మోడీకి తమపార్టీ భవిష్యత్
ముఖ్యం. అదే సమయంలో ప్రధానిగా అన్ని రాష్ట్రాలను చూసుకోవలసిన బాధ్యత కూడా ఉంది.
కానీ మోదీ దేశ ప్రయోజనాలకంటే తన పార్టీ
నే ముఖ్యమనుకొని దక్షిణ భారత దేశాన్ని గాలికి వదిలేస్తున్నాడు
. చంద్రబాబు రాష్ట్రప్రయోజనాలు,
పార్టీ ప్రయోజనాలను జోడు గుర్రాల స్వారీగా రెంటినీ సమానంగా చూస్తూ ముందుకు
సాగుతున్నాడు. ఈ విషయంలో దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రి గా చంద్రబాబుని
చెప్పుకోవాలి.
అవినీతి అనేది సమాజంలో ఒక భాగంగా
మారిపోయిన కాలంలో ప్రభుత్వాల అవినీతి గురించి విపక్షాలు బురద జల్లడం మామూలే .
అవినీతిని తరిమేసి,నల్లధనాన్ని పట్టుకొస్తాం అని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన
ప్రధాని ఎంతవరకు సఫలం అయ్యారో అందరికి తెలుసు. నల్లధనం పక్కనపెట్టండి. బ్యాంకు
లోని తెల్లధనాన్ని లూటీ చేసినవాళ్లను ఉపేక్షించే ప్రధానిని ఇంకా ఎవరు
విశ్వసిస్తారు?
పిల్ల కాంగ్రెస్ కి ఒక
బాధ్యతానేది లేదు,కేవలం తనపై ఉన్న కేసులనుండి ఎలా తప్పించుకోవాలనే ధ్యాస తప్ప! తల్లి
కాంగ్రెస్ ను ఒక పార్టీగా చూడటం మానేసి 60నెలలవుతుంది.
పవన్ లాంటి అనుభవ శూన్యులు
,ఏమాత్రం అవగాహన లేకుండా గందరగోళం పడిపోతూ, ప్రజలను
కూడా గందరగోళంలో పడేస్తున్నారు. ఏవో పేపర్లలో
వచ్చిన నిరాధారమైన వార్తలు
చదివేసి ఒకరిపై బురద జల్లే మనస్తత్వం పవన్ కి ఉండటం బాధ వేస్తుంది . BJP&JAGAN
చేతిలో కీలుబొమ్మలా మారిపోవడం ఇతని స్వార్థపర రాజకీయ చతురత ను వెల్లడి
చేస్తుంది .
ఆంధ్రులు ఆలోచించాలి. ఇకనైనా
కులమతాలకు అతీతంగా అలోచించి, రాష్ట్రప్రయోజనాలకు ఎవరైతే కట్టుబడి ఉన్నారో,కట్టుబడి
ఉంటారో వారి నే బలపరచాలి . అలా జరగకపోతే నష్టపోయేది ఆంధ్రులే!
మోడీ గురించి మొదట్లో ఈ బ్లాగులోనే ఎంతో మంచిగా వ్రాశాను . నేనేకాదు,
మెజారిటీ భారతీయులు మోడీ బాగా పాలనా చేస్తాడని నమ్మారు . కానీ ఏటికి ఏడాది
అతని పాలన లోని లోటుపాట్లు భారతీయులను కుంగదీస్తున్నాయి. చివరికి ఎలా వచ్చిందంటే,
కుంభకోణాల మయమైన కాంగ్రెస్ పాలనే మెరుగు అనే అభిప్రాయానికి జనం వచ్చేస్తున్నారు. ఒకో రాష్ట్రంలో,ప్రాంతీయపార్టీల జుట్లు ముడివేసి పబ్బం గడుపుకొంటానికి ప్రయత్నం చేస్తూ,ఆ క్రమంలో ఎదురుతిరిగే రాష్ట్రాలకు నిధులుగానీ, ప్రాజెక్ట్ లు గానీ కేటాయించకుండా కట్టడి చేస్తున్నారు మోడీ&షా. ఉదాహరణకు ,ప్రత్యేకహోదా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నందుకు శిక్షగా జగన్ ని,పవన్ ని కలిపి,చంద్రబాబు పైకి ఉసిగొల్పడం
మనం చూస్తున్నాం. మోదీకి ఉచ్చము నీచం అనే తేడా లేదు. బ్రిటిష్ వాళ్ళు, ఇందిరాగాంధీ పాలించినట్లే "విభజించు -పాలించు" అనే సూత్రాన్ని నిర్ధాక్షిణ్యంగా అమలు చేస్తున్నారు.
అంతేకాదు తనకు ఎదురుతిరిగిన వాళ్లపై లేనిపోని కేసులు బనాయించడం,తనకు దాసోహం అన్న వారి పై నున్న కేసులను నీరుగార్చేయడం మనం చూస్తున్నాం. 21వ శతాబ్దంలోకూడా కోలోనియల్ పద్ధతులు,ఫాసిస్ట్ చర్యలు చేయడం చూస్తుంటే జాతీయ పార్టీల పాలనా ఇంతే అనే నిర్వేదం వస్తుంది.
ఎందుకంటే మార్పు తెస్తానని నమ్మించి మోసం చేసిన మోడీ గురించి ఒక్కసారి పరిశీలించండి...
మనం చూస్తున్నాం. మోదీకి ఉచ్చము నీచం అనే తేడా లేదు. బ్రిటిష్ వాళ్ళు, ఇందిరాగాంధీ పాలించినట్లే "విభజించు -పాలించు" అనే సూత్రాన్ని నిర్ధాక్షిణ్యంగా అమలు చేస్తున్నారు.
అంతేకాదు తనకు ఎదురుతిరిగిన వాళ్లపై లేనిపోని కేసులు బనాయించడం,తనకు దాసోహం అన్న వారి పై నున్న కేసులను నీరుగార్చేయడం మనం చూస్తున్నాం. 21వ శతాబ్దంలోకూడా కోలోనియల్ పద్ధతులు,ఫాసిస్ట్ చర్యలు చేయడం చూస్తుంటే జాతీయ పార్టీల పాలనా ఇంతే అనే నిర్వేదం వస్తుంది.
ఎందుకంటే మార్పు తెస్తానని నమ్మించి మోసం చేసిన మోడీ గురించి ఒక్కసారి పరిశీలించండి...
అవినీతిని తరిమేస్తానన్నమోడీ
మరింతగా అవినీతిపరులకు సాయం చేస్తున్నాడు . మధ్యతరగతి
వారిని పూర్తిగా దోచేసే చట్టాలు
చేసి ఆర్ధికవ్యవస్థ ను అతలాకుతలం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్,బంగారం,పరిశ్రమలు
,షేర్ లు , బ్యాంకింగ్ తదితర రంగాలు పూర్తిగా కుదేలై పోతున్నాయి.
పాలనలో పారదర్శకత అంటే సాంకేతికత
ను ఉపయోగించి పక్కదారిపట్టకుండా అనగా ఉద్యోగులు,చోటా రాజకీయనాయకులు దోచేయడానికి
వీలులేకుండా , లబ్దిదారులకు సంక్షేమపథకాలు అందేటట్లు చేస్తున్నాడు. అంతవరకూ
మెచ్చు కో వచ్చు. కానీ ఆలా సేవ్ చేసిన ధనాన్ని మళ్ళీ
తనకు ఇష్టమొచ్చిన పారిశ్రామికవేత్తలకు పంచే ఏర్పాట్లు
చేస్తున్నాడు. ఆ ధనాన్ని ఓటు బ్యాంకును కైవసం
చేసుకోవడానికి వినియోగిస్తున్నాడు . అంతేతప్ప మౌలిక సదుపాయాల కల్పనకు తద్వారా
ఉద్యోగ కల్పనకు చేయూత నివ్వకుండా కేవలం తన పార్టీ ఎన్నికల ప్రచారానికి,
పైపై మెరుగులు అద్దే కార్యక్రమాలకు ధనం వెదజల్లుతున్నాడు.
ఇలా వెదజల్లుతున్న మోడీ కి ఓటర్లు
తప్ప మనుషులు కనబడరు.
బ్యాంకింగ్ రంగం పూర్తిగా
అవినీతితో కుళ్ళి పోయేటట్లు చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే మిన్నగా మోడీ ఏమీ చేయడం
లేదు. పెద్దనోట్ల రద్దు, జి ఎస్ టి అనేవి మంచివే అయినా వాటిని అమలుచేసిన తీరు
ఆర్ధికమాంద్యానికి దారి తీసింది.
ప్రజాస్వామ్య మనే దానిపై మోడీకి
విశ్వాసం లేదు. క్రమేణా ఫాసిస్టు పోకడలు కనబడుతున్నాయి. అందుకే ప్రజాస్వామ్య బద్ధ
అటానమస్ సంస్థలను మూసేసి, పార్టీ, ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లా ఆడే సంస్థలను
స్థాపిస్తున్నాడు.
కాంగ్రెస్ నక్క లాంటిదైతే మోదీ
నాయకత్వంలో బి జె పి తోడేలు లెక్క ప్రవర్తిస్తుంది. ప్రాంతీయపార్టీల కు
స్వార్ధం,అధికార అభిలాష తప్ప రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకొనే తీరిక ఉండదు .
రాష్ట్రం కోసం కష్టపడిపనిచేసే
టి డి పి లాంటి పార్టీలు చాలా తక్కువ. అందుకే మూడో కూటమి అనేది కూడా
చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ,ఆచరణలో ఫలితాలు ఇచ్చేది కాదు.
ఏదిఏమైనా , దేశంలోని సంపద అన్ని
రాష్ట్రాలకు,అన్ని జిల్లాలకు సమానంగా అందించే వ్యవస్థ రావాలి . అలంటి వ్యవస్థను
కదం తొక్కించే ప్రభుత్వం కావాలి . ఎన్నికలవరకే పార్టీలు. ఆ తర్వాత అందరూ దేశంకోసం
క్రమశిక్షణ తో పనిచేయాలి. అవినీతి కేసులను విచారించడానికి లోకాయుక్త,లోకపాల్ ,
ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నియమించి 6నెలల్లోనే తీర్పువెలువడే సిస్టం ఉండాలి. ఏదైనా
ప్రాంతపు ప్రజల మనోభావాలను గౌరవించకపోతే క్రమేణా వాళ్ళు దేశం అనే ప్రవాహం నుండి
పక్కకు తొలగిపోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా సౌమ్యంగా డీల్
చేయాలి. ఉదాహరణకు, ఆంధ్రులకు ఉన్నంత అవగాహన మరే ప్రాంతానికీ ఉండదు. వారు
ఆర్థికపరమైన దోపిడీ కి గురవుతున్నామని గట్టిగా నమ్ముతున్నారు.
ఎందుకంటే విభజన వారు
కోరుకోలేదు. పైపెచ్చు, ఎక్కువశాతం అప్పులు వాళ్ళనెత్తిపై
పడేసి,తక్కువశాతం ఆస్తులు అనగా భవనాలు,సాగునీరు,విద్యుత్ , ఖనిజ
సంపద వాళ్లమొగాన కొట్టారు. అంతేకాదు, ఆదాయాన్ని ఇచ్చే పాడికుండ లాంటి
రాజధాని నుండి బయటకు తోసేశారు. ఆదాయం ఇచ్చే వనరులన్నింటినీ
లాక్కొన్నారు.
కోరుకొని
విభజన వలన ఒక్కసారిగా ఒడ్డున పడ్డ చేపల్లా గిల గిల లాడుతున్నారు ఆంధ్రులు.
వ్యవసాయ భూమి
తప్ప, పరిశ్రమలు, సర్వీసు సెక్టార్ సంస్థలు,నగరాలు
లేని రాష్ట్రం వారి కి మిగిలింది. కాస్త సాయం అందిస్తే
చాలు,అల్లుకుపోయే సత్తా ఉన్న ప్రజలకు కష్టపడిపనిచేసే చంద్రబాబు నాయకుడిగా దొరికాడు.అలంటి
సమయంలో నేనున్నా' నంటూ మోడీ చేయందించాడు. నమ్మాము .
విధిలేని పరిస్థితిలో ఇవ్వాళ
కాబోతే రేపైనా సాయం చేయడా? అనుకొంటూ 4 ఏళ్ళు ఎదురు చూశాం . చివరి
బడ్జెట్ లో కూడా మొండి చేయి చూపించే సరికి ఆంధ్రుల కు
అర్ధమైపోయింది. మాటతప్పాడు మోదీ! నమ్మించి మోసం చేశాడు మోడీ!
పునర్ వ్యవస్థేకృత చట్టం ప్రకారం
2024 లోపుగా , ఆయా షెడ్యూల్ ల లోని వాటిని అమలు చేయడానికి ఆంధ్ర
రాష్ట్రానికి ఇవ్వ వలసింది అక్షరాల రూ. 3లక్షల 25వేల కోట్లు. కానీ
చెప్పుకొంటే సిగ్గుచేటు, ఇప్పటి వరకు విదిల్చింది కేవలం 12 వేలకోట్లు. ఎంతవరకు
దిగజారారంటే,80% చేసేశాం,ఇంకా పెద్దగా ఏమీ చేయనక్కరలేదని బుకాయిస్తున్న మోడీ
ప్రభుత్వాన్ని ఏమిచేయాలి?
అభివృద్ధి చెందిన రాష్ట్రాలైన
గుజరాత్,మహారాష్ట్రలో మెట్రోలు, బుల్లెట్ రైళ్లు, అంతర్జాతీయ నగరాలు , ఎక్స్
ప్రెస్ రోడ్లు వేయడానికి లక్షలకోట్లు గుమ్మరిస్తూ అనాథలా పడిపోయిన ఆంధ్రాకి
ఏమీ ఇవ్వకుండా ఎదురు మాట్లాడుతున్న కేంద్రప్రభుత్వాన్ని ఏమిచేయాలి??
ఇలాంటి స్థితిలో
నాయకుడనే వాడు ఏమి చేయాలి ?కేంద్రం పై పోరాడాలి . అంతే తప్ప
పోరాడేవాళ్లపై బురదజల్లకూడదు. రాష్ట్రానికి
ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదంటున్న కేంద్ర ప్రభుత్వాన్నిగానీ, ప్రధాని
నరేంద్రమోదీనిగానీ ఒక్క మాట అనలేదు పవన్. నామమాత్రంగా వైకాపాను విమర్శించారు. లోకేష్, చంద్రబాబు ప్రభుత్వాన్ని
ఆడిపోసుకోవడానికే మీటింగ్ పెట్టారు తప్ప ఇది ప్లీనరీకాదు,పాడూ కాదు.
పార్టీలో ఎవరున్నారో చెప్పలేరు. ఇలా వచ్చి బాధ్యతా రహితంగా నాలుగు
మాటలనేసి,బురద జల్లేసి,తర్వాత హైదరాబాద్ పోయి సినిమా కధలు వింటారు .
రాష్ట్ర
ప్రయోజనాలు సాధించు కో వాలంటే కేంద్రం పై జాగ్రత్తగా ఆచితూచి ఎత్తులువేస్తూ
పోరాడాలి. అంతే తప్ప పోరాడేవాళ్లపై బురదజల్లకూడదు.ఇది బురద జల్లే సమయం కాదు. అందరూ
సంఘటితమై పోరాడి ఉద్యమం చేయవలసిన సమయం.
పవన్ లాంటి
మంచి వ్యక్తులు రాజకీయాలు ఆడకూడదు. చేతనైతే రాష్ట్రానికి పనికొచ్చే పనులు చేయాలి.
అంతేగానీ,పోరాడేవాళ్ళను బలహీనపరచ కూడదు.
“అవినీతి
చిట్టా ప్రధానమంత్రి దగ్గర ఉంది.అందుకే భయంతో ఎదిరించలేకున్నారు” అని ఆరోపణ చేసే
ముందు నిజాలు తెలుసు కో కుండా ఎలాపడితే ఆలా వాగేయ కూడదు.దమ్ముంటే కేంద్రాన్ని
ప్రశ్నించాలి . ఆలా చేయకుండా దారినపోయే దానయ్యలా గాలికబుర్లు పోగేసి బాధ్యతా
రహితంగా మాట్లాడటం మంచి పధ్ధతి కాదు.
ఎలాంటి ఆధారాలు లేకుండా,కేవలం సాక్షి పేపర్లో చదివి ,ఇలాగట ,అలాగట అంటూ గాలి పోగేసి,ఒక వ్యక్తిపై బురద జల్లితే,ఒక వ్యక్తి యెక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తే రాష్ట్రప్రయోజనాలు సిద్ధిస్తాయా?
“వాళ్ళకంటే నేనే శుద్ధం” అని అందరూ చెప్పుకొని నాకే ఓట్లేసి అధికారం అప్పచెబితే,అపుడు నేను కేంద్రంతో పోరాడుతా! అంటున్నాడు పవన్.
ఎలాంటి ఆధారాలు లేకుండా,కేవలం సాక్షి పేపర్లో చదివి ,ఇలాగట ,అలాగట అంటూ గాలి పోగేసి,ఒక వ్యక్తిపై బురద జల్లితే,ఒక వ్యక్తి యెక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తే రాష్ట్రప్రయోజనాలు సిద్ధిస్తాయా?
“వాళ్ళకంటే నేనే శుద్ధం” అని అందరూ చెప్పుకొని నాకే ఓట్లేసి అధికారం అప్పచెబితే,అపుడు నేను కేంద్రంతో పోరాడుతా! అంటున్నాడు పవన్.
"ఈ 4ఏళ్ళు
నువ్వేం చేశావ్ ? నువ్వు తప్పు చూపించినపుడల్లా అగ్గగ్గ లాడుతూ ఆ తప్పుని
దిద్దుకోవడానికి ప్రయత్నీమ్చి నిన్ను ఓ పెద్ద నాయకుడిగా చేయడం చంద్రబాబు తప్పు.
ఉద్దానం సమస్య నీ కంటే ముందే అచ్చెన్నాయుడు భుజానవేసుకొన్నాడు. తుందుర్రు
సమస్యలోతులు నీకు సరిగ్గా అర్ధమే కావు" ... ఇలా ప్రజలు
మాట్లాడుకొంటున్నారు.
ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేయ వలసింది కేంద్రమే తప్ప రాష్ట్రం కాదు. ఈ విషయం కూడా తెలుసుకో కుండా బహిరంగ సభల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఏదో కరడుగట్టిన రాజకీయ స్వార్ధపరులకు చెల్లుతాయి గానీ పవన్ లాంటి మంచి వ్యక్తికి నప్పవు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ పై అలుపెరగ కుండా పోరాటం చేస్తున్న ప్రభుత్వం పై అబద్ధపు ప్రచారాలు చేయవలసిన అవసరం పవన్ లాంటి నిస్వార్ధ పరుడుకి ఎందుకుంది?
2016లో జరిగిన నోట్లరద్దు సమయంలో జరిగిన శేఖర్ రెడ్డి ప్రహసనాన్ని తీసుకొని అందులో లోకేష్ పాత్ర ఉందని సాక్షి పేపర్ వాళ్ళు అల్లిన కధ”లో నిజానిజాలు చూసుకో కుండా,2 ఏళ్ల తర్వాత ఇలాంటి అభాండాలు వేసేది పవన్ కాదు, వెనుక ఓ పెద్ద జాతీయ పార్టీ ఉందని”ప్రజలు అనుకొంటున్నారు .
రేపో మాపో, పవన్ ఆమరణ దీక్ష చేయడం,కేంద్రం ఏదో వరాలు ప్రకటించి పవన్ దీక్షను విరమింప చేయడం, ఉద్యమకారుడి లెక్క పవన్ ని జాతీయ పైడ్ మీడియా లో ఆకాశానికెత్తడం , ఇవన్నీ రాబోయే జనసేన సినిమాలో టీజర్స్”అనే భావం ప్రజల్లో ఉంది.
“పవన్ కూడా మామూలు రాజకీయ నాయకుడే!పవన్ కూడా జగన్ లా కేంద్రానికి తొత్తులా ఆడే కీలుబొమ్మే!ఆయనకు రాష్ట్రప్రయోజనాల పై ఎలాంటి శ్రద్ధ లేదు” అని అందరూ అనుకొంటూ ఉంటే బాధ కలుగుతుంది.
పవన్ లాంటి మంచి వ్యక్తులు
రాజకీయాలు ఆడకూడదు .చేతనైతే రాష్ట్రానికి పనికొచ్చే పనులు చేయాలి.
అంతేగానీ,పోరాడేవాళ్ళను బలహీనపరచ కూడదు.
పొరపాట్లు చేయడం మానవ సహజం.
ఇప్పటికైనా మోడీ మనిషిగా,మంచి నేతగా మారాలి.పవన్ మంచి మార్గంలో నడవాలి.
ఎందుకంటే రాష్ట్రం కోసం .
లేదూ , మాకు
రాష్ట్రప్రయోజనాలకంటే మా సొంత ప్రయోజనాలే ముఖ్యమని మీరనుకొంటే ,ఇక చెప్పేదేమీ
లేదు!యుద్ధమే!
No comments:
Post a Comment