Search This Blog

Wednesday 28 November 2012

తెలుగు భా ష పుట్టు పూర్వోత్తరాలు

ద్రావిడులు ప్రోటో ఆస్ట్ర లాయిడ్స్ జాతికి చెందిన వారు . వారు  భారత దేశ ములో అనాదిగా ఉన్న వారా లేదా ఆఫ్రికా ఖండం నుండి వలస వచ్చారా ? అనేది సందేహం.
పురాతన కాలంలో అంటే ఆర్యులు సింధూ మైదానాలకు రాక ముందు ,అనగా ద్రావిడ నాగరికత బాగా వెల్లి విరిసిన మొహంజదారో హరప్పా కాలంలో , ద్రవిడులు మాట్లాడే భాషా సమూహాలన్నింటినీ ( ప్రొటో ద్రావిడ భాషలో  మొత్తం 21 మాండలికాలు ) భాషా శాస్త్ర వేత్తలు 3 భాగాలుగా విభజించారు .
ఆర్యులు ఉత్త భారత సింధు ,గంగా మైదానాలను పూర్తిగా ఆక్రమించుకొన్న తర్వాత ద్రావిడులు వింధ్య పర్వత ,దానిని కూడ దాటి దక్షిణా పధానికి తరలి వచ్చారు .
ద్రావిడ జాతి కి చెందిన ఆంధ్రులు సంచార తెగలుగా తిరుగాడిన  ప్రాంతాలు ముఖ్యంగా దక్కన్ పీట భూమి ,క్రిష్ణా ,గోదావరి నదీ తీర ప్రాంతాలు .
ఆంధ్ర ప్రాంతంలో బతికే  ద్రవిడ తెగలైన దేసి ,నాగ ,యక్ష తెగలన్నీ తెలుగు భాష మాట్లాడే ఆంధ్రులుగా చలామణీ అయ్యారు .
పురాతన ఆంధ్ర ప్రాంతాలు ఏవి ?
తుంగా నది ,అంద్రి (హంద్రి) నదీ తీరాలు   ,వింధ్య ,దక్కన్ పీట భూమి ప్రదేశాలు.
తెలుగు ద్రావిడ భాషా ?
విభక్తులు,ప్రత్యయములు",కర్త- కర్మ-క్రియ పదాల పొందిక -వీటిని బట్టి తెలుగు భాష ద్రవిడ భాషా జాతికి చెందినదని నిర్దారించారు .
క్రీ.శకం 500 ముందు పాక్రుతం రాజ భాషగా ఉండేది . సంస్క్రుతం కావ్య భాషగా ,దేవ భాషగా ఉండేది. గుప్తుల ,పల్లవుల యుద్దాల వల్ల ప్రాక్రుతం కనుమరుగైన తర్వాత ,తెలుగు భాష పై సంస్క్రుత భాష ప్రభావం పడింది .
1000.డి.లో,ఆది కవి నన్నయ్య భారతం తెనిగించిన తర్వాత తెలుగు భాష ప్రాముఖ్యత బాగా పెరిగి సంస్క్రుతాన్ని మించి పోయింది . తెలుగు ,  సంస్క్రుతంలోని  'త త్సమాసాల' ను గ్రహించి తనలో కలుపుకొంది

తెలుగు జాతి  ,తెలుగు భాష  ,తెలుగు ప్రాంతం  ఇప్పుడు 9 కోట్ల మంది  వారసత్వం .
నుడికారం ,మమకారం ,సంప్రదాయం  తేట తెలుగు  భావుకత్వం .
విడదీసి పడ  గొట్టాలని  అధికారం చలాయించాలని  ఉద్యమాలతో పిరి తీసే  నాయకత్వం..


No comments:

Post a Comment