Search This Blog

Thursday, 8 February 2018

Andhras are not fools....

ముందు రెవెన్యూ లోటు గురించి మాట్లాడుకొందాం. ఆనాడు అనగా విభజన జరిగిన సంవత్సరంలో కాగ్  లెక్కవేసి ,రెవెన్యూ లోటు 16000కోట్లుగా తేల్చింది . తర్వాత 14 వ ఆర్ధిక సంఘం లెక్కవేసి రెవెన్యూ లోటు సుమారు 9000కోట్లు అని చెప్పారు.
అమరావతికి నిధులు ప్రతి ఏటా కనీసం 10000కోట్లు ఇవ్వవలసి ఉంది . కానీ దాని ఊసు  లేకుండా 5బడ్జెట్ లు కానిచ్ఛేసి ,ఇంకా ఎదురు చూడమంటున్నారు.
పోలవరం తదితర ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు నిధులు సకాలంలో ఇవ్వడం లేదు. ఇచ్చినా అరకొర గా విదిలిస్తున్నారు.
ఇ ఏ పి ప్రాజెక్ట్ లకు కాలు అడ్డమువేసి కాలయాపన చేస్తున్నారు. హడ్కో,నాబార్డ్ ద్వారా నిధులు ఇచ్చే అవకాశమున్నా లేనిపోని సాకులు చెబుతున్నారు.
ఇప్పటివరకు పేపర్ ప్రకటనలకే పరిమితమైన జాతీయ స్థాయి సంస్థలకు ఇప్పటివరకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. కనీసం ఆఖరి బడ్జెట్ లో నూ  నిధులు కేటాయించలేదు.
మిత్రపక్షంగా ఉంటున్నా ,ఏనాడూ మాకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. నాలుగు ఏళ్ళు సహనంతో ఎదురు చూసినా ,మాకు నిరాశ మిగిల్చారు. బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్నపుడు మిత్రపక్షాలనుండి ఇన్ పుట్స్ తీసుకోవాలన్న ఇంగితం కూడా లేదు.
చట్టప్రకారం ఆంధ్రాని  ప్రత్యేకరాష్ట్రంగా చూడవలసి ఉన్నా , కనీసం, ఇతర  రాష్ట్రాలకు మామూలు గా  నిధులు ఇస్తున్నట్లుగా,  ఇవ్వడానికి  కూడా నానా యాగీ చేస్తున్నారు. ఎన్నిసార్లు మీ దగ్గర పడిగాపులు కాయాలి ? ఎన్ని ఫైల్స్ మీకు పంపాలి? ఎన్ని యూసర్ బిల్స్ పంపాలి?
విభజన లో 9,10 షెడ్యూల్ లోని ఆస్తుల పంపకాలనూ మీరు పూర్తి చేయలేదు.
మేమేమీ బిచ్చమ్ అడగడం లేదు. న్యాయము , చట్టం ప్రకారం మాకు రావలసియున్న వాటినే డిమాండ్ చేస్తున్నాం.
భౌగోళిక ప్రాతిపదికన ఆస్తులు, జనాభా ప్రాతిపదికన అప్పులు, వినియోగం ప్రాతిపదికన విద్యుత్‌, జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల పింఛన్లు విభజించి న్యాయం చేస్తానన్న  కేంద్రం ఇంతవరకు ఆ పనిపూర్తి చేయలేదు. ఉభయరాష్ట్రాలకు ఒక్క గవర్నర్ ని పెట్టారు. ఎపుడైనా ఎంతవరకు పని అయింది అని గవర్నర్ ని  ఆరా తీశారా? 

ప్లానింగ్ కమిషన్ అనేది స్వతంత్ర ఆర్ధిక సంస్థ . ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించాలో నిర్ణయించే అటానమస్  అధికారం ఉన్న  ఆ సంస్థను రద్దు చేసి , నిధులను రాష్ట్రాలకు పంచే అధికారాన్ని కేంద్రం తన చేతిలోకి తీసుకొని, తనకిష్టమైన రాష్ట్రాలకు అదీ ఎలక్షన్ లు జరిగే ముందు ఎలాపడితే ఆలా నిధులు గుమ్మరిస్తే మిగతా రాష్ట్రాలు ఎలా బతకాలి?  కేంద్రాన్ని కాదనే రాష్ట్రాలకు మొండి చేయి చూపెడుతుంది. ఇది అప్రజాస్వామిక మైన చర్య. 

ఊకదంపుడు ఉపన్యాసాలు మొదట్లో బాగున్నాయని జనం నమ్మి మోడీకి అధికారం ఇచ్చారు. పాలనలో కొన్ని మంచి సంస్కరణలు తెచారు గానీ,అమలు చేయడంలో దారుణంగా విఫలం అయ్యారు. స్వచ్ఛ గంగ,స్వచ్ఛభారత్  లాంటి విఫల పధకాలు ఎన్నో ప్రవేశపెట్టినా, కొన్ని మంచి వినూత్నమైన చర్యలు చేపట్టారు. అందుకే మీ పై నమ్మకంతో సహనంతో ఎదురు చూశాం . 
విద్యుత్పాదన , పల్లెలకు విద్యుత్ సౌకర్యం, పాలనలో  సంస్కరణలు, అందరికీ వంటగాస్, కేంద్ర సంక్షేమ పథకాలలో  ఆధార్ ని ఉపయోగించి అవినీతిని అరికట్ట డం , పాలనలో కుంభకోణాలు లేకుండా విజయం సాధించారని చెప్పవచ్చు. 
 డెమో, డిజిటల్ లావాదేవీలు,గోల్డ్ మోనిటైజేషన్ , బినామీ నియంత్రణ, రియల్ ఎస్టేట్ నియంత్రణ,  జి. ఎస్. టి  గురించి  ప్రజలలో ఇంకా బాగా అవగాహన పెంచి మరింత పకడ్బందీగా అమలుచేయవచ్చు . డెమో కి ముందుగానే బాంక్ లను మరింతగా సిద్ధం చేసి   సాంకేతికతను ఉపయోగించి .మానిటర్ చేయడానికి అనువుగా చేయవచ్చు. ఇవన్నీ క్షమించగల పొరపాట్లే!    
కానీ ప్రజలందరినీ కేవలం ఓటర్లు గా చూడటం అనేది మరీ ముదిరిపోయిన రాజకీయ అధికార కాంక్షకు గుర్తు. 

తెలుగు దేశం పుట్టిందే  కాంగ్రెస్ వారి చేతిలో పతనమైన తెలుగు ఆత్మగౌరవం రక్షణకోసమని  మోడీ లోక్ సభలో  చెప్పారు . అలంటి కాంగ్రెస్ తో ఎవ్వరూ జతకట్టకూడదు... ముఖ్యంగా తెలుగుదేశంపార్టీవాళ్ళు కాంగ్రెస్ తో జతకట్టకూడదని మోడీ అభిప్రాయం. 
 TDP పార్లమెంట్ సభ్యులు  చేస్తున్న ఆందోళనకు మద్దతు నిస్తున్న కాంగ్రెస్ వారిని చూసి కడుపు మంటతో మోడీ అన్నమాటలా అవి? లేక   ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని  కాపాడిన అభిమాన నాయకుడిని మెచ్చుకొని,  ఆంద్ర సెంటి మెంట్ ని రాజేసి ఆంధ్రుల మనస్సును గెలుచుకో వాలన్న యుక్తా ? 
కేసులతో సతమవ్వుతూ, తనకాళ్లకింద బానిసలా పడిఉండే  జగన్  తో అంటకాగడానికి మానసికంగా సిద్ధమైన అమిత్ షా &మోడీ మాటలు ఆంధ్రులే కాదు,రాబోయే ఎన్నికలలో ఎవ్వరూ నమ్మేపరిస్థితి లేదు. 
ఒకటిమాత్రం నిజం, గల్లా జయదేవ్ చెప్పినట్లు , మోడీ కపటపు మాటలు నమ్మడానికి  ఇపుడు...  ఆంధ్రులు  ఫూల్స్ కాదు. 




No comments:

Post a Comment