Search This Blog

Monday 17 December 2012

జీవనోపాధి - జీవన పరమావధి .


సత్య దర్శనమ్ , శూన్య నిర్వాణం ,భగవదైక్యం ,మోక్షం ,సమాధి , కాస్మిక్ ఎరుక ,విస్తరించిన చైతన్యం  - ఇవన్నీ పర్యాయ పదాలు .
మన కున్న చైతన్యం  అనగా అవగాహనా సామర్ధ్యం  (బుద్ది  ,మనస్సు, జ్ఞానేంద్రియాలు )  ఈ  సృష్టి లో ఒక చిన్న భాగాన్ని మాత్రమే ఆకళింపు చేసు కొంటుంది . అంటే  సత్యాన్ని చాలా కొద్దిగా అర్ధం చేసుకొనే శక్తి మనిషి కుంది .
ఉదాహరణకు , ఒక్క చిన్న రంధ్రం తప్ప ఎలాంటి కిటికీలు లేని ఒక చిన్న గదిలో మనం ఉన్నప్పుడు , మనకు   ఆకాశం లో  చాలా చిన్న భాగం మాత్రమే   కనిపిస్తుంది .ఆ రంధ్రానికి ఏదైనా అడ్డు వచ్చినా ,ఓ చిన్న మేఘం మనకు కనపడే ఆకాశానికి అడ్డు వచ్చినా మనకు ఆకాశం ఏదీ కనపడదు . కలత చెందుతాము . భయ పడతాము .అడ్డు తొలగి మళ్ళీ ఆకాశం కాన పడ గానే సంతోషిస్తాము .
ఇలాగే మన జీవితం కూడ సుఖ దుఃఖ సమ్మేళనం వలే ఉంటుంది .
కానీ, మనం ఉన్న గోడలను పగుల గొడితే ఆకాశం ఎలా పూర్తిగా కనిపిస్తుందో ,మనిషి తన చుట్టూ ఉన్న అహంకారపు పొరలను పగుల గొడి తే మన కు సత్యం పూర్తిగా అవగాహనకు వస్తుంది .

జీవుడు అవిభాజ్యపు కాస్మిక్ శక్తిలో - (పర బ్రహ్మం ) ఒక భాగమని ,
జీవుని చుట్టూ ఉన్న పంచ కోశాలు ,వాటి లో ఉన్న పంచ తన్మాత్రలు , త్రిగుణాల కలయిక వ ల్ల  అరిషడ్వర్గాలు, వాటి వల్ల కలిగే సుఖ దుఖాలు  మొదలగు వికారాలు అన్నీ  మాయ అని ,దీని వలన కర్మ చక్రం భ్రమణం తప్పదని ,చావు-పుట్టుకల చక్రం ఆగదని , - అవగాహన చేసు కోవడమే మనిషి గమ్యం .
కాబట్టి ,మనిషి  గమ్యం సత్యాన్ని పూర్తిగా అవగాహన  చేసుకోవడ మే .
అదే మనిషి  జీవన పరమావధి .
'నేను'  అనగా  , శరీరము ,మనస్సూ ,బుద్ది , కాదని
"నేను" అనేది ఒక 3 - మితులు ( 3 dimension space-time-)ఉన్న ఒక పరిధి లో బందీ గా ఉందని
నిజానికి " నేను" అనేది కాస్మిక్ శక్తి లో ఒక చిన్న భాగమని , దానికి అనేక మితుల తో (multi dimensional) సంభంధ ముందని ,
"నేను" యొక్క నిజ స్వరూపాని ఆవిష్కరిమ్చు కోవడ మే ప్రతి మనిషి పరిణామ గమ్యమని అవగాహన చేసు కోవడమే సాధన .
జీవనోపాధి ని ,  జీవన పరమావధి ని సమన్వయము చేసు కొంటూ ఎలా బతకాలో నేర్పుతుంది భగవద్గీత .

No comments:

Post a Comment