Search This Blog

Wednesday, 26 February 2014

రాబోయేది సంకుల సమరం

రాబోయేది సంకుల సమరం . 
 సీమాంధ్రుల మ నోభావాలను ఏ మాత్రం లెక్క చేయకుండా సోనియా కోటరీ నిర్దాక్షిణ్యం గా, రాష్ట్రాన్ని చీల్చు తుంటే
సిగ్గు ఎగ్గు లేని కాంగ్రెస్ నాయ కులు చొంగలు కార్చు కొంటూ పదవులను జలగ ల్లాగా  పట్టుకొని ,సరైన సమయం లో అభ్యంతరాలు తెలప కుండా సీమాన్ధ్ర ప్రజలను దారుణం గా మోసం చేశారు .
ఇప్పుడు మంచి పాకేజీలు ఇప్పిస్తామని  మళ్ళీ కల్లబొల్లి కబుర్లు చెపుతున్నారు . వీళ్ళని నమ్మటానికి ఇంకా ఆంద్ర రాష్ట్రం లో వెర్రి వెంగలాయి లున్నారా ?
కులాలుగా ,వర్గాలుగా చీల్చడానికి కాంగ్రెస్ అధినాయకత్వం నడుం కడుతుంటే పదవుల కోసం వెంపర్లా డుతూ డిల్లీ చుట్టూ తిరుగుతున్న ఈ నాయకులను ఇంకా మీరు ఉపేక్షిస్తే ఆంద్ర జాతిని , సాంఘిక వారసత్వాన్ని ఎవరూ కాపాడ లేరు .
 కులాల పరం గా మనుషులను చీల్చడం రాష్ట్రాన్ని చీల్చడం కన్నా ఘోరమైనది. 

1 comment:

  1. రాబోయేది సం’కుల’సమరమే :) plz remove word verification

    ReplyDelete