This BLOG is dedicated exclusively to Andhra kshatriyas to strengthen the solidarity,tradition& morality of kshatriya community. it also promotes better human values and traditions. Please remember it’s not caste biased or caste based matter. Please contribute your positive suggestions & comments…
Search This Blog
Sunday, 1 January 2023
Sunday, 21 August 2022
శ్రీ కృష్ణ తత్త్వం
శ్రీ కృష్ణ తత్త్వం
వేలాది రాజుల సమక్షంలో తనను అగ్రపీఠంమీద
కూర్చోబెట్టినా తన కళ్లముందే ద్వారకాపట్టణం సముద్రంలో కుంగిపోతున్నా రెండూ కర్మననుసరించి
వచ్చిన ఫలితాలే అంటాడు. రెంటినీ అంతే ఆనందంగా స్వీకరిస్తాడు. సమస్య తలెత్తినప్పుడూ
అదే నవ్వూ... గెలిచిన తర్వాతా అదే చిరునవ్వూ. ఆ నవ్వే కృష్ణతత్వం.
సంసారాన్ని వీడడు... ఏదీ త్యాగంచేయడు... కష్టాలు ఎదురైనప్పుడు కూడా సంతోష సాగరంలో ఎలా
మునకలువేయాలో సులువుగా చేసిచూపడమే మానసచోరుడి లీలావినోదం.
జీవితం అంటే ఏమిటీ... అని ప్రశ్నించుకునే
మనుషులకు పరిపూర్ణం నుంచి ఉద్భవించిన మానవ జన్మ తిరిగి పరిపూర్ణంలోనే కలిసిపోయే నిర్దిష్టమైన
గమనమన్నాడు గీతాచార్యుడు. ఈ ప్రయాణం అంత సులువైంది కాదన్నాడు. అది బంధాలతో అల్లుకుంటుందనీ
బాధ్యతలతో నిండి ఉంటుందనీ, శిఖరాలను చూపిస్తుందనీ, లోతుల్లోకి తోసేస్తుందనీ తెలిపాడు.
ఎలా జీవించాలో జీవితాన్ని ఎలా అందిపుచ్చుకోవాలో ఆచరించి చూపాడు. అందుకే కృష్ణుడి జీవితం
మానవాళికి ఓ విలువైన సందేశం. నందనందనుడు నమ్మి చేరిన వారిని కాదన్న సందర్భమే లేదు.
ఒకవైపు ప్రేమను పంచుతూనే మరోవైపు ధర్మాన్ని నిలబెట్టాడు. మనిషిగా పరిపూర్ణత్వాన్ని
ఎలా సాధించాలో మొత్తం మానవజాతికి చెప్పకనే చెప్పాడు. కృష్ణుడు
కన్నయ్యకు బంధాలంటే అమితమైన తీపి. అందుకే
ఆయన అందరికీ బంధువే. ప్రతి బంధాన్నీ వెన్నముద్దల్లా అపురూపంగా ఒడిసిపట్టాడు. బంధుత్వాలను
ఎలా కొనసాగించాలో చెప్పకనే చెప్పాడు. బంధాలు మనకి బంధనాలు కావనీ ఆయా రూపాల్లో భగవంతుడేననీ
గ్రహించమంటూ భాగవత సూత్రాన్ని అలవోకగా వివరించాడు.
దుష్టులను శిక్షించడానికీ ధర్మం పక్షాన
నిలబడటానికీ మాధవుడు వేయని ఎత్తుగడ లేదు, చేయని రాజకీయం లేదు. కాళీయ మర్దనం నుంచీ కురుక్షేత్ర
సంగ్రామం వరకూ ప్రతిదీ కన్నయ్య ప్రణాళికే. అంతటి రాజనీతిజ్ఞుడు మరొకడుండడు. మహాభారతాన్ని
రాజకీయకోణంలో చూస్తే కృష్ణుడిదే కీలక పాత్ర.
నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలో కృష్ణయ్య
యుగాలనాడే చూపించాడు. ముందుండి నడిపేవాడు సమస్యలకూ, సవాళ్లకూ భయపడిపారిపోకూడదు. చివరివరకూ
విజయం మనదేనన్న భావంతో పోరాడాలి. తన బృందంలోనూ అదే స్ఫూర్తిని నింపాలి. గోకులంలో
కష్టాలూ, సవాళ్లూ ఎదురైనప్పుడు..
ధైర్యంగా అడుగు ముందుకు వేయమంటాడు. లక్ష్యాన్ని నిర్దేశించుకోమంటాడు. మానసిక ధైర్యాన్ని
అలవర్చుకోమంటాడు. అందుకే కృష్ణతత్వం...సమస్యల సుడిగుండంలో కూరుకుపోయినవారికి నిచ్చెనలు
మాత్రమే ఉండే పరమపదసోపానం, గమ్యమేంటో తెలియక పరుగులు తీసేవారికి దారిచూపే వెలుగురేఖ,
ఒత్తిడితో సతమతమయ్యే వారికి తిరుగులేని ఔషధం శ్రీకృష్ణుడు.
Sunday, 13 March 2022
హోళీ
శాస్త్రీయ కారణం చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ ఫీవర్స్, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన.
కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. వాస్తవానికి ఇవి చల్లుకోవాలి కానీ ఇప్పుడు కృత్రిమ రంగులు చల్లుకుంటున్నారు.
తృప్తి ని ఇవ్వలేని కోర్కెలతో , అరిషడ్వార్గాలతో , రాగద్వేషాలతో , స్వార్ధభూయిష్టమైన ఆలోచనలతో కలుషితమైన మనస్సును జ్ఞానం తో తపింపచేసి పునీతం చేయడమే హోళికా పూర్ణిమ లోని అంతరార్ధం.
జీవితమంటే ఉత్సాహం ,ఉషస్సు మాత్రమేకాదు విషాదం,నిర్లిప్తత ,తమస్సు కూడా !
ఒకో రంగు ఒకో భావాన్ని కలిగిస్తుంది. అన్ని రకాల రంగులతో హొలీ ని మనం ఎలా హుషారుగా జరుపుకొంటామో ,అలాగే అన్నిరకాల భావాలనూ సమానంగా హుషారుగా శ్వీకరించాలి .
దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం.
We command the state government and see that AMARAVATI farmers get justice
కంటిన్యూ మాండమస్ డిక్టేర్ అంటే కోర్టు తానిచ్చిన తీర్పును పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వాధికారి లేదా సంస్థ తన చట్టబద్ధ విధులను నిర్వర్తించనప్పుడు ప్రజల హక్కులకు భంగం కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఆ విధులను నిర్వర్తించాలని న్యాయస్థానం ఈ రిట్‌ను జారీ చేస్తుంది.
పాలనాపరంగా ప్రజలు న్యాయం పొందలేనప్పుడు ఈ రిట్ ద్వారా ఉపశమనం పొందొచ్చు. ఈ రిట్ జారీ కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాధికారుల తప్పనిసరి విధులకే ఈ రిట్ వర్తిస్తుంది. సంబంధిత అధికారి విచక్షణాపూర్వక విధులకు ఇది వర్తించదు.
నిబంధన–226 ప్రకారం రాష్ట్ర హైకోర్టు లు ఇలాంటి రిట్ జారీ చేయవచ్చు.
రాజధాని విషయంపై మొత్తం 70 పిటిషన్లను విచారించిన త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పునిచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలంది. అమరావతి భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని, రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి భూములు ఇవ్వొద్దని చెప్పింది కోర్టు. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని చెప్పింది. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 6 నెలల్లో ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలి. మూడు నెలల్లోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. అమరావతి అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అభివృద్ధి పనులు ఎంత వరకు వచ్చాయి. రైతులకు ప్లాట్లు అప్పగించారా లేదా.. ఏంటనే విషయం పై హైకోర్టు గమనిస్తూ ఉంటోంది. దాన్నే కంటిన్యూస్ మాండమస్ అంటారు.
ఒకసారి ఆ చట్టం ( CRDA ) చేసి...అంత మంది రైతులను ఇన్ వాల్వ్ చేసి ( Promissory estoppel is a doctrine in contract law seeks to protect the rights of a promisee or aggrieved party against the promisor.) ...అన్ని వేల ఎకరాలు తీసుకున్న తర్వాత అంత తేలికగా నిర్ణయాన్ని మార్చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ ఓ సంచలన తీర్పు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిందనే చెప్పాలి.
Mandamus is a command of Judicial Remedy in the form of an order from a court to any government, subordinate court, corporation, or public authority to do some specific act. which is in the nature of public duty, and in certain cases one of a statutory duty.
Saturday, 29 January 2022
కొండా కోన ఎండా వాన వెలుగు చీకటి
Sunday, 10 January 2021
3 minute Introduction to Kaya Kalpa Yoga
or reload the browser
ఓజస్సు, తేజస్సుగా,తేజస్సుప్రాణశక్తిని ఉద్దీపన చేసే శక్తిగా
చేసే విధానమే కాయకల్ప.
సృష్టిలో ఏదైనా దేశ కాలాలకు లొంగి ఉండవలసిందే!
కాలమానాలలో తేడా ఉండవచ్చు తప్ప , చివరికి బ్రహ్మ అనే శక్తికి కూడా జననం,లయమూ
ఉంటాయి. మానవ పూర్ణ ఆయుర్ధాయం 120 ఏళ్ళు. . కానీ ఈతి బాధలు, అంటువ్యాధులు,
ధాతు నష్ట ము, జనటిక్ తదితర వ్యాధులు , దురిత(కర్మ) కారకములు ఇలా అనేక కారణాల
చేత ఆయుర్ధాయం తగ్గిపోతుంది.
ముఖ్యంగా అపరిమితమైన లేదా పూర్తిగా లోపించిన ఆహరం,నిద్ర,ఆలోచనలు
,పని , లైంగిక క్రియ అనేవి మనిషిలో వైటల్ ఎనర్జీని బాగా తగ్గించివేస్తాయి.
ఎప్పుడైతే వైటల్ ఎనర్జీ తగ్గిందో, కణాలను పట్టిఉంచే బయో అయస్కాంత శక్తి
తగ్గి వ్యాధులు కలుగుతాయి .
కాబట్టి , ఆహరం,నిద్ర,ఆలోచనలు ,పని , లైంగిక క్రియ అనే
ఐదు మితంగా అదుపులో సంతులిత స్థాయిలోనే ఉండేటట్లు మన ప్రవర్తనను తీర్చి దిద్దుకోవాలి.
కేవలం వ్యాధి కి, వ్యాధి కారణానికి చికిత్స
అందిస్తే సరిపోదు. వ్యాధులను తట్టుకొనే రోగ నిరోధ సామర్ధ్యాన్ని పెంచితే తప్ప, క్వాలిటీ
ఆయువును అనగా ఎలాంటి రోగాలు లేని ఆయుస్సును మనిషికి ఇవ్వలేము.
బిలియన్ల సంఖ్యలోఉన్న సప్త ధాతువులకు చెందిన కణాలను ఒక
మానవాకారం లో కలిపి, నిలిపి ఉంచే శక్తినే బయో అయస్కాంత ఎనర్జీ
లేదా పోలార్ ఎనర్జీ అంటారు. ఈ అయస్కాంత శక్తి ఉందంటే విద్యుత్ శక్తి లాంటిది కూడా ఉండాలి
గదా?
అవును! కణాల మధ్యన భ్రమణం చేసే సూక్ష్మ మైన కణాలుంటాయి. వీటి
కేంద్రీయ భ్రమణ శక్తి ( centrifugal force ) వలన శక్తి తరంగాలు దేహమంతటా వ్యాపిస్తూ
ఉంటాయి. ఇదే విద్యుత్ శక్తి,కైనటిక్ శక్తి లేదా జీవశక్తి. (vital force).
జీవశక్తిని, బయో అయస్కాంత శక్తిని, ఎనర్జీని సరి
సమాన పాళ్ళలో ఉంచేటట్లుగా మన ఆహార విహార వ్యవహారాలను తీర్చి దిడుకొవాలి.
యోగ రసామృతం (sexual vital fluidic energy storehouse) అనేది ఒక బ్యాటరీ లాంటి అనగా శక్తిని నిల్వ ఉంచే ఒక రసాయనశక్తి . ఇది మెదడులో ముఖ్యంగా పీనియల్,పిట్యూటరీ,హైపో థలామస్ , మూడవ కుహరం అనే ఒక వలయకారపు సర్క్యూట్ ఉత్తేజము చెందినప్పుడు ఈ యోగ రసామృతం దేహములోని వైటల్ ఫోర్స్ ప్రవహించే నాడుల లోకి ప్రసరిస్తుంది.
