Search This Blog

Wednesday 21 May 2014

అర్ధ క్రాంతి !

ప్రజలను ఎంత గా కష్ట పెట్ట వచ్చో ,దేశాన్ని  ఎంత అధ్వాన్నం గా  పాలించ వచ్చో , వ్యవస్థని ఎంతగా నాశనం చేయ వచ్చో మీరు తెలుసు కోవాలంటే -గడచిన 10 ఏళ్లలో మీరొక్క సారైనా భారత దేశం వచ్చి ఉంటే చాలు .

ప్రాంతీయ వేర్పాటు వాదాలు ,అవినీతి కుంభ కోణాలు  పేట్రేగి  దేశ సమగ్రతకే ఎసరు తెచ్చిన సంకీర్ణ ప్రభుత్వాలు,
పతన మవుతున్న రూపాయ్ , రాకెట్ లా దూసుకు పోతున్న ధరలు ,నిరుద్యోగం ,కుంగి కునారిల్లుతున్న యువత - ఇవన్నీ ఒక మార్పు -ఒక క్రాంతి ,కోరుకొన్నాయ్ .

ఆ మార్పు వస్తుందని , తమ జీవితాలలో క్రాంతి వెల్లి   విరుస్తుంద ని  ప్రగాడ నమ్మకం కలిగించే  పార్టీని అందలం ఎక్కించ డా నికి 80 కోట్ల ఓటర్లు ముఖ్యం గా 12 కోట్ల మంది యువత   ఉవ్విళ్ళూ రుతున్నారు .

అన్నా హజారే నడిపిన అవినీతి వ్యతిరేక ఉద్యమం , నయా లొహ్ పురుష్ మోడీ  కలిగించిన నమ్మకం  పునాది వేసాయ్ .
ఇక జరగవలసిన కార్యక్రమం చూద్దాం . 
ప్రభుత్వం  ఏటా సబ్సిడీల రూపం లో ఆయిల్ కి 13లక్షల కోట్లు ,విద్యుత్ కి 4 లక్షల కోట్లు , ఎరువులకు 6 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది . అయినా ,70శాతం పల్లెలు ఇంకా బయోమాస్ నే వాడుతున్నాయ్ .
40 శాతం ప్రజల కు ,నేటికీ కిరోసిన్ దీపాలే గతి .

పేద వారు ఎంత మంది ఉన్నారు ? వారి కి కూడు -గుడ్డ - నీడ కల్పించ దానికి ఎంత కావాలి ? ఎంత మంది కి  విలువలతో కూడిన ప్రాధమిక విద్య  (up to 7th class) , మంచి ప్రాధమిక వైద్యం , సత్వర న్యాయం అందు బాటులో ఉంది ? అనే నిఖార్సైన లెక్కలు వేయాలి .
6 లక్షల గ్రామాలు , 600 జిల్లాలు గా ఉన్న విభిన్న భారత్ కి  ఒకే అభివృద్ధి ఫార్ములా సరిపోదు .
ప్రతి జిల్లాకి ఆయా  ప్రాంత భూ , పంట ,ఖనిజ ,మానవ వనరుల ప్రాతి పాదిక పై ఒక ఫధకం తయార్ చేయాలి .
ఉదాహరణకు ఆహార భద్రతా పేరుతో ఏటా 1 లక్ష కోట్లు కేటాయించి అందులో కేవలం 50 వేల కోట్లు పేదల ఆహారానికి ఖర్చు పెట్టి మిగతాది మింగే ద్దా మనే దౌర్భాగ్యపు ఎత్తుగడ కాంగ్రెస్ ప్రభుత్వానిది .
సరైన లెక్క లుంటే ఇలాంటి దోపిడీని అరి కట్ట వచ్చు .
అలాగే పోషకాహార లోపం అనేది మన దేశం లో ప్రమాద కర మైన రీతి లో ఉంది . దీనికి కారణం ఆహార కొరత ఒక్కటే కాదు , సరైన శుభ్రత లేక పోవడం , బహిరంగ మల విసర్జన , దానితో కలిగే ఇన్ఫెక్షన్ ల వల్ల తిన్నది వంట బట్టక పోవడం ...

ఎనర్జీ స్వయం సమృద్ధి ఉంటేనే అర్ధ క్రాంతి . 
విద్యుత్ లేక పోతే ఉత్పత్తి లేదు . 
1965 వరకు చైనా ,భారత్ ఒకే స్థితి లో ఉండేవి . అప్పటి నుండి చైనా - భారీ,మధ్య ,కుటీర  పరిశ్రమలను ఇబ్బడి ముబ్బడి గా పెంచు కొంటూ ప్రపంచం లో ఉన్న గాస్, ఆయిల్ వనరులను చౌక ధరల కే దొరక బుచ్చుకొని జాతీయ స్థూల ఉత్పత్తి ని పరుగులు పెట్టిస్తుం టే ,భారత్, సేవా రంగం లో నే చతికిల పడి వ్యవసాయ ,పారిశ్రామిక రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎనర్జీ స్వయం సమృద్ది ని గాలికి వదిలేసింది .

బర్మా అంగోలా , కజకిస్తాన్ లలో ఆయిల్ నిక్షేపాలను చౌకగా స్వాధీనం చేసుకొన్న చైనా ,
పాకిస్తాన్ ,ఇరాన్ లలో ఓడ రేవులు నిర్మించడానికి కూడా  ఆర్ధిక సాయం చేసి గాస్ సరఫరాకి మార్గం సుగమం చేసు కొంటుంటే, మన దేశం  ఈసురో మంటూ సంస్కరణలు పేర పిల్లి మొగ్గలేస్తుంది .

ఏటా కోటి మంది యువత ఉద్యోగాల మార్కెట్ కి వస్తున్నారు . కానీ మన దేశం లో అత్యంత ఆకర్షణీయ సేవా రంగం  కేవలం 20 లక్షల మంది కి మాత్రమే ఉద్యోగాలు ఇస్తుంది .
గత పదేళ్ళలో కేవలం 50 లక్షల మంది కి మాత్రమే ఉద్యోగాలు దొరికాయి .


భవిష్యత్ భారతానికి అణు విద్యుతే దిక్కు అని చిన్న పిల్లోడికి కూడా తెలుసు .
 అణు ప్రమాద ము వస్తే పరికరాలు సరఫరా చేసిన సంస్థలే బాధ్యత వహించా లనే చట్టం మనం పెట్టు కోవడం వలన ,ఏ  కంపనీ ముందుకు రావడం లేదు .

అర్ధం కాని విషయం ఏమిటీ అంటే ,మన దేశానికి వనరుల కొరత లేక పోయినా ఎందుకు వెనుక బడి ఉంది ?
సరైన దిశా నిర్దేశం చేసే నాయకులు లేకనా ?
ఉన్న నిధులను ,వనరులను దొంగ చాటుగా విదేశాలకు ఐయిన కాడికి తెగ నమ్మేసి ప్రజలను ,వ్యవస్థలను లూటీ చేస్తున్న అధికార నాయక గణా ల ధన దాహమా ?
అపారమైన బొగ్గు , తరగని ధోరియం , 3మిలియన్ చ కిమీ ల లో  గాస్ నిల్వలు ,సౌర విద్యుత్ కి పనికి వచ్చే భూ ప్రాంతం , మేధా వులు , మానవ వనరులు - ఇన్ని ఉన్నా మన బద్ధకం ,మూర్ఖత్వం , స్వార్ధం  ముందు పనికి రాకుండా పోతున్నాయ్ .

వనరులు  ఎప్పుడు , ఎట్లా ఉపయోగించాలో తెలిసేది మార్కెట్ కదలికల బట్టే గానీ , ప్రభుత్వ పాలసీల ద్వారా కాదు .
గనులు,ఆయిల్ ,గాస్ ,ఖనిజాలు - వీటిని తవ్వి ప్రాసెస్స్ చేసి వినియోగిం చాలీ అంటే, పెట్టుబడి , సాంకేతిక నైపుణ్యం చాలా అవసరం . ఇవన్నీ ప్రైవేట్ రంగం లోనే సాధ్యం  గానీ ప్ర భు త్వ రంగం లో సాధ్యం కాని పని .
Therefore, it is necessary to expand production capacities by allowing private participation. 
Given the right mix of incentives, market forces will usher in new capital and technologies for fuel extraction, carbon sequestration, and gasification.
 "ఇంధన వనరుల ఉత్పత్తి -సరఫరా -ధరల నియంత్రణ  సంఘం " అనేది స్వయం సంచలిత అధికారాలతో ,ప్రపంచ ఇంధన రంగ కదలికలకు అనుగుణ్యం గా ,ఎలాంటి రాజకీయ వత్తిళ్ళ ప్రమేయం లేకుండా పని చేసిన నాడు 125 కోట్ల మందికీ  అర్ధ క్రాంతి ఫలితాలు అందుతాయి . 

No comments:

Post a Comment