Search This Blog

Tuesday 29 January 2013

చేతిలో డబ్బున్న వాడికి చేసు కొన్నంత మహా దేవ !

ఆర్ధిక స్థితి మందం  గా ఉన్నప్పుడు , డబ్బు చెలామణీ తగ్గి ,   బాకీ దార్లు అప్పు చెల్లింపులు చేయ లేక
 బాంక్ ల నిరర్ధక ఆస్తులు పెరిగి  తద్వారా   బాంక్ లకు కూడా ద్రవ్య సరఫరా తగ్గి ,బాంక్ లు
 అప్పు ఇవ్వ లే నప్పుడు ,  పరిస్థితి ఎలా ఉంటుంది ?
our markets going in to the phase of "deflation".
what measures one has to observe in coming 5years?

1.స్థిరాస్తులు కొనే వాళ్ళు తగ్గి ,వాటి విలువలు తగ్గుతాయి . ఆ తర్వాత కొనే వాళ్ళు కూడ ఉండరు .
2. డబ్బు సరఫరా    తక్కువ ఉండటం వలన పరిశ్రమలకు , వ్యాపారాలకు ఇబ్బంది ఏర్పడు తుంది .
3.ప్రజల కొనుగోలు శక్తి తగ్గు తుంది . వస్తువుల ధరలు తగ్గినా కొనుగోళ్ళు పెరగవు .

సా మాన్య ప్రజలు తీసు కోవలసిన జాగ్రత్తలు :
1.ఉన్న డబ్బుని కనీస అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి . విలాస వస్తువులు ,సెల్ ఫోన్ లు , ఎ.సి.లు , కార్ లు , తదితర వస్తువుల జోలికి వెళ్ళ కూడదు .
2. స్థలాల పైన ,స్టాక్ ల్లో , స్పెక్యులేషన్ పై పెట్టుబడి వద్దు .
3. సాధ్య మైనంత వరకు మీ కున్న సంపదను కరెన్సీ రూపం లో గాని ,లేదా ఏదైనా త్వరగా ద్రవ్య చ లా మణీ కి ఉపయోగ పడే -బంగారం  , అద్దె లు వచ్చే రియల్ ఎస్టేట్  లాంటి వాటిలో మదుపు చేయ వచ్చు .బంగారం కొనేది అవసరానికి ఉపయోగించు కోవటానికే తప్ప దాని పై భారీ లాభాలు వస్తాయని కాదు . ఎందు కంటే రాబోయే 10 ఏళ్ల లో బంగారం విలువ క్రిందటి దశాబ్దం లాగా పెరగదు .
4. ముఖ్యం గా చదువు ల కోసం డొనేషన్ లు కట్ట వద్దు .
5. కనీసం 3 లక్షల విలువ గల  ఆరోగ్య భీమా ప్రతి ఒక్కరికీ ఉండాలి .
6. కుటుంబం లో ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేయాలి .వ్యవసాయం పై  గ్రామీణ యువత దృష్టి పెట్టాలి .
సేవా రంగం చతికిల బడే కాలం ఇది . కాబట్టి ఉత్పాదక రంగం పై ఎక్కువ శ్రద్ద పెట్టాలి .
7.  ఇంజనీరింగ్ ,మెడిసిన్ లాంటి అత్యధిక ఖరీదు చదువులు  కాకుండా ,వృతి విద్యా కోర్సులు - పారా మెడికల్ , పారా లీగల్ ,పాలిటెక్నిక్ ,వడ్రంగం ,ఎలక్ట్రీషియన్ ,శానిటరి , ఆటో మెకానిక్ కోర్సులు చేస్తే ఉద్యోగాలు గ్యారంటీ .

No comments:

Post a Comment