Search This Blog

Friday, 21 December 2012

జన్మ రహస్యాలు - ఆత్మ పరిణామం - దైవ నాటకం :


ఈ  జగత్ అంతా ఓ నిరంతర నాటకం . ఆడించేది దైవ శక్తి .
ఆడే వారు కూడ ఆత్మ లుగా మారిన దైవమే !
ఆత్మ స్వరూపులైన మనుషులు నిజం (స్వ స్వరూపం ) మరిచి , ద్వంద భావాలతో కొట్టు మిట్టాడ ట మే మాయ అని అద్వైతు లంటారు .
నేటి జన్మ లో ఉన్న సహజాత  లక్షణాలు ,ఆలోచనా
 సరళి ,వ్యక్తిత్వం , శరీర నిర్మాణం   - అన్నీ మన 
పూర్వ  జన్మల నుండి మోసుకొని (carry forward)  వస్తూనే  ఉంటాం .
సంచిత కర్మ ఒక ఫిక్సిడ్ డిపాజిట్  లాంటిది . ప్రారబ్ద కర్మ ప్రస్తుత జన్మ లో అనుభ వించ వలసిన కరెంట్ అకౌంట్ . ఆగామి కర్మ  ప్రస్తుత జన్మ లో కొత్తగా కూడ  బెట్టు కొనే కర్మ .

ప్రతి విషయమూ ,సంఘటన ,రాగ ద్వేషాలు ,
బంధాలు -అన్నీ మనం  జన్మించక మునుపే
 నిర్ణయింప బడి ఉంటాయి .అదే విధి (destiny ).

కానీ , ఎవరైతే జ్ఞాన సంపద తో వివేక వైరాగ్య విచక్షణ ల తో తన ఆలోచనా కర్మలను ద్వంద భావ రహితంగా ,సాక్షీ భావ ము తో అనుభ విస్తారో వారి పై  కర్మ భారము ,విధి పనిచేయవు . మనిషికి ఆ స్వాతంత్రం సాధించే శక్తి (free will) ,వెసులుబాటు ఉంది .
శరణాగతి , ధ్యానం  , కర్మఫల సన్యాసం  - వీటన్నింటి ద్వారా ఆత్మ జ్ఞానం  ,తద్వారా కర్మ -జన్మ చక్రం నుండి విముక్తి .

2 comments:

 1. శుద్ధ చైతన్యమైన ఆత్మ సహాయం లేకుండా ఏ ఇంద్రియం కూడ పనిచెయ్యలేదు. ఆత్మ యొక్క శక్తి ద్వారానే ఇంద్రియాలన్ని జీవుని ద్వార నడుస్తున్నాయి. మాయ కమ్మిన ఆత్మే జీవుడు. ఆ జీవుడు నేను నాది అనే అహంకారంతో అంతఃకరణ చతుష్టయం లోనే ఉంది. మనోబుద్దులు శరీరం లోపల పని చేస్తూ ఉంటాయి, అవి నాలుగు విధాలుగా ఉన్నాయి. అవి

  1. మనస్సు: ఇది సంకల్ప వికల్పాలను చేస్తుంది. ఇది బాగుంది, అది బాగుంది అని సంకల్పిస్తుంది. తర్వాత ఇది తగిందా ,కాదా అనే అనుమానాలతో, సంశయాలతో, అల్లకలలోలంగా, ఆశానిరాశాలతో, ఊగిసలాడడం అనేటువంటి వికల్పాలతో నిలుస్తుంది.

  2. బుద్ధి: ఆయా పదార్థాల స్వరూప స్వభావాలను, ధర్మాలను గత అనుభవాల సహాయంతో నిశ్చయాభిప్రయానికి వచ్చి చేయవలసిన పనిని నిర్ణిస్తుంది, ప్రణాలికలను తయారు చేస్తుంది.

  3. అహంకారం: తర్వాత నేను జీవించటానికి తెలివితేటలతో తెలివిగా నడవగలుగుతున్నాను అని భావన చేసేదే అహంకారం. కార్యానికి సంబందించిన సందేహం నాకే కలిగింది, దాని నివృత్తి కూడ నేనే చేసుకున్నాను, దాని వల్ల వచ్చిన ఫలితాన్ని కూడ నేనే అనుభవించాను అనే వాటిని ఆపాదించుకుంటూ ప్రతి పనిమీద ఒకరకమైన సంతోషాన్ని పొందుతూ గర్వాన్ని ప్రకటిస్తూ అహంభావాన్ని అనుభవించే దాన్నే ‘అహంకారం’ అంటారు. నేను, నాది అనే అహాన్ని వ్యక్తం చేస్తూ జీవించే విధానాన్నే అహంకారం అన్నారు. అహంకారంలో తనను తాను అభిమానించుకొనే గుణం ప్రధానంగా ఉంటుంది.

  4. చిత్తం అంటే ప్రయోజనన్నే చింతిస్తుంది.ఏదైనా విషయాన్ని స్మరించేటప్పుడు మనస్సు, బుద్ధి, అహంకారాలతో కుడి వాటిని పర్యవేక్షిస్తూ రాబోయే వాటికి సలహాలిస్తూ, అభిమాన విషయాలను ఎల్లవేళలా జ్ఞాపకం పెట్టుకుంటూ వాటి జ్ఞానంతో సక్రమంగా నడిచేటట్లు చేసేదే చిత్తం.

  అందువలన సహజ సిద్దమైన మనస్సుయొక్క చంచలత్వాన్ని తొలగిస్తే మిగిలిన పనులన్నీ బుద్ది నిర్వహించ గలుగుతుంది. మనం ఎప్పుడైతే ఆత్మ జ్ఞానాన్ని గ్రహిస్తామో అప్పుడు మనసు తన యొక్క చంచలత్వం తొలగిపోతుంది, అప్పుడు మనసు నిర్మలమవుతుంది. ఆ నిర్మలమైన మనస్సే మనకు సాధనలో ఉపకరిస్తూ ఆ పరమాత్మ స్వరూపునిని హృదయంలో మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది.

  ReplyDelete
 2. Very good. బాగా విడమరిచి చెప్పారు రత్నం గారు .

  ReplyDelete