Search This Blog

Saturday, 22 December 2012

ఆధ్యాత్మికత

ఆధ్యాత్మిక జీవితం  అంటే  అన్ని పనులు వదిలేసి దైవ చింతన లో మునిగి పోవటం కాదు . గుళ్ళ కి వెళ్లి ,తీర్థ యాత్రలు చేసి ,పురాణ ప్రవచనాలు విని , జప తపాలు చేసి మళ్ళీ మామూలుగా అన్ని రకాల ద్వంద భావాలతో ,రాగ ద్వేషాలతో జీవనం సాగించడం  ఆధ్యాత్మికత కానే కాదు .
వయో వృద్దులు ఒక్కరే చేసేది కాదు .
 ఆధ్యాత్మికత ఇహానికి ,పరానికి రెంటికీ పని కొచ్చే సూత్రం .
 నిజాన్ని నమ్మటం ,నిజమైన స్వ  ధర్మాన్ని తెలుసుకొని  త్రికరణ శుద్ది గా పాటించడం , వయస్సుకి ,స్థితికి అనువైన నాలుగు ఆశ్రమాల నియమాలను అమలు చేయడం ఆధ్యాత్మికత .
పుట్టిన పసి వాడు తల్లి పాలు త్రాగటం ,20 గంటలు నిదుర పోవటం ఆధ్యాత్మికత .
బాల్య  వయస్సు లో మంచి ఆహారం ,ఆట పాటలతో ఆహ్లాదంగా గడపటం    ఆధ్యాత్మికత  .

విద్యార్ధి దశలో -  శరీర శుభ్రత , వ్యాయామం ,మంచి పోషక ఆహారం తినుట ,
స్వచ్చ మైన గాలిని ప్రాణా యామ పద్దతి లో శ్వా  సించుట ,
తల్లితండ్రులను అతిధి అభ్యాగతులను పూజించుట ,
గురువుని దైవం వలే నమ్మి విద్య నేర్చు కొనుట ఆధ్యాత్మికత .

తోటి మనిషికి , ప్రకృతికి హాని చేయక చాత  నైనంత సాయం చేయడం ,
వస్తూత్పత్తి చేసే వారిని  అనగా పంటలు పండించే రైతు ,పరిశ్రమలలో పనిచేసే కార్మికుడు , 
అలాగే మనలను రక్షించే వారిని,అనగా , సైనికులను , పోలీసులను , గౌరవించి ఆదరించడం ;
విజ్ఞానాన్ని పంచే గురువులను ,పరిశొధనలు చేసి కొత్త విషయాలు ఆవిష్కరించే శాస్త్రజ్ఞుల ను అనుసరించడం -ఆధ్యాత్మికత .
ప్రతి భాద్యత ,వ్రుత్తి, ప్రవ్రుత్తి  అన్నీ కర్తృత్వ భావన లేకుండా భగవద్ కైంకర్యం గా చేయడమే ఆధ్యాత్మికత .
మనషి  చిన్నప్పటి నుండి ఎలా ఆధ్యాత్మిక జీవనం సాగించాలో గీత చెబుతుంది .

Friday, 21 December 2012

జన్మ రహస్యాలు - ఆత్మ పరిణామం - దైవ నాటకం :


ఈ  జగత్ అంతా ఓ నిరంతర నాటకం . ఆడించేది దైవ శక్తి .
ఆడే వారు కూడ ఆత్మ లుగా మారిన దైవమే !
ఆత్మ స్వరూపులైన మనుషులు నిజం (స్వ స్వరూపం ) మరిచి , ద్వంద భావాలతో కొట్టు మిట్టాడ ట మే మాయ అని అద్వైతు లంటారు .
నేటి జన్మ లో ఉన్న సహజాత  లక్షణాలు ,ఆలోచనా
 సరళి ,వ్యక్తిత్వం , శరీర నిర్మాణం   - అన్నీ మన 
పూర్వ  జన్మల నుండి మోసుకొని (carry forward)  వస్తూనే  ఉంటాం .
సంచిత కర్మ ఒక ఫిక్సిడ్ డిపాజిట్  లాంటిది . ప్రారబ్ద కర్మ ప్రస్తుత జన్మ లో అనుభ వించ వలసిన కరెంట్ అకౌంట్ . ఆగామి కర్మ  ప్రస్తుత జన్మ లో కొత్తగా కూడ  బెట్టు కొనే కర్మ .

ప్రతి విషయమూ ,సంఘటన ,రాగ ద్వేషాలు ,
బంధాలు -అన్నీ మనం  జన్మించక మునుపే
 నిర్ణయింప బడి ఉంటాయి .అదే విధి (destiny ).

కానీ , ఎవరైతే జ్ఞాన సంపద తో వివేక వైరాగ్య విచక్షణ ల తో తన ఆలోచనా కర్మలను ద్వంద భావ రహితంగా ,సాక్షీ భావ ము తో అనుభ విస్తారో వారి పై  కర్మ భారము ,విధి పనిచేయవు . మనిషికి ఆ స్వాతంత్రం సాధించే శక్తి (free will) ,వెసులుబాటు ఉంది .
శరణాగతి , ధ్యానం  , కర్మఫల సన్యాసం  - వీటన్నింటి ద్వారా ఆత్మ జ్ఞానం  ,తద్వారా కర్మ -జన్మ చక్రం నుండి విముక్తి .

Tuesday, 18 December 2012

విద్యా విదానం శరణమ్ గచ్చామి :

సంఘం ఎలా ఉండాలి ? ఎలా ఉంటే శాంతి సంతోషాలు ఉంటాయి ?
సంఘం లోని ప్రజల జీవన విధానాన్ని సంస్కృతి అంటారు . ఈ    సంస్కృతి విధ్యా   విధానం పై ఆధార పడి ఉంటుంది .
విధ్యా   విధానం ----> సంస్కృతి ---->   శాంతి సంతోషాలు.

వేద ఋషులు రరకాల మానవ  మనస్తత్వాలను పరిశీలించి ,మనుషుల్లోని స్వార్ధము మొదలగు అరిష డ్వర్గాల సమ్మేళ నాన్ని,  వాటి వల్ల  వచ్చే పరిణామాలను అంచనా వేసి , వివాహ వ్యవస్థను , గుణ కర్మ ల కను గుణ మైన  వర్ణ   వ్యవస్థను (నేటి కుల వ్యవస్థ కాదు ) ప్రోత్స హించారు .
ఏ సంఘ మైనా ప్రజల జీవనోపాధి , జీవిత పర మావధి -రెంటినీ సమానం గా ఆదరించి నప్పుడే ,  అ సంఘం లో    శాంతి సంతోషాలు పరిడ విల్లు తాయి .
సత్వ గుణం ఉన్న ప్రజలకు ,  జీవిత పర మావధి కి అవసర మైన మానవ చైతన్య పరిణామ  లేదా ఆత్మ వికాసానికి  దారి చూపించే భాద్యత నిచ్చారు . వారు ధర్మ  , న్యాయ ,తర్క  ,మీమాంస ,రాజ నీతి  ,అర్ధ , ముహూర్త , జ్యోతిష , వ్యాకరణ, భాషా , వైద్య  ,మంత్ర ,యోగ ,ఆగమ శాస్త్రాలను రచించి ప్రజలకు మార్గ దర్శ నం చేసే వారు .

రజో గుణం ప్రధానంగా ఉన్న వారికి సంఘ రక్షణ భాద్యత లను అప్ప చెప్పారు . వారే కాల క్రమేణా క్షత్రియులుగా రాజ్యా ఏలారు .
జన పద మైనా ,గణ తంత్ర రాజ్య మైనా , పెద్ద సామ్రాజ్య మైనా రాజ గురువులు ,మంత్రి మండలి , న్యాయ ధర్మ మండలి రాజుకి పాలన లో సాయం చేసేవి .
రజో తమో గుణ మిశ్రమం ఉన్న వారికి వ్యాపార వృత్తిని ,సరకు కొని అమ్మే వృత్తిని కేటాయించారు .
తమో గుణం ప్రధానంగా ఉన్న వారికి వస్తూత్పత్తిని ,వ్యవసాయాన్ని కేటాయించారు .

వ్యక్తీ స్వ ధర్మాన్ని  నాలుగు పురుషార్ధా లైన  ధర్మార్ధ కామ మోక్షా లను  ధర్మంగా సాధించు తుంటే  , ఏ సమాజ మైనా ధర్మ బద్దం గా  నడిచి శాంతి సంతోషాల తో ఉంటుంది .
ధర్మానికి మూలం  మంచి విద్యా విధానం . 
విద్య జీవనోపాధి కే కాదు  , జీవిత పర మావధి  కీ ఉపయోగ పడి తేనె , ఆ విద్య సార్ధకం , ఆ సమాజం  బృందావనం అవుతుంది .

మనస్సున్న మనిషీ ! మేలుకో !

స్వయం చలిత నాడీ వ్యవస్థ (autonomous nervous system) చేసే పనులు , అనగా మనం ఏమీ  తలచు కో పోయినా , అప్రయత్నముగా , మనము మెలకువ లేదా నిద్ర లో ఉన్నా జరిగే శరీర కార్య క్రమాలు  - రోగ నిరోధ లేదా శరీర రక్షణ వ్యవస్థ ,మెదడు లోని కొన్ని భాగాలు ( కలలు ) , శ్వాస క్రియ , గుండె పంపింగ్ , హార్మోన్ ల విడుదల , కణాలలో శక్తి ఉపయోగం , జన్యువుల పని తీరు ,కణ విభజన , సహజాతాలు    (ఆకలి ,నిద్ర, మైధున కోరిక , రక్షణ కోసం ఆరాటం  ) ,అరిషడ్ వర్గాలు , ద్వంద భావాలు , ---- ఇవన్నీ మన చైతన్యం తో ప్రమేయం లేకుండా నే  నిత్యం జరిగే పనులు . వీటిని లింబిక్ వ్యవస్థ ,మెడుల్లా ,థెలామస్  భాగాలు , అటానమస్ నాడులు  చేస్తాయి .
ఇక్కడ మనం చెప్పు కోవలసినది  - మన ప్రాధమిక  శరీర పని తీరు అంతా  హైపో తెలామాస్ ,  లింబిక్   వ్యవస్థ     పైన ఆధార పడి  ఉంటుంది . పశు పక్ష్యాదుల లో  కూ డ ఇదే విధం గా ఉంటుంది .

ఈ పనులన్నింటినీ కార్టెక్స్ - ( పెద్ద మెదడు  - కాన్షస్ -చైతన్యం) ,  ఆధీనము లోకి తీసుకు రావడమే పరిణామం లో పెద్ద మలుపు .కానీ భారత దేశ  యోగులు ,ఋషులు ఎన్నో పరి శోధనలు చేసి నిగ్గు తేల్చిన విషయం - మన పెద్ద మెదడు ని ,అనగా మన   చైతన్యం ను పూర్తిగా విని యోగించు కోవడము లేదు . వినియోగించే ఆ కొద్ది చైతన్యాన్ని  , అధర్మ కార్య క్రమాలకే ( basic instincts / animal behaviour) పరిమిత ము చేస్తున్నాడు .

భాష , కళలు ,వినోదం ,కొత్త విషయాలను నేర్చు కోవడం , సమస్యలను ,విషయాలను పరిశో ధించి కొత్త ఆవిష్కరణలు చేయడం , తార్కికముగా ఆలోచించ డం  , ఊహలలో విహరించడం -- ఇవన్నీ కార్టెక్ష్  / చైతన్యం తో చేసే పెద్ద పనులు . ( art & intellectuality ).
కానీ మనం ఎం చేస్తున్నాం ? చైతన్య పూర్వకముగా పశుత్వ పు పరిధి లో ని పను లే  గొప్ప తెలివి తేటలతో ఇంకా ఎక్కువ గా చేస్తున్నాము .
మనకున్న బలాలను బట్టి ఎదుటి వా డిని అణచి పరిమితి కి మించి సంపద ను పోగు చేసు కోవడం
 కుట్రలు పన్ని ప్రకృతికి, తోటి మనిషికి హాని చేయడం   -ఇవన్నీ మన చైతన్య శక్తి ని దుర్విని యోగ పరచి చేస్తున్న పనులు .
అందరూ గుర్తు ఉంచు కోవలసిన విషయం -
స్థావర జంగ మాలైన రాళ్ళు ,చెట్లు ,పశు పక్ష్యాదులు ,మనుషులు - వీటన్నింటికీ వివిధ పరిమాణ దశ లలో మనస్సు  ఉంటుంది .
మనిషి లో మనస్సు బాగా అభివృద్ధి చెంది ,చిత్తము ,మానసము ,బుద్ధి  , అహంకారం
అనే విభాగాలుగా ఉంటుంది .
ఇంత  మనస్సున్న మనిషి తన ధర్మం మరచి పశుత్వం వైపు దిగ జార డ మే విచిత్రం .
పశుత్వం  నుండి  పశుపతి గా మార్పు చెందడమే మనిషి చైతన్య పరిణామ గమ్యం .
చైతన్యం = ఎరుక = అనుభూతి తో కూడిన అవగాహన =consciousness.

Monday, 17 December 2012

అచ్చులు -హల్లులు -తెలుగు వాకిట పూచిన వెన్నెల ముగ్గులు

మనిషి  నోటి ద్వారా పుట్టించే శబ్దా లన్నింటినీ కాగితము పై వ్రాయ టానికి లిపి ఉండాలి .
మనిషి ఎందుకు శబ్దాలను పుట్టిస్తాడు ?
తనలోని భావ పరంపరను వ్యక్తం చేయడానికి .
భాషకు లిపి ప్రాణం . లిపి లేక పోతే భాష కు మనుగడ ఉండదు .భాష లేక పోతే విజ్ఞానం వ్యాప్తి చెందక ఆ జాతి మొత్తం అంతరించి పోతుంది .
అంటే , జాతికి  భాష ,భాషకు లిపి ,లిపికి శబ్దం ప్రాణం .
File:Telugu.png:
పురాతన కాలం నుండి  గమనిస్తే , తెలుగు భాష పరిణామం  చెందిన  తీరు మిగతా అన్ని ద్రవిడ భాషలను మించి పోయింది .
ఎందు కంటే , తెలుగు లిపి కి 60 గుర్తులు - 16 అచ్చులు ,41 హల్లులు ,3 అచ్చులను మార్చే గుర్తులు .
తెలుగు లిపి పై - సంస్క్తుతము ,పాలీ  ,ప్రాకృత  భాషలు ఎక్కువగా ,ఈ  మధ్య కాలము లో  ఉర్దూ  కొద్దిగా ప్రభావము చూపాయి .

సంస్కృతం, కన్నడ ,తమిళ్ భాషల తో పాటు తెలుగు భాష భారత దేశ  సాంస్కృతిక (classic language) భాష.
మన దేశ 22 అధికార భాష లలో తెలుగు ఒక్కటి .
అచ్చ తెలుగు లేదా గ్రాంధిక తెలుగు భాష ,  ప్రాంతాల వారిగా మార్పులు చెంది 20 మాండలికాలుగా (dialects  ) వ్యాప్తి లో ఉంది .
తెలుగు పదాలు అచ్చుల తో అనగా స్వరములతో అంత  మవుతాయి .తెలుగు భాష చేసే శబ్దం లో ఒక  నాద సమ తుల్యత (vowel harmony ) ఉంది . అందు వల్లే తెలుగు భాష శ్రవణ పేయముగా ,మధురముగా ఉంటుందని అంటారు .
13 వ శతాబ్దం లో కన్నడ లిపి ,తెలుగు లిపి వేర్వేరు గా అభివృద్ధి చెందాయి .
11 వ శతాబ్దం తర్వాత , తెలుగు లో ఎన్నో కావ్యాలు ,ఇతిహాసాలు ,నాటికలు , వచ్చాయి .
నన్నయ్య ,తిక్కన ,ఎర్రాప్రెగడ ,పోతన, శ్రీ నాధుడు , జక్కన, గౌరన ,గోన బుధా రెడ్డి  , సోమన్న ,వేమన ,భీమకవి ,భాస్కరుడు ,అన్నమయ్య  ,
ఆ తర్వాత తెలుగు భాషకు స్వర్ణ యుగముగా చెప్పు కొనే 16 వ శతాబ్దం లో శ్రీ కృష్ణ దేవ రాయలు ,అష్ట దిగ్గజాలు ,
 ఆ తర్వాత 17వ శతాబ్దం లో త్యాగ రాజు ,
18   వ శతాబ్దం లో పరవస్తు చిన్నయ సూరి
 19   వ శతాబ్దం లో వీరేశ  లింగం ,గురజాడ , విశ్వనాధ , శ్రీ శ్రీ , రాయ ప్రోలు , కృష్ణ శాస్త్రి , జాషువా  - తెలుగు భాష  సాహిత్యాల  ఉన్నతికి దోహదం చేశారు .

ఈ  క్రింది ప్రశ్నలకు విద్యార్ధులు సమాధానాలు ఆలోచించి వారి విద్యాలయా ల్లో వ్యాస రచన ,వక్తుత్వ పోటీలు  ఏర్పాటు చేసుకొని వారి ఆలోచనలు అందరితో పంచు కోవాలి .
మాత్రు భాష లో విద్యా భోధన అవసరమా ? అంతర్జాతీయ భాష , జీవనోపాధి ఇచ్చే భాష ఐన ఇంగ్లీష్ లో విద్యా భోధన మంచిదా ? మాత్రు భాషని బతికించు కోవడం అంత  అవసరమా ?
 ప్రక్రుతి పరంగా ,జాతి పరంగా , శరీర స్వర పేటిక  నిర్మాణ పరంగా  మనుషు లందరూ ఒక్క టైనా , వారు వ్యక్తీక రించే భావాలు ఒకే విధమైనవి అయినా , ఆ యా సందర్భాలకు తగ్గట్టు చేసే మూల  శబ్దం ఒక్కటే అయినా - ఇన్ని భిన్న లిపులు ఎలా పుట్టాయి ?

జీవనోపాధి - జీవన పరమావధి .


సత్య దర్శనమ్ , శూన్య నిర్వాణం ,భగవదైక్యం ,మోక్షం ,సమాధి , కాస్మిక్ ఎరుక ,విస్తరించిన చైతన్యం  - ఇవన్నీ పర్యాయ పదాలు .
మన కున్న చైతన్యం  అనగా అవగాహనా సామర్ధ్యం  (బుద్ది  ,మనస్సు, జ్ఞానేంద్రియాలు )  ఈ  సృష్టి లో ఒక చిన్న భాగాన్ని మాత్రమే ఆకళింపు చేసు కొంటుంది . అంటే  సత్యాన్ని చాలా కొద్దిగా అర్ధం చేసుకొనే శక్తి మనిషి కుంది .
ఉదాహరణకు , ఒక్క చిన్న రంధ్రం తప్ప ఎలాంటి కిటికీలు లేని ఒక చిన్న గదిలో మనం ఉన్నప్పుడు , మనకు   ఆకాశం లో  చాలా చిన్న భాగం మాత్రమే   కనిపిస్తుంది .ఆ రంధ్రానికి ఏదైనా అడ్డు వచ్చినా ,ఓ చిన్న మేఘం మనకు కనపడే ఆకాశానికి అడ్డు వచ్చినా మనకు ఆకాశం ఏదీ కనపడదు . కలత చెందుతాము . భయ పడతాము .అడ్డు తొలగి మళ్ళీ ఆకాశం కాన పడ గానే సంతోషిస్తాము .
ఇలాగే మన జీవితం కూడ సుఖ దుఃఖ సమ్మేళనం వలే ఉంటుంది .
కానీ, మనం ఉన్న గోడలను పగుల గొడితే ఆకాశం ఎలా పూర్తిగా కనిపిస్తుందో ,మనిషి తన చుట్టూ ఉన్న అహంకారపు పొరలను పగుల గొడి తే మన కు సత్యం పూర్తిగా అవగాహనకు వస్తుంది .

జీవుడు అవిభాజ్యపు కాస్మిక్ శక్తిలో - (పర బ్రహ్మం ) ఒక భాగమని ,
జీవుని చుట్టూ ఉన్న పంచ కోశాలు ,వాటి లో ఉన్న పంచ తన్మాత్రలు , త్రిగుణాల కలయిక వ ల్ల  అరిషడ్వర్గాలు, వాటి వల్ల కలిగే సుఖ దుఖాలు  మొదలగు వికారాలు అన్నీ  మాయ అని ,దీని వలన కర్మ చక్రం భ్రమణం తప్పదని ,చావు-పుట్టుకల చక్రం ఆగదని , - అవగాహన చేసు కోవడమే మనిషి గమ్యం .
కాబట్టి ,మనిషి  గమ్యం సత్యాన్ని పూర్తిగా అవగాహన  చేసుకోవడ మే .
అదే మనిషి  జీవన పరమావధి .
'నేను'  అనగా  , శరీరము ,మనస్సూ ,బుద్ది , కాదని
"నేను" అనేది ఒక 3 - మితులు ( 3 dimension space-time-)ఉన్న ఒక పరిధి లో బందీ గా ఉందని
నిజానికి " నేను" అనేది కాస్మిక్ శక్తి లో ఒక చిన్న భాగమని , దానికి అనేక మితుల తో (multi dimensional) సంభంధ ముందని ,
"నేను" యొక్క నిజ స్వరూపాని ఆవిష్కరిమ్చు కోవడ మే ప్రతి మనిషి పరిణామ గమ్యమని అవగాహన చేసు కోవడమే సాధన .
జీవనోపాధి ని ,  జీవన పరమావధి ని సమన్వయము చేసు కొంటూ ఎలా బతకాలో నేర్పుతుంది భగవద్గీత .

Sunday, 16 December 2012

అగ్ని కుల క్షత్రియులు

అగ్ని కుల క్షత్రియులు పల్లె కారులా ? లేక నిజమైన క్షత్రియులా ?
క్షత్రియులే ఐతే వారిలో అత్యధికులు  చేపల వేట ఎందుకు వృత్తిగా  చేస్తునారు ?
పల్లె కారులె ఐతే , ఉత్తర భారత  ప్రాంతపు రాజ్ పుత్ర  వంశపు ఇంటి పేర్లు ,గోత్ర నామాలు ( Raghuvamsham, Ravikulam and Kaushal ) ఎలా  కలిగి ఉన్నారు ?
పల్లవులకూ , అగ్ని కుల క్షత్రియు లకు సంబంధం ఉందా ?
పల్లవులు క్షత్రియులా ? బ్రాహ్మణు లా ? లేక క్షత్రియులు గా మారిన   బ్రాహ్మణు లా?

పల్లవులు ఎవరు ? వారికి ఇరాన్ జాతి వారైన  పహ్లవులకు సంబంధం ఉందా ?
Some theorists have suggested that the Pallavas of Kanchi might well have been an offshoot of the Parthians or Pahlavas of Iran. They point out evidences as their preference for Aryan motifs than Dravidian ones and their choice of the Parthian mascot the Lion as the emblem of the Pallava kingdom. Moreover, the greatest Pallava king Narasimhavarman styled himself 'Mahamalla' or 'Great Wrestler'. It is interesting to know that in modern Hindi and Urdu the word 'Pehelvan' derived from 'Pahlava' means 'wrestler'.

  • another  theory that the Pallavas were a branch of the Vakatakas.

Since Pallavas ruled in the territory extending from Bellary to Bezwada, it led to the probability of a theory that the Pallavas were a northern dynasty who having contracted marriages with princesses of the Andhra Dynasty ,thus inherited a portion of Southern Andhra Pradesh

పల్లవులు శాత వాహనులకు సామంతులుగా ఉండి కౄష్ణానదికి దక్షిణాన ఉన్న ఆంధ్రదేశాన్ని కాంచీపురమును రాజధానిగా చేసుకొని , క్రీ.శ.200 నుండి క్రీ.శ.700 వరకు పాలించి  ,వేద విహిత కార్య క్రమాలైన విగ్రహా రాధన  ,దేవాలయ నిర్మాణం చేసే వారని చరిత్ర చెబుతుంది .
పల్లవులు నౌకా నిర్మాణము, దేశీయ విదేశీయ నౌకా యానము, నౌకా వాణిజ్యము నకు అత్యంత ప్రాముఖ్యత నిచ్చి తూర్పు ఆసియా దేశాలలో కూడ  వలస రాజ్యాలు స్థాపించారు .

కొన్ని ప్రాంతాలలో ఆలయాలు నిర్మాణం చేసే పని అగ్నికుల క్షత్రియులద ని చరిత్ర లో కొన్ని ఆధారులున్నాయి . పల్లవుల వలే   అగ్ని కుల క్షత్రియులు  కూడ నౌకా నిర్మాణము, నౌకా యానము, చేస్తున్నా , చేపల వేటకే  పరిమి తమై  ,  చేపల వేటే వ్రుత్తి గా గల బెస్త, జాలరి, వాడబలిజ మొదలగు మిగతా కులాలతో కలిసి పోయారు .

ఉత్తర దేశమునందలి చాళుక్యులు అనగా సోళంకులు , పవార్ (పారమారులు ), పరిహారీ (ప్రతిహారీ), చౌహాన్ (చాహుమాన),  - ఈ నాలుగు క్షత్రియ జాతు లూ   అగ్ని కుల క్షత్రియులని రాజస్థాన్ లో అంటారు .
ఏది ఏమైనా సరైన ఆధారాలు లభ్య మవ్వ లేదు కనుక , నిజం ఏమిటొ శాస్త్ర కారులే  కని  పెట్టాలి .

అందువలన 
అగ్ని కుల క్షత్రియులు  తమను తాము పల్లీలమని, పల్లెకారులమని, మత్స్యకారులమని చెప్పుకోవడం, అలా పిలిపించుకోవడం సరైనదికాదే మో ఒక సారి ఆత్మ  పరిశీలన చేసు కోవాలి .


Saturday, 15 December 2012

ధ్యానం

ధ్యానం  ఎప్పుడు చేయాలి  ? ఇప్పుడేనా ? నువ్వు సిద్దమేనా ?
ఎందు కంటే ఒక సారి ధ్యానం లో సుస్థిర మైతే నువ్వు మిగలవు . సంఘం ఉండదు .
ఈ మాయా ప్రపంచం ఉండదు . బంధా లుండవు ,మమకారం , వ్యామోహం ఉండదు .
ద్వంద భావాలు ,అరిషడ్ వర్గాలు ఉండవు .
నువ్వు సంతోష మనుకోనే విష యాలు ఉండవు .
మాయా ప్రపంచం లో ఏ దైతే మనకు సుఖ సంతోషాలను ఇస్తాయో అవేమీ ఉండవు .
అలాగే దుఃఖాలూ  , భాదలూ  ఉండవు .
కానీ ,ధ్యానం లో ప్రాపంచిక సంతోషానికి భిన్న మైన ఆనందం ఉంటుంది . 
చాలా మంది ప్రశాం తత లేనప్పుడు ,దుఖం ఎక్కువై నప్పుడు , ఈ  ప్రపంచము  భాధా కరముగా మారినప్పుడు  శాంతి  సంతోష ము  కోసం ధ్యానం చేయాలని అనుకొంటారు . తాత్కాలిక వైరాగ్య భావన తో సన్యాసి గా మారి ఈ  ప్రపంచం నుండి  పలాయనం చేద్దా మను కొంటారు . ధ్యానం పలాయ నానికి ఒక మార్గమని అనుకోని  తర్వాత నిరాశ పడ తారు .

ధ్యానానికి ఒక అర్హత మనకు ఉండాలి . సత్యాన్వేషణ కు ఓపిక ఉండాలి . ఎందు  కంటే ధ్యానం అంటే  నిన్ను  నువ్వు కోల్పోయి శూ న్యం లో ఒక భాగ మై పోవటమే .
 తాత్కాలిక వైరాగ్యం  కాక నిజ మైన మానసిక చింతన , చిత్త వైరాగ్యం ఉండాలి . బుద్దికి వివేకం విచక్షణ ఉండాలి .

ఏకాగ్రత ,ధారణ లో మన మనస్సు పూర్తిగా ఒక విషయం పై మమేక మైనా అహంకారం మాత్రం పోదు . అనగా బంధం ఇంకా మిగిలే ఉంటుంది .రాగ ద్వేషాలు అలాగే ఉంటాయి .
మనం ఎన్నో పరీక్షలకు ఏకాగ్ర చిత్తం తో చదువుతాము .
అలాగే అవధానం చేసే వారు , వారికి పట్టు ఉన్న విషయాన్ని ధారణ చేస్తారు .
ఒక ఆట గాడు తన ఆట పై   ఏకాగ్ర చిత్తం తో ఉంటాడు . అక్కడ ఏదో సాధించాలన్న, గుర్తింపు పొందాలన్న తపన ఉంటూనే ఉంటుంది .

కానీ, ధ్యానం లో అహంకారం  ఇగిరి పోయి ,దృశ్యం ,ద్రష్ట  , దృక్కు అన్నీ ఒక్కటి గా పరివర్తనం చెందుతాయి .  గుర్తింపు పొందాలన్న తపన గానీ, ఏదో సాధించాలన్న కోరిక గానీ ఉండవు .
అందుకే ధ్యానమనేది ఎలాంటి గుణాలు లేని ,ఎలాంటి లక్షణాలు లేని  అవ్యక్తమూ ,నిత్య సత్యమూ ఐన విషయం పై నే సాధ్య పడుతుంది . పరిమితంగా ఉన్న మన ఎరుక అంటే  మన  అవగాహన , మనకు తెలిసిన  ఎల్లలు దాటి  పరి వ్యాప్తి చెందటమే ధ్యానం . ఎరుక వ్యాప్తి చెందింది అని అనే స్పృహ కోల్పోవడమే సమాధి .

ఏకాగ్రత ,ధారణ ,ధ్యానం -- ఒక్కటేనా  ?
ఇంద్రియాలను ,మనస్సు ని కేంద్రీకరించడ మే ఏకాగ్రత . దానిని ఎక్కువ సేపు అవిచ్చిన్నంగా చేయడ మే ధారణ .

ఏకాగ్రత ,ధారణ లో మన ఎరుక ఒకే విషయానికి పరిమితం అవుతుంది .
ఒక అమ్మాయి ప్రేమ కోసం నీ ధ్యాస ని పెడితే అది ధ్యానం అవ్వదు .
నీ వ్రుత్తి లో నువ్వు నిష్ణాతు గా మార టానికి నువ్వు పడే కష్టం ధారణ అవ్వుతుంది గానీ   ధ్యానం అవ్వదు .
ఒక కిటుకు ఏమిటంటే ,  ఏకాగ్రత ,ధారణ అనే దశ లు బాగా అభ్యసించి  దాటితే నే ధ్యానం సాధ్య పడుతుంది .

 ధ్యానం అంటే ఏమిటి ?
ఒక వస్తువు- అది బయట ప్రపంచం లొ నిదే దైనా కావచ్చు , లేదా అంతర్ ముఖంగా -
ఒక అనుభూతి ,ఆలొచన, ఒక ద్రుశ్యం , ఒక మంత్రం ,ఒక భావన ,ఒక స్పందన - ఏదైనా కావచ్చు , దానిపై మన మనస్సుని ,ఇంద్రియాలతొ సహా లగ్నం చేయటం .అలా చేస్తూ నిన్ను నువ్వు కోల్పోవడం . అహంకార మమకారాలు అన్నీ మాయమై ,అంతా  ఒక్కటే అనే భావన కలిగి ,ఆ తర్వాత విశ్వ జన భావం కూడ  పోయి శూన్య సమాధి కి చేరు కోవడం ధ్యానం లో ని దశలు .


 మనిషి ఎందుకు ధ్యానం చేయాలి ?
ఒక విషయాన్ని ,అది ఏదైనా సరే ,పరిశీలన ,పరిశోధన , చేసి నిజం రాబట్ట కలగాలి .
అంటే సత్యాన్ వేషణ కోసం ధ్యానం చేయాలి .సత్యమైన సచ్చిదా నందం అనేదొక టుంద నే విషయాన్ని తెలుసుకొని అనుభూతి చెందటం కోసం ఋషులు ఎన్నో విధాలుగా అన్వేషించి ,చివరకు ధ్యానం ఒక్కటే మార్గమని చెప్పారు .
అసలైన సత్యం అనుభూతి చెంది దానిని సుస్తిరమూ , శాశ్వతమూ  చేసు కొనే టందుకు  మనిషి ధ్యానం చేయాలి .
అసలైన ప్రపంచం ఏమిటో తెలియాలన్నా,  ఈ  సృష్టి కి నిజమైన అర్ధం తెలియాలన్నా , మన శరీరం ,మనస్సూ బాగా పని చేయాలన్నా , ఆందోళన , ఆత్రుత తగ్గి సృష్టి కి    సత్య మైన  అర్ధం తెలియాలన్నా ధ్యానం చేయాలి . కానీ ఒక షరతు .
ధ్యానం లో నిన్ను నువ్వు కోల్పో తావని భయ పడితే నీకు ధ్యానం వద్దు .
ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావని నీవు తలిస్తే  ఇపుడు నీకు ధ్యానం వద్దు .

ఇప్పుడు నేను చాలా సంతోషము గా ఉన్నాను . నాకు ధ్యానం చేయ వలసిన అవసరం లేదు ?
బయటి నుండి  వచ్చేది సంతోషం .దానికొక కారణం ,దానితో పాటు నీ అహం తృప్తి చెందటం ఇవ్వన్నీ ఉంటాయి .
అది ఒక జల పాతం వలె ఉత్తుంగ జలధి తరంగమై ఉంటుంది .కారణం పోయినా , నీ అహం అలవాటు పడి తృప్తి పడక  పోయినా సంతోషం ఆగిపోతుంది .
కానీ,ఆనందం బయట ఉన్న వస్తువుల నుమ్డి రాదు . నీ అహం తృప్తి చెందటం కూడా  ఉండదు .అది నీ లోపలి నుండి పెల్లుబికి వచ్చే ప్రశాంత సరోవరం .

నీ కున్న భయా లన్నింటినీ నువ్వు ఎలా అధి గ  మించాలి ?
వివేక వైరాగ్య అభ్యాసం తో భయాలను , కోరికలను , శరీర సుఖ లాలసతను , నియమితం చేసు కోవాలి .
ఈ  ప్రపంచం కాక , మరేదో నిజమైన  శాశ్వత మైన సత్య స్థితి ఉందని సుస్థిర మైన నమ్మకం ఉండాలి .

కానీ ,ఈ  అర్హతలు ఏమీ లేక పోయినా నిజమైన కుతూహలం నీ కుంటే ధ్యానాన్ని గురు ముఖంగా ఆరంభించు !

మనిషికి ఉండ వలసిన ముఖ్య లక్షణాలు ఏవి ?

మనిషికి ఉండ వలసిన ముఖ్య లక్షణాలు ఏవి ?
మంచి అలవాట్లు --- శరీర శుబ్రత ,ఉద్వేగాలను అదుపులో ఉంచుట ,కుటుంబానికి ,సంఘానికి మేలు చేసే ఆలోచనా ,ఆచరణలు .మనస్సుకి వైరాగ్యం ,బుద్దికి వివేకం అలవాటు చేయాలి .

ప్రతి మనిషీ సాధకుడే ! మన కన్నా గొప్ప శక్తి అవ్యక్త ముగా ఉందని , ఈ  సృష్టి అంతా ఆ శక్తి సంకల్పం వల్లే పోషింప బడుతుంద నే   ప్రగాడ నమ్మకం ,కృతజ్ఞత స్థిరంగా ఉండాలి . అప్పుడే ,ప్రతి పనీ ,ఆ భగవద్ కైంకర్యం గా చేయగలము . దైనందిన కార్యాలు , వ్రుత్తి  ప్రవ్రుత్తి కర్మలు , యజ్ఞ యాగాలు  మనం ఏది చేసినా భగవద్ శక్తికి సమర్పణ గా  చేయడ మే మనిషి ధర్మం .
ధర్మం పైనే సకల సృష్టి  పని చేస్తుంది .
సకల జీవ రాశి లో ఒక్క మనిషికి మాత్రమే ధర్మ కార్యా చరణ చేయగల సామర్ధ్యం ఉంది .
ఆ సామర్ధ్యాన్ని ఉపేక్షించి మనిషి అధర్మం గా ఉంటే  ఆ మనిషికీ  , సమాజానికీ  నష్టం .

telugu fonts :

For telugu fonts to download ,please click the below link.

http://www.aponline.gov.in/Apportal/TeluguSoftware/index1.html

Friday, 14 December 2012

వైటల్ ఫోర్స్ - జీవ శక్తి

శక్తి అంటే పని చేయగల సామర్ధ్యం .
 మనిషి కి శక్తి ఎలా వస్తుంది ?
ఆహారం ద్వారా  రసాయన శక్తి - 
జీర్ణ వ్యవస్థ (  నాలుక ,జీర్ణాశయం ,ప్లేహం,కాలేయం  ) ఆహార పానీయాల నుండి రసాయన శక్తిని ( గ్లూకోజ్ ) గ్రహిస్తుంది .
ఈ రసాయన శక్తి కణాలలో బంధింప బడి ( bond between carbon and hydrogen) ఉంటుంది .
వాతా వరణం లో ఉన్న గాలిని(ఆక్సిజన్ )  ఊపిరి తిత్తుల సంచుల ద్వారా గ్రహించి , ప్రతి కణం లో ఉన్న రసాయన శక్తిని మండించి (oxydation),  అవయ వాలు పని చేస్తాయి .

మంచి ఆహారం ద్వారా రసాయన శక్తి 
ప్రాణా యామం ద్వారా ప్రాణ శక్తి 
చుట్టూ ఉన్న కాస్మిక్ శక్తి  --- ఇవన్నీ కలిసి జీవ శక్తి - వైటల్ ఫోర్స్  గా మారి 
 మనిషిని ఆరోగ్య వంతునిగా చేస్తాయి .
A balanced energy system is the best defense against disease.
Pranic Healing Services సూక్ష్మ శక్తి ప్రవాహాలు  మనిషి దేహాన్ని ఆవరించి  ఉండి ,కొన్ని ముఖ్యమైన  ప్రదేశాలలో భౌతిక శరీరానికి - అనగా నాడీ కేంద్రాలకు  తద్వారా  ,గ్రంధులకు , బంధింప బడి  ఉంటాయి .
వైద్య పరంగా లేదా శరీర శాస్త్ర పరంగా ప్రాణా యామంలో 
ఉన్న ఉపయోగాలు ?
 అంతర్ కుంభకం (retention of air in lungs ) వల్ల  శరీరం లో ఎం జరుగుతుంది ?
నిశ్వాస (expiration ) ను సుదీర్ఘం ( controlled prolongation ) గా చేయుట వలన ప్రయోజనం ఏమిటి ?
శ్వాస ( respiration) లో జరిగే వాయువుల మార్పిడి (exchange of gases) పై ఏది ఎలా ప్రభావం చూపుతుంది ?
  • గాలి సంచుల (alveoli) లో ఒక పలుచనిపొర (alveolar membrane) యొక్క ఆరోగ్యం ,దాని కిరు వైపులా రక్త నాళి కల వల (capillaries ) , ఆయా రక్తం లో ఉన్న వాయు ( co2 & oxygen) నిష్పత్తి(ratio)  మరియు వత్తిడి ( pressure)-ఇవీ ప్రభావ కారక అంశాలు .
పతంజలి చెప్పిన విధానం లో పూరకం ,కుంభకం ,రేచకం  ల సమయ నిష్పత్తి : 2: 4: 6

  • ఆక్సిజన్ ఎక్కువగా అంది, బొగ్గు పులుసు వాయువు బాగా  బయటకు పోతుంది .
  • కణాలలో గ్లూకోజ్ మండి శక్తి ఎక్కువగా అందుతుంది .
  • నరాల లో విద్యుత్ శక్తి  ,రక్త నాళా లలో  రక్త ప్రసార శక్తి  బాగా జరిగి జీవ శక్తి అన్ని  చోట్లా సమానంగా ఉంటుంది .
  • శరీర నాడీ కణాలలో ,మెదడు లో శక్తి తరంగాలు ఒకే ( పౌన పున్యం - FREQUENCY )విధంగా   ప్రసార మవుతాయి .
  • స్వయం చలిత నాడీ మండలం (autonomic nervous system) లో  పారా  సింఫతి కణాలు ఎక్కువగా పనిచేయడం వలన ప్రశాం తత కలుగుతుంది .

Slow pranayamic breathing generates inhibitory signals and hyperpolarizing
 current within neural and non-neural tissue by mechanically stretching
tissues during breath inhalation and retention.
 It   is likely that inhibitory impulses in cooperation with hyperpolarization
current initiates the synchronization of neural elements in the central nervous system,
peripheral nervous system, and surrounding tissues ultimately causing shifts in
the autonomic balance towards parasympathetic dominance. 
Further experimental research of the  cooperative cellular mechanisms
of pranayama is needed to confirm this theory.

ధనుర్ మాసం :

The Holy Dhanur Masa begins on December 16 in this month. Dhanur Masa is the 

period between the entry of Sun in Dhanu Rashi and Makara Sankramana. 

  శ్రీ సూర్య నారాయణుడు ధనుస్సు రాశి లో ప్రవే శిస్తున్నాడు . హేమంత

 ఋతువు వచ్చేసింది. బ్రహ్మ ముహూర్తం లో    పల్లె ల్లో గుడి గంటలు 

,విష్ణు సహస్ర నామ పారాయణం  శ్రావ్యంగా పాడుతూ , నారాయణునికి  

 దద్దోజనం ,చక్కర పొంగలి నైవేద్యం సమర్పణ చేసే సమయం ..

ఆండాళ్ ,గోదా దేవి అని పేర్లతో భూదేవి తమిళ నాట శ్రీ విల్లి పుత్తూరు లో పుట్టి హేమంత కాలం లో సూర్యో దయానికి ముందే లేచి  శుచి శుభ్రత లతో మనస్సు లో భక్తి  ని నింపుకొని  శ్రీ రంగ నాధుని ఎలా పొందాలో పాశురాలుగా పాడి మనందరికీ భోధించిన సంపూర్ణ శరణాగతి మంత్రం "తిరుప్పావై " .
ఏ అష్ట పుష్పాలను  భగ వంతునికి ఎలా నివేదించా లో గీత లో భగ వంతుడే  చెప్పాడు .
పాటించడం మనిషి ధర్మం .
వేకువ నే హరి దాసు కీర్తనలు , వాకిట్లో బియ్యపు పిండి ముగ్గులు , ఆవు పేడ తో గొబ్బిళ్ళు ,వాటి లో గుచ్చిన బంతి ,గుమ్మడి పూలు ,సాయంత్రం సందె గొబ్బెమ్మ పాటలు  - ఇవన్నీ మన సంప్ర దాయం . మన పిల్లలకు నేర్పుదాం .
కొన్ని పండుగలు :
  • December 18--     Guha / Skanda / Champa Sashti – 
  • December 23rd – Gita Jayanti
  • December 24 -   Vaikunta Ekadasi
  • December 27 - Dattatreya Jayanti
  • December 25 – Hanumand Vratam..
ఆహార విహారాలు :
వెన్న , తేనే ,ఉసిరి ,ఎండు ద్రాక్ష , చ్యవన ప్రాశ  ఎక్కువగా తినాలి .
శరీరనికి తైల మర్దన ఎంతో మంచిది .

సూర్యుణ్ణి  ,శ్రీ మహా విష్ణువు ని ,ఆంజనేయుడిని ,సుబ్రమణ్యు ని,దత్తా త్రేయున్ని  పూజిద్దాం .
ప్రతి రోజూ  భగవద్ గీతను చదివి మన జీవితాలకు అన్వ  యించు కొందాం .



శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం ధన - సం పదా |

శ త్రు- బు ద్ధి-వినాశాయ దీ ప- జ్యోతిర్ -నమో స్తుతే  ||


Thursday, 13 December 2012

నాద యోగం

సాధకులందరి గమ్యం - సంకల్ప శూన్యత ,తద్వారా చిత్త వ్రుత్తి  నిరోధం ,మనోలయం  .

సంకల్ప శూన్యత (వికల్పం ) ఎలా కలి గి  సుస్థిర మవుతుంది ?
నేను,నా శరీరం ,నా సంపద ,నా కుటుంబం - అనే అభిమానం
సుఖం ,దుఖం - అనే ద్వంద భావం --- ఇవన్నీ భ్రాంతి  అని నమ్మి శ్రద్ద తో వైరాగ్యం అభ్యసిస్తే
చూ చేది (దృశ్యం ) ,చూచే వాడు (ద్రష్ట ) ఉండరు .చూడటం అనేది ఉంటుంది .
అంటే  సాక్షిగా  ఉంటాము .

సదా శివుడు భోధించిన 1లక్షా 25000 లయ యోగ పద్దతుల లో నాద యోగం అనుకూలమైనదని పెద్దలు చెబుతారు .
మన శరీరం లో ఉన్న నాడులు , చక్రాలు అన్నీ శు ద్ది పొందా లంటే ప్రాణా  యామం చేయాలి .
శుద్ది  జరిగిందనే దానికి గుర్తు -- అనాహత నాదం సాధకుడు విన గలుగు తాడు . ఆ నాదం పై చిత్తాన్ని లగ్నం చేయడమే నాదాను సంధానం .
ప్రాణమూ ,చిత్తమూ బొమ్మ బొరుసు ల్లాంటివి .ఒకదానిని నియంత్రిస్తే రెండోది నియంత్రిత మవుతుంది .

ప్రాణా యామ అభ్యా సం  -----> నాడీ  శుద్ది ----> అనాహత నాద శ్రవణం ----> నిరంతర మూ నాదం పై చిత్త  లగ్నం ----> ప్రాణ వాయువు సుషుమ్నా నాడీ  ప్రవేశం ----> అనాహతంలో ప్రాణ వాయువు లయం ----> మనోలయం .

Monday, 10 December 2012

మనం ఎలా ఎందుకు బ్రతకాలి ?

మనిషి స్వధర్మాచరణ చేస్తూ సంతోషంగా,శాంతం గా బ్రతకాలి .

మనిషి జీవితం ఎలా  శాంతం గా ఉంటుంది ?
జీవనానికి నియమాలు , నదులకు చెలియలి కట్టలు
మనస్సుకి సత్సంగ సాధన -
ప్రాణానికి ఆయామం
శరీరానికి వ్యాయామం
బుధ్ధికి  ప్రగాడ సూక్ష్మత - ఇవన్నీ ఉంటేనే మనిషి జీవితం శాంతం గా ఉంటుంది .

మనిషికి సంతోషం ఎప్పుడు ,ఎలా కలుగుతుంది ?
హుషారుగా ,ఇష్టపడి కష్ట పడుట
ఇతరులకు ప్రేమతో సేవ చేయడం
నీ స్వ శక్తి పై గానీ , తోటి వారిపై గానీ ,దేవుని పై గానీ విశ్వాసం ఉంచి
ఎపుడూ  నీకు దేనిపై విశ్వాసముందో దానిని ప్రార్ధన చేస్తూ
మన పని విజయవంతం కావటానికి క్రుషి చేయడం - సంతోషానికి తొలి మెట్టు .

సత్సంగం అంటే ఏమిటి ?
ఓ మంచి గురువు ,మంచి స్నేహితుడు ,మంచి గ్రంధం తో గడపటమే సత్సంగం .
శరీరాన్ని , మనస్సుని ,ప్రాణ శక్తిని ఒకే కంపనంలో ఉంచడమే యోగానికి తొలి మెట్టు .
మనిషి జీవన  విధానం ఎలా ఉండాలి ?
మనస్సుని ఉత్సాహంతో నింపుకొని
ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవడం
మనస్సుని అన్నివేళలా ఆశావహంగా ఉంచుకొని
దుఖాన్ని అధిగమించడం
ఇతరులు చేసిన తప్పిదాలను క్షమించడం
అన్యాయాలను ,అనినీతిని ఎదుర్కోవడం
కుటుంబం కోసం , సంఘంకోసం పాటుపడటం
వైఫల్యాలు మరిచి  నిరంతరం విజయంకోసం ప్రయత్నించడం
ధర్మమేమిటో అవగాహన చేసుకోవడం - ఇదే మనిషి జీవన విధానం .
మనిషి ఏది  వదులు కొంటే శాంతంగా ఉంటాడు ?
మనిషికి పంచ జ్ఞానేంద్రియాలు ,పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు , మానసం ,చిత్తం , బుద్ది, అహంకారం ,వీటన్నింటినీ ఆవరించి జీవాత్మ ఉంటాయి . శరీరంలో ప్రతి కణానికి మనస్సు ఉంటుంది . కణంలోని ప్రతి అణువుకూ మనస్సు ఉంటుంది . కానీ స్థాయిలోనే తేడా !
మనిషి ఏది సాధిస్తే నిత్యం  శాంతంగా ,సంతోషంగా ఉంటాడో కనిపెట్టడానికి ఎందరో ప్రవక్తలు , యోగులు ,రుషులు మొదలుకొని నేటి శాస్త్రజ్ఞులు వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు .
అందరూ అంగీకరించిన విషయం ఏమిటంటే , మనిషి నేను -నాది - నా వాళ్లు అనే అహంకార మమకారాలను  పూర్తిగా తొలగించుకొంటే ఎపుడూ శాంతిగా ఉండవచ్చును .
అహంకారాన్ని పరమాత్మలో నిమజ్జనం చేయడమే సాధనలో చివరి మెట్టు .
అహంకారాన్ని ఎలా నిర్ములించాలి ?
సాధనతో .
అది ఎలా చేయాలి ?
నిన్ను నువ్వు ఇష్టపూర్వకముగా కోల్పోవాలి .ఇలా జరగాలంటే పలు మార్గాలున్నాయి .
మొదటగా - ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకోవాలి.
మనస్సుని ఏకాగ్రతం చేయటం సాధన చేయాలి . దేని మీద చేయాలి ?

  • శబ్దం లేదా నాదం లేదా మంత్రం మీద చిత్తాన్ని నిలిపే టట్లు సాధన చేయాలి . - మంత్ర  యోగం
  • మనస్సుని సంపూర్ణముగా దేవునిపైగానీ ,నీకిష్టమైన పనిపైగానీ లేదా నీ స్వశక్తిపైగానీ కేంద్రీకరించి ఎల్లపుడూ స్థిత ప్రజ్ఞత్వంతో ఉండేటట్లుగా సాధన చేయాలి . -కర్మ ఫల సన్యాస యోగం .
  • కర్మ సన్యాసం చేసి ప్రతి కార్య కారణానికి దేవునిపై భారమేసి ,సుఖ దుఖాలకు చలించక సంపూర్ణ శరణాగతి తో త్యాగ  వైరాగ్య  జీవనం సాగించడాన్ని -భక్తి యోగం.
  • అన్ని కర్మలూ నిమిత్త మాత్రము గా ఎలాంటి అనుభూతిలేకుండా  చేస్తూప్రేమ తో కూడిన సేవ ఇష్టపూర్వకముగా చేయడాన్ని -రాజయోగం.
  • శరీరాన్ని సం రక్షించుకొంటూ ,మనస్సుని "నేనెవరు" అనేదానిపై విచారణ చేస్తూ విహిత కర్మాచరణ చేస్తూ ,త్యాగ బుద్దితో జీవనం -జ్ఞానయోగం.

పై న చెప్పిన విధంగా చేస్తే మనిషికి నిత్య సంతోషం ,శాంతి , ఆనందం కలుగుతాయి . అదే మోక్షం .అదే నిర్వాణం . ఇది మనం బతికున్నప్పుడే కలిగే అనుభూతి . ఇలాంటి ఆనందకరమైన జీవితం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటారు .
 అంటే మన మనస్సుని రీ ప్రొగ్రాం చేసుకొవడమన్న మాట . ఏమని ? సుఖ శాంతులకు బయటి ప్రపంచం పై ఆధార పడనక్కరలేదు , మన మనస్సే వీటికి మూలం ,కాబట్టి మనస్సుని మౌల్డ్ చేసుకొంటే చాలు,నిత్యం శాంతంగా ఉండవచ్చు . మనిషి కనీస అవసరాలు తీర్చుకొంటూ విద్య వినయాలతో డాంబికాలు , దంభాలు లేకుండా కనీసపు వ్రుత్తి ఉద్యోగ , కుటుంబ మరియు  సంఘ ధర్మాన్ని ఆచరిస్తూ జీవనం చేయాలి. కోరికలను తన ఆరోగ్యానికి , ఇతరులకు ఇబ్బంది రానంతవరకు తీర్చుకోవచ్చు . ఆశ ఉండాలి . అత్యాశ ,దురాశ ఉండకూడదు . పట్టుదల ఉండాలి . మొండితనం కూడదు . అన్యాయ అధర్మాలను ప్రతిఘటించే కోపం ,ఆవేశం ,ఆలోచన   ఉండాలి . తన ఆరోగ్యాన్ని ,ఇతరులను నాశనం చేసే క్రోధం ,చింత ఉండరాదు . అన్ని ప్రాణులపై సమ ధర్మం ఉండాలి . ఏమి చేస్తే నువ్వు బాధ పడతావో ,వాటిని ఇతర ప్రాణులకు చేయకపోవటమే అహింస .

స్వ ధర్మం అంటే ఏమిటి ? 
జీవితం పైనా ,తోటివారి శాంతి పైనా ఉత్సాహం
శత్రువులనుకూడ క్షమించే గుణం
తనకున్నంతలో ఇష్టపడి చేసే సేవ
ఇతర ప్రాణులను ఆనందముగా ఉంచే ప్రేమ
ఎన్ని వైఫల్యాలు ఎదురైనాచలించని ఓర్పు
తనపైనా ,ప్రతి ప్రాణి పైనా శ్రద్ద - ఈ లక్షణాలతో జీవించడమే మనిషి కనీసపు స్వ ధర్మం.
నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తించు . శాంతి ఆనందాలు అవే వస్తాయి .
   
జన్మ రాహిత్యం ,సారూప్య , సాలోక , సాయుజ్య మోక్షం ,నిరాకార నిర్గుణ పరమాత్మ సన్నిధి చేరే సమాధి స్థితి ,-ఇవన్నీ ఎవరికివారు అనుభూతించవలసిన అధి భౌతిక అధి ఆత్మిక విషయాలు .

తెలుసుకోతగినది ,తెలుసుకొనే వాడు ,తెలుసుకొన్న విషయం - ఇవన్నీ ఏకమైన సమయంలో అంతా శూన్యమే ! ఆ శూన్యం ఇలా ఉంటుందని ,అలా ఉంటుందని వివరించే స్మ్రుతులు ,శ్రుతులు ,గీతాసారాలు ,మరెందరో ప్రవక్తలు నుడివిన సిద్దాంతాలు మనకెన్నో ఉన్నాయి . వాటిని మార్గం చూపించే మైలు రాళ్ళుగా , దీప జ్ఞాన కాంతులుగా స్వీకరిద్దాం .

"సర్వం గురు బ్రహ్మార్పణమస్తు .
దుర్జనో సజ్జన భూయాత్
సజ్జనో శాంతి మాప్నుయాత్
శాంతి ముచ్యతే బందేభ్యో
ముక్తిచ్య అన్యయో విమోచయేత్" .
చెడ్డవారందరూ మంచివారిగా మారాలి .
మంచి వారందరూ శాంతిని పొందాలి .
శాంతి వైరాగ్యం తో ముక్తి భావం కలుగుతుంది .
అలా ముక్తిని పొందిన వారు ఇతరులను కూడ విముక్తులను చేయాలి..

Saturday, 8 December 2012

RELIGIONS.


 మనిషి మతిని తన చెప్పు చేతల లో ఉంచుకొని మనిషి జీవన్ విధానాన్ని శాసించేది మతం .
వివిధ కాలాల లో వివిధ సంఘ పరి స్థితుల లో  ఆ యా ప్రజలకు మేలు చేసే విధంగా ఎందరో ప్రవక్తలు
రకరకాల సిద్దాంతాలను దర్శించి  వ్యాప్తి చేశారు .
ప్రతి మతమూ చేప్పేదోక్కటే  -
దేవుడు ఒక్కటే . రూపమూ ,గుణమూ లేని అవ్యక్త శక్తి . అది  సర్వ వ్యాపి . సర్వ సమర్ధత ఉన్న ది  .
రూప గుణములు లేని అవ్యక్త  శక్తి నుండి రూప ,గుణ ములున్న పదార్ధ శక్తులు వ్యక్త మ వ్వట మే సృష్టి .
మనిషి కి ఉన్న ఎరుక చాలా తక్కువ . కానీ పశు పక్ష్యాదుల కన్నా ఎక్కువ .
మనిషి కొంచెం ఎక్కువ పరిణితి చెందిన పశువు .
సత్యాన్ని చాలా తక్కువ అర్ధం చేసుకొన్న స్థాయి నుండి పూర్తిగా ఆకళింపు చేసు కోవడమే ముక్తి . దీనికి సహకరించేదే నిజమైన మతం .

మధ్య తరగతి ప్రజలు అంటే ఎ వ రు ? ఎలా నిర్ణయిస్తాం ?

50 శాతం రోజు వారీ ఖర్చులకు , మిగతా సగం పొదుపు కి కేటా యించే వారు .
కుటుంబానికి కారు కొనే సామర్ధ్యం ఉన్న వారు .
రోజుకి 200 నుండి 500 రూపాయలు ఖర్చు పెట్టే స్థోమత ఉన్న వారు. 
రోజు వారీ తలసరి  ఆదాయం 500 నుండి 3000 రూపాయలు ఉన్నవారు .
తలసరి కుటుంబ ఆదాయం 4లక్షల నుండి 18 లక్షలు ఉన్న వారు .
 ------   అలా లెక్కిస్తే   మన ఇండియా లో  4 కోట్ల మధ్య తరగతి కుటుంబాలు న్నాయి .  మన దేశ 
 కుటుంబ పరిమాణం 5.3 సభ్యులు  . అనగా మధ్య తరగతి ప్రజలు  25  కోట్ల మంది ఉన్నారు .
దేశ జనాభా లో 20 శాతం ఉన్న మధ్య తరగతి వారు , 50 శాతం కార్ లు ,ఎ.సి. లు , కంప్యూ టార్ లు ,క్రెడిట్ కార్డ్ లు , 40 శాతం ఓవెన్ లు కలిగి ఉన్నారు .

Thursday, 6 December 2012

అహింస అంటే ఏమిటి ?

అహింసా పరమో ధర్మ :  

ధర్మ హింసా  తదేవ చ :

ఆయుధం లేని దేవుడు ఉన్నాడా ఆయుధం లేని దేవత ఉందా.?
అహింసా పరమో ధర్మ :   అనేది కేవలం సన్యసించి, వైరాగ్య మార్గంలో ఉన్న సాధు సంతులకు మాత్రమే. ఒక సాధువును హింసించినా, తనకు ప్రాణహాని కలుగుతున్నా , తనని తాను రక్షించుకోవడానికి కూడా, ఆయుధం చేత బట్టడు. కారణం, సకల చరాచర సృష్టిలో తనని తాను చూసుకుంటూ అవతలి జీవిలో కూడా పరమాత్మని చూస్తాడు కాబట్టి !

ధర్మ హింసా  తదేవ చ : కూడా అంతే గొప్పది. సనాతంధర్మంలో ధర్మ హింస అనేది క్షాత్ర ధర్మం. దానిని అనుసరించి , సంఘాన్ని రాక్షసుల బారినుంచి, దోపిడీ ముఠాల నుంచి, క్రూర మృగాల నుంచి, దుర్మార్గులనుంచి రాజులు రక్షించేవారు. కానీ నేటికాలం లో ముఖ్యంగా భారతదేశం లాంటి ప్రజాస్వామ్యం లో రక్షించడం అనేది ప్రతి పౌరుడి బాధ్యత.

కష్ట నష్టాలను ,దౌర్జన్యాలను ,అవినీతి ,అధర్మాలను ,అన్యాయాలను ,దోపిడీని  ఉపేక్షించి , ముడుచుకొని మూల కూర్చోవటం  మాత్రం కాదు .  ఉదాహ రణ  కు గాంధీ అహింస మార్గాన్ని ఎంచుకొని పోరాటం చేశాడు తప్ప అహింస అని వల్లిస్తూ మూలన కూర్చో లేదు. 

సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు! 

అన్యాయాన్ని,అధర్మాన్ని ఎదిరించి పోరాడవలసిందే! కొందరు కర్రను పెట్టుకొంటే గాంధీ అహింస అనే ఆయుధాన్ని పట్టుకొన్నాడు. 

అన్ని సందర్భాలలో అహింస విజయవంతం అవుతుందని చెప్పలేం. కొన్ని సార్లు ధర్మరక్షణకోసం హింస చేయాలి. అది కూడా అహింస గానే చూడాలి. 

ముఖ్యమైన విషయం ఏమిటంటే, పదిమంది మంచికోసం ఒక్కడిని హింసించడం లో తప్పేమీ లేదు. 

వైద్యుడు ఆపరేషన్ చేసి పాడైన అవయవాన్ని తొలగించడం హింస కాదు గదా? 

అధర్మాలను
 ఎదుర్కొని న్యాయం సాధించుకోవడం ,కానీ ఆ ఎదుర్కొనే విధానం లో హింస ఉండ వచ్చు, లేకపోవచ్చు. .
నిన్నె వారైనా కొడితే తిరిగి కొట్టక పోయినా, వారి నుండి
   క్షమార్పణ వచ్చె వరకు వారిని ఎదుర్కోవటమే అహింస .
సమాజానికి అన్యాయం జరిగితే ,న్యాయం జరిగే వరకు హింస లేకుండా
  పోరాడటమే అహింసా విధానం . మంచి,మానవత , న్యాయ ధర్మాల కోసం  పోరాటం చేయవలసిందే! యుద్ధం జరగవలసిందే! 

ధర్మ రక్షణే అహింస.     దేహాలను కాదు , ధర్మాన్ని హింసించ కూడదు. దేహరక్షణకంటే ధర్మరక్షణ మేలు!

అహింస అంటే సమస్యనుండి పారిపోవడం కాదు. నిలబడి ఎదుర్కోవడం ! 

అహింస అనే ఆయుధం తో కొన్నిసార్లు   దుర్మార్గుల మనస్సును  కూడా గెలవ వచ్చు.    

 అహింస కూడా ఒక విధమైన తపస్సే! 

 తపస్సు అంటే ఏమిటి? 

మనో వాక్ కాయములతో దైవస్మరణ,దైవజపం,దైవకార్యం  చేయడమే తపస్సు. 

 నిర్ణయాలు చేసే బుద్ధితో  సత్య మే పలికే ధైర్యాన్ని,  అహింస యే పరమాయుధంగా వాడే కుశలతను, దైవం పై నమ్మకం,శ్రద్ధ కలిగిఉండే ఓర్పును  కలిగిఉండటమే తపస్సు. 

తపస్సు పరమార్ధం ఏమిటి ?

తపస్సు పరమార్థం త్రికరణ శుద్ధియే.!  చిత్త శుద్ధి , త్రికరణ శుద్ధి శాంతిని అందిస్తాయి. శాంతిద్వారా రాగద్వేషాలు తొలుగుతాయి. అరిషడ్వర్గాలు నశిస్తాయి' అన్నది యోగవాసిష్ఠంలో చెప్పబడింది

తపస్సు ఎలా చేయాలి? 

దేహంతో అంటే భౌతికంగా జరిపే పూజ, వాక్కుతో జపం, మనస్సుతో దైవధ్యానం,  అహింస,ధర్మరక్షణ, సత్య వాక్ పాలన ,దైవ శరణాగతి,నిరంతరం భగవత్  శ్రద్ధతో ఉండే బుద్ధి తద్వారా  దేహ, మనో, బుద్ధి, ఇంద్రియ నిగ్రహాలు అలవడుతాయి. అంతేకాదు ప్రాపంచిక బాధ్యతలను దైవం అప్పచెప్పిన బాధ్యతలుగా భావించి దైవకార్యంలా చేయడమే కాయతపస్సు. దీనినే కర్మకౌశలం, కర్మయోగం అనికూడా అంటారు. 

ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం తపస్సుకు మరీ ముఖ్యమైన రెండు సాధనాలు. బుద్ధి సాత్వికం గా దైవబద్ధంగా ఉంటేనే మనో  ఇంద్రియాల పైన అదుపు ఉంటుంది. 

 మంచీ-చెడూ , పాపం-పుణ్యం; సుఖదుఃఖాలు,సంతోష విచారాలు,మానావమానాలు అనే ద్వందాలు  ధర్మ  జిజ్ఞాస పరిధి లో ఉంటాయి . 

ధర్మ పరిధిని దాటి పరబ్రహ్మ పరిధికి చేరినప్పుడు మంచీ,చెడూ అనే ద్వందాలేవీ ఉండవు. 

తిను -తినిపించు;గెలువు-గెలిపించు; సంతోషాలను పంచు --ఇదే యజ్ఞం. 

పాత్రత నెరిగి దేశకాల మాన స్థితులకు అనుగుణంగా  ప్రేమతో బాధ్యతగా కొంత పంచడం-   దానం.  

తపస్సు అంటే సంకల్ప బలం ఎక్కువగా ఉన్న సాత్విక  బుద్ధి అని పైన  మనం వివరంగా చెప్పుకొన్నాం. 

 యజ్ఞ దాన తపో కార్యాలు కర్త్రుత్వ భావన అనగా నేనే చేస్తున్నాననే అహంకారం లేకుండా  చేయడమే సాత్వికత. 

సాత్వికత అనేది ఒక సాధనం. 

సాత్వికత ద్వారా దేహ ప్రపంచ పరిధినుండి ఆత్మ పరిధికి చేరుకోవడమే బ్రహ్మ విద్యా సాధన.  

అర్జున విషాదం - సనాతన ధర్మ విచారం

భగవద్గీత ప్రధమ  అధ్యాయం లో అర్జున విషాదానికి కారణాలు ? అవి సబబైన వా ? లేదా ?
అర్జునుని పరిస్థితి సామాన్య మానవుడికి కూడా రావచ్చు . అప్పుడు ఏం చేయాలి ?

అర్జునుడు జగ దేక వీరుడైనా , ధీ శక్తి యుతుడైనా , ఎన్నో యుద్దాలలో విజయుడై నా , అన్న గారి మాటకు ,ధర్మానికి , ఆర్తుల ప్రాణ రక్షణ కు కట్టు బడినా ,రుద్రుని మెప్పించినా , ద్రోణు నికి ప్రియ శిష్యుడుగా మె లిగినా , భీష్ముడికి ,కృష్ణునికి  , ద్రౌపదికి , ప్రియమైన వ్యక్తిగా  ఉన్నా , తన శారీరక , అస్త్ర బలాన్ని పెంచుకోవటానికి ఎంతో తపస్సు చేసి న శ్రద్దా సక్తుడుగా ఉన్నా ,ధర్మ  పోరాట మైన కురు క్షేత్ర యుద్దంలో ఎందుకు నీరస పడి నిర్వీరుడ య్యాడు  ?
కారణాలు :
1.ఎదురుగా ఉన్న అందరూ స్వ జనులే -బంధువులు , సోదర ,పితా ,తాత సమానులు . అలాగే 18 అక్షౌహిణ సేనా వాహిని లో  ముసలి వారు , స్త్రీలు  ,పిల్లలు తప్ప   భారత వర్షం లో ఉన్న జన పదాల జనమంతా ఉన్నారు ,. యుద్ద మంటే అంతా  సర్వ నాశ నమే . ఎవరు గెలిచినా పెద్దగా సాధించేది లేదు . గెలిచి ఎవరు ఎవరిని పరి పాలించాలి ?

2.ఇప్పటి వరకు చేసిన యుద్దాలు వేరు . ఈ భారత యుద్ధం వేరు .నేటి వరకు చేసిన తపస్సు ,పడ్డ కష్టాలు ,సంపాదించిన శస్త్ర అస్త్రాలు ,చేసిన ఖాండవ వన దహనం ,కిరాత రూ పంలో ఉన్న రుద్రుని తో చేసిన యుద్ధం ,ఘోష యాత్ర యుద్ధం ,ఉత్తర గోగ్రహణ యుద్ధం , రాజ సూ య కోసం చేసిన యుద్దాలు , అన్న మాట కు ,ధర్మానికి కట్టు పడి  చేసిన  పోరాటాలు ,తపస్సులు  - ఇవన్నీ  ఒక వీరునిగా ,యువ రాజుగా  ,సేనాధిపతిగా ,  వ్యక్తిగా చేసిన కార్యాలు . వాటిలో స్వార్ధమూ ఉంది . స్వధర్మమూ ఉంది . ప్రయోజనమూ ఉంది .ఎక్కువ ప్రజా నష్టం లేదు . కానీ మహా భారత యుద్దంలో అన్నింటి కంటే ఎక్కువ ప్రజా నష్టం ఉంది .అణు అ స్త్రాలు వాడ వలసి రావచ్చు. రాజ్యం కోసం ,చేసిన ప్రతినల కోసం ఇంత మంది జనాలను ,వారెంత అధర్మం చేయనీ -తన బంధు వర్గాలను , చంపి సాదించే రాజ్యం ఎందుకు ? ఎవరి కోసం ? ఇది పాపం కాదా? సైన్యం లోని అమాయక జనులే మి తప్పు  చేశారు ?

3.ధర్మ రాజు పర్య వేక్షణ ఎంతగా ఉన్నా అర్జునుడు కూడా కొన్ని అధర్మ పాప కర్మలు చేసాడు .
        తానొక్కడే మేటి విలు కాడు గా చరిత్రలో మిగిలి పోవాలని గురువుని కోరిక కోరి ,ఒక రకంగా  ఏక లవ్యుని          నిర్వీర్యున్ని చేసాడు .
        ఖాండవ వన దహనం చేసి ఎన్నో జీవ జాతులను ,పచ్చటి అడవిని బుగ్గి చేసాడు . ఆ మారణ కార్యం అర్జును ని మనస్సు ని ఎప్పుడూ తొ లుస్తానే ఉంది .
         తాపసిగా ఉన్నా ఒక్క వేట కోసం ,అహంకారంతో   కిరాత రూ పంలో ఉన్న శివుని తో నానా రకాలుగా యుద్ధం చేసి తాపసిక ధర్మానికి తూ ట్లు పొడిచాడు .
       ధర్మ రాజుని అవకాశ మున్నప్పుడ ల్లా దెప్పి పొడిచే వాడు .
       మేటి వీరుడి నని అహంకారం ,తానొక్కడే యుద్ధం చేసి శత్రువులను నిర్జిస్తానని బీరాలు పలికాడు .

ఇవన్నీ అర్జుని మనస్సులో సుళ్ళు తిరుగుతూ బుద్ది  వికలమై ఇంద్రియాలు నిస్తేజమై రధం దిగి నిస్త్రాణగా కూల బడ్డాడు .
ఈ  విధంగా అర్జునుడు గందరగోళ పడటం ,సబబా ,కాదా అని నిర్ణ యిమ్చేది ఆ నాటి దేశ  కాల మాన పరి స్థితులు , ధర్మ సూత్రమూ   , అతని  స్వధర్మం .

దేశ  సమాజ స్థితి : కౌరవ సామ్రాజ్యం దుర్యోధనుని ఏలుబడి లో క్షీణ దశ  కు చేరింది . అధర్మం పెచ్చు మీరి ప్రజలలో అరిషడ్వర్గాలు పేట్రేగి పోతున్నాయి .అనైతికత ,స్వార్ధం ,రాజ ధర్మంగా ఎప్పుడైతే మారిందో , ప్రజలు కుడా
యదా రాజా తదా ప్రజా .

కాల పరిస్థితి : ద్వాపర యుగ ధర్మం ఆడు గంటి కలిధర్మం ప్రవేసి స్తుంది .

అర్జునుని స్థితి : అతడు  రాజు .అధర్మాన్ని ,అన్యాయాన్ని అణచివేసి, ధర్మ స్థాపనే స్వ ధర్మం & రాజ ధర్మం గా ఉన్న మనిషి . .
తనకు ,తన కుటుంబానికి ,రాజ్యానికి ,సమాజానికి  కౌరవులు చేసింది అధర్మ అన్యాయా లు .

కాబట్టి , సమాజ పరంగా ,స్వధర్మ పరంగా ,రాజ ధర్మ పరంగా ఎలా చూచినా అర్జునుడు యుద్ధం చేసి ధర్మ స్థాపన చేయక తప్పదు .కర్మ ఫలం ఎలా ఉన్నా మనిషి తన ధర్మం తాను  చేయాలి . అనవసర మైన ,పనికి రాని  గుంజాటన మనిషికి ఉండ కూడదు . తాత్కాలిక వైరాగ్యం వలన అనర్ద మే . నిజమైన జ్ఞానం లేక పోవుట వలన , సత్యం తెలియక   పోవుట వలన మనిషి నానా రకాలుగా ఆలోచించి కర్మలను విడ నాడి పలాయన వాదిగా మిగిలి పోతాడు .
అందుకే యుద్ధం చేసి నీ ధర్మాన్ని నిర్వర్తించు . ఆ తర్వాత వచ్చేది  విజయమైనా ,వీర స్వర్గ మైనా   నీ కనవసరం .
ఇది నీ భాద్యత . దీని నుండి పారి పోవద్దు .
అంటే  ప్రతి మనిషి తన భాద్యతల నుండి పారిపోక తన స్వ ధర్మాన్ని ప్రతిఫలాపేక్ష  లేదా ఫలం ఎలా ఉంటుందో అనే చింత గానీ లేకుండా నిర్వర్తించాలి .
నీ మానసిక అంతరంగం శుష్క పాండిత్యం తో ,సందేహాలతో , గందర గోళంగా ఉంది . అనేక సందర్భాలలో ప్రతి మనిషి కి ఈ  పరిస్థితి వస్తుంది .
అప్పుడు మనం మనిషిగా  ఏమి చేయాలి ? ఎందుకు అలాగే  చేయాలి ? మనిషి ధర్మం ఏమిటి ? మనిషి గమ్యం ఏమిటి ? వీటన్నిటికి సమాధానం భగవద్గీత .
ఆత్మ  ఒక్కటే సత్యం ,అంటే  మార్పు లేనిది . మిగతా వన్నీ అంటే  ద్వందాలన్నీ  - సుఖ దుఖాలు ,కష్ట నష్టాలు , అసూయా ద్వేషాలు , పగ ప్రతీకారాలు , క్షమా  అసహనాలు -   కర్మ చక్ర భ్రమణం వలన మనకు కలిగేవి .

మనిషి నాలుగు ఆశ్రమ ధర్మాల లో  ,నాలుగు పురుషార్ధాలను   ధర్మంగా సాధించి , నాలుగు యోగ మార్గాలలో తన కనువైన ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని జన్మ రాహిత్యం పొందాలని ఉపనిషద్ సారమైన గీతలో  శ్రీ కృష్ణుడు ఉపదేశిం చాడు .
మనిషికున్న పంచ కోశాలు ,జన్మ కర్మ పరంపర ,పంచ భూతాల  ,సూక్ష్మ & కారణ శరీర వివరణ
భగవంతుని శక్తి , సత చిత్  ఆనందం ,లీల  వివరణ
మనిషి ఎలా మాయ ,ద్వందాలతో ,అహంతో అల్లాడి పోతాడు ---------- ఇవన్నీ గీతలో ఉపదేశా సారంగా చెప్పారు .
తత్ వం అసి  -తత్వమసి .
అహం బ్రహ్మం అసి  - అహం బ్రహ్మస్మి

Wednesday, 5 December 2012

108 Upanishads


108 Upanishads have arranged  in four categories according to the particular Veda to which each of them belong.

Rigveda(10): Aitareya , Atmabodha, Kaushitaki, Mudgala, Nirvana, Nadabindu, Akshamaya, Tripura, Bahvruka, Saubhagyalakshmi.

Yajurveda(50): Katha, Taittiriya , Isavasya , Brihadaranyaka, Akshi, Ekakshara, Garbha, Prnagnihotra, Svetasvatara, Sariraka, Sukarahasya, Skanda, Sarvasara, Adhyatma, Niralamba, Paingala, Mantrika, Muktika, Subala, Avadhuta, Katharudra, Brahma, Jabala, Turiyatita, Paramahamsa, Bhikshuka, Yajnavalkya, Satyayani, Amrtanada, Amrtabindu, Kshurika, Tejobindu, Dhyanabindu, Brahmavidya, YogakundalinI, Yogatattva, Yogasikha, Varaha, Advayataraka, Trisikhibrahmana, mandalabrahmana, Hamsa, Kalisantaraaa, Narayana, Tarasara, Kalagnirudra, Dakshinamurti, Pancabrahma, Rudrahrdaya, SarasvatIrahasya.

SamaVeda(16): Kena, Chandogya, Mahat, Maitrayani, Vajrasuci, Savitri, Aruneya, Kundika, Maitreyi, Samnyasa, Jabaladarsana, Yogacudaman, Avyakta, Vasudevai, Jabali, Rudrakshajabala.

Atharvaveda(32): Prasna , Mandukya, Mundaka, Atma, Surya, Narada-Parivrajakas, Parabrahma, Paramahamsa-Parivrajakas, Pasupatha-Brahma, Mahavakya, Sandilya, Krishna, Garuda, Gopalatapani, Tripadavibhuti-mahnarayana, Dattatreya, Kaivalya, NrsimhatapanI, Ramatapani, Ramarahasya, HayagrIva, Atharvasikha, Atharvasira, Ganapati, Brhajjabala, Bhasmajabala, Sarabha, Annapurna, TripuratapanI, Devi, Bhavana, SIta.

Tuesday, 4 December 2012

భారతీయం కడు కమనీయం

సంస్కృతి - సంప్రదాయం  అంటే ఏమిటి ? వాటి వలన జాతికి ఉపయోగం ఉందా?
ఒక జాతికి తిండి ,గుడ్డ ,నీడ లేక పోవచ్చు .కానీ , విజ్ఞానం లేక పోతే జాతి క్రమంగా అంతరించి పోతుంది . ఉదాహరణకు ,పశువులకు విజ్ఞాన మును వారసత్వంగా నేర్చుకొనే శక్తి , సామర్ధ్యం లేనందు వల్ల అవి ఎప్పుడూ ఇంకొకరి దయా దాక్షిణ్యాల పై ఆధారపడి బతక వలసిందే .శారీరక బలం కొంత మేరకే పనికొస్తుంది . బుద్ది  పదునెక్కి , జీవన పోరాటాన్ని సులభతరం ,సుఖ వంతం చేయక పోతే  ఆ జాతి మనలేదు .

మన విజ్ఞానమే మన సంస్కృతి . ఆ విజ్ఞానాన్ని మన దైనందిన జీవనం లో భాగం చేసు కోవడమే సంప్రదాయం .
విజ్ఞానాన్ని తరంతరం నిరంతరం ఒక ధారా లాగా అందివ్వ ట మే మనిషి భాద్యత .
ఓ చిన్న ఉదాహరణ -
శుభ , సంతోష  కార్యాలలో మనిషి బొట్టు పెట్టు కోవడం సంప్రదాయం . నుదుట ఆజ్ఞా చక్రాన్ని ఉద్దేపనం చేయడం దాగిఉన్న విజ్ఞానం .

 భౌతిక ,ఆధ్యాత్మిక అంతరార్ధం లేకుండా భారతీయ సంప్రదాయాలుండవు .
పూజ ,ఆలయం ,హోమాలు , వాకిట ముగ్గులు ,గొబ్బిళ్ళు , కొప్పులో పూ లు ,మంగళ సూత్రం ,ఉపనయనం ,షోడశ కర్మలు , పంచ యజ్ఞాలు  మొదలగు ఆచారాలు అన్నీ సత్  సంప్రదాయాలే. వీటన్నింటి వెనకాల ఉన్నవి  విజ్ఞాన వీచికలే  .

తరతరాల ఋషులు ఎన్నో పరిశోధనలు తపస్సు లాగా చేసి నిగ్గు తేల్చిన సత్యం  భారతీయ సంస్కృతి .
భారత సనాతన ధర్మం ఇహానికి ,పరానికి సమ తుల్యత నిచ్చిన జీవన వేదం .

మన భారతీయ సంస్కృతి - సంప్రదాయాన్ని కాపాడండి .
ప్రకృతిని ,గోవులను , స్త్రీలను , ద్వి జులను రక్షించండి .
వేదాలను వినండి . ఉపనిషత్ లను అధ్యయనం చేయండి . భగవంతుడే స్వయంగా భోధించిన గీతా సారాన్ని దైనందిన జీవితంలో అన్వ యించు కొండి .
రామాయణ ,భారత ,భాగవతాలను మన పిల్లలకు నేర్పటం మరవకండి .

వ్యక్తిత్వ వికాసాన్ని (personality development ) అభివ్రుది చేసు కోండి . దాని తోనే ఆగకండి .
 శీలాన్ని( character building) నిర్మించు కోండి .
సత్యము ,శౌచము ,అహింస ,కరుణ ,శ్రద్ద ,సహనము ,క్షమ  ,సేవ ,ప్రేమ - ఈ లక్షణాలను చిన్నప్పటి నుండి పిల్లలకు నేర్పిద్దాం ,మన జాతిని పరి పుష్టం చేసుకొందాం .