ముక్కోటి ఏకాదశి పర్వ దినాన కాస్మిక్ శక్తి మన సహస్రారానికి అందు బాటు లో ఉంటుంది . సాధకులు , ప్రాణ మరియు కుండలినీ శక్తులను ఊర్ధ్వ ముఖం గా అనగా ,ఉత్తర ముఖం గా పయనింప చేయడం ప్రారంభించాలి . ఎందు కంటే రాబోయేది ఉత్తరాయణ కాలం .
ప్రాణ శక్తి ని ఆజ్ఞా చక్రానికి తీసు కెళ్ళి నిలపా లంటే మన శ్వాస ను ఆజ్ఞా చక్రానికే పరిమితం చేయాలి . అనగా ,శ్వాస పై ధ్యాస పెట్టి సాధన చేసే వారికి వారి శ్వాస భ్రూ మధ్య మున నిలిచి ఉండటం పరిపాటి . అంటే శ్వాస నిమిషానికి 3 లేదా 4 సార్లు మాత్రమే జరుగుతుంది .
అప్పుడు మనస్సు 99 శాతం లయ మవుతుంది .
అప్పుడే విశ్వ శక్తి మన సహస్రారం లోకి దిగి ప్రవహిస్తుంది .
సాధకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కొంటారు .
మన చంద్ర మానం లో సంవత్సరానికి 26 ఏకాదశి రోజులు ఉంటాయి .ప్రతి ఏకాదశి నాడు చంద్రుడు ,సూర్య గమన పరిధి నుండి 135 డిగ్రీల దూరం లో ఉంటాడు .కాబట్టి ఆ రోజున భూ వాతావరణం పై చంద్రుని గురుత్వ బలం తక్కువ ఉండి ,మనిషి మనస్సు తక్కువ ఆలోచనల తో శాం తం గా ఉంటుంది . కాబట్టి , మన శరీరం ,మనస్సు ఉపవాసానికి అనగా ఆహారం మాని ,దైవ చింతన చేయడానికి అనుకూలమైన రోజు ఏకాదశి .
This is such a great resource that you are providing and you give it away for free.I love seeing websites that understand the value of providing a quality resource for free.Spiritual Healer in india|Pranic Healing in Bangalore
ReplyDelete