Search This Blog

Saturday 2 November 2013

ధ్యానం

ధ్యానం లో మనస్సుతో ఏమీ చేయం.మనస్సు పనిచేస్తే మనకు ఆలోచనలు,జ్ఞాపకాలు,స్మ్రుతులు,సంకల్పాలు, అలాగే అరిషడ్వర్గాలకు చెందిన స్పందనలు మెదులుతా ఉంటాయి.
ఏకాగ్రతలో మనస్సు పనిచేస్తుంది. ఒకే విషయం పై గాడం గా ఆలోచిస్తుంది.
నిద్రలొ కూడ మనస్సు పని చేస్తుంది. కలలు కనే సమయం లో జరిగిపోయిన వాటిని  నెమరు వేసుకొంటూ ఉంటుంది.అహం కూడ మిగిలే ఉంటుంది.జ్ఞాపకాలను ,సంఘటనల తీవ్రతను,భయాన్ని,కోరికలను బేరీజు వేసుకొని ఏది అవసరం,ఏది కాదు అనే పద్దతిలో ఒక క్రమంలో మన జ్ఞాపకా లేదా స్మ్రుతి సామర్ధ్యాన్ని సునిశితం చేస్తుంది .   గాడ నిద్రలో మనస్సు నెమ్మదిస్తుంది.కానీ అదే సమయం లో ఎలాంటి విషయ అవగాహన ఉండదు.

కానీ,ధ్యానం లో మనస్సు నెమ్మదిస్తుంది.అహం ఉండదు, సాక్షీత్వం ఉంటుంది.విషయ అవగాహన ఉంటుంది.

శారీరకం గా,మానసికం గా  అలసిఉన్నప్పుడే నిద్ర వస్తుంది. నిద్రని మనం నిర్వర్తించ లేము.నిద్ర ఒక దేహ క్రియ. అది మనలను ఆవహిస్తుంది.
ధ్యానం మనం ఆరోగ్యం గా మెలకువతో ఉనప్పుడు,శక్తి వంతం గా ఉన్నప్పుడు మనం చేయగలం. ధ్యానం లో ఎలాంటి సంకల్ప వికల్పాలు ఉండవు. కానీ ధ్యానాన్ని మనం ఒక సంకల్పం తోనే ప్రారంభిస్తాము.సంపూర్ణ ప్రశాంతత,ఇబ్బడి ముబ్బడి గా శక్తి వస్తుందని,ఈ శక్తి వలన మన కర్మ శరీరం  కూడ  శుద్ద మవుతుందని ధ్యానులు చెబుతారు.

శరీరాన్ని కంట్రోల్ చేయడానికి వ్యాయామాలు చేస్తాము.
ప్రాణ శక్తిని కంట్రోల్ చేయడానికి ప్రాణాయామం చేస్తాము.అలాగే,మనస్సుని కంట్రోల్ చేయడానికి ధ్యానం చేయాలి.

మనస్సు 1hz  నుండి 40 hz పౌన పున్య స్థాయుల్లో కంపిస్తూ ఉండే ఒక శక్తి ప్రవాహం.ఈ కంపనాలను 4hz కి తీసుకు రావడ మే ధ్యానం.మనస్సుని  ఎప్పుడూ 7hz లోపే ఉండేటట్లు చేయడం ధ్యానం.
దైనందిన విషయాలను,పనులను,బాధ్యతలను చేస్తూ వాటికి సంబంధించిన రాగ ద్వేషాలను  మనస్సుకి ఇంకించు కోకుండా మన పని మనం చేసుకోవడ మే ధ్యానం.
రాగ ద్వేషాలు    ఎప్పుడు ఉండవు? మనం చేస్తున్న కార్యాలతో మన అహం మిళిత మవ్వ కుండా ఉన్నప్పుడు.

 మన మనస్సు ఆలోచనల రూపం లో సమాచారాన్ని పంపుతుంది.
అలాగే అది వింటుంది కూడ.
సాధారణ మానవుడు ఎక్కువగా ఆలోచిస్తాడు గానీ వినడు . అలా వింటానికి చేసే ప్రయత్న మే ధ్యానం.

ఒక విద్యార్ధి శాంతంగా  ఉన్నప్పుడే చక్కగా వింటాడు . ఇంకా ప్రశాంతం గా ఉన్నప్పుడు అతనిలోని సృజనాత్మక త పెరిగి అతను  కళాకారుడు అవ్వుతాడు . ఈ  రెండు  దశల లో అహం ఉంటుంది . కాకపోతే సాత్విక ,రాజసిక స్థాయిలో ఉంటుంది . అదే విద్యార్ధి మనస్సు అత్యంత ప్రశాంతం గా,ప్రేమతో,ఎలాంటి రాగద్వేషాలు లేనప్పుడు అతనికి ధ్యానం సిద్దిస్తుంది .

మనసు ఆలోచించి నప్పుడు దాని శక్తి 12hz నుండి 40hz స్థాయిలో అనగా బీట పౌన పున్యం లో ఉంటుంది.
ధ్యానం లో 4hz నుండి 7hz (థీటా స్థాయి) ;
గాడ నిద్రలో 1hz నుండి 4 hz డెల్టా స్థాయిలో  ఉంటుంది.
బీటా కి ,థీటాకి  మధ్య స్థాయి ఆల్ఫా ది.

అనగా,డెల్టా మరియు థీటా స్థాయిలో మనస్సు వింటుంది.
మనిషి బీటా స్థాయి కి బాగా అలవాటు పడిపోయాడు.

మనిషికి నిద్ర రావాలంటే మనస్సు ప్రశాంతం గా ఉండాలి.
అలాగే ధ్యానం చేయాలన్నా మనస్సు ప్రశాంతం గా ఉండాలి.

భౌతిక అవసరాలతో సత మయ్యే వాళ్ళు రిలాక్స్ కాలేరు. అంటే డెల్టా,థీటా స్థాయికి మనస్సు వెళ్ళదు.
ఎలాంటి షరతులు లేకుండా మనిషి ప్రేమించ గలిగితే,గాడ మైన విశ్వాసం తోటి వారి పైన,తన పైన కలిగి ఉన్నప్పుడే గాడ మైన నిద్ర గానీ,ధ్యానం గానీ సాధ్య మవ్వుతుంది .

నిస్సంగత్వే నిర్మోహత్వమ్ 
నిర్మోహత్వే నిశ్చల తత్త్వం 
నిశ్చల తత్వే జీవన్ ముక్తిహి 

No comments:

Post a Comment