Search This Blog

Thursday 13 March 2014

అప్పుడే ఏమైంది ? ముందుంది ముసళ్ళ పండగ

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రాజ్యాంగ బద్ద హామీలు ఇవ్వకుండా నే అడ్డగోలుగా ఆంద్ర రాష్ట్ర విభజనను  చేసింది .
కేంద్రానికి నిధులు లేవు .
పోలవరం, సీలేరు, గాలేరు, హంద్రినీవా, రాజోలిబండ, డెల్టా ఆధునీకరణ -వీటి గురించి ఉన్న చిక్కు ముళ్ళు తీర్చ కుండా ,సీమాన్ధ్రులు నిరంతరం బిచ్చగాళ్ళ మాదిరిగా అడుక్కొనే టట్లు చేసేసింది .
అటు తెలంగాణా రైతులకు కరెంటు వెతలు,నిరుద్యోగులకు నిరాశా నిట్టూర్పులు తప్పేటట్లు లేవు .
హైదరాబాద్ ఆదాయాన్ని సీమాంధ్ర కి పంచ కుండా ,కనీసం ఉద్యోగులకు జీతాలు,పెన్షన్ లు ఇవ్వలేని స్థితికి దిగజార్చింది .
రెండు లక్షల కోట్ల అప్పుని జనాభా దామాషా లో పంచి సీమాన్ధ్రని నిండా ముంచేసింది .
జాతీయ స్థాయి విద్యాలయాల వలన వాటి చుట్టూ భూముల రేట్లు పెరగడం తప్ప సీమాంధ్ర విద్యార్ధులకు ప్రత్యేకం గా ఒరిగేదేమీ లేదు . ఎందుకంటే వీటి ప్రవేశా లలో స్థానిక  రిజర్వేషన్ లుండవు .
పోలవరం  ముంపు ప్రాంతాల సమస్య ,ఆస్తులు ,అప్పుల సమస్య , కామన్ రాజధాని గా  హైదరాబాద్ ఉంటుందని చెప్పిన కల్లబొల్లి  కబుర్లు --- ఇవన్నీ తెలుగు వారు అనుభవించవలసిన అగత్యం .

ఎలాంటి చట్ట సవరణ (258A or 371H)లేకుండా - ఒక రాష్ట్రం లోని ప్రాంతం పై గవర్నర్ కి అధికారం కట్ట బెట్ట లేరు . కాబట్టి బిల్లులో చెప్పినట్లుగా  గవర్నర్ అజమాయిషీ హైదరాబాద్ పై జరుగుతుందని నమ్మకం లేదు .
కోర్టులో ఈ కామన్ రాజధాని క్లాజు వీగిపోయినప్పుడు , సీమాంధ్రులు తప్పని సరిగా హైదరాబాద్ పై తమ హక్కు  కోల్పోతారు .

 ఇది ప్రతి తెలుగు వాడూ తన చేత గానితనానికి చెల్లిస్తున్న మూల్యం .
పచ్చని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన ప్రతి రాజకీయుడు కూడా మూల్యం చెల్లించే రోజు ముందుంది . 

No comments:

Post a Comment