మన ఆంధ్రాలో , ఒక ఎకరాలో వరి పండించడానికి ,విత్తనాలు,ఎరువులు,పురుగుమందులు, మానవవనరుల కూలీ ,ట్రాక్టర్ ఖర్చులన్నీ కలిపి ఒకపంటకు సుమారు 30000/ అవుతుంది. ఎకరాకి సరాసరిగా 30బస్తాల దిగుబడి అనుకొందాం. అంటే, బస్తాకి అవుతున్నఖర్చు ,సుమారుగా 1000/-అవుతుంది. జైట్లీ 2018 బడ్జెట్ లో ఏమిచెప్పారు? ఖర్చుకి 150శాతం ఎక్కువకలిపి మద్దతు ధరగా నిర్ణయించ
మన్నాడు . అంటే బస్తాకి 2500/- ధరగా నిర్ణయించాలి .
స్వామినాధన్ కమిటీ చెప్పినట్లు చేయాలంటే 75kg. వరి బస్తాకి కనీస మద్దతు ధర రూ . 3000/- గా నిర్ణయించాలి .
ఇలా చేయగలిగితే రైతు ఆదాయం రెట్టింపు అవుతుంది. కానీ ఇంత గా మద్దతు ధర పెంచాలంటే మార్కెట్ డైనమిక్స్ దోహద పడాలి. మార్కెట్ ని శాసించాలంటే , ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఆలా చేయడానికి ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదుగదా?!
మరి రైతేమి చేయాలి?
ఎకరా వరి వ్యవసాయానికి కేవలం రూ . 10000/- కంటే ఎక్కువ ఖర్చు కాకుండా జాగ్రత్త పడాలి.
పాలు,వెన్న,గుడ్లు ,కూరల ను ఇంట్లోనే ఉత్పత్తి చేసుకోవాలి.
పరిసరాలను,తాగునీటిని పరిశుభ్రంగా ఉంచుకొంటే సగం జబ్బులు రాకుండా కాపాడుకో వచ్చు.
ఇవన్నీ నిజమవ్వాలంటే,అనుభజ్ఞులేమి చెప్పారో చూద్దాం .
1. గో ఆధారిత సేంద్రియ ,ప్రక్రుతి వ్యవసాయం చేపట్టాలి. కనీసం రెండు పాడిపశువులుండాలి. పెరట్లోనే హైడ్రోఫోనిక్స్ ద్వారా పశుగ్రాసం, కూరగాయలు పెంచుకోవాలి.
2. జీవాలు .. కనీసం రెండు గొర్రెలు ,10కోళ్లు పెంచుకోవాలి .
3.సమతుల్యమైన ఆహారాన్ని తీసుకొంటూ, ఆల్కహాల్,పొగత్రాగడం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. అపుడే మనదేశానికి గ్రామ స్వరాజ్యం వచ్చినట్లు ...
No comments:
Post a Comment