Search This Blog

Saturday, 22 December 2012

ఆధ్యాత్మికత

ఆధ్యాత్మిక జీవితం  అంటే  అన్ని పనులు వదిలేసి దైవ చింతన లో మునిగి పోవటం కాదు . గుళ్ళ కి వెళ్లి ,తీర్థ యాత్రలు చేసి ,పురాణ ప్రవచనాలు విని , జప తపాలు చేసి మళ్ళీ మామూలుగా అన్ని రకాల ద్వంద భావాలతో ,రాగ ద్వేషాలతో జీవనం సాగించడం  ఆధ్యాత్మికత కానే కాదు .
వయో వృద్దులు ఒక్కరే చేసేది కాదు .
 ఆధ్యాత్మికత ఇహానికి ,పరానికి రెంటికీ పని కొచ్చే సూత్రం .
 నిజాన్ని నమ్మటం ,నిజమైన స్వ  ధర్మాన్ని తెలుసుకొని  త్రికరణ శుద్ది గా పాటించడం , వయస్సుకి ,స్థితికి అనువైన నాలుగు ఆశ్రమాల నియమాలను అమలు చేయడం ఆధ్యాత్మికత .
పుట్టిన పసి వాడు తల్లి పాలు త్రాగటం ,20 గంటలు నిదుర పోవటం ఆధ్యాత్మికత .
బాల్య  వయస్సు లో మంచి ఆహారం ,ఆట పాటలతో ఆహ్లాదంగా గడపటం    ఆధ్యాత్మికత  .

విద్యార్ధి దశలో -  శరీర శుభ్రత , వ్యాయామం ,మంచి పోషక ఆహారం తినుట ,
స్వచ్చ మైన గాలిని ప్రాణా యామ పద్దతి లో శ్వా  సించుట ,
తల్లితండ్రులను అతిధి అభ్యాగతులను పూజించుట ,
గురువుని దైవం వలే నమ్మి విద్య నేర్చు కొనుట ఆధ్యాత్మికత .

తోటి మనిషికి , ప్రకృతికి హాని చేయక చాత  నైనంత సాయం చేయడం ,
వస్తూత్పత్తి చేసే వారిని  అనగా పంటలు పండించే రైతు ,పరిశ్రమలలో పనిచేసే కార్మికుడు , 
అలాగే మనలను రక్షించే వారిని,అనగా , సైనికులను , పోలీసులను , గౌరవించి ఆదరించడం ;
విజ్ఞానాన్ని పంచే గురువులను ,పరిశొధనలు చేసి కొత్త విషయాలు ఆవిష్కరించే శాస్త్రజ్ఞుల ను అనుసరించడం -ఆధ్యాత్మికత .
ప్రతి భాద్యత ,వ్రుత్తి, ప్రవ్రుత్తి  అన్నీ కర్తృత్వ భావన లేకుండా భగవద్ కైంకర్యం గా చేయడమే ఆధ్యాత్మికత .
మనషి  చిన్నప్పటి నుండి ఎలా ఆధ్యాత్మిక జీవనం సాగించాలో గీత చెబుతుంది .

1 comment:

  1. గురువు అంటే సాక్షాత్కరించిన పరబ్రహ్మ అంటారు. అజ్ఞానపు చీకటిని పోకార్చే జ్ఞాన భాస్కరుడూ ఆయనే! పరబ్రహ్మ ప్రతినిధులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకన్నా మిన్న గురువేనన్న వాదన ఒకటి వున్నది. బ్రహ్మదేవుడు కేవలం జన్మకారకుడు. విష్ణువు జీవ సంరక్షకుడు. శివుడు లయకారుడు. గురువు జ్ఞానదీపం వెలిగించి కొత్త జీవితం ప్రసాదించి మోక్షమార్గాన్ని చూపిస్తాడు. అందుకే గురువు అన్న పదానికి తనని మించినది మరేదీ లేదన్న అర్థం సార్థకం అయింది  శిష్యుడు తన అహంకారాన్ని సంపూర్ణంగా గురువు పాదాల దగ్గర ధారబోయాలి. శరణాగతుడు కావాలి. అపుడే గురుఅనుగ్రహంతో బంధవిముక్తుడై ‘ముక్తపురుషుడు’ కాగలడు.
    ఎంత తపస్సు చేసినా, ఎన్ని గ్రంథాలు రచించినా వ్యాసులవారికి ఏదో తెలియని ఆరాటం- అంతరంగంలో పోరాటం!

    ReplyDelete