Search This Blog

Sunday 20 January 2013

"దేశ మంటే మట్టి కాదు , దేశ మంటే ఓ ట్లోయ్ "

రాబోయే 2014 ఎన్నికల లో , సమైఖ్య ఆంద్ర లో కాంగ్రెస్స్ పార్టీకి విజయ అవకాశాలు తక్కువ.సీమాంధ్ర లో జగన్ పార్టీ కి ఉన్న సానుభూతి  , తెలంగాణా లో  ఉన్న ప్రత్యేక రాష్ట్ర  సెంటిమెంట్ వలన 2014 లో  కాంగ్రెస్స్ పార్టీ గెలిచే అవకాశాలు  లేవు.కనీసం ఆంధ్రా నుండి 25 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించు కోవాలంటే రాష్ట్రాన్ని చీల్చి తెలంగాణా ఇస్తే , కనీసం తెలంగాణా ప్రాంతం లో 20 సీట్లు సాధించు కోవచ్చనే వ్యూ హం తో కాంగ్రెస్స్ పార్టీ సిద్దంగా ఉంది .అలాగే ఇతర పార్టీలు కూడా  తెలంగాణా సెంటిమెంట్ కి తల ఒగ్గి వారి వారి విజయావ  కాశా లాను మెరుగు పరుస్తున్నారు - .-  ఇదీ రాజ కీయ పండితుల అంచనా .

వ్యవస్థ ఏ మైనా ఫరవా లేదు ,ఓట్లు రాబట్టు కొని అధికారం చెలాయించాలి. ప్రతి పార్టీ ఓట్ల గురించి ఆలోచిస్తుంది గాని, రాష్ట్ర విభజన వలన జరగ 
 బోయే కష్ట నష్టా లను ప్రజలకు తెలియ చేసి , విభజన తప్పని పరిస్థితి లో
 ఏ విధం గా సంపద , ఆదాయాల పంపిణీ  చేసు కోవాలి ? అనే దిశ గా ఆలోచించడం లేదు .
శ్రీ కృష్ణ కమిటీ సూచనల గురించి ఎవ్వరూ చర్చించడం లేదు .
విచిత్రం ఏమిటంటే , రాజకీయ నాయకులకున్న సమ కాలీన సామాజిక పరిజ్ఞానం మేధావులకు, నేడు లేదు .ఉన్నా ఎవ్వరూ ముందుకు రారు .
ప్రజలు కూడా మనోభావాల కన్నా రాష్ట్ర ఆర్ధిక ,జీవన అభివృద్ధి కి పెద్ద పీట వేయాలి .
మేధావులు విద్యార్ధులను చైతన్య పరిచి , సామాన్య మానవుడి వికాసానికి మనం ఏం చేయాలో భోధించాలి .
మత  సంస్థలు , వ్రుత్తి సంఘాలు , సేవా సంస్థ లు ,సంఘానికి దిశా నిర్దేశం చేయాలి . 
మేధావులే రాజ కీయ పార్టీల ఉచ్చు లో పడితే సంఘం దారి తప్పుతుంది .
దురదృష్ట వశాత్ ,ఒక్క రాజ కీయ పార్టీ లే చురుకుగా ఉన్నాయి . మిగతా సమాజం ఏమీ పట్ట నట్టు సోమరి గా ఉంది .
రాజ కీయ పార్టీలు ఓట్ల కోసం ఎన్నో అనుచిత సంక్షేమ పధకాలు , ప్రభుత్వ వ్యవస్థను ,సాంఘిక వ్యవస్థను బల హీన పరిచే  కార్య క్రమాలు చేస్తున్నారు . దానం మంచిదే .కానీ, అపాత్ర దానం మంచిది కాదు . ప్రజలను బిచ్చ గాళ్ళగా మార్చ కూడదు . చేపని దానం చేయడం కంటే ,చేపని పట్టు కొనే శక్తిని ,యుక్తిని నేర్పాలి .
ఒక విధంగా ప్రజలను సోమరులుగా మార్చి  తద్వారా సమాజాన్ని నిర్వీర్యం చేస్తే  , ఎంత కాలమైనా వారి అధికారానికి అడ్డు ఉండదు .
"దేశ మంటే మట్టి కాదు  , దేశ  మంటే ఓ ట్లోయ్ "
unfortunately we don't have statesman but we have "ote- bank -centric" politicians

No comments:

Post a Comment