Search This Blog

Thursday 17 January 2013

తెలుగు తల్లి గుండె లో గునపాలు

నీటి పంపిణీ ,భూగర్భ సంపద (- బొగ్గు ,సున్నపు రాయి ,మొదలగు ), సాగర సంపద ,నౌకా యాన పరిశ్రమ , హైదరాబాద్  మహా నగరం  - ఆంద్ర ప్రదేశ్   రాష్ట్రాన్ని రెండు గా విభజించాలన్నప్పుడు , ఇవీ ముఖ్యం గా చర్చకు వచ్చే విషయాలు .

తెలం గాణా ప్రజా వాణి , వారి  ఉద్వేగ భరిత  మానసిక స్థితి ని అందరూ అర్ధం చేసు కోవాలి .
 చరిత్ర తిరగ దోడినప్పుడు , ముసల్మాన్ ర జా కార్ ల, గడీ దొరల ఏలుబడి లో    తెలం గాణా ప్రజల కష్ట నష్టాలు అందరికీ తెలిసిన వే . గత 150 ఏళ్ళుగా తెలెంగాణా ప్రజలు శారీరక ,మానసిక ,ఆర్ధిక దోపిడీ కి గురి అయ్యారు . ఎటొచ్చీ గత 40 ఏళ్ళు గా వారు ప్రశాంతంగా అభివృద్ధి పధం లో సాగుతున్నారు .

దోపిడీ కి కారణం కలిసి ఉండటం మాత్రం కాదు . కలిసి లేనప్పుడే వారు విపరీత మైన దోపిడీకి గురి అయ్యారు .వేరే కారణాల వల్ల  ఇబ్బందులు పాలై , కలిసి ఉండటం వల్లనే అభివృద్ధి చెంద  లేక పోతున్నామని అనుకోవటం ఆత్మ  వంచన . ఇది చారిత్రిక తప్పిదానికి దారి తీస్తుంది .

భౌగోళికంగా , నదీ ప్రవాహ జాలు  పరంగా , భూ గర్భ గనుల  మరియు సాగర తీర నౌకా వాణిజ్య పరంగా సీమాంధ్ర , తెలెంగాణ  ప్రాంతాలు కలిసి జీవనం  సాగిస్తూ అభివృద్ధి చెంద  వలసిన అవసరం ఉంది .

విడి పోవాలా ? వద్దా ?
 విడి పోవాలని కొందరు  రాజకీయ నాయకులు ,కొన్ని వర్గాల ప్రజలు ఎందుకు పోరాటం చేస్తున్నారు  ?
సమైఖ్యంగా నే ఉండాలని మరి కొందరు ఎందుకు   కోరుకొంటు న్నారు ?
విడి పోవటం అత్యవసరమా ?
అభివృద్ధి ని ఫ ణం గా  పెట్టి విడి పోవలసిన అగత్యం ఎందుకు ?
తెలంగాణా జిల్లాలలో ఉన్న 3.5 కోట్ల మందిలో ఎంత మంది విడి పోదామని అనుకొంటున్నారు ? ఎక్కువ లో ఎక్కువ , కోటి మంది అలా అనుకొన్నా , వారి సెంటిమెంట్ కోసం పచ్చగా అభివృద్ధి చెందుతున్న బల మైన  రాష్ట్రాన్ని ముక్కలు చేసి ,మిగతా 8 కోట్ల ప్రజల భవిష్యత్ ను బూడిద గా మార్చే కార్పణ్యం ఎందుకు ? 


ఆంద్ర ప్రదేశ్  సమైక్య విశాలాంధ్ర గా ఎందుకు ఉండాలి ?
చరిత్ర చెప్పినట్ట్లుగా నిజాం కాలం నాటి హైదరాబాద్ తెలంగాణాలోని ప్రాంతమే. అప్పటి నగరం వేరు . కానీ గత 50 సంవత్సరాల నుండి మనందరం కలిసి  ఆ నగరాన్ని అభివ్రుద్ది చేసుకొన్నాం . అలాంటి హైదరాబాద్ లేకుండా అటు తెలంగాణా కానీ , ఇటు ఆంధ్ర ప్రాంతం గానీ బ్రతుకు సాగించలేవు . మనందరమూ కలిసి ఒక చెట్టుని నాటి ,పెంచి పోషించి , పళ్ళు కాసే సమయానికి మీకు హక్కు లేదు- పొమ్మని పొగపెట్టడం  ఎంత వరకు న్యాయం ? మనందరి ఉనికిని , మనందరి ప్రగతిని కాపాడుకోవలసిన సమయం ఇది .కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజలు  కలిసి కట్టుగా ఉండవలసిన తప్పని  పరిస్థితి నేడు ఉన్నది .
 
  హైదరాబాద్ కోసం మాత్రమే కొట్టుకొంటున్నారు . మీలో సమైక్యతా భావం లేదు - అని కొందరు విమర్శిస్తున్నారు . నిజం నిక్కచ్చిగాచెప్పుకోవాలంటే , మన బ్రతుకు బండికి ఆర్ధిక దన్ను ఉండాలి . .హైదరాబాద్ అందరికీ చెందాలనే మా కోరిక. అన్ని ప్రాంతాల వారు లబ్ది పొందాలనే మా ఆరాటం .ఒక ప్రాంతానికో , మరికొందరి ప్రజలకో పరిమితం కాదు .మనందరం కలిసి  గత 50 ఏళ్ళుగా మన రాజధాని నగరాన్ని పెంచి పోషించుకొన్నాం . మన వర్తమానాన్ని , భవిష్యత్ ని , మన కలలను ఆ నగరంతోనే ముడి వేసుకొన్నాం .హైదరాబాద్ నేడు అందరికీ అవసరం .

  అన్ని ప్రాంతాలవారూ  హైదరాబాద్ కోసం ఎందుకు  ఆరాటపడుతున్నారు ?
    దేశంలో 6 వ పెద్ద నగరం . 2000 చ.కి.మీ. వ్యాపించి ఉన్న హైదరాబాద్ అర్బన్ డెవ్లమెంట్ అధారిటీలో 70 లక్షల  పని చేసే జనాభా . అంతర్జాతీయ విమానాశ్రయం . దేశంలోని అన్ని ప్రాంతాలను కలిపే రోడ్ - రైల్ నెట్ వర్క్  . ప్రసిద్ది గాంచిన 500  సాఫ్ట్ వేర్ కంపినీలు ,  ప్రపంచంలోనే అత్యధికమైన ఫార్మా కంపినీలు ,మెడికల్ -ఇంజనీరింగ్ - అంతర్జాతీయ బిజినెస్  కాలేజీలు , 30000 హాస్పిటల్ బెడ్స్ తో 40 అధునాతన కార్పొరేట్ హాస్పిటల్స్ , జాతీయ - అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాలు , బయోటెక్ ఇండష్ట్రీ , నానో ఇండష్ట్రీ , ఫాబ్ సిటి , దేశంలోని  ఐ. టి. ఎగుమతులలో 15 శాతం .
రాష్ట్ర మొత్తం శిస్తు వసూళ్ళలో దాదాపు 40 శాతం ఒక్క హైదరాబాద్ ద్వారానే వస్తుంది .
అన్నింటినీ మించి ఐ. టి. మల్టి ప్లైర్ ప్రభావంతో  అమెరికానే తలదన్నే రియల్ ఎస్టేట్ , ఆహార రెస్టారెంట్ లు , మాల్స్ , టూరిజం , క్రీడా స్టేడియం  -ఇంతగా అభివ్రుద్ది చెందిన సిటీ ,మీకు చెందదు అని అంటే ఎంత బాధ కలుగుతుంది ? ఇలాంటి నగరాన్ని మన అందరమూ కలిసి పంచుకోవాలంటే తప్పనిసరిగా  అన్ని ప్రాంతాల వారు కలిసి ఉండాలిసిందే .
వలస వచ్చినవారు , దోపిడీదారులని , ఒక వర్గం వారిని తిడుతూ, మీ ఆస్తులకు రక్షణ కల్పిస్తామని అంటున్నారు . ఎవరు ఎవరికి రక్షణ ఇస్తారు ? ఎ పుడైతే ఈ విధమైన హామీలు వచ్చాయో ,ఒకరి దయా దాక్షిణ్యాలపై ఆ ధారపడవలసిన అగత్యం ఉందన్న మాట  అక్షరాల నిజం .

2. నీటి యుద్దాలు , విద్యుత్ శక్తి కొరత , ఆహార ధాన్యాల కొరత - వీటిని నివారించాలంటే మనం కలిసి ఉండ వలసిందే .

 3. చిన్న రాష్ట్రల  వనరులు , శిస్తులు , ఆ రాష్ట్ర  పరిపాలనా ఖర్చుకే సరిపోని పరిస్థితి వస్తుంది . పెద్ద సమైక్య రాష్ట్రం ఉంటే ఎన్నో ప్రాజెక్ట్ లు కట్టుకోవచ్చు . కేంద్ర ప్రభుత్వ నిధులు ,పెద్ద ప్రాజెక్ట్లు సాధించు కోవాలన్నా పెద్ద రాష్ట్రం గా ఉంటే నే సాధ్య పడుతుంది .

4. ఒక ప్రాంతంలో లేని వనరులు మిగతా ప్రాంతాల వారితో పంచుకోవటం వలన అభివ్రుద్ది అందరికీ అందే అవకాశం. ఉదాహరణకు - తెలంగాణా లో విస్తారమైన బొగ్గు , బెరైటిస్ , సున్నపురాయి గనులు ఉంటే , అదే విధంగా ఓడ రేవులు ,  గాస్ - ఆయిల్ నిక్షేపాలు ఆంధ్ర ప్రాంతంలో , ఐరన్ తదితర గనులు సీమలో  ఉన్నాయి . వీటన్నింటినీ సమంగా అందరము వాడుకోవటం వలన అందరము అభివ్రుద్ది చెందవచ్చు .

5. హక్కులకోసం పోరాడితే బాధ్యతలు కూడ మోయాలి - ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి . మారిన పరిస్థితులలో ఆంధ్రా అంటే హైదరాబాద్ . హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్ . ఇది అందరూ గుర్తుంచుకోవలసిన విషయం.

ఆంధ్ర  ప్రదేశ్  ని  విభజిస్తే జరగ బోయే పరిణామాలు  :

 క్రీస్తు శకం 2018 . క్రిష్ణా జిల్లాలో ఓ మారుమూల గ్రామం . ఏరువాక ఎల్లిపోయి నెల గడిచింది . పొలాలలో సడి లేదు . నారుమళ్ళ పోత లేదు . నల్ల భూముల్లో కసింతలు . కుక్క బెండలు విరగ కాసాయి . ఒకప్పుడు పచ్చని మాగాణులైన ఆ  భూముల్లో నాగలి కర్రు దిగి రెండేళ్ళయింది . రైతు గుండెల్లో గునపాలు దిగి ఒకప్పటి అన్నపూర్ణ ఆకలితో అలమటిస్తోంది . కాలువల్లో నీరు లేక లవణ జలం ఎగదన్ని భూములన్నీ చౌడుబారి సముద్ర తీర మైదానాలన్నీ సరుగుడు  , సుబాబుల్ చెట్లు పెంచాలసిన పరిస్థితి .దీనికి కారణం ఎగువ తెలెంగాణ ప్రభుత్వం క్రుష్ణా నది కి అడ్డు కట్ట లేసి కరెంటు మోటార్లతో ఎత్తిపోతల పధకాలు విరివిగా అమలు చేయడం ..

రాయల సీమలో ఓ కుగ్రామం . ఫాక్షన్ తగాదాలతో అట్టుడుతున్న వందలాది గ్రామాలలో అది ఒకటి .  గనుల డబ్బుతో , పారిశ్రామికంగా ఎదిగిన కొన్ని ప్రాంతాలు మినహాయించి చాలావరకు సీమ ప్రాంతం  కరువు కొరల్లో వేలాడుతుంది . కరెంటు లేదు . జల ఘోష లేదు . ఎర్ర భూముల్లో వాన చుక్క బడి ఏదాది వెళ్ళింది . శనగ మొక్క బతికి గింజ కట్టే పరిస్థితి లేదు . తిండి లేకపోవటంతో తగాదాల్లో ఇరుక్కున్న జనం . మగ దిక్కు లేక  తల్లీ -బిడ్డా తల్లడిల్లే  గ్రామాలు  పెరిగి పోతున్నాయి . దీనికి కారణం తెలంగాణా ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ని ఆపివేయడం .

తెలంగాణా లో ఓ చిన్న గ్రామం . అన్ని ఆహార పదర్ధాలు , యంత్ర సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి . సముద్ర ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నాయి .సిమెంటు , ఉక్కు ధరలు పెరుగుతున్నాయి . నక్షలైట్ల బెడద పెరుగుతూంది
రాజ కీయ నాయకులు ఏంతో కష్ట పడి ఎన్నో పధకాలు రచించి విడ దీసి చేతులు దులుపు కొన్నారు .కొత్తగా వచ్చిన అధికారం తో  కాలు నిలవక ఎన్నో వాగ్దానాలు అమాయక ప్రజల పై విర జిమ్ముతూ న్నారు .
 ఎత్తి పోతల పధకాలు , నదులకు ఎగువ గా ఆన కట్టలు కట్టాలని దోపిడీ రాజ్యానికి తెర  దీసారు .
పేద వారు ఇంకా పేదరికం లో ధన వంతులు మరింత సంపద లో కూరుకు పోతున్నారు .
రాజ కీయ పార్టీలు  మాత్రం రెండు రాష్ట్రాలలో  ఎలా అధికారం సాధించాలా ? అని మల్ల గుల్లాలు పడుతున్నాయ్  .
   భారత కేంద్ర ప్రభుత్వం ఎప్పటి లాగానే సమస్యలను సాగ దీస్తూ .... కొత్త సమస్యలను సృష్టిస్తుంది .                                                                                 

 సుత్తి లేకుండా సూటిగా చెప్పా లంటే , విడి పోవాలా ? వద్దా ? అనేది కొశ్చన్ కాదు . ఎలా,ఏవిధంగా విడి పోయి ఆస్తుల ,సంపదల పంపిణీ జరపాలి అన్నదే పాయింటు .
                                                                                                                                                                                           



No comments:

Post a Comment