Search This Blog

Friday 30 March 2018

మోదీ ముక్త్ భారత్'. - Lets throw away the Modi!

మోడీ ఏమిచేశాడో పరిశీలిస్తే సగటు భారతీయుడి కడుపు మండక మానదు. గత 4ఏళ్లలో మోడీ చేసినన్ని నినాదాలు,గిమ్మిక్ లు మరే ప్రధానీ చేయలేదు. అలాగే మోడీ వేసినన్ని రంగు రంగుల కోట్లు మరెవ్వరూ వేయరు,వేయలేరు. 
కాలికి చక్రాలు కట్టుకొని ప్రపంచాన్ని చుట్టేయడం, ఎదురుగా కనబడిన ఇతర దేశాధినేతలను కౌగలించు కోవడం, బాంక్ లపై విశ్వాసాన్ని దెబ్బతీయడం, దొంగలతో ,నేరస్తులతో జట్టు కట్టడం, రాజకీయలబ్ధికోసం కొందరు నేరస్థులను వదిలివేయడం, లక్షలకోట్ల ప్రజా ధనానికి విలువలేకుండా చేయడం అత్యంత గర్హనీయమైన నేరాలు. ఇన్ని నేరాలు చేసికూడా గర్వంగా ఛాతీ విరుసుకుని తిరుగుతూ ఉన్నాడంటే అది మన చేతకానితనమే!

2016 నవంబర్ లో మోడీ చేసిన ఓ అనాలోచిత చర్య భారతదేశాన్ని, సగటు భారతీయుడిని ఎంతలా కుంగదీసిందో చూస్తే, ఇదే ఏ కమ్యూనిస్ట్ దేశంలో ఐతే మోడీని ఈ పాటికి అభిశంసన చేసేసి ఉరి తీసే వాళ్ళు. నోట్ల రద్దు అనే పిడుగు బడా బాబులను ఏమీ కదిలించ లేకపోయింది. పైగా మధ్యతరగతి,కింది తరగతి భారతీయులను మాత్రం నానా కష్టాల పాలు చేసింది. 

పెద్దనోట్ల రద్దు అని చెప్పి అంతకంటే పెద్ద 2000 నోట్లను ముదిరించినపుడే, చంద్రబాబు లాంటి అనుభవజ్ఞులు అది తప్పని హెచ్చరించారు. అయినా మోడీ మొండితనం ముందు అవేమీ నిలవలేదు. 
నాలుగురకాల స్లాబులతో GST ని ప్రవేశపెట్టడం,ప్రతినెలా మార్పు చేర్పులు చేయడం, ప్రతి 3నెలలకు చిన్నా చితకా వ్యాపారులను రిటర్న్ లు పంపమని జులుం చేయడం 30శాతం వ్యాపారాలు మూతపడటానికి కారణమైంది. 
ఆయిల్ దిగుమతుల బిల్లు బాగా తగ్గిపోయినా కూడా రోజు రోజుకీ ఆయిల్ ధరలు పెంచేయడం, దేశ ఆర్ధిక గమనానికి తీవ్ర విఘాతమైంది.  
                              లక్షలాది భారతీయుల విషాద చరిత్ర ను ఒక సారి పరిశీలిద్దాం. 
  భారతీయ గ్రామీణ ప్రాంతంలో 5కోట్ల వ్యవసాయ కూలీ కుటుంబాలున్నాయి. మరో 13కోట్ల కుటుంబాలు తమకున్న చిన్న చిన్న కమతాలలో అతికష్టం మీద పంటలు పండిస్తూ తమ కడుపులు నింపుకోలేక పోవడమే కాక ఏటికేడు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. మోడీ చేసిన తెలివి తక్కువ నోట్లరద్దు ఈ మొత్తం 18కోట్ల కుటుంబాల డొక్కలను ఎండ గట్టి వారిని రోడ్డు పై పడేసింది. నోట్లరద్దు' అనే పిడుగుపాటు వలన,  వీరి ఆదాయం గత ఏడాదిగా 40శాతం తగ్గిపోయింది. అంతేకాదు వట్టిపోయిన పశువులను అమ్ముకో నివ్వకుండా చేసిన చట్టం వలన రైతులు ఇంకా కుంగిపోయారు. అటు పశువులను పెంచలేక,ఇటు వాటిని అమ్ముకోలేక నానా యాతన పడుతున్నారు.
  18కోట్ల కుటుంబాలలో సగటున రెండు ఓట్లు చొప్పున 36 కోట్ల ఓట్లు మోడీకి వ్యతిరేకంగా పడుతాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

సరే గ్రామీణ భారతాన్ని కుంగదీసిన మోడీ అనాలోచిత చర్యలు,మధ్యతరగతి పట్టణవాసులను కూడా ప్రభావితం చేసిందా?
ముందుగా చెప్పుకో వలసింది నిరుద్యోగం . అవినీతినైనా సహిస్తారు గానీ,పని దొరక్కపోవడాన్ని భారతీయ యువత సహించలేరు. ప్రతి రోజూ
  సుమారు 30000 మంది పనిచేయగల యువత పనికోసం భారతీయ సమాజంలోకి వస్తున్నారు. మరి వీరందరికీ ఏమైనా ఉద్యోగాలు కల్పించాడా మోడీ? స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా" అంటూ పిచ్చి పిచ్చి నినాదాలతో కాలం గడిపేశాడు తప్ప ఒక్క ఉద్యోగం కూడా కొత్తది ఇవ్వలేకపోయాడు మోడీ!
కొత్త ఉద్యోగాలు కాదు, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతా ఉంటె జనంలో అశాంతి పెరగదా?
  పెద్దనోట్ల రద్దు తర్వాత 6నెలలలో సుమారు 20 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి అంటే సమాజంలో ఎంత అశాంతి పెట్రేగిందో మోడీ గానీ, మోడీ చుట్టూ మూగిఉన్న మేధావుల కోటరీ గానీ  అర్ధం చేసుకోలేదు. ఒక ఉద్యోగం నలుగురిని బతికిస్తుందీ అనుకొంటే సుమారు 80 లక్షల మంది ప్రజలు డొక్కలు ఎండిపోతున్నాయి . ఇవేమీ మోడీకి తెలియదు. ఎందుకంటే అతడు ఒక కుహనా మేధావి.
తోలుపరిశ్రమలు మూతపడిపోవడానికి కారణం ఎవరు? మోడీ! ఆటను చేసిన తుగ్లక్ చర్యలవలన
కబేళాలు మూసేయడం వలన తోళ్ళపరిశ్రమకు తోళ్ళు అందలేదు. దానితో  ఆ పరిశ్రమలపై ఆధారపడిన సుమారు మిలియన్ మంది ఉద్యోగాలు పోయాయి.
వస్త్ర పరిశ్రమల లో 30% మూతపడటానికి కారణం ఎవరు? మోడీ! అతను ప్రవేశపెట్టి సరిగ్గా అమలుచేయలేకపోతున్న పన్ను విధానాల వలన 30% బట్టల పరిశ్రమలు మూత పడిపోవడం వలన మరో మిలియన్  ఉద్యోగాలు పోయాయి.
ఇలా మోడీ అనాలోచిత,అతితెలివి చర్యలు దేశాన్ని ఆర్ధిక మాంద్యంలోకి నెట్టివేస్తున్నాయి. ఓ పక్క అమెరికా,యూరప్,చైనాలు ఆర్ధిక ప్రగతితో దూసుకు పోతూ ఉంటే , భారతదేశాన్ని మాంద్యంలోకి తోసివేసిన మోడీని ఏ చెప్పుతో కొట్టాలి?

ఆయిల్ దిగుమతుల బిల్లు గణ నీయంగా తగ్గినా కూడా ఇబ్బడిముబ్బడిగా పన్నులు, పన్నులమీద సెస్సులు వేసేసి పెట్రోల్,డీజిల్ ధరలను ఆకాశంలో నిలిపిన మోడీ వలన పచారీ సరకుల ధరలు,ధాన్యం ధరలు కొండెక్కి కూర్చున్నాయి.
 ఇలా అనేక విధాలుగా  భారతదేశాన్ని చేతులారా నాశనం చేసిన మోడీ కి ఏ శిక్ష వేయాలి?
చిన్న చిన్న వ్యాపారులు కూడా ప్రతి మూడు నెలలకు తట్టెడు పన్ను రిటర్న్ లు దాఖలు చేయాలంటే ఎలా కుదురుతుంది.
దేనిపైనా స్పష్టత లేని మోడీ, అన్ని శాఖలను తన అధీనంలో ఉంచుకొని కేవలం 10మంది  క్షేత్రస్థాయిలో అనుభవంలేని కుహనా మేధావులను వెంటేసుకొని  ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తావుంటే 
ఆపేవారెవరూ లేరా ?

అంతేకాదు, ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా,అక్కడ వాలిపోయి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి అమాయకులను మోసపుచ్చడం మోడీకి మామూలైపోయింది. 
తమిళనాడులో నీతి -అవినీతి అనే విచక్షణ ను పక్కన బెట్టి, ఉచ్చ నీచాలు మరచిపోయి, అటు DMK  ని, ఇటు అన్నా DMK లోని రెండువర్గాలను ఏక కాలంలో  దువ్వుతున్నాడు మోడీ. 
అలాగే ఆంధ్రాలో తనచేతిలో కీలుబొమ్మలా మెసలే రెండు సత్రకాయ పార్టీలను ఎగదోసి బలంగా ఉన్న చంద్రబాబుని అణగతొక్కి ఆంధ్రాలో మోడీ జెండా ఎగరవేయడానికి అతను చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. 
తాజాగా పదోతరగతి పరీక్ష పేపర్లు కూడా లీక్ చేయించి విద్యార్థులలో కూడా మోడీ పలుచనైపోయాడు. 2019లో ఈ విద్యార్థులకు కొత్తగా ఓటు హక్కు రాబోతుంది. మరి వీళ్ళు ఎవరికీ వ్యతిరేకంగా ఓటు వేస్తారో వివరించి చెప్పనక్కర లేదు. 
  అతని మాటే చెల్లిపోవాలనే అహం మూర్తీభవించిన మనిషి మోడీ  
మోడీకి కావలసింది అతను తాన అంటే తందానా అనే కీలుబొమ్మలు కావాలి. దానికోసం తనమాట వినని నాయకులపై  కేంద్ర నిఘా సంస్థలను వేట కుక్కల్లా ఉసికొల్పుతున్నాడు. శత్రువులపై లేని కేసులు పెట్టిస్తాడు. మిత్రులపై ఉన్నకేసులు నీరు గారుస్తాడు. ఇదీ ఫాసిజం. ఇది హిందూత్వ కానే  కాదు.   హిందువులను రక్షించే ఏకైక రక్షకుడుగా పేరుతెచ్చు కోవడానికి భారతదేశమంతటా  లేనిపోని అల్లర్లు,మతకలహాలు రెచ్చ గొట్టించి హిందువుల ఓట్లన్నీ గంప గుత్తగా భాజపా కే పడాలనే దురుదేశ్యంతో దేశంలో అశాంతి పుట్టిస్తున్నాడు. 
ఈ బాధలనుండి విముక్తి కలగాలంటే ఒక్కటే పరిష్కారం... అదే "మోదీ ముక్త్ భారత్'.


No comments:

Post a Comment