Search This Blog

Saturday, 3 February 2018

ఆంధ్రనాయకులారా! బిచ్చమెత్తడం ఇక ఆపండి! Don't Beg... Demand!

ప్యాకేజి , హోదా అనే మాటలు 60% ఓటర్లకు అర్ధం కావు . 
ప్యాకేజి , హోదా అంటే ఏమిటో , వాటి వలన వచ్ఛే లాభమేమిటో , వాటి మధ్య ఉన్న తేడా ఏమిటో , 
  మిగతా 35 శాతం ఓటర్లకు తెలియదు .  
గతవారం  ఆంద్ర ప్రదేశ్ లో  భిన్న వర్గాలు చేసిన సర్వే లో దాదాపుగా అరవై అయిదు నుంచి డబ్భై శాతంమంది "హోదా అంటే ఏమిటో తమకు స్పష్టత లేదని'' వ్యాఖ్యానించారు. హోదా కావాలని కోరేవారిని "దానివల్ల ఏమి వస్తుందో తెలుసా?'' అని ప్రశ్నిస్తే "తమకు తెలియదని'' వారు సమాధానం ఇచ్చారు. 
కేవలం మధ్యతరగతి వారిలో , అదీ నిరుద్యోగ యువత లోనే , ఆంధ్రుల ఆత్మ గౌరవం మంటగలిసి పోతుందనే  సెంటిమెంటల్ భావం, దానితో పాటు ఉద్యోగ అవకాశాలు పెంచే పరిశ్రమలు రావనే  అనుమానం , భయం  ఉన్నాయి .  దానికి ప్రధాన ముద్దాయి BJP, MODI    అని భిన్న ప్రతిపక్షాలు చెబుతున్న విషయాన్ని తిప్పికొట్టే సత్తా ఉన్నవాళ్లు BJP  లో  కనబడటం లేదు .
 చంద్రబాబు ని ఎవ్వరూ అనుమానించడం లేదు . ఎందుకంటే , ఆయన పడుతున్న  కష్టం
 అందరూ చూస్తున్నారు . ఈ సమయం లో ఆర్ధిక పరిజ్ఞాన మున్న వారు  సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలను తెలియ చేస్తూ  భయాలను , అపోహలను పోగొట్ట వలసిన అవసరం ఉంది . 
                        కష్టాలలో ఉన్న రాష్ట్రానికి  హోదా , ప్రత్యేక ప్యాకేజి కంటే ముందు , కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయము తప్పనిసరి . పన్నుల్లో రాష్ట్ర వాటా ని త్వరగా కేటాయించాలన్నా ,  FRBM నిబంధనలను కొద్దిగా సడలించి రాష్ట్ర రుణ పరపతిని పెంచాలన్నా , విదేశీ రుణాలతో నెలకొల్పే ప్రాజెక్ట్ లకు గారంటీ  ఇవ్వాలన్నా , కేంద్రీయ సంస్థలను స్థాపన చేయాలన్నా , కేంద్ద్రంతో సయోధ్య తప్పనిసరి . కేంద్రాన్ని కాదని ఇవేమీ ముందుకు సాగవు . కాబట్టి కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయము , సయోధ్య అత్యంత అవసరం .  
  •  వెనుకబడిన ప్రాంతాలను గుర్తించాలి . సహజం గా మన రాష్ట్రం లో ఉన్న 13 జిల్లాలలో , రాయలసీమ 4 మరియు ఉత్తరాంధ్ర 3 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని అందరికి తెలిసిందే . కాబట్టి ఈ జిల్లాలలో ముందుగా ప్రభుత్వ భూములను గుర్తించి లాండ్ బాంక్ లు ఏర్పరచి ,పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించాలి . దీనికి ముందుగా రాష్ట్ర -కేంద్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి రావాలి .
  • పెట్టుబడి లో  25 నుండి 40 శాతం ప్రోత్సాహక సాయం ( enhanced investment allowance ) మరియు ఏడాదికి 30 శాతం చొప్పున తరుగుదల లెక్కింపు , మొదలైన ప్రోత్సాహకాలు పారిశ్రామికవేత్త లకు  కేంద్రం ఇవ్వాలి . అలాగే రాష్ట్ర ప్రభుత్వం  పరిశ్రమలకు మొదటి రెండేళ్లు 30 శాతం ఉచిత కరెంట్ ఇవ్వాలి . 
  •  పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ లో మూడు భాగాలు ఉన్నాయి . ఒకటి సాగునీటి ప్రాజెక్ట్ , తాగునీటి పధకం , జల విద్యుత్ ప్రాజెక్ట్ . మొత్తానికి కలిపి 2011 లెక్కల ప్రకారం 16వేల  కోట్లు  ఖర్చు అయ్యే ప్రాజెక్ట్  అని  కేంద్రం అంటుంది . దీనిలో విభజనకు ముందే సుమారు 5000 కోట్ల పనులు పూర్తయ్యాయి . కాబట్టి ఇంకా అవసరమయ్యే 11000 కోట్లలో సుమారు 8000 కోట్లు (సాగునీటి ప్రాజెక్ట్  కి మాత్రమే ) ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చ్చింది . కానీ ఇది సరి పోదు . ఎందుకంటే 2016 లెక్కల ప్రకారం  మూడు విభాగాల మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు అంచనా 26 వేల కోట్లు . దీంట్లో 5000 కోట్లు  విభజనకి ముందే ఖర్చు పెట్టేశారు . ఈ  విషయాన్ని దృష్టిలో పెట్టు కోవాలి . కాబట్టి 2014 ఏప్రిల్ నుండి మూడు విభాగాల తో కూడిన  మొత్తం ప్రాజెక్ట్ కి అయ్యే ఖర్చు మొత్తం  కేంద్రమే  భరించాలి . ప్రాజెక్ట్ లు ఆలస్యమైన కొద్దీ ఖర్చు పెరిగిపోతా ఉంటుంది . రాష్ట్రానికే నిర్మాణ బాధ్యత అప్పగించినా , ఆలస్యమైతే పెరిగే ఖర్చుని కూడా భర్తీ చేయాలన్న నిబంధన తప్పనిసరి గా ఉండాలి .అంతే కాదు ,రాష్ట్రం . గత 2 ఏళ్లలో పోలవరం పైన  సుమారు 4000 కోట్లు ఖర్చు పెట్టారు . కాబట్టి  ఆ డబ్బు కూడా కేంద్రం  రీ ఎంబర్స్ చేయాలి.  
  • 2014-15 ఆర్ధిక సంవత్సరం లో రెవెన్యూ లోటు 14000 కోట్లు అని కేంద్రమే ఒప్పుకొంది . ఇదంతా కేంద్రమే భరించాలి . కానీ ఇప్పటివరకు కేవలం 2000 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చ్చింది . మిగతా 12000 కోట్లు ఎప్పటి కిచ్ఛేను? కేంద్రం వెంటనే ఇవ్వాలి .
  • సంక్షేమ పథకాలైన రైతు ,చేనేత కార్మికుల , ద్వాక్రా గ్రూపుల కు రుణ మాఫీ , అలాగే చంద్రన్న కానుకలు మొదలైన వాటివలన ఇంతగా ఖర్చు పెట్టారని కేంద్రం గుర్రుగా ఉంది. 10 వ PRC  వలన నెల వారీ జీతాల బిల్లు 2100 కోట్ల నుండి అమాంతం 3400 కోట్లకు అనగా 1300 కోట్ల భారం ఏటా పడుతుంది . ఇంతగా రైతు ,చేనేత ,ద్వాక్రా ,ఉద్యోగుల సంక్షేమానికి పాటు బడటం వలన ఆదాయ వనరులు 12 శాతం పెరిగినా కూడా ఇంకా 14000 కోట్లు లోటు ఉంది .  

సంక్షేమం , అభివృద్ధి అనేది పాలకులకు రెండు కళ్ళ వంటివి . అందరినీ కలుపుకొని , అందరికీ సుఖశాంతులు అందిస్తూ (Inclusive growth) ముందుకు పోవలసిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి గట్టిగా నమ్ముతున్నారు . అంతెందుకు, మొన్నటివరకు రైతురుణ మాఫీని విమర్శించిన మోడీ గారే గుజరాత్ , తదితర  BJP  పాలిత  రాష్ట్రాలలో  రైతులరుణ మాఫీ లేకాదు,  చంద్రబాబు గారికంటే ఎక్కువ హామీలు గుప్పించారు. 
  • కాబట్టి కేంద్రం, రాష్ట్రంలోని పరిస్థితులను గమనించి , వెంటనే రెవెన్యూ ( ఆదాయ ) లోటుని పూడ్చాలి. 2014-15  16079 కోట్లు . దీనిలో 2303 కోట్లు కేంద్రం ఇచ్చ్చింది . మిగతా 13776 కోట్లు వెంటనే  ఇవ్వాలి . 2015-16 పద్దు కింద 5000 కోట్లు ఇవ్వాలి .2016-17 పద్దు కింద 5000 కోట్లు ఇవ్వాలి . ఏది ఏమైనా ఏడాదికి సుమారు 5000 కోట్ల రెవెన్యూ ( ఆదాయ ) లోటు ఉంటుంది . కనీసం 10 ఏళ్ల పాటు కేంద్రమే ఈ లోటుని భర్తీ చేయాలి . 
  •  ఇంకో విషయాన్ని కూడా గమనించాలి . ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ పెట్టడం మంచిది కాదు . కానీ , పేదలకు రెండు లక్షల ఇళ్లు  , పోలవరం ప్రాజెక్ట్ , కోర్ కాపిటల్ భవనాలు  వచ్ఛే 3 ఏళ్లలో పూర్తి చేయడానికి , ఆదాయానికి మించి ఖర్చు పెట్టక తప్పదు . 
  • పరిశ్రమలకు , వ్యవసాయ రుణాలకు రాయితీలు ఇవ్వాలి .
  • కనీసం వచ్ఛే ఐదు ఏళ్లలో 20000 కోట్లు రాజధాని కోర్ భవనాలకు , మౌలిక సదుపాయాలకు ఖర్చు అవుతుంది . 

దీనివల్లనే ఫిస్కల్ లోటు కూడా ఇబ్బడి ముబ్బడి గా పెరగక తప్పడం లేదు . 
ప్రస్తుతం , ప్రభుత్వం ఏటా సుమారు 15000 కోట్లు అప్పు తీసు కొంటుంది . నాబార్డ్, ప్రపంచబ్యాంక్,ఆసియన్ అభివృద్ధి బాంక్ లేకాదు, రాష్ట్రప్రజలనుండికూడా బాండ్ ల అమ్మకం ద్వారా నిధులు సమకూర్చుకునే అవసరం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రేపటి బడ్జెట్ లో ఆంధ్రాకి న్యాయం చేయాలి. 
అలాజరగని పక్షంలో మీనమేషాలు లెక్కించకుండా వెంటనే NDA  ప్రభుత్వం నుండి తప్పుకొని నిరసన ప్రకటించాలి. కావాలంటే బయటనుండి అంశాలవారీగా మద్దతు ప్రకటించుకోవచ్చు. 
ఆంధ్ర ప్రభుత్వానికి ,  జమిలి ఎన్నికలకు వెళ్ళవలసిన అవసరం లేదు . ఖర్చు ఎక్కువైనా ప్రభుత్వం పూర్తికాలం నిలబడి,పోలవరాన్ని పాక్షికం గానైనా పూర్తి చేసి సాగునీరు అందించే ఏర్పాటు, రాజధాని భవనాల నిర్మాణం పూర్తి చేసే ఏర్పాటు జరిగిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళవచ్చు. 

మోడీ పై ఉన్న వ్యతిరేకత దానితో కలిసివుండే పార్టీలపై పడటం ఖాయం. 
మోడీ కొన్నివిషయాలలో ముఖ్యంగా మంచి  విదేశీ పాలసీలు,అవినీతిరహితమైన  పాలన చేసినా , ప్రజాస్వామ్య విలువలను,నియమాలను తోసిరాజని ఒంటెత్తు పోకడలు పోవడం,పైపెచ్చు అటు హిందూ వాదులకు, ఇటు మైనారిటీలకు కూడా అసం తృప్తి కలిగించడం,రాష్ట్రాల మనోభావాలను  పట్టించుకోకపోవడం, నియంతమాదిరి గా కనిపించడం,  రాజకీయలబ్ది కోసం,తమిళనాడు సంక్షోభాన్ని అవకాశంగా మలచుకొని,అవినీతితో కుళ్లిపోయిన DMK వారిని కలవడం, 2 G కేసులను నీరుగార్చారని న్యాయస్థానమే ఆక్రోశించడం,గుజరాత్,బీహార్ ఎన్నికల సమయంలో మోడీ ప్రవర్తన, మెజారిటీ దక్షిణ భారతీయులకు రుచించడం లేదు. 

4 ఏళ్ళక్రితం  మోడీని ఎంతగానో ఆరాధించిన సినిమా నటులు, వివిధ వృత్తిలో ఉన్నవారే , నేడు మోడీ ని అసహ్యించు కొంటున్నారు. దీనికి కారణం ఆయన  తీసుకొన్న నిర్ణయాలను సరైన రీతిలో కమ్యూనికేట్ చేయలేకపోవడమే అనిపిస్తుంది. మన్ కి బాత్ లాంటి ప్రోగ్రాములు ఎన్ని చేసినా ఆయన మాటల్లో స్వచ్ఛత ,సమర్ధత కనబడుతుంది గానీ,క్షేత్రస్థాయిలో అస్సలేమీ కనబడటం లేదు. దీనితో ఆయన మాటల్లో విశ్వాసం తగ్గిపోతుంది.  పైపెచ్చు ఆయనకీ ఉన్న పరిజ్ఞానం పైన కూడా అనుమానం కలుగుతుంది. ఆయనలో పైకి కనబడే హుందాతనం , ఆచరణలో కనబడటం లేదు. 
 దేశాన్ని మార్చాలనే తపనను ఆయనలో చూసే ఓట్లు వేశారు. కానీ,కేవలం ఆయన పార్టీని మాత్రమే బలవత్తరం చేసుకొంటున్నారు తప్ప రాష్ట్రాల కు  సమాన భాగస్వామ్యం ఇచ్చే ఫెడరల్ స్ఫూర్తికి  తూట్లు పొడుస్తున్నారు. 
ఆంధ్రాలో కూడా అవినీతి కేసుల్లో కోర్టు విచారణలో  ఉన్నవారితో సంబంధాలు పెట్టుకోవడం ,రాజకీయ లబ్ది  కోసం విలువలను త్యజించడం లాంటి  చర్యలు మోడీ యొక్క  స్వచ్ఛత ను మకిలి పట్టించేశాయి. 
ఎన్నికలున్న రాష్ట్రాలకు లక్షలకోట్లు ఖరీదు చేసే హామీలు గుప్పించే మోడీ, ఆంద్ర రాష్ట్రానికి న్యాయంగా రావలసిన సౌకర్యాలను కూడా ప్రకటించకపోవడం, తెలుగు వారందరినీ కలచివేస్తుంది . 
మోడీ చేసేది.చూసేది దేశం మొత్తం అభివృద్ధి కావచ్చు,అలాగని ఆంధ్రుల మనోభావాలను,గాయాలను పట్టించుకోనపుడు, మిగతా దేశం గురించి ఆంధ్రులకెందుకు? ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ను సమానంగా చూసినప్పుడే ఆయనపై గౌరవం ఉంటుంది. అలాకాక,కేవలం రాజకీయలబ్ధినే పరమావధిగా చూస్తే , ప్రధానమంత్రైనా ఒక్కటే, ట్రంపైనా ఒక్కటే! గౌరవం కోల్పోతారు.  
చంద్రబాబు లేదా జగన్ లేదా పవన్ లాంటి వుత్సాహిక రాజకీయనాయకులెవరైనా, స్వలాభం కోసం, స్వరక్షణ కోసం 5కోట్ల ఆంధ్రుల సంక్షేమాన్ని ఫణంగా పెడితే  వారి గొయ్యి వారే తవ్వుకొన్నట్లే! 
ప్రాంతీయపార్టీ లేవైనా  మోడీతో గానీ,భవిష్యత్ లో  మోడీలాంటి కేంద్ర పాలకులతో గానీ  కలిసివుంటే ఆంధ్రాలో   పతనం  కాక తప్పదు.  దీనికి ఉదాహరణ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ దుస్థితి !

No comments:

Post a Comment