Search This Blog

Wednesday 19 February 2014

తెలుగోడి తొలి దెబ్బ

ఇంతకు  ముందే  వాగ్దానం చేసినందు వల్ల , తెలంగాణా నాయకుల సుదీర్ఘ పోరాటం వల్లే తెలంగాణా ను ఇవ్వ వలసి వస్తుందని చెబుతున్నాయి రాజకీయ పార్టీ లన్నీ .
అంటే, వేల మంది పోరాటం చేస్తే కోట్ల మందికి నష్టం కలిగే విధం గా రాష్ట్రాలను ముక్కలు చేస్తారా?

రాష్ట్రాల విభజన విషయం లో ఆయా రాష్ట్ర శాసన సభ ల అభిప్రాయానికి విలువ లేదా?
అతి ముఖ్యమైన రాష్ట్రాన్ని విభ జించె విధా నం ఇదా ?
దొడ్డి దారిన ,చాటుమాటు గా ,మీడియాకి గంత లు కట్టి నియంతృత్వ పోకడలతో పార్లమెంటు లో బిల్లు పాస్ చేసే స్తారా ?
రాష్ట్ర పార్లమెంట్ సభ్యుల నోరు నొక్కేసి,ప్రజలలో ఉన్న భయాలను నివృత్తి చేయకుండా కేంద్రం ఇష్ట మొచ్చి నట్లు చేయ వచ్చా ?

రాజ్యాంగ బద్దం గా నే చేస్తున్నాము . ఇందులో పెద్ద తప్పేమీ లేదు . అందరికీ న్యాయం జరగడం అసాధ్యం -- ఇదీ కేంద్రం, కాదు సోనియా కోటరీ వాదన.

ప్రతి దశలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ సాగిన విభజన పద్దతి ,చివరకు లోక్ సభ లో ప్రధాన ప్రతి పక్షం తో కుమ్మక్కై 6కోట్ల తెలుగు వారిని నిర్భాగ్యులను చేసిన సోనియా ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించు కోవాలి .
6కోట్ల తెలుగు వారి ఉసురు ఊరకే పోదు .

కేంద్రం దగ్గర పైసలు లేవు . అప్పుల ఊబిలొ కూరుకు పోయిన కేంద్రం ఇచ్చే హామీలు నీటి మూటలు .
 వాటిని నమ్మేంత వెర్రోల్లు కాదు తెలుగోళ్ళు .

ఓట్లు సీట్ల లెక్కలు వేసుకొన్నారు గానీ ప్రజల లో ఉన్న భయాన్ని ,అభద్రతను లెక్కచేయ లేదు .
అభివృద్ధి లో దూసుకు పోతున్న రాష్ట్రాన్ని ప్రకృతికి , భౌగోళిక స్థితికి విరుద్దం గా ముక్కలు చేస్తే జ రగ బోయే ఆర్ధిక,హార్దిక విపత్కర పరిణామాలు తెలిసీ ఇలా చేస్తారా ?

సోనియా గానీ,రాహుల్ గానీ కనీసం ప్రజానాయకులతొ ,విద్యార్ధి - ఉద్యోగుల నాయకులతో ,ఇతర  పార్టీ నాయకులతో మాట్లా డారా ?  లేదే .
 లోక్ సభలో బిల్లుని పెట్ట లేదన్న సుష్మా స్వరాజ్ రెండో రోజు అదే బిల్లుని ఎలాంటి  సవరణల కోసం పట్టుబట్ట కుండా ఎలా ఆమోదించారు ?
అంటే  అహంకార పూరిత రాజకీయం చేసి భారత దేశ  ప్రగతిని నాశనం చేసి ,దేశాన్ని విచ్చిన్నం  చేసే ఎజండా తో ముందుకు సాగుదా మను కొంటున్నారా ?
కాంగ్రెస్స్ ముద్దర ఉన్న ప్రతి రాజకీయ నాయకుడిని సమాజ బహిష్కరణ చేయాలి . 
ఇదే తెలుగు వారి తొ లి దెబ్బ గా రుచి చూపించాలి . 

No comments:

Post a Comment