చట్టప్రకారం చేయవలసిన పనులు కూడా చేయడం లేదు మోడీ ప్రభుత్వం అని ఆంధ్రుల ఆరోపణ. ఈ చట్టంలో ఏముందో ఒక్కసారి పరిశీలిద్దాం...
- ఆదాయము,ఆస్తుల పంపకం : జనాభా నిష్పత్తిని ఆధారం చేసుకొని పంపకాలు చేయాలి. పంపకాలలో గొడవలొస్తే కాగ్ సహకారంతో పరిష్కరించి ఉత్తర్వుల ద్వారా పరిష్కరించాలి తప్ప ఆలస్యం చేయకూడదు. ఏడాదిలోపే ఈ పంపకాలు పూర్తి చేయాలి.
- పోలీసువ్యవస్థ : గ్రే హౌండ్ మరియు ఆక్టోపస్ లాంటి శిక్షణా సంస్థలను 3ఏళ్లలో ఆంధ్రాలో స్థాపించాలి.
- Center must give Helping hand to A.P. state. సాయం :
- తొట్టతొలి సంవత్సరంలో (2014-15) ఉన్న లోటుబడ్జెట్ కి సరిపడా నిధులివ్వాలి.
- అలాగే కేంద్రం గ్రాంట్ రూపంలో ప్రతి ఏటా సాయం అందించాలి.
- పరిశ్రమలను ఆకర్షించడానికి అవసరమైన సాయాన్ని అందించే రీతిలో కొత్త ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూడాలి. (special package).
- మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలి . విద్యా / వైద్య / సాంకేతిక / పరిశోధనా సంస్థలను 5ఏళ్లలో ఏర్పాటు చేయాలి .
- రోడ్ ,రైల్ ,ఎయిర్ నెట్వర్క్ ని బాగా విస్తరించాలి. అంతేకాదు దుగరాజపట్నం ఓడరేవు, కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలి. మూడుప్రధాన నగరాలలో మెట్రో సదుపాయం ఇవ్వాలి. వీటన్నింటికీ సరిపడా నిధులను కేంద్రం 5ఏళ్లలో అందివ్వాలి.
- పోలవరం జాతీయప్రాజెక్ట్ గా ప్రకటించి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో అనుమతిచ్చిన హంద్రీ నీవా లాంటి మిగతా సాగునీటి ప్రాజెక్ట్ లన్నీ కేంద్రమే పూర్తి సాయం ఇవ్వాలి.
పరిశీలించి చూడండి . ఇప్పటికే 4 ఏళ్ళు అయిపోయింది. పైన ఉన్న చట్టంలోని ఏ విషయాన్ని కూడా మోడీ ప్రభుత్వం అమలు చేయలేదు. కేవలం డ్రామా ఆడుతూ కాలం వృధా చేశారు . మిగతా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఇస్తున్నారు తప్ప,స్పెషల్ గా ఏమీ సాయం ఇవ్వడం లేదు. పైపెచ్చు ఎక్కడ ఎలక్షన్ లు ఉంటే ఆ రాష్ట్రానికి వేల కోట్లు గుమ్మరిస్తూ, తానూ ఒక సాదా రాజకీయనాయకుడి మాదిరి ప్రవర్తిస్తున్నారు.
ఇలా ఏడిపిస్తున్నారనే , వివిధ కేంద్ర పథకాలనుండి కొద్దికొద్దిగా నిధులను పోలవరానికి,ఇతర సాగునీటి ప్రాజెక్ట్ లకు మల్లించి తన తిప్పలు తాను పడుతుంది ఆంద్ర ప్రభుత్వం.
కేంద్రంలోని మోడీ &కో , ఇంకా మాయమాటలతో మోసం చేదాం అని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.
అఖిల పార్టీ మీటింగ్ పెట్టి గొడవలు చేస్తేనే కేంద్రం దారికొస్తుంది.
సమయం మించిపోతుంది..
సరైన నిర్ణయం సరైన సమయంలో ఆచరణలో పెట్టాలి చంద్రబాబు.
No comments:
Post a Comment