Search This Blog

Tuesday, 6 May 2014

సకల చరాచర సృష్టి ,మానవ సంబంధ బాంధవ్యాలు , మానవ జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞ - సర్వమూ విశ్వ చైతన్య లీల

అండపిండ బ్రహ్మాన్డాలతో  ,కృష్ణ బిలాలతో ,నెబ్యులాలతొ ,వాయుధూళి  తో నిరంతరం వ్యాపిస్తున్న ఈ సువిశాల అంతరిక్ష ము అలాగే ఈ విశ్వ సృష్టి వెనక ఎంతో తెలివైన చైతన్యము ఉందని ,విశ్వము ,మన మెదడు నిర్మాణం ఒకే రకం గా ఉందని నేడు శాస్త్ర వేత్తలు అంగీకరిస్తున్నారు .
మనం ఎలా ఐతే ఆలోచిస్తామో ,ఎలా ఐతే కల లు కంటామో -అలాగే విశ్వ చైతన్యం -అనగా మనం వ్యవహార పరం గా పిలిచుకొనే దేవుడు చేస్తున్న ఆలోచనలే -లీలలే- ఈ సువిశాల సృష్టి  -అని నేటి శాస్త్రజ్ఞులు ఒప్పుకొంటున్నారు .
Scientists always talk about consciousness being the underlying fabric of the universe from which all things emerge (M-theory, string theory, Unified Field Theory, etc. see work of Dr. Amit Goswami and Dr. John Hagelin). 
So not only is the fabric of the universe conscious like a brain, it is growing like a brain as well. 
But here’s a question…a brain to what? Is it possible we exist as a thought within the mind of some Super Intelligence? 
Are we just brain cells operating within a Cosmic Mind? Maybe, maybe not, but it’s fascinating to think about. - See more at: http://www.spiritscienceandmetaphysics.com/physicists-find-evidence-that-the-universe-is-a-giant-brain/#sthash.2McIOe3o.dpuf.

Researchers report in a new study  that they have found regions of the brain that seem to impact a person's level of spirituality. కానీ మనం తెలుసు కోవలసింది ఏమిటీ అంటే ,మన కారణ శరీరం అనగా మన సంచిత కర్మ వాసనా గుణాల బట్టే మన మెదడు రూపు దిద్దుకొంటుంది . 
యద్భావమ్ తద్భవతి . ముందు భావం -ఆ తర్వాత పదార్ధం . ముందు చైతన్యం - ఆ తర్వాత విశ్వ సృష్టి . 
ముందు కర్మ వాసనా కారణ శరీరం - తర్వాత మన పంచ భౌతిక శరీరం . 

లేవండి . మనలోని ప్రేమ జ్యోతిని జ్ఞానం తో వెలిగిద్దాం

ప్రస్థాన త్రయా లైన భగవద్గీత ,ఉపనిషత్ లు ,బ్రహ్మ సూత్రాలు ;
పంచ సంప్రదాయ భాష్య కారులు - మధ్వాచార్య ,రామానుజాచార్య ,వల్లభాచార్య ,నింబార్క ,శంకరాచార్యులు - నుడివిన పూర్ణ ప్రజ్ఞ భాష్యం ,శ్రీ భాష్యం,సర్వజ్ఞ భాష్యం,పారిజాత సౌరభ భాష్యం,శరీరక భాష్యం---- ఇవన్నీ భగవంతుడు   అనగా  సంపూర్ణ ప్రజ్ఞ - అని చెబుతూ జీవుడికి ,దేవుడికి మధ్యన ఉండీ లేనట్లు ఉన్న  సన్నటి గీత పైనే విబేదిస్తారు .
మనిషి ఎలా తి రగనియ్యి . అరిషద్వార్గాలతో ఎంతగా కు త కుత లాడనియ్యి . మరింతగా బ్రష్టు పట్టి పోనియ్ .
కాని చివరకు -రోజులు,ఏళ్ళు .యుగాలు- గడిచినాక అయినా -ఆ మనిషిలో -ఆ జీవిలో , ఉన్న ప్రేమైక దైవ స్వరూపాన్ని ఆవిష్క రించు కోక తప్పదు .
pure love of god is eternally situated in every one's heart and it only needs to be awakened!

Friday, 2 May 2014

ఇదే యదార్ధం - తత్ సత్ -ఓం తత్సత్

 ఆత్మ అనగా అర్ధం ఏమిటి ?
సవిస్తార చైతన్య  సముద్రం లో ఓ చిన్న కెరటం ఆత్మ . 
శక్తి  కి త్రిగుణాలుంటాయి . మూడు గుణాలు సమ స్థితిలో  ఉండే శుద్ద స్వరూపం ఆత్మ .
అలాంటి స్థితిలో ఉన్న శక్తి లో గుణ సమ స్థితి తప్పినప్పుడు కలిగేది మాయ .
దానినే మనిషి లో మనస్సు అని అంటాము .
పదార్ధానికి  ఒక్క  ఆకర్షణ మాత్రమే ఉంటుంది .( గ్రహాలకు ,అణువులకు మధ్యన ఆకర్షణ )
కాని శక్తికి ఆకర్షణ ,వికర్షణ రెండూ  ఉంటాయి . ఈ  తత్వ మే శక్తి స్వరూపమైన మనస్సుకీ ఉంటుంది .
ఇదే ద్వందం . రాగము ద్వేషము ;సంకల్పము ,వికల్పము .

పదార్ధమే  పూర్తి  యదార్థం  కాదు .(either material or energy are  not absolute truth)
పదార్ధం , మనస్సు , ఆత్మ ఇవన్నీ కలిసి చైతన్యం లో ఇమిడి ఉంటాయి .
 అంటే చైతన్యమే యదార్ధం . అదే శుద్ద సత్యం .

                                 ధ్యాన సాధన - ధ్యాన స్థితి 
Be a witness:
భౌతిక విషయాలను , ఇంద్రియాల లో కలిగే స్పందనలను  సాక్షీభూతం గా గమనించడ మే సాధన . ఆ  విధం గా సాధన చేస్తూ ఉంటే ఏదో ఒక క్షణం లో ధ్యానం సిదిస్తుం ది .
ఆ ధ్యాన స్థితి లో  యదార్ధ స్థితిని అనుభూతిస్తామ్ .
  ధ్యానం లో మనస్సు పని చేయదు . అలాంటప్పుడు అనుభూతి ఎలా కలుగుతుంది ?
పుట్టి బుద్దెరిగినాక మన దైనందిన వ్యవహారాలన్నీ మనస్సుతో చేస్తాము . మనస్సుతో అనుభూతిస్తాము. 
మనస్సు లేకపోవడం ,మనస్సుని అధిగమించడం అనేది మన అనుభవంలో లేనిది . 
ప్రతిదీ 'మనస్సు తో' అలవాటైన మనకు ఆత్మ గత అనుభూతి గురించి ఏమీ తెల్వదు . 
ఎంత చెప్పినా ,చదివినా ,ఉపన్యాసాలు విన్నా సాధన చేయకపోతే ఎప్పటికీ ఆత్మ ని గుర్తించ లేము . 

మన శరీరం , మనస్సు ,ప్రాణం  -ఇవన్నీ ఆత్మ ప్రకాశం వలనే పని చేస్తాయి .
ఆత్మ చైతన్యం తో నే మనస్సు పని చేస్తుంది . ఆత్మ ప్రకాశం తో నే ఆత్మను అనుభూతిం చడం ధ్యానం .
మనస్సు పని చేస్తే ద్వందం ఉంటుంది . మనస్సు పనిచెయ నప్పుడు మిగిలేది ఒక్కటే . అదే ఆత్మ . అదే చైతన్యం . అదే ఎరుక . అదే సత్ చిత్ ఆనందం . ఆ స్థితిలో చూడ బడేది ,చూసేది ,చూపు - ఇవన్నీ విడి విడి గా ఉండక అన్నీ కలిసి ఏకమవుతాయి .
మనస్సు పైన చిత్తం , దాని పైన బుద్ది ,దానికి పైన అహం - ఇలా పదార్ధం వివిధ స్థాయులలో స్పందనలు చేస్తుంది .
అరిషడ్వర్గాలు , సమస్త కోరికలు ,రాగ ద్వేషాలు అన్నీ మనస్సులోనే రూపు దిద్దుకొంటా యి . కానీ వీటికి మూలం చిత్తం లో ని వాసనలు ,తత్వాలు ,గుణాలు . కాబట్టి చిత్తాన్ని శుద్ది చేయకుండా మనస్సుని నియంత్రించు కొనే సాధనాలు ఎన్ని చేసినా సరైన ఫలితం ఉండదు .
చిత్తాన్ని ఎలా శుద్ది చేసుకోవాలి ? 
వివేకము తో కూడిన వైరాగ్య భావనలను, సాక్షీ త్వం ను  ప్రతిరోజూ ,ప్రతి క్షణమూ అభ్యాసం చేయాలి .
నవ విధ భక్తీ మార్గాలు కూడా చిత్తాన్ని శుద్ది చేస్తాయి .
ఎన్నో యుగాల నుండి పేరుకుపోయిన కర్మ వాసనలను సమూలం  గా భస్మం చేయాలి .
సాక్షీ భూత కర్మాచరణ ,కర్మ ఫల అనాసక్తి వలన మనస్సులో స్పందనలు తగ్గుతాయి . చిత్తం లో ఎలాంటి కర్మ పోగు పడదు .
ఎన్నో యోగ క్రియలు ,ఆసన ముద్రలు ,నాడీ శుద్ది క్రియలు ,ప్రాణ శుద్ది క్రియలు - ఇవన్నీ పంచ కోశ శు ద్దీకరణ లో భాగాలే .
చిత్త  శుద్ది  లేని శివ పూజ లేల ?భాండ శుద్ది లేని పాకమేల ?
కాబట్టి ముందు  చిత్త శుద్ది . తర్వాతే ఆత్మావిష్కరణ .
మోహం క్షయ మవ్వడమే మోక్షం .
అహం అణిగి సోహం గా మిగలటమే  శరణాగతి .
ఓం ప్రధమం మనకు శ్రద్ద ,ఓర్పు పుష్కలం గా ఉండాలి .


క్షత్రియ భారతం -మొదటి భాగం .

 సనాతన భారతావని లో  వేద కాలం లో 'కులము' అనే పదం లేదు . ఉన్నదల్లా వర్ణ మే . వర్ణ మనేది ఆయా మనుషుల గుణాలు , చేసే వ్రుత్తి ,ప్రవ్రుత్తి పైన ఆధారపడి యుండేది . అది కర్కశమ్ గా ఉండేది కాదు . శూ ద్ర వృత్తిలో ఉన్నా  వాడి సంతానం బ్రాహ్మణ్యం చేసుకోవచ్చు . వైశ్యుడు క్షత్రియుడి గా మార వచ్చు .
  • ప్రజలను కన్న  బిడ్డల మాదిరి పాలించి కాపాడే వాడు క్షత్రియుడు . 
  •  ఎలా బతికితే సుఖ సంతోషాలు ఉంటాయో  బుద్ది చెప్పి,పరానికి పనికొచ్చే ధర్మాలను చెప్పే వాడు బ్రాహ్మణుడు . 
  • అవసరాలకు కావలసిన వస్తు సామగ్రిని పైకానికి అందించే వాడు వైశ్యుడు . 
  • పాడి  - పంట పండించి , పనులు చేసే వాడు శూద్రుడు . 
  • పరం కోసం ,సత్య శోధనకి మౌనం గా తపం చేసుకొనే వారు మునులు . 
  • శాస్త్రాలను శోధించి , నిజాలను కనిపెట్టి సామాన్యులకు వాటి ఫలాలను అందించే వారు ఋషులు . 
  • విద్య అంగడి సరుకు కాదు . 
  • అన్నం అమ్మే వస్తువు కాదు . - ఇదీ వేద కాలం నాటి సంఘ స్థితి . 
భారత వర్షం అంటే అటు రష్యా లోని ఓల్గా నదీ తీరం నుండి ఇటు మధ్య ఆసియా లోని టైగ్రిస్ యూఫ్రటిస్ తీరాలను చుట్టి  మన గంగా సింధు సరస్వతీ మైదానాల మీదుగా గోదావరి,కావేరి దాటి అటు బ్రహ్మ పుత్రా , బర్మా లోని ఇరావతి , ఇండోనేసియా లోని బాలి ,కాలిమంతాన్ నదుల మీదుగా కంబోడియా లోని మెకాంగ్ నది వరకు వ్యాపించి ఉన్న మహా ప్రాంతం .

ద్వాపర యుగపు ఆఖరి రోజులు . కలియుగం ఆరంభం లో జరిగిన మహా భారత యుద్ధం లో సమస్త భూమండలమ్ లోని క్షత్రియులు నశించి  పోగా ,బతికిఉన్న సైనికులు ,దళపతులు చిన్న చిన్న జన పదాలను ఆక్రమించుకొని రాజులుగా చెలామణీ అయ్యారు . కానీ వారికి రాజ నీ తి లో గానీ , రాజ ధర్మం పై గానీ ప్రవేశము లేదు . పట్టు లేదు .
బలవంతుడే రాజు . తెలివున్న వాడే అధికారి . కాస్త కండ ఉన్నోడే బంటు . 

 ఎప్పుడైతే రాజ ధర్మం నశించి , ఒక ధర్మం , పద్దతి లేని మనుషులు రాజులుగా - పాలకులుగా మారి రాజ ధర్మం తప్పి నప్పుడు , అలాగే సంఘం లోని ఇతర  వర్ణాల వారు కూడ ఆయా సంఘ నియమాలు పాటించ నప్పుడు ,బ్రాహ్మణ వర్ణం వారు తిండికి మాడి పోయారు . అప్పుడు ,కొందరు బ్రాహ్మణులు పొట్టకోసం అనేక నియమ నిష్టలు , వేద ప్రామాణికం కాని  క్రతువులు , మూడ నమ్మకాలు ప్రచారం చేసి ,వేదము లోని మర్మాలను ,జ్ఞానాన్ని కప్పిపుచ్చడానికి అవాకులు చెవాకులు ప్రవేశ పెట్టారు .
బ్రాహ్మణులు తప్ప మరే ఇతర వర్ణం వారు వేదాలు చదవకుండా అలాగే జ్ఞాన విజ్ఞాన ధార అందరికీ అందకుండా ఎన్నో తప్పుడు పనులు చేశారు .
ఎప్పుడైతే జ్హ్నాన  ధార పది మందికీ అందకుండా పోయిందో అప్పుడే భారత జాతి జవజీవాలు ఉడిగిపోయాయి .
ఒక జాతిని నిర్వీర్యం చేయా లంటే వారిని చంప వలసిన పని లేదు . వారికున్న జ్ఞాన సంపదను వారి తర్వాతి తరాలకు అం ద కుండా చేస్తే చాలు . 
విద్య లేని వాడు వింత పశువు అనే సామెత అలా వచ్చిందే . 
బల వంతపు మత మార్పిడులు చేసి భుజాలు చరచు కొనక్కర లేదు . 
మత గ్రంధాలను  అంద  కుండా  చేస్తే చాలు -ఆ మతం క్రమేణా కనుమరు గవుతుం ది. 

శాస్త్రాలు , వేదాలలోని నిజాలను మరుగు పరిచి కర్మ కాం డలు ప్రవేశ పెట్టి ఆనాటి జీవ సంపదను -గోవులు,మేకలు,బర్రెల ను -దానము రూపమ్ లో లేదా హోమ క్రతువుల బలి రూపం లో స్వీకరించే వారు .
సంఘ శాంతికి తోడ్పడ వలసిన వారి జ్ఞానం పక్క దారి పట్టి మొత్తం సంఘాన్ని బ్రష్టు పట్టించింది . విద్యని అమ్మకానికి పెట్టినది అప్పుడే .

మహా భారత యుద్ధం మొత్తం జాతిని, అప్పటికే బ్రష్టు పట్టిన వ్యవస్థను నాశనమ్ చేసింది .

పాలించే వారి ఆకృత్యాలు మితి మీరినప్పుడల్లా  భగ వంతుడు ఏదో ఒక రూపమ్ లో వచ్చి లెక్క సరిచేస్తాడు .

వేద కాలం నుండి క్షత్రియ ,బ్రాహ్మణ వర్ణాల మధ్య జరుగుతున్న ఆధి పత్య  పోరులో జరిగిన  సంఘటనలు భారత దేశ చరిత్ర ని రకరకాలుగా మార్చి వేశాయి .
సమాజం లో రెండు వర్గాల మధ్య పోరు నాడు ఉంది . నేడు ఉంది .ఎప్పుడూ ఉంటానే ఉంటుంది .
వేద కాలంలో  మొదటి స్థానం లో ఉన్న క్షత్రియులు క్రమం గా రెండో స్థానానికి జారారు . ఋగ్వేద కాలం లో పుట్టుకతో కాక , గుణాలను బట్టి వర్ణం ఉండేది .

త్రేతా యుగం లో పరశురాముడు క్షత్రియ వంశాలను సమూలము గా నిర్మూ లించిన తర్వాత ఏర్పడిన అరాచకాన్ని అరికట్టే టందుకు చేసిన హోమాగ్ని నుండి 4 రాజపుత్ర వంశాలు -పరమార్ ,చౌహాన్ , ఉద్భ వించాయి . వీరే రాజపుట్ క్షత్రియులు లేదా అగ్ని వంశ క్షత్రియులు .

ఆం ధ్ర  క్షత్రియులు :

క్రీస్తుశకం 2వ శతాబ్దం లో శాతవాహనుల  తర్వాత  ఉత్తరా పధ మునకు చెంది కాలక్రమం లో దక్షిణా పదానికి వలస వచ్చిన  ఇక్ష్వాకులనే వారు, వారి  రాజ్యాలను  కృష్ణా నదీతీరమైదానాలలో స్థాపించారు . నాగార్జున కొండ రాజధానిగా భట్టిప్రోలు ,జగ్గయ్య పేట ,అమరావతి ప్రాంతాలను పాలించారు .
వాయు పురాణమ్ ప్రకారం ఇక్ష్వాకు 100 మంది సంతానం లో 48 మంది దక్షిణా పదానికి వలస వచ్చి చిన్న చిన్న రాజ్యాలు స్థాపించు కొన్నారు .
 బౌద్ద జైన సాహిత్యాన్ని తిరగేసినా ,అస్మక ,ములక,వేంగి రాజ్యాలు, వీరు స్థాపించిన వే .

ఇక్ష్వాకుల తర్వాత శాలంకాయనులు పల్లవ సామంతులుగా కృష్ణా గోదావరి ప్రాంతాన్ని పెదవేగి రాజధానిగా పాలించారు . వీరి తర్వాత విష్ణుకుండినులు, మిగతా క్షత్రియ వంశా లైన పరిచేది ,కోట , చాళుక్యలు గుంటూరు గోదావరి ,కృష్ణా సీమలను 300 ఏళ్ళ  పాటు పాలించారు .(5 నుండి 7 శతాబ్దం వరకు ).

చంద్ర వంశ క్షత్రియులైన తూర్పు చాళుక్యులు నే వేంగి చాళుక్యులు గా  పిలిచే వారు . వీరు పూర్వమ్   శాతవాహనులకు సామంతులు గా ఉండే వారు . వీరు ఎలమంచిలి , పిఠాపురం , ముదిగొండ ప్రాంతాలను పాలించారు .

మత్స్య రాజులు ముఖ్యం గా మత్స్య ప్రాంతం అనగా నేటి ఒరిస్సా కి చెందినా వారు .

చేది రాజులు కోణ ప్రాంతం అనగా నేటి కోన సీమ ని పాలించారు . తర్వాత కాలం లో చాళుక్య చోళ రాజులకు సామంతులుగా మారి చోడ రాజులుగా వ్యావహ రింప బడ్డారు . వీరి గోత్రం కాశ్యపస .

కాలచూరి,హైహేయ రాజులు మధ్య భారతానికి చెందినవారు .

ధనంజయ గోత్రీకులైన కోట వంశపు రాజులు ధరణికోట ని రాజధానిగా చేసుకొని 11,12 శతాబ్దం లో పాలించారు .

చాగి లేదా సాగి వంశ రాజులు చాలా కాలం చాళుక్యులకు సామంతులుగా ఉండి పోయారు .
ఆ తర్వాత కాకతీయులు , తర్వాత విజయనగర రాయలు పెద్ద రాజ్యాలు పాలించారు . కానీ వీరు క్షత్రియ వర్ణం నకు చెందినవారు కాదు .

Friday, 25 April 2014

క్షత్రియ లోకపు పిలుపు

రాబోయే పాలకులు పాలించే  5 ఏళ్ళు భారత దేశ  చరిత్రని తిరగ రాసే కాలం .

  • ముఖ్యం గా భారత సనాతన సంప్రదాయ పునరుద్దరణ ,
  • విదేశీ వ్యవహారాలలో అత్యంత చురుకైన పదునైన పధకాలు ,  రష్యా ,ఇజ్రాయేల్ ,శ్రీలంక,నేపాల్,ఇండోనేషియా  దేశాలతో సత్సంబంధాలు . పాకిస్తాన్,చైనాలకు దీటైన సమాధానం 
  • మానవ వనరులను అత్యంత ఎక్కువగా వినియోగించు కొనే పరిశ్రమలు దేశ వ్యాప్తం గా  నెలకొల్పడం , 
  • అంతరిక్ష జ్ఞానాన్ని ప్రజా బాహుళ్యానికి అందించే పరిశోధనలు , 
  • రెండో హరిత,క్షీర,నీలి విప్లవాలు , 
  • లింగ విచక్షణ ను రూపు మాపే కటిన చట్టాలు ,
  • యువత కి చేతి నిండా పని ,
  • రై తుకి మద్దతు పంట ధర , 
  • రక్షణ సామగ్రిని దేశ  వాళీగా తయారు చేసే ముమ్మర పరిశోధనలు . 
రాబోయే కాలమ్ లో  కాబోయే నాయకులకు , క్షత్రియ పరిషత్ లన్నీ నిస్వార్ధం గా వారి వంతు సహకారం అందించాలని ,బారత దేశ ఐక్యతని కాపాడుతూ ,సనాతన ధర్మ ధార అవిచ్చన్నం గా సాగడానికి అవిరళ కృషి సల్పాలని ప్రార్ధన . 

Sunday, 20 April 2014

క్షత్రియులందరూ ఒక్కటే .

12 వ శతాబ్దానికి పూర్వం భారత దే శ  క్షత్రియులలో ఎలాంటి భేదాలు లేవు . ఉత్తర ప్రాంత రాజ్ పుట్  లు ,దక్షిణ ప్రాంత మరాటా క్షత్రియుల మధ్య  సంభంధ బాంధవ్యాలు బాగా ఉండేవి .
24 బ్రహ్మ , 24 సూర్య , 24 శేష , 24 చంద్ర వంశాలు కలిపి మొత్తం 96 మరాటా క్షత్రియ వంశాలు మన భారత దేశాన్ని 17 , 18 శతాబ్దాలలో పాలించాయి .
కలియుగం ప్రారంభ దశలో , వ్యాసుడు ,వామ దేవుడు ,శుకుడు మొదలగు ఋషులు హిందూ మత  పునరుద్దరణకు ,భారత జాతి రక్షణకు ఏర్పరచిన 56 రాజ వంశాల నుండి 96 శాఖలుగా విస్తరిల్లిన మరాటా క్షత్రియ వంశాలు రాజస్థాన్ , కర్ణాటక ,మహారాష్ట్ర , మధ్య ప్రదే శ్  ,గోవా ,దక్కన్ ప్రాంతం ,గుజరాత్ లలో ప్రవర్దిల్లాయి . గోదావరి జిల్లా క్షత్రియులు రాజస్థాన్ రాజ్ పుట్ ల వారసులు . కృష్ణా జిల్లా క్షత్రియులు మరాటా క్షత్రియ వారసులు . పూర్వం క్షత్రియ దళాలు తమ విధి నిర్వహణలో అనేక ప్రాంతాలలో  స్థిర పడ్డారు . ముఖ్యం గా నదీ తీర ప్రాంతాల వెంబడి వారి సంచారం సాగేది .

కృష్ణా జిల్లా , కోసూరు  గ్రామం లోని మరికొందరి క్షత్రియుల కులగోత్రాల వివరాలు.

1. ఇంటిపేరు దళపతి   - చవాన్  క్లాన్  - - చంద్ర వంశం - మేవాడ్ రాజ్యం, గురువు వశిష్ట, వేదం రుగ్వేదం,గాయత్రి మంత్రం,క్లాన్ దేవత జ్వాలా ముఖీ భవాని.వశిష్ట గోత్రం .
ప్రవర . Prawar (Five) :- Angirasa, Brihaspati, Chyavana, Upamanyu and Saman *Guhyasutra :- Paraska 

2. ఇంటిపేరు జగతాప్ - జగతాప్వం శం - చంద్ర వంశ్ -భరత్పూర్ రాజ్యం -  జెండా పై గణపతి -ఖండేరా దేవత.

3. ఇంటి పేరు బుట్టె - జాదవ్ లేదా యాదవ్ క్లాన్ - -పసుపు రంగు జెండా-ధమ్మపాల గోత్రం -రుగ్వేదం - ప్రాంతం - వరంగల్,మధుర,దేవగిరి రాజ్యం -
*Gotra: Atri and Shavasaviti , అత్రి ,శవసవితి  లేదా ఆత్రేయస గోత్రం . 
*Pravar ;- Atri, Archan and Shavasaviti, 
*Veda: Rigveda ,
 *sign ;- Black, 
*Clan god (Kuladaivat):- Shreeshankar,Khandoba 
* Sect;- Nath

4.ఇంటి పేరు బోర్కాటి  లేదా బుర్ఘటే  - ధర్మదీర్ లేదా దందీర్ క్లాన్ . -బ్రహ్మ వంశం - చిత్తోడ్ ప్రాంతం - గాయత్రి మంత్రం - జెండా పై రుద్రుడు - కౌశిక్ రుషి .
Lineage: Bramhavansha, descended from the Brahmavanshi king Derik . 
Clan object: Pancha-pallava . *Guru: Kaushika rishi 
Gotra: Dorik *Veda: Rigveda *Mantra: Gayatri mantra. 



 .


Thursday, 10 April 2014

మతాన్ని రక్షించు కోవలసిన అవసరం ఉందా?

మతాన్ని రక్షించు కోవలసిన అవసరం ఉందా?
ఈ భౌతిక ప్రపంచం లో మనిషికి రక్షణ ఇచ్చే ది గుంపు . ఆ గుంపు  అనేది  కులం వల్లో , రంగు వలనో , ప్రాంతం వల్లో ఎలా వస్తుందో అంత  కన్నా బలం గా మతం ద్వారా వస్తుంది .
కాబట్టి పారమార్ధిక చింతన మీద శ్రద్ద నమ్మకం లేని వారు , మానవత్వాన్ని మతం తో ముడి పెట్టే వారు తమ మతమే గొప్పదని , అన్య మతాలు  ఒట్టి బోగస్ అని,తమ మత  సిద్దాంతాలను ప్రచారం చేసుకొంటూ ఇతర మతాలను తెగ నాడుతూ ఉంటారు .

నేటి కాలానికి మనిషిని ఒక బలమైన సమూహం గా పట్టి ఉంచేది మతం .
ఆక్రోశం లో , ఆపదలో ప్రార్ధన ,
కోరికలు తీరడానికి  చేసే క్రతువులు --- ఇవన్నీ మనిషికి అత్యంత అవసరం .
ఒక  జాతి జీవన విధానం, వారు అనుసరించే మతం  పై ఆధార పడి ఉంటుంది .
   ఎన్ని విషయాలలో ఏకాభిప్రాయం ఉంటే అంత  ప్రశాంతం గా సంఘం ఉంటుంది .
ఒక సామూహిక  సమ్మతిని ప్రోత్సహించేది మతం.
కాబట్టి మతాన్ని రక్షించు కోవలసిందే . అలాగని అన్య మతాలను ఈసడించు కొనక్కర లేదు .
భిన్న మతాల మధ్య ఆరోగ్య కర పోటీ అన్ని విషయాలలో అవసరమే .
మతం మనిషిని ఓదా ర్చుతుం ది .
ప్రాధమిక అవసరాలైన కూడు ,గుడ్డ ,నీడ , రక్షణ కరువైన వారికి ఆలంబన గా నిలిచే మతాన్ని ఎక్కువ మంది ఆదరిస్తారు,  అనుసరిస్తారు .
ఇవన్నీ తీరిన తర్వాతే మనిషి పరమార్ధ చింతన చేయ గలడు .
హిందూ మతం ఆధ్యాత్మిక తకు  ఎక్కువ ప్రాధాన్యత నిస్తుంది.