Search This Blog

Friday 21 March 2014

ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి .

మనుషులను చీల్చడానికి ఎన్నో విష వలయాలున్నాయి . అందులో  మహా ప్రమాద కర మైనది మతమూ , కులమూ .
మన రాష్ట్రం లో కులాల సంఖ్యా బలం ఎలా ఉందో చెబుతుంది ఈ క్రింది బొమ్మ .
అధికారం ద క్కా లంటే కులాల వారీగా మనుషులకు ఎర  వేయాలి .
కొన్ని కులాలను అందలం ఎక్కించాలి . మరి కొంత మందికి తాయిలాలు పంచాలి .
కుల బలం ఉందని విర్రవీగి , ఆ తాయిలాలకు పడిపోతే తర్వాత వగచీ ప్రయోజనం ఉండదు .
మన సెంటిమెంట్ ని , ఇష్టాలను పక్కన పెట్టి సమాజ హితవుని దృష్టి లో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి
ప్రజా స్వామ్యం లో  ఎన్నికలే  సామాన్యుడి ఆయుధం . దానిని ఎలా వాడుకోవాలో తెలియకపోతే అది మనల్నే గాయ పరుస్తుంది .
సంక్షేమ పధకాల పేరుతో విసిరే ఎంగిలి బిచ్చం కావాలా ?
ఉత్పాదకత ని పెంచి ఉద్యోగాలను సృష్టించే వ్యవస్థ కావాల్నా ?
అవినీతి,దోపిడీ ,క్విడ్ ప్రో కో రాజ్యం రావాలా ?
స్వేచ్చ , న్యాయం ,రక్షణ ,చేతి నిండా పని,కడుపు నిండా కూడు కావాలా ?
నిర్ణయించు కొనే సమయం వచ్చింది .
ఓట్ల పండుగ వస్తుంది . సిద్దం గా ఉండండి .



Demographics of A.P. as on 2010,categorization based on reservation policy:

1 comment:

  1. ఈ లెక్కలు పూర్తిగా తప్పు. కమ్మవారి శాతం అంతకుముందు 5 ఉండేది. అది ఇప్పుడు ఇంకా తగ్గుతుందేగానీ ఆరుకు పెరగటమనేది కల్ల. రెడ్లు ౩శాతం కంటే ఎక్కువేఉంటారు. కాపులగురించి ప్రస్తావనే లేదు. అది ఓట్లపరంగా బలమైన సామాజికవర్గమేకదా.

    ReplyDelete