Search This Blog

Wednesday, 7 February 2018

కోసూరు క్షత్రియులు - క్షత్రియ చరిత్ర. -1వ భాగం

కోసూరులో (కృష్ణాజిల్లా)  క్షత్రియ కుటుంబాలు ఉన్నాయని ఇంతకు  మునుపు చెప్పుకొన్నాం. వీరికి, గోదావరి క్షత్రియులకు తేడా ఉందని  కొన్ని అపోహలున్నాయి. బ్రాహ్మణులలో ఎన్ని శాఖలున్నాయో క్షత్రియులలో కూడా అన్ని శాఖలున్నాయి. ఆ శాఖలకు మరోపేరే వంశం.  ఆంధ్రాలో నాలుగు వంశాలున్నా , సూర్య,చంద్ర వంశం వారి మధ్యనే ఎక్కువగా వివాహ సంబంధాలు జరుగుతున్నాయి.ఉత్తరభారతం నుండి వలసలు మొదలై ,కృష్ణా ,గోదావరీ నదీ తీరాల వెంబడి వారి జీవనం సాగింది .
నిజానికి వేదకాలంలో కులాలు అనే చీలికలు లేవు. కేవలం 4  వర్ణాలు ,అదీ స్వభావాన్ని,వృత్తిప్రవృత్తులను బట్టి నిర్ణయించే వారే తప్ప,పుట్టుకను బట్టి నిర్ణయించే వ్యవస్థలెదు.

మరాఠా క్షత్రియులలో  లో 96 శాఖలున్నాయి . అలాగే  రాజస్థాన్ రాజపుట్ లు  ,హర్యానా లో జాట్ లు, ఉత్తరప్రదేశ్ లో ఠాకూర్ లు,  ఇంకా అనేకరాష్ట్రాలలో భిన్న మైన పేర్లతో క్షత్రియులున్నారు.తమిళనాడులో అరసు ,ఒడయార్ లు, నాయకర్ లు, కర్ణాటకలో బంటూ లు , కేరళలో మలబార్  నాయర్ లు, ఉత్తరప్రదేశ్ లో ఖేత్రీ లు, ఒరిస్సాలో ఖండైట్  లు , బెంగాల్ లో పోలియా మరియు ఆగూరియా లు  క్షత్రియులుగా ఉన్నారు.

నిజానికి క్షత్రియులంటే ఎవరు? 
ఈ ప్రశ్నకు జవాబు చాలాకష్టం . సమాజపరంగా ,ఆర్ధిక స్థితిగతుల పరంగా  మానవసమూహాలను  వర్గాలుగా విడదీసి చూస్తున్న కాలమిది. క్షత్రియ అనే పదము వేదకాలములో వృత్తి-ప్రవ్రుత్తి లను బట్టి , రాజన్యులకు,వీరులకు ,రక్షణచేసి శాంతిని స్థాపన చేసేవారికి ఇచ్చిన నామం. తర్వాత ఇతిహాస పురాణకాలంలో వృత్తి-ప్రవ్రుత్తి లకు సంబంధం లేకుండా , పుట్టుకను అనుసరించి తరతరాలుగా  క్షత్రియుల వంశం అనే పేరు వాడుకలోకి వచ్చింది. తర్వాత కాలంలో వంశ మూలపురుషుడు, కొలిచే దైవం,ఆచారసాంప్రదాయాలను బట్టి  క్షత్రియ వర్గంలోనే  4 వంశాలు.. . సూర్య-చంద్ర-అగ్ని-నాగ వంశాలు మొదలయ్యాయి.  కుల గురువు ని అనుసరించి గోత్రం,  ఋషిప్రవర , మూలపురుషులను అనుసరించి రాజప్రవర  వాడుకలోకి వచ్చాయి. 
 క్షత్రియ'అనేపదం వీరత్వం,ధీరత్వం,శూరత్వానికి చిహ్నంగా వాడుకలోకి వచ్చింది. మనదేశంలోని భిన్న సామ్రాజ్యాలను  క్షత్రియులు మాత్రమే స్థాపించి పాలన చేయలేదు. ఇతర వర్ణాలవారు కూడా పాలన చేశారు. ఉదాహరణకు కణ్వ సామ్రాజ్యం బ్రాహ్మణ వర్ణం వారు స్థాపన చేసి పాలించారు. శాతవాహనులు కూడా క్షత్రియవర్ణానికి చెందినవారు కాదని కొందరు చరిత్రకారుల భావన. అలాగే క్షహ రాటులు మధ్య ఆసియా నుండి వచ్చి ఇక్కడనే స్థిరపడి శక సామ్రాజ్యాన్ని స్థాపించారు. అలాగే కుషాణులనే వాళ్ళు పశ్చిమ రష్యా ప్రాంతం నుండి వచ్చి పాలించారు. వారిలో కనిష్కుడు మంచి రాజుగా  పేరు పొందాడు.   
గుప్తులు క్షత్రియ వర్ణానికి చెందినవారు కాదు. 


 క్రీస్తుపూర్వం 2000 ఏళ్ల కాలాన్ని ఇతిహాస,పురాణ కాల మంటారు. ఆ కాలంలో  రాజన్యులకు,రాజగురువులకు మధ్యన సంఘర్షణ వలన బ్రాహ్మణులు ,క్షత్రియులనే వర్గాల మధ్య  వైషమ్యం పెచ్చు మీరుతా ఉండేది. కాలక్రమంలో  బ్రాహ్మణులు (రాజగురువులు) వేదాలకు వక్రభాష్యాలు చెప్పు కొంటూ ఎవరికీ తోచిన విధంగా వారు వాఖ్యానాలు ప్రచారం చేస్తూ యజ్ఞయాగాలకు  విపరీతార్ధాలు తీస్తూ దానాలు,బలులు ప్రోత్సహిస్తూ ఒక విధంగా
వ్యవసాయ,పాడిపంట ల ఉత్పత్తి ని వారే దోచేస్తూ ఉండేవారు. రాజన్యులు ( క్షత్రియులు ) ఇది గమనించి తిరుగుబాటు చేస్తూ ఉండేవాళ్లు. ఆలా మొదలైన వారే జైన మహావీరుడు,బౌద్ధ సిద్ధార్థుడు.  వీరిద్దరూ రాజన్యులే.
వేదానికి విపరీతార్ధాలను  వాఖ్యానిస్తూ బ్రాహ్మణ మతం ఎప్పుడైతే ప్రజలను భయపెట్టి ,ప్రలోభపెట్టి మతంగా మారి పీడించడం మొదలుపెట్టిందో అపుడే భిన్న ఆలోచనా ధారలతో జైన,బౌద్ధ మతాల రూపంలో సమాజంలో తిరుగుబాటు మొదలైంది.

ఇతిహాస పురాణకాలంలో సంస్కృత భాష స్థానంలో ప్రాకృతం,బ్రహ్మి ,పాళీ ,దేవనాగరి బయల్దేరడానికి కూడా ఒక కారణం ఉంది. బ్రాహ్మణ మతం వారి సంస్కృత భాషను పక్కనపెట్టి వారికీ వ్యతిరేకమైన భావజాలాన్ని వ్యాపితం చేయాలంటే జనం మాట్లాడే యాసలో భాష తేలికగా ఉండాలనే ఉద్దేశ్యంతో వివిధ భాషలు పరివ్యాపితం చెందాయి.

మధ్య ఆసియా అనగా నేటి ఇరాన్,ఇరాక్, సిరియా,టర్కీ ప్రాంతం,అలాగే నేటి ఆఫ్ఘనిస్థాన్, సియస్దాన్ , పాకిస్థాన్ ప్రాంతాలు, అలాగే అజర్ బైజాన్, కజకిస్థాన్, మొదలైన పశ్చిమ రష్యా ప్రాంతం,పశ్చిమ చైనా ,మంగోలు ప్రాంతాలన్నీ భరత ఖండంలో కలిసిఉండేవి. రకరకాల జాతులు,కొందరు మొరటుగా,జిప్సీ  జీవితం గడిపేవాళ్లు,మరికొందరు మైదానప్రాంతాలవాళ్ళు కొంచెం నాజూకుగా ఉండేవాళ్ళు ... ఇలా  భిన్న జాతులన్నింటినీ మ్లేచ్చు లనే వాళ్ళు ఇండియాలోఉన్న బ్రాహ్మణులు . కానీ కాలం గడిచిన కొద్దీ ఈ మ్లేచ్చులన బడే జాతులు  ప్రస్తుతం  నార్త్ ఇండియా  గా చెప్పుకొంటున్న  ప్రాంతాలపై  దాడులు చేస్తూ కొంతకాలానికి  ఇక్కడనే ఉండిపోయి కొత్త రాజ్యాలు స్థాపన చేసుకొని స్థానిక ప్రజలతో  కలిసిపోయి వారి ఆచారాలు పాటిస్తూ వివాహాలు చేసుకొంటూ
కలిసిపోయారు. కొన్ని సార్లు గ్రీకులు,రోమన్లు కూడా సముద్రాన్ని దాటి టర్కీ మీదుగా ఉత్తరభారతం పై దండయాత్రలు చేసి వారూ ఇక్కడనే ఉండిపోయారు.

ఈ విధంగా భిన్నజాతులు ... వారినే ఇండో-పార్దియన్ లు , ఇండో-సిథియన్ లు (శకులు )  , ఇండో-బాక్ట్రియన్ లు , ఇండో-గ్రీకులు , ఇండో-మంగోలియన్ లు  (కుషాణులు), భిన్న భాషలు,యాసలు,భిన్న శరీర ఆకృతులు,ముఖ కవళికలు,భిన్న భావజాలం తో   ఉత్తరభారతం పై కి తోసుకు వచ్చినా, మెజారిటీ జాతులన్నీ స్థానికంగా ఉన్న ఆచారసాంప్రదాయాలను  ఆచరిస్తూ వారూ క్షత్రియులలెక్క ఈ భారత సమాజంలో చెలామణీ అయ్యారు. ఎందుకంటే వారు శారీరకంగా బలవంతులు, మొరటువారు. యుద్ధవిద్యలలో నిష్ణాతులు. స్థానికంగా ఉన్న బ్రాహ్మణులను ఎదిరిస్తూ ఉన్న స్థానిక క్షత్రియులకు వీరు తోడవ్వడంతో ముఖ్యంగా క్షత్రియ మతాలైన బౌద్ధ,జైన మతాలకు బాగా  ఊపొచ్చింది. అలాగని అందరూ క్షత్రియులుగా మారారని చెప్పలేం.  కొంతమంది నాజూకు వాళ్ళు  తెలివి ఎక్కువగా ఉన్నవాళ్లు బ్రాహ్మణు  వర్గంలో కలిసిపోయారు. మరికొందరు వారుచేసే పనిని బట్టి,  సూద్రులుగా ,వైస్యులుగా చెలామణీ అయ్యారు.
ఇలా  గత 4000 ఏళ్లుగా ఉత్తరభారత మరియు మధ్య భారత ప్రాంతం భిన్న జాతుల కలగూర గంపగా మారిపోయింది. జన్యు పరీక్షలలో కూడా తేలింది ఇది.
దీనిని బట్టి మనం అర్ధం చేసుకో వలసింది ఏమిటి?
 శుంగ వంశస్తులు, కణ్వ వంశం, శాతవాహనులు,మౌర్యులు,గుప్తులు , రాజులు ,వర్మలు, చాళుక్యులు, చోళులు , ఇక్ష్వాకులు , తదితర క్షత్రియ వర్గం వారు ,... వీరందరూ  ఉత్తర,మధ్యభారత ములో  స్థానికంగా ఉన్న క్షత్రియ వంశాలకు చెందిన వాళ్ళే తప్ప మధ్య ఆసియా నుండి వచ్చిన మ్లేచ్చులు కాదు.  కానీ, పల్లవులు,రాజపుత్రులు , జాట్ లు ,ఠాకూర్ లు ,   పైన చెప్పుకొన్న మధ్యఆసియా కి చెందిన భిన్న జాతుల నుండి వ్యాప్తి చెందిన వారే!
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, స్థానిక క్షత్రియులైనా , మధ్యఆసియా , పశ్చిమ రష్య  నుండి వలస వచ్చి  క్షత్రియులుగా చెలామణీ ఐనవారైనా అందరూ కూడా మన భారతీయ ఆచారసాంప్రదాయాలను, హిందూ బ్రాహ్మణ మతమో లేక జైన బౌధ్ధమతాన్నో అనుసరించి భారతీయతకు వన్నెలు అద్దినవారే!
సూర్య,చంద్ర,అగ్ని,నాగ  వంశాలనేవి ఆయా మూలజాతుల ఆచార సంప్రదాయాలను బట్టి అనూచానంగా వచ్చినవే!

మనిషి భిన్నరకాలుగా ఆలోచిస్తాడు. అందుకే భిన్నంగా కనిపిస్తాడు. ఆలోచన'అనేది లేకుంటే మనుషులందరూ ఒక్కటే'!
శరీరనిర్మాణం ,ముఖకవళికలనేవి ప్రాంతాన్ని బట్టి,ఆహారాన్ని ,వాతావరణ స్థితులను బట్టి భిన్నరకాలుగా పరిణామం చెందుతూ ఉంటాయి. చెబితే ఆశ్చర్యపోతారు. నేటి బ్రిటిష్ వారి మూలపురుషుడు తెల్లవాడుకాదు, నల్లవాడే!అంతేకాదు, మానసిక నిర్మాణం అనగా  ఎక్కువ శాతం ఆలోచనలు కూడా వంశ పారంపర్యంగా  వస్తాయి. అందుకే,ఒకే  వంశంలో ని  మానవులలో శరీర,మానసిక నిర్మాణం లో పోలికలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమాజంలో జీవించాలంటే మంచి బలమైన దేహనిర్మాణం,  స్థిరమైన భావాలూ,ఆలోచనలు  ఉన్న సంతానం అవసరం. దీని కోసం వంశము,గోత్రము అనేవి వ్యాప్తి చేశారు .ఇది సాధ్యపడాలంటే పటిష్టమైన  వివాహ వ్యవస్థ ఉండాలని దానిని ఆచరించారు.    ఈ విషయం, మన జన్యు పరోశోధనలలో ముఖ్యంగా "Y" క్రోమోజోమ్
యెక్క సున్నితత్వాన్ని కాపాడుకోవడానికి గోత్రం,వివాహ వ్యవస్థ అత్యవసరం అని తేలింది .


క్రీస్తు శకం మొదటి వేయి సంవత్సరాలలో  అనగా క్రీస్తుశకం 1 నుండి 10 వ శతాబ్దం వరకు , మధ్యప్రదేశ్క్ష,రాజస్థాన్,మహారాష్ట్ర   ప్రదేశాలనుండి క్షత్రియ కుటుంబాలు  దక్షిణా పదానికి వలస వచ్చి నెమ్మదిగా రాజ్యాలు స్థాపించుకొన్నాయి. ఆలా వచ్చిన వాళ్లలో పెద్దరాజ్యాన్ని స్థాపన చేసింది శాతవాహనులు.
పల్లవులు,చాళుక్యులు,పరిచేది , చోళులు ,ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు,కాకతీయులు   ఆ తర్వాత దక్షిణా పదాన్ని శాసించారు. వీరందరూ జన్మత : క్షత్రియులని చెప్పలేము. రాజ్యం వీరభోజ్యం . వీరులకే రాజ్యం దక్కుతుంది.  తెలివైన మంత్రాంగం, ప్రజా పాలన సరిగా ఉంటె  ఆ రాజ వంశం నిలబడు తుంది .

 నిజానికి వేద కాలంలో జన్మనిబట్టి వర్ణం నిర్ణయించే ఆచారం లేదు. కేవలం గుణాలను, వృత్తి ప్రవ్రుత్తి లను ఆధారం చేసుకొని వర్ణ నిర్ణయం జరిగేది. కానీ క్రీస్తు పూర్వం 1000 ఏళ్ళక్రితం నుండే ఈ ఆచారం మంటగలిసిపోయి కేవలం జన్మను బట్టి వర్ణ నిర్ణయం జరిగేది.  క్రమేణా వర్ణాలు కులాలుగా మారడం అనేది క్రీస్తుశకం 15 వ శతాబ్దం తర్వాతనే అని చరిత్రకారులు చెప్పారు. ఇందులో వాస్తవమెంతో ఇంకా నిర్ణయించ వలసిఉంది .

11 వ శతాబ్దం నుండి మొదలైన గజనీ, మొగలాయీలు , తురుష్కుల దండయాత్రల వలన క్షత్రియ వంశాలు చిన్నాభిన్నమైపోయాయి .కకావికలమైపోయి దేశం నాలుగు చెరగులా వలసలు పోయారు.విదేశీ మూకల నిర్దాక్షిణ్యమైన అణచి వేత తర్వాత , మందుగుండు సామాను వచ్చి పడటంతో కత్తి కటారు యుద్ధవిద్యలకు  ఆదరణ,అవసరం తీరిపోయింది. అలాగే క్షత్రియ పాలకుల వంశాలు కూడా ప్రాణభయంతో చెట్టుకొక్కరు,పుట్టకొక్కరు లా చెల్లా చెదురై పోయారు. కేవలం 50 వంశాలు నిలదిక్కుకొని సంస్థానాలను ఏలుకొంటూ ఉన్న స్థితిలో మాజీప్రధాని  ఇందిరా గాంధీ  ఒక్క పెన్ను పోటుతో వాటన్నింటినీ రద్దు చేసి బిచ్చ గాళ్ళ లెక్క మార్చేసింది.

నిజానికి  ఎవరైతే సమాజంలో  ఘర్షణలను తగ్గించి శాంతిని స్థాపన చేస్తారో వారే క్షత్రియులు . ఇది ఒక రాచ కుటుంబంలో పుట్టినంత మాత్రాన అబ్బే  లక్షణం కాదు. ఆంధ్ర క్షత్రియులని తొట్టతొలుత చెప్పు కొనే వారిలో ప్రప్రథమ వంశం శాతవాహన వంశం . ఈ వంశం వాళ్ళు మౌర్యులతర్వాత సుమారు 300 ఏళ్ళు,నేటి తెలంగాణ,ఆంధ్ర, మహారాష్ట్ర ప్రాంతాలను పాలించారు.

గౌతమీ పుత్ర శాతకర్ణి,  నేటి గుజరాత్,సౌరాష్ట్ర ప్రాంతాన్ని పాలించే శక రాజు  క్షత్రప మారాజు ని ఓడించడంతో , శక వంశం నెమ్మదిగా కనుమరుగైపోయింది . కానీ ఆ శకులే , క్షత్రపులని, క్షహరాటులని ,క్షత్రియులని వ్యవహరించడం క్రమేణా జరిగింది.
కాబట్టి రాజ్యాలు పాలించేవారే క్షత్రియులు కానక్కరలేదు. గత 2000 ఏళ్లలో వివిధ వర్ణాలు రాజులుగా,చక్రవర్తులుగా పాలించారు.  కానీ సైనికులుగా, దళపతులుగా, చమూ పతులుగా ఎక్కువ శాతం క్షత్రియ వర్ణం వారు ఉండేవాళ్లు.
సూద్రులలో ఎన్ని శాఖలున్నాయో,అలాగే క్షత్రియులలో కూడా ఎన్నో శాఖలున్నాయ్. అవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. క్షత్రియ ధర్మాన్ని ,సంప్రదాయాన్ని పాటిస్తూ శాంతిని నెలకొల్పే ఏ మనిషైనా క్షత్రియుడే!

చర్మం రంగు,ముఖ కవళికలు , మనస్తత్వం అనేవి ఒక గుంపులో ఒకే రకంగా దగ్గర పోలికలతో  ఉంటాయి.
ఒకే రకమైన పక్షులు,పశువులు గుంపులుగా జీవిస్తాయి. మరి మనిషికి తెలివి,వాక్కు , హృదయచైతన్యం ఉన్నాయి. మరి మనిషి కూడా పశు పక్ష్యాదులు లాగ బతకవలసిందేనా?

( తర్వాత  2 వ భాగం  ). 

No comments:

Post a Comment