BJP వాళ్ళు ఇచ్చామని
అంటారు.
ఏదో కొద్దిగా
విదిల్చారు,ఇవ్వవలసింది చాలాఉంది,సమయం మించిపోతుంది అని TDP వాళ్లంటారు.
కానీ ఆంధ్రులందరు ముక్తకంఠంతో ఒకటే మాట చెబుతున్నారు. "మోడీ నమ్మించి ముంచేశాడు. ... "
మామూలుగా అన్ని
రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా కూడా ఇవ్వడం లేదు . పన్నులో రాష్ట్ర వాటా గా ఇవ్వవలసిన నిధులను కూడా తొక్కి పట్టి నెమ్మదిగా
ఇస్తున్నాడు.
నిజానికి ఆంధ్రప్రదేశ్
పునర్ వ్యవస్థీకృత చట్టంలోని హామీ లన్నీ కూడా ఈ పాటికి పూర్తి చేయకపోయినా కనీసం పట్టా లెక్కించాలి. అదేమీ చేయడం లేదు .
- అడిగినవాటికి, ఇచ్చిన వాటికి పొంతన లేదని ఆంద్ర ప్రజలు,తెలుగుదేశం పార్టీవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విభజన నేపథ్యంలో తీవ్ర
ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ఆర్థిక లోటు రూ.16,500 కోట్లు అయితే, కేంద్రం రూ.7,500
కోట్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించిందని, అందులోను ఇంకా రూ.3,382 కోట్లు
విడుదల చేయాల్సి ఉంది.
- పోలవరంకు ఏపీ రూ.7,.431 కోట్లు ఖర్చు పెడితే కేంద్రం
నుంచి వచ్చిన నిధులు రూ.4,323 కోట్లు.
- నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఏపీ అడిగింది రూ.11వేల
కోట్లు అయితే మంజూరు చేసింది రూ.2500 కోట్లు, అందులో విడుదల చేసింది రూ.1500
కోట్లు.
- చట్టం ప్రకారం, సుమారు 15 జాతీయ విద్యా సంస్థలను ఈ 5 ఏళ్లలో పూర్తి చేయాలి. కనీసం ప్రహరీ గోడలు కూడా కట్టలేదు.
- చట్టం ప్రకారం రైల్వే జోన్ ఇవ్వాలి. అది ఖర్చుకి సంబంధంలేని చిన్న పాలసీ
మార్పు. ఒరిస్సా అభ్యంతరం చెబుతుందనే సాకు చూపించి, అదీ నెరవేర్చలేదు .
- చట్టం ప్రకారం రాజధాని అమరావతి నిర్మాణానికి సాయం చేయాలి. ఏదో కాస్త
బిచ్చమ్ వేశారు. అదీ విజయవాడ,గుంటూరు నగరాలకే ఇచారుతప్ప పునాదులనుండి
నిర్మించు కోవలసి ఉన్న రాజధానికి ఓ చిన్న మట్టిపాకేట్ తప్ప కనీసం చిల్లిగవ్వకూడ ఇవ్వలేదు.
మోడీ, మాటకారే తప్ప చేతల మనిషి కాదని
క్రమేణా భారతీయులందరూ గ్రహిస్తున్నారు.
No comments:
Post a Comment