Search This Blog

Thursday 27 February 2014

కోస్తా ప్రజలు మారాలి

సుమారు 700 ఏళ్లకు పూర్వం(క్రీ.శకం 1321) ,తుగ్లక్ చేతిలో పరాజయం పొందిన ప్రతాప రుద్రుడు ఖైదీగా ప్రయాణిస్తూ ,నర్మదా నదిలో చేసిన ఆత్మ త్యాగం త్రిలింగ దేశానికి సంబంధించినంత వరకు అతిముఖ్యమైన మొట్ట మొదటి బలిదానం . 
 డిల్లీ సుల్తాన్ లైన అల్లాఉద్దీన్ ఖిల్జీ , ఆ తర్వాత మాలిక్ కాఫర్ ముష్కరుల దాడిని సుమారు 18 ఏళ్ల పాటు వీరోచితం గా ఎదిరించిన కాకతీయలు సైనిక పరం గా ,సంస్కృతి పరం గా , సంపద పరం గా బల హీన మై, చివరకు ఒక విదేశీ ముష్కర తురుష్కుడైన తుగ్లక్ చేతిలో దారుణం గా ఓడిపోయారు . తుగ్లక్ సైన్యం నెలల తరబడి కాకతి రాజ్యాన్ని ,త్రిలింగ దేశాన్ని లూటీ చేసి  టన్ను ల కొద్దీ  బంగారం ,కోహినూర్ వజ్రాన్ని దోచుకు పోయారు .

కాకతీయ రాజులెవరు ? పశ్చిమ కళ్యాణ చాల్యుక్యుల సామంతు లైన వీరు,  అటు  చోళుల  తో ,ఇటు యాదవ రాజులతో చిన్న చిన్న యుద్దాలు చేస్తూ , నెమ్మది నెమ్మదిగా మొత్తం  తెలుగు దేశాన్ని తమ పాలనలోకి తెచ్చుకొన్నారు .
కళలు ,సాహిత్యం, వేయి స్తంభాల గుడి ,రామప్ప గుడి మొదలైన దేవాలయాల  నిర్మాణం ,సంస్కృత భాషకి ఆదరణ, గ్రూప్ లు గా విభజించి నాయకు ల ఆద్వర్యం లో   సైన్యాన్ని నడపటం ,ప్రస్తుత తెలంగాణా ప్రాంతాన్ని ఎక్కువ కాలం పాలించడం -కాకతీయ రాజుల ప్రత్యేకత .
కాకతీయ రాజులు (1083 CE to 1323 CE.) సుమారు 250 ఏళ్ళు పాలించారు . 


Kirti Stambhకాకతీయ శిల్ప ద్వార తోరణం సాంచీ స్తూప తోరణాన్ని పోలి ఉంటుంది .

బహమనీ సుల్తాన్ లు ఎవరు?  రాయలు  Vs  బహమనీ లు 
తుగ్లక్ గవర్నర్ ఐన బహమన్ షా ,అతని వారసులు  గుల్బర్గా రాజధానిగా  చేసిన పాలన విజయనగర  హిందూ సామ్రాజ్య స్థాపనకి ప్రేరణ గా నిలిచింది . రాయలు అనేక యుద్దాలు చేసి క్రమం గా బహమనీ వంశ పాలకులను నాశ నం చేసినా , టర్కీ దేశ స్తులైన 5 గురు బహమనీ తురుష్క  సైన్యాధిపతులు దక్కన్ ప్రాంతం లో అహ్మద్ నగర్ ,బేరార్ , బీదర్, గోల్కొండ, బీజాపూర్ అనే 5 చిన్న రాజ్యాలను స్థాపించు కొన్నారు .

విజయ నగర రాజ్యం ప్రస్తుత కర్నాటక రాష్ట్రం .  ప్రస్తుత రాయలసీమ ప్రాంతం కూడా ఆ రాజ్యం లో ఇమిడి ఉండేది .

ఎక్కడో టర్కీ ,పర్షియా ,గ్రీసు  దేశస్తులు, జిప్సీ ల్లాంటి దొంగలు భారత దేశాన్ని స్వాధీనం చేసు కొని ఇక్కడి సంపదను దోచుకొని ,ప్రజలను ఇబ్బంది పెట్టి యాగీ చేశారంటే దానికి కారణం ఎవరు ? మన ప్రజలా ? మన నాయకులా?

హైదరాబాద్ --- కుతుబ్  షాహీ --- అసఫ్ జాహీ ---రజాకార్ లు ---తెలంగాణా బాంచన్ లు ?
ఇప్పటి మన కధకి  అతి ముఖ్య మైన కీలక ప్రాంతమైన  హైదరాబాద్ కి తొలుత బీజం వే సిన వారు -గోల్కొండ రాజ్యాన్ని 170 ఏళ్ళు పాలించిన కుతుబ్  షాహీ వంశ  స్థులు .
1687 లో ఔరంగ్ జేబ్ దక్కన్ లోని 5 రాజ్యాలను స్వాధీనం చేసుకొన్నా , గోల్కొండ రాజ్యం నెమ్మదిగా అతని గవర్నర్ ఐన అసఫ్ జాహీ చేతిలోకి వచ్చింది .
ని జాం ప్రభువులుగా పేరు పడ్డ అసఫ్ జాహీ వంశ స్థులు నేటి తెలంగాణా ప్రాంతాన్ని ఘోరం గా పాలించారు .
చివరి తరం వాడైన 7 వ అసఫ్ జాహీ రజాకార్ లనే సొంత సైన్యం తో తెలంగాణా వారిని వేపుకు తిన్నాడు .

చరిత్ర తిరగేస్తే మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే ,డిల్లీ సింహాసనం ఎంత బలహీనం గా ఉంటే అంత  ఎక్కువగా చిన్న చిన్న రాజ్యాలు పుట్టు కొస్తాయి . చిన్న చిన్న రాజ్యాలుగా దేశం ఎంతగా చీలి పోతుందో అంత  ఎక్కువగా విదేశీ ముష్కరుల దాడి ఎక్కువ అవుతుంది .ఇదంతా ఒక ప్రమాదకర సామాజిక చక్రం .

14 వ శతాబ్దం లో బహమనీలు ,18 వ శతాబ్దం లో అసఫ్ జాహీలు డిల్లీ పాలకులను బెదిరించి సొంత జాగేర్దార్ లా దక్కన్ మరియు తెలుగు ప్రాంతాన్ని పీల్చి పిప్పి చేసి ,ఆయా ప్రజానీకాన్ని రాచి రంపాన పెట్టారు .

మనుషులందరూ ఒక్కటే . కానీ , ఎప్పుడైతే కుటుంబ ఆచారాలు,సంఘ సంప్రదాయాలు , సాంఘిక జీవన విధానం ,మత సంస్కృతి విభిన్న దారులలో సాగుతాయో అప్పుడు ఘర్షణ ఏర్పడు తుంది . ఆ ఘర్షణ తీవ్ర మైనప్పుడు యుద్ధం గా  కదం తొక్కుతుంది . భిన్న సంస్కృతులు కలిసి ఉండాలంటే వాటన్నిం  టినీ కలిపే ఏక సూత్రమ్ ఒకటి ఉండాలి . అది మతం కావచ్చు . దేశ భక్తీ కావచ్చు . కానీ ఎప్పుడైతే విభిన్న కులాలు ,మతాలు ఉన్నాయో వాటినే బలహీనత గా మార్చి ఆయా ప్రజా సమూహాలను విడదీసి పబ్బం గడుపు కొనే వారు ఎప్పుడూ  ఉంటారు .

ఇంకో విచిత్రమైన విషయం గమనించండి . క్రీస్తు పూర్వం  ఆంద్ర ,మహారాష్ట్ర ,కర్నాటక ,మధ్య ప్రదేస్ ,గుజరాత్  -వీటన్నింటినీ ఒకే సామ్రాజ్యం గా పాలించిన శాతవాహన రాజులు కృష్ణ గోదావరి డెల్టా ప్రాంతం వారు . అప్పటి నుండి ఇప్పటి వరకు  డెల్టా ప్రాంతం నుండి ఒక్క రాజు కూడా రాజ్యం స్థాపించ లేదు . ఈ ప్రజాస్వామ్య యుగంలో జాతీయ స్థాయి గల నాయకులూ  పుట్టలేదు ఒక్క ఎన్టిఆర్ తప్ప .

No comments:

Post a Comment