Search This Blog

Tuesday, 20 March 2018

Be careful....! Modi is ruling

రైతులు సంతోషంగా లేరు. మద్దతు ధరలు లేవు. పెట్టుబళ్ళు ఇచ్చే బాంక్ లన్నీ దివాళా తీయడానికి సిద్ధం గా ఉన్నాయ్ . అస్మదీయులకు వేలకోట్ల ఋణాలు మంజూరు చేస్తూ రైతులకు వేయి రూపాయలు ఇవ్వడానికి సవాలక్ష రూల్స్ పెడుతుంది కేంద్రం. రుణాలను ఎగవేత వేసే సొంత వాళ్ళను విదేశాలకు పారిపోయేటట్లు వెసులుబాటు ఇస్తున్నాడు మోడీ.  10లక్షలకోట్ల నిరర్ధక ఆస్తులతో బ్యాంకు లు దివాళాతీయడానికి మూలకారణం కాంగ్రెస్ మరియు మోడీ ప్రభుత్వాలే! ఎందుకంటే  మోడీ అధికారం చేపట్టిన తర్వాత, గత 4 ఏళ్లలోనే సుమారు 4లక్షల కోట్లు నిరర్ధక ఆస్తులుగా లెక్క తేలింది.

రాష్ట్రాలు సంతోషంగా లేవు. 14 వ ఆర్ధిక సంఘం పేరిట  లెక్కలన్నీ తారుమారు చేస్తుంది . అదేమని అడిగితే రాష్ట్రాలలో నానా రభస సృష్టిస్తుంది  కేంద్రం.  కాగ్ చేసిన లెక్కలు పక్కన పడేసి  పార్టీకార్యకర్తలకే రాష్ట్ర పద్దుల ఆడిటింగ్ అప్పచెబుతుంది.  GST పేరిట వసూల్ చేస్తున్న పన్నుల లో 30% బ్లాక్ మార్కెట్ దార్ల చేతుల్లోకే పోతున్నాయ్ తప్ప ఖజానకి చేరడం లేదు. పైపెచ్చు సామాన్యుల  ఆదాయంలో 40%  ప్రత్యక్ష ,పరోక్ష పన్నులకే పోతుంది.

సామాన్యులు సంతోషంగా లేరు. "పెద్దనోట్ల రద్దు"అని చెప్పి మరింతపెద్ద నోటు ను విడుదల చేయడంతో  ధనం మరింతగా వ్యవస్థలోకి రాకుండా చీకట్లోకి పోతుంది. మోదీకి చదువులేకపోయినా మంచి చురుకైన బుర్ర ఉందని నమ్మామ్ . కానీ అదీ లేదని తేలిపోయింది. ఎన్నికల కోసం నానా అబద్దాలు,  మాట వినని ప్రాంతీయ నాయకులను భయపెట్టడం, తనమాట వినే నేరస్థులపైనున్న కేసులను నీరుగార్చేయడం , నిరంకుశంగా తప్పులమీదతప్పులు చేయడం మోడీకి మామూలై పోయింది. దీని వలన నిరుద్యోగ సమస్య తీవ్రతరం అవుతుంది.ఆర్ధిక మాంద్యంలో దేశం కూరుకు పోతుంది. మోడీకి   కేవలం వాగాడంబరం, పైపై పటాటోపం  తప్ప అంకిత భావంతో  చేసే హృదయంకూడా లేదని తేలింది.

యువత సంతోషంగా లేరు. ఎటు చూసినా నిరుద్యోగం . ఇండియాలో తయారీ, పరిశుభ్రమైన భారత్ , సొంతకాళ్ళ పై నిలబడ్డ భారత్, వికాస భారతం, ... ఇలా లేని పోనీ ఆడంబర డంబాలు తప్ప క్షేత్రస్థాయిలో  చెప్పుకోతగ్గ  పెద్దపరిశ్రమ గానీ , ప్రాజెక్ట్ గానీ నిర్మించలేదు. చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రులు ఎవరైనా నానా కష్టాలు పడి  ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణం చేద్దామనుకొంటే మోడీ మోకాలడ్డం పెడుతున్నాడు.

సహచర కేంద్ర మంత్రులు సంతోషంగా లేరు. ప్రధాన మంత్రి ఆఫీసు రాజదర్బార్ లెక్క పనిచేస్తూ మిగతా మంత్రుల స్వయం చాలిత  అధికారాన్ని కూడా హరించివేస్తుంది . ఒక్క ప్రధానమంత్రి తప్ప మిగతా మంత్రులందరూ కాగితాలకే పరిమితం. మోడీ ఒక్కడే సార్వభౌముడిగా నిరంకుశ అధికారాన్ని వెలగబెడుతున్నాడు. సరే,రాజు ప్రజ్ఞా దురంధరుడు అయితే ప్రజలకు మంచిదే! కానీ మోడీ అసంపూర్ణజ్ఞాని !

వైద్యులు సంతోషంగా లేరు. జాతీయవైద్యాకమిషన్ పేరుతొ తిక్క తిక్క చట్టాలు చేసి దేశీయ వైద్యాన్ని,ఆధునిక శాస్త్రీయ వైద్యాన్ని కలగాపులగం చేయడానికి మోడీ నడుం బిగించాడు. అంతేకాదు మెడికల్ విద్యలో వేలుపెట్టి, 60% మెడికల్ సీట్లను యాజమాన్యం అమ్ముకోటానికి వీలుగా , మెడికల్ మాఫియాకి కొమ్ముకాసే విధంగా చట్టాలు తయారు చేస్తున్నాడు.

కొండలాంటి పనికిరాని విగ్రహాలు, ఇప్పట్లో పూర్తికాని బులెట్ రైళ్లు , స్వచ్ఛ గంగ పేరిట నిధులన్నీ గంగపాలు  చేయడం, అవినీతిని కడిగేస్తానని చెప్పి పైస్థాయిలో  అవినీతి ని ప్రోత్సహించడం,బ్యాంకు ల దివాళా, ఎన్నో పబ్లిక్ సంస్థలను కారుచౌకగా అస్మదీయులకు అమ్మేయడం, ఆర్థికనేరాలుచేసిన వారిని అక్కునచేర్చుకోవడం  తదితర  అభివృద్ధి నిరోధక  చేష్టలు మిక్కుటంగా చేస్తున్నాడు మోడీ.
ఓ పక్క రైతులు ఆకలితో అల్లాడుతూ చావుకేకలు పెడుతుంటే, ఉద్యోగుల ఓటుబాంక్ ను కాపాడుకోవడం కోసం , 7 వ కమిషన్ చెప్పిందంటూ  ఉద్యోగులకు ఏకంగా 3రేట్లు జీతాలు
పెంచేసి న మోడీని ఏమనాలి?
 కులలు గా, మతాలుగా విడిపోయిన భారతీయులను మరింతగా విడదీసి ఒకరిపై మరొకరిని ఉసికొలిపే విధంగా ఓట్లకోసం మతకల్లోలాలు , సీట్లకోసం కులాలకుమ్ములాటలు పేట్రేపుతున్న సంఘ్ పరివార్ తోకలిసి మోడీ ఆడుతున్న నాటకం ఈ దేశానికి పెద్దప్రమాదం. 
తస్మాత్ జాగ్రత్త!

No comments:

Post a Comment