Search This Blog

Friday 8 November 2013

ధ్యానం ఎందుకు చేయాలి?

ధ్యానం ఎందుకు చేయాలి?
మనం రోజూ చేస్తున్న పనులను,నిర్వర్తిస్తున్న బాధ్యతలను ఇంకా బాగా చేయడానికి,మాన సంబంధాలలో మధురిమను పూర్తిగా పొందటానికి,సమాజం లో సమతుల్యతను పెంచడానికి శక్తి కావాలి.ఆ శక్తి నీకు నిరంతరం అందుబాట్లో ఉండాలంటే,ధ్యానం అనే ప్రక్రియ ద్వారా పొందవచ్చు.
ధ్యానం లొ ఏం జరుగుతుంది?
మనస్సు ఒక శక్తి ప్రవాహం. దాని కంపన స్థాయిని థీటా స్థాయికి అనగా 4 నుండి 7hz(frequency)  కి తీసుకు రాగలిగితే,అప్పుడు మనచుట్టూ ఉన్న అంతులేని కాస్మిక్ శక్తి ఎలాంటి నిరోధం లేకుండా మనలోకి ప్రవహిస్తుంది.అంటే,ఆలోచనలతో సతమత మయ్యే మనస్సు నిరోధం లాగా పనిచేస్తూంది.
కాస్మిక్ శక్తి  మనలోకి నాడులు,చక్రాల ద్వారా ప్రవహించాలి అంటే,అవి శుద్దం గా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలి.అందుకే, నాడీ చక్ర శుద్ది కోసం ప్రాణాయామం చేయాలి.
శక్తి   సంచాలనం బాగా జరిగితే  ఇంద్రియాల ద్వారా  ఎలా మనం బయటి ప్రపంచాన్ని అర్ధం చేసు కొంటున్నా మో  ,అదే విధం గా ,లోపలి ప్రపంచాన్ని ,ఇతర మితులలో (dimensions)ఉన్న వాస్తవాలను అర్ధం చేసుకోగలం . వీటినే అతీంద్రియ శక్తులు అని చెప్పు కొంటాం .
లోపలి వాస్తవాలు ఏమిటి ? 
అవి ఎవరికీ వారే తెలుసుకోవాలి.
శరీరం ఎంత వాస్తవ మో ఆత్మ కూడా  అంతే వాస్తవం . కనిపించే మన భౌతిక శరీరమే కాదు , ఇంకా మనకు అనేక శరీరాలు  పొరలు గా ఉన్నాయని, ఆత్మ  అనేది చివరి పొ ర  అని ,పంచ కోశ  శరీరం వాస్తవమని ,యోగులు చెప్పిన  ద్రిగ్ విషయాలను ధ్యానం లో నే తెలుసు కోగలం .
కానీ బాగా గుర్తుంచు కోవలసినది ఏమిటంటే , అతీంద్రియ శక్తులు గానీ ,పంచ కోశ శరీర జ్ఞానం గానీ మన లక్ష్యం కాదు . ఆత్మ జ్ఞానం  సాదించిన తర్వాత ఆత్మను పూర్తిగా కోల్పోవడం ఆఖరి మెట్టు .
మిధ్యా నేను - అనగా అహంకారం పూర్తిగా కరిగినప్పుడు ఆత్మ  అవగాహన కలుగుతుంది .
ఆత్మ  అవగాహన  కలిగిన వారు ఎలా ప్రవర్తిస్తారు ?
కరుణ,నిష్కామ సేవ ,ప్రశాంత చిత్తం -   ఇవన్నీ ఉంటాయి . 

No comments:

Post a Comment