియదు . ఈ లోపల  నా నాటికీ ఎడారిగా మారి పోతున్న  రాయలసీమ వాసుల కష్టాలు ఎప్పటికి గట్టేక్కెనో ?
మేధోమధనం సాగుతుంది  - 
3000 TMC ల గోదావరి నీరు వృధాగా సముద్రం లోకి పోతుంది .దానిని సద్వినియోగం చేసుకోవాలీ అంటే గోదావరి -కృష్ణ ల అనుసంధానం జరగాలి . ఇలా చేస్తే గోదావరి డెల్టా కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో ?
రాయలసేమ జిల్లాలకు సాగు ,తాగు నీ టి అవసరా లు తీరాలంటే ఏం చేయాలి ?శ్రీశైలం నుండి కిందకు అంటే నాగార్జున సాగర్  కి కృష్ణా డెల్టా అవసరాలకు వదిలే నీటిలో సింహ భాగాన్ని ఒక రెగ్యు లేటర్ ద్వారా  రాయలసేమ జిల్లాలకు పంపాలి. అలాచేస్తే  కృష్ణా డెల్టా  ఇబ్బంది పడుతుంది . మరి  కృష్ణా డెల్టా రైతుల  అవసరా లు తీరే మార్గం ఏమన్నా ఉందా ?
పరిష్కారం  - 
నిజానికి 2006 లో ఇరిగేషన్ నిపుణులు సూచించిన ప్రకారం 80 TMC ల గోదావరి నీటిని ఒక క్రమ పద్దతిలో నెలకు ఇన్ని TMC ల చొప్పున వదులుతూ కాలవ ల ద్వారా కృష్ణా నదికి పంపితే ఆ నీటితో కృష్ణా డెల్టా అవసరా లు తీరతాయి . అంటే గోదావరి -కృష్ణా నదుల అనుసంధానం .
సరే బాగానే ఉంది . గోదావరి జిల్లాలకు లోటు రాకుండా గోదావరి నీటిని ఎలా ,ఎక్కడ నుండి  
మళ్లిం చాలి ?
 అందుకు అనువైన చోటు, కట్ట బోయే  పోలవరం డాం  కి దిగువన ఉన్న పట్టిసీమ . అక్కడ గోదావరి నీటి మట్టం  15 మీటర్ల కన్నా ఎక్కువ ఉండి, వరద లాగా వృధా అవుతున్న ప్పుడు మాత్రమే నీటిని,  ఇప్పటికే 80% పూర్తయిన పోలవరం కాలవ లోకి పంపు చేసి ప్రకాశం బారేజి రిజర్వాయర్  కి మళ్లిం చాలి .
అలా పంప్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ? 
1400 కోట్లు .
అంటే 1400 కోట్లతో పోలవరం డాం కడితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం 
ఇప్పుడే ,ఇంత తక్కువ ఖర్చు తో  వస్తుందా ?
 గోదావరి డెల్టా  ఆయకట్టు స్థిరీకరణ , కొత్తగా 7లక్షల ఎకరాలకు సాగు నీరు , విశాఖ కి త్రాగు నీరు , కృష్ణా నదికి 80 TMC  ల నీటి మళ్లిం పు ,1000 విద్యుత్ ఉత్పత్తి -ఇవీ పోలవరం ప్రాజెక్ట్  వలన ఒన గూడే లాభాలు .
ఇందులో అత్యంత ముఖ్యమైనది కృష్ణా నదికి 80 TMC  ల నీటి మళ్లిం పు ద్వారా నదుల అనుసంధానం,
 తద్వారా కృష్ణ డెల్టా  ఆయకట్టు స్థిరీకరణ మరియు రాయలసేమ జిల్లాలకు సాగు ,తాగు నీటి లభ్యత . దీనికి గోదావరి వరద నీటిని మాత్రమె వాడుకొనే పట్టిసీమ ఎత్తిపోతల పధకం సరిపోతుంది .
మరి ,గోదావరి జిల్లాల రైతులు ఎందుకు భయ పడుతున్నారు ? 
వారు ఏ మాత్రం భయ పడ నక్కర లేదు . ఖరీఫ్   లో  గోదావరి డెల్టా కి 150 TMC ల నీరు అవసరం ఉంది .
ఖరీఫ్ 5 నెలల్లో ధవ ళే శ్వరమ్  ఆనకట్ట దగ్గర నీటి లభ్యత సుమారు 700 TMC లు  అని వెంకట రావ్ కమిటీ చెప్పింది .
గ త 50 ఏళ్ల రికార్డ్గ లు పరిశీలిస్తే   40 ఏళ్ళు  గోదావరికి వరదలు వచ్చినట్లుగా తేలింది .
ఖరీఫ్ 150 రోజుల్లో  సుమారు  125 రోజులు, రోజుకి 50000 క్యూసెక్ ల చొప్పున సరాసరి ఏటా 3000 TMC ల వరద నీరు వృధాగా సముద్రం లోకి పోతున్నట్లు లెక్కలు చూపిస్తున్నాయి .  అంటే ,ఖరీఫ్ కాలం లో గోదావరి జిల్లాల    డెల్టా కి అవసరమైన దాని కంటే 20రెట్లు లభ్య మవుతుండగా ,రబీ కాలం లో మాత్రం అవసర మైన దాని కంటే 30 TMC ల నీరు తక్కువ లభ్య మవు తుంది . రబీ కాలం లో నీటిని వినియోగించు కోవడానికి వీలుగా గోదావరి నీటిని నిల్వ చేసుకోవడానికి  పోలవరం జలాశయం పనికి వస్తుంది .    ధవ ళే శ్వరమ్    ఆనకట్ట నుండి నీరు వరద రూపం లో బయటకు వచ్చిన ప్పుడు మాత్రమే పట్టిసీమ  ఎత్తిపోతల   టర్బైన్ లు పనిచేయడం మొదలెడ తాయి . కాబట్టి , గోదావరి జిల్లాల రైతులు  ఏ మాత్రం భయ పడ నక్కర లేదు .
సరే   ఇంతవరకు బాగానే ఉంది .  పోలవరం ప్రాజెక్ట్ 10 ఏళ్లలో పూర్తయ్యి నప్పుడు ,పట్టి సీమ ప్రాజెక్ట్ పై పెట్టిన 1400 కోట్లు వ్రుధా యే గదా ? 
సమ న్యాయం అనేది రాజ్యాంగ హక్కు . అదీ  గాక , ఇప్పటికే రాయలసీమ లో సాగు చతికిల పడి పోయింది . ఇంకా 10 ఏళ్ళు ఆలస్యం చేస్తే ప్రాంతీయ అసమానతలు పెరిగిపోయి మళ్ళీ రాష్ట్రం ముక్క చెక్క లవుతుమ్ది .

 దుర్మార్గపు రాజకీయం చేస్తున్న కొందరు చెబుతున్నట్లు ,పట్టిసీమ పధకం ముడుపుల కోసం కానే కాదు .
కృష్ణ -గుంటూరు ఆయకట్టు లో సకాలం లో నాట్లు వేసి నేల నాలుగు చెరగులా పచ్చని వరి ,అపరాల పంటలతో  ఏటా కోట్లాది రూపాయల విలువైన పాడి పంటలు , రాయలసీమ మెట్ట కి కనీసం నాలుగు తడులిచ్చి ఏపుగా పెరిగే శనగ ,జొన్న పంటలు, సీమ వాసుల దప్పిక తీర్చే కలుషితం కాని జలాలు- వీట న్నిం టికి విలువ కడితే పట్టిసీమ కి ఖర్చు పెట్టే 1400 కోట్లు ఏపాటి ?
జల యజ్ఞం పేరిట లక్షలాది కోట్ల ప్రజా ధనాన్ని నీరు చుక్క పారని కాలవ లు ,మట్టి పనులు ,మొబిలైజేషన్ ముడుపులు పేరిట యదేచ్చగా దొంగల దోపిడీ చేసినప్పుడు ఎవ్వరూ అరచి గోల చేయ లేదేం ?


 ముఖ్యమైన విషయాలు  మరో రెండు ఉన్నాయి :
1. పట్టిసీమ ప్రాజెక్ట్ వలన లభ్య మయ్యే  నీటితో, నాగార్జున సాగర్ నీటి పై ఆధార పడ నక్కర లేకుండా    కృష్ణా డెల్టా కి సరైన సమయం లో నాట్లు పడే అవకాశం ఉంది . శ్రీశైలం నీటిని పోతి రెడ్డి పాడు రెగ్యు లేటర్ ద్వారా నియమిత విధానం లో వదులు కొంటూ ,హంద్రినీవా కాలువల ద్వారా  రాయలసీమ నాలుగు జిల్లాలకు సాగునీరు ,త్రాగు నీరు అందించ వచ్చు .  అంటే ,పోలవరం పూర్తయ్యే వరకు వేచి చూడ కుండా , కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ , సీమ పొలాలకు నీరు అందించే పట్టిసీమ ప్రాజెక్ట్ అత్యంత అవసరం .
 ఫ్లోరైడ్ కాలుష్యం నుండి సీమ బతుకు లకు విముక్తి కలుగుతుంది .
సీమ వాసుల ఆరోగ్య సంపద , రాయలసీమ రైతాంగం పండించే పంటల విలువ ముందు 1400 కోట్లు ఏపాటి ?
2.  పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత , పట్టిసీమ ప్రాజెక్ట్  లో వాడే మోటార్ లు , పంపులు మళ్ళీ ఎక్కడైనా వినియోగించు కోవచ్చు .

ఇలా భిన్న కోణాలలో తరచి తరచి చూసినా  పట్టిసీమ ప్రాజెక్ట్  ఇటు కృష్ణా డెల్టా కి ,అటు రాయలసీమ కి పెద్ద వరం . అలాగే ఇది  చంద్ర బాబు దార్సనికతకు నిజమైన సరిఐన రూపం .