Search This Blog

Tuesday 18 February 2014

నేటి భారతం

రెండు సమాంతర ఆర్ధిక వ్యవస్థలు న్న దేశం మహా ప్రమాద కరమైన అశాంతి కి దారి తీస్తుంది . 

నల్ల ధనం, యాంత్రీకరణ , కార్పోరేట్ ఆక్రమణ లు , విదేశీ పెట్టుబళ్ళు  ఒక వైపు 
తెల్ల ధనం , చేతి పనివారి కూలీ రేట్ల  పెరుగుదల , కూలీ చెల్లించలేని స్థితిలో రైతులు , దేశం చేసిన అప్పులతో సంక్షేమ కార్యక్రమాలు,ఉత్పాదకత లేకుండా అప్పులు   -ఇదీ నేటి భారత ఆర్ధిక దుస్థితి . 

భారత దేశం లో మనుషులకు పని లేదు . నిజం చెప్పా లంటే పని దొరకడం లేదు . ఎప్పుడైతే పని లేదో రకరకాల అవాంఛ నీయమైన కార్య క్రమాలు పెచ్చరిల్లుతాయి . 
మన దేశ ఆర్ధిక పునాదులు విదేశీ పెట్టు బడులపై న , కార్పోరేట్ కంపెనీలు చెల్లించే పన్నుల పైనా ఆధారపడి ఉన్నాయి . 
కార్పోరేట్ కంపెనీలు  బలం గా ఉండాలంటే తక్కువ జీతాలకు పని చేసే శ్రామికులు కావాలి . లేదంటే వారు భారీ యంత్రాలపై న ,ఆటోమేషన్ పైన ఆధార పడతారు . 

 విదేశీ పెట్టుబడుల ఆధారంతో కార్పొరేట్ కంపెనీల సారథ్య ంలో ఆర్థికాభివృద్ధిని సాధించడమనే అభివృద్ధి నమూనాను మనం అనుసరిస్తున్నంతవరకు మనం మన లక్షలాది యువజనులకు ఉద్యోగాలను సృష్టించలేము; ఉపాధి అవకాశాలను పెంపొందించలేము. 
కార్పొరేట్ కంపెనీలు చెల్లించే పన్నుల నుంచి సమకూరే ఆదాయాన్ని ఉద్యోగాల సృష్టికి ఉపయోగించవచ్చునని ప్రస్తుత అభివృద్ధి నమూనా విశ్వసిస్తోంది. అయితే ఇది తప్పుడు భావన. 
కార్మికులను వీలైనంతవరకు తగ్గించుకొని, ఉత్పత్తి కార్యకలాపాల్లో గరిష్ఠంగా స్వయంచాలక యం త్రాలను ఉపయోగించుకోవడం ద్వారా మాత్రమే కార్పొరేట్ కం పెనీలు పన్నులను చెల్లించగలుగుతాయి.

రెండంకెల వృద్ధి రేట్లను సాధించడానికి మన ప్రణాళికాకర్తలు, పాలకులు ఆరాటపడుతున్నారు. నిజానికి వృద్ధిరేట్లు అధికంగా ఉండడమనేది ఉద్యోగాల సృష్టికి దోహదం చేయదు. అందుకు భిన్నంగా శ్రమ శక్తితో పెద్దగా ప్రమేయం లేకుండా స్వయంచాలక యంత్రాలతో ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహించే కంపెనీలపై భారీ పన్నులు విధించాలి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు తగ్గినప్పటికీ ఉద్యోగాల సృష్టికి గణనీయమైన దోహదం సమకూరుతుంది. 

దేశ  ఆర్ధిక వృద్ధిరేట్లు అధికంగా ఉండడమనేది ఉద్యోగాల సృష్టికి దోహదం చేయదు.ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం మరింతగా పెచ్చరిల్లిపోతోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) పేర్కొంది. దీనికి నివారణ -

  • ఉద్యోగాల లభ్యతకు సంబంధించిన సమాచారాన్ని కార్మిక విపణిలోకి ప్రవేశించిన వారికి సమకూర్చాలి .
  • ఉపాధికి దోహదం చేసే నైపుణ్యాలలో శిక్షణ దేశ వ్యాప్తం గా అమలు చేయాలి . 
  • కొత్త ఉద్యోగాల సృష్టికి ఆర్థిక సహాయం : స్వయం ఉపాధి కార్యక్రమాలకు మన ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని అందించాలి . 
  • ఉద్యోగాల సృష్టికి ఏకైక మార్గం నేత మొదలైన శ్రమాధిక్య  రంగాలలోకి ప్రవేశించకుండా కార్పొరేట్ కంపెనీలపై ఆంక్షలు విధించడమే. తద్వారా చేనేతరంగంలో చాలా పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలను సృష్టించవచ్చు. 
  •  శ్రమ శక్తితో పెద్దగా ప్రమేయం లేకుండా స్వయంచాలక యంత్రాలతో ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహించే కంపెనీలపై భారీ పన్నులు విధించాలి. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు తగ్గినప్పటికీ ఉద్యోగాల సృష్టికి గణనీయమైన దోహదం సమకూరుతుంది - 

No comments:

Post a Comment